YSR Kalyanamasthu Scheme Latest Updates
అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు. వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేసేలా సమగ్ర మార్గదర్శకాలతో కూడిన GO.47 తేదీ 10-09-2022 సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల పేద అమ్మాయిల వివాహాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైఎస్సార్ షాదీ తోఫా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Financial Assistance under YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa :
SN | Category | Existing (in rupees) | Financial Assistance under YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa (in rupees) |
1 | Scheduled Caste | 40,000/- | 1,00,000/- |
2 | Scheduled Caste-Inter caste | 75,000/- | 1,20,000/- |
3 | Scheduled Tribe | 50,000/- | 1,00,000/- |
4 | Scheduled Tribe- Inter caste | 75,000/- | 1,20,000/- |
5 | Backward Classes | 35,000/- | 50,000/- |
6 | Backward Classes- Inter caste | 50,000/- | 75,000/- |
7 | Minorities | 50,000/- | 1,00,000/- |
8 | Differently Abled | 1,00,000/- | 1,50,000/- |
9 | BOCWWB | 20,000/- | 40,000/- |
అర్హతలు, విధి విధానాలు :
1.వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు.ఆ రోజు నవశకం -మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.3.వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి.
4.వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
5.మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు.
6.కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కుటుంబాలకు మినహాయింపు ఉంది.
10.మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
విద్యా అర్హత పై సీఎం జగన్ మోహన్ రెడ్డి వారి మాటల్లో :
వైయస్ఆర్ కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని CM YS జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారు. అందుకనే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామని సీఎం స్పష్టం చేశారు.
YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ప్రశ్నల - సమాదానాలు :
1. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ఎలా అప్లికేషన్ చేయాలి ?
Ans: గ్రామ వార్డు సచివాలయం లో అప్లికేషన్ చేసుకోవాలి.
2. ఏ రోజు నుంచి పెళ్లి అయిన వారు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు అర్హులు ?
Ans : తేదీ 01 అక్టోబర్ 2022 నుంచి ఆన్లైన్ అవకాశం ఉంది. ఎప్పటి నుంచి పెళ్లి అయిన వారు అని ఇంకా Operational Guidlines రాలేదు.
3. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వరుడు, వధువుకు ఎంత వయసు ఉండాలి ?
Ans :వరుడుకు 21 సంవత్సరాలు. వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
4. ఒక కుటుంబం లో ఇద్దరు మహిళలు ఉండి ఒకరికి YSR Kalyana Masthu, YSR Shaadi Thofa వస్తే రెండో మహిళకు కూడా వస్తాయా ?
Ans : రెండో మహిళకు రావు.వర్తించే మహిళ వితంతువు అయితే వర్తిస్తుంది .
5. వదువు వరుడులకు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు విద్యా అర్హతలు ఉండాలా?
Ans : కనీసం 10వ తరగతి చదివి ఉండాలి.
6. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు దరఖాస్తు చెయ్యాలి అంటే కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరమా ?
Ans : అవును. అవసరము. ముందుగా సచివాలయం లో దరఖాస్తు చేహసుకొని ఉండవలెను.
CASTE & INCOME Application Forms : Click Here
7. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు దరఖాస్తు చేయు సమయం లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరమా ?
Ans ; అవసరం అయ్యే అవకాశం ఉంది. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే తెలుస్తుంది.. కావున వధువు వరుడు ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ పెళ్ళికి ముందే లింక్ చేసుకోవాలి.
Aadar - Mobile Link Status & Aadar Update History Download : Click Here
8. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa దరఖాస్తు కు ముందుగా సచివాలయం ను సందర్శించాల ?
Ans : సచివాలయం ను సందర్శించి ముందుగా వధువు వరుడు ఆధార్ నెంబర్ తో NBM పోర్టల్ లో Eligibility Criteria చెక్ చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు.
8. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa నగదు ఏ బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి ?
Ans : లబ్ధిదారుని ఆధార్ కు NPCI లింక్ అయిన బ్యాంకు ఖాతా లో మాత్రమే జమ అవుతుంది. మిగతా ఏ బ్యాంకు ఖాతా లో జమ అవ్వదు.
Aadar Bank Link Status : Click Here
9. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వధువు ఆంధ్ర ప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రము వారు అయితే అర్హులా ?
Ans : అర్హులుఅవ్వరు .
DOWNLOAD YSR KALYANAMASTHU , YSR SHAADI THOFA GO 👇👇
All Citizen Updates Click Here