RBK Volunteers Allotment Update
రైతు భరోసా కేంద్రాలలో ఒక్క గ్రామ వ్యవసాయ అధికారులు మాత్రమే ఇంతకాలంగా సర్వీసులను అందించడం జరుగుచున్న. వారు అందిస్తున్న ముఖ్యమైన సర్వీసులు Stock Receipt Maintenance And Cash Delivery, Receiving Indent From The Farmer, Sales Through E-pos Machine, Stock Delivery, Uploading Of Sales In Ifms Portal, Maintenance Of Godowns And Stock Remittance Of Cash Collection To Ap Markfed And Submission Of Reports తదితరులు.
e-Crop Booking మరియు ఇతర వ్యవసాయ సంబంధిత పనులలో నిమగ్నమై ఉండటం వలన రైతు భరోసా కేంద్రాలలో సర్వీసులు ఇచ్చుటకు పని భారం మొత్తం కేవలం గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ అధికారి పై మాత్రమే పడుచున్నది. మరియు ఏ ఇతర అధికారి కూడా అందుబాటులో ఉండకపోవడం వలన సర్వీసులు కొంతమేరకు ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. పై విషయాలు అన్నిటిని వ్యవసాయ స్పెషల్ కమిషనర్ వారు తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాలలో సర్వీసులను పూర్తిస్థాయిలో ఇచ్చుటకు ఒక వాలంటీర్ను కేటాయించవలసిందిగా ప్రభుత్వానికి కోరారు.
తేదీ ఆగస్టు 5 2022 నాడు జరిగిన రివ్యూ మీటింగ్ నందు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు స్పెషల్ కమిషనర్ వారి అభ్యర్థనను ఆమోదించడం జరిగినది. పై ఉత్తర్వుల మేరకు గౌరవ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వాలంటీర్ను కేటాయించవలసిందిగా కోరారు.
మండల వ్యవసాయ అధికారి, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ వారి రిపోర్టు మేరకు సంబంధిత మండల ఎంపీడీవో వారు వాలంటీర్ ను ఎన్నుకోవలసి ఉంటుంది.ఎన్నుకోబడిన గ్రామ వాలంటీర్లకు ఇతర జీతభత్యాల కోసం ఎటువంటి అధికారిక సమాచారం ఇంకను వెలుబడలేదు.
తేదీ 27-09-2022 అప్డేట్ :
- వలంటీర్లు ధాన్యం పరీక్ష దశలో పాటు చేబ్రిడ్జ్ మిల్లు గేట్ వద్ద మూడు ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు.
- A కేటగిరీ ఆర్పీబీకేకు నలుగురు, B కేటగిరీ ఆర్ బీకేలకు ముగ్గురు C కేటగిరి ఆర్బీకేకు ముగ్గురు వలంటీర్లను కేటాయించారు.
- ఇందుకోసం వీరికి నెలకు రూ.1,500 ప్రోత్సాహం కింద అందించనున్నారు.
- సిబ్బందికి, టెక్నికల్ సహాయకులు, వలంటీర్లకు త్వరలోనే పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.
- సేకరణకు ముందే కమిటీలు మిల్లులను తనిఖీ చేస్తారు.
- ఆర్బీకేలతో మిల్లుల అనుసంధాన ప్రక్రియ ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది.
- సేకరణ కేంద్రాలు ప్రారంభానికి ముందు మిల్లులు 66 శాతం బ్యాంకు గ్యారెంటీ సమ ర్పించాలి.
- సేకరణ ప్రక్రియలో అవకతకలను గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదు.
Download Official Circular 👇