YSR Bima Scheme Rs 10,000/- Update
- వైయస్సార్ బీమా పథకంలో భాగంగా మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు రూ. 10000/- లు తక్షణం అందించడం జరుగుతుంది.
- గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారు YSR BHIMA WEA APP లో అంత్యక్రియల చార్జీల నమోదుకు సంబంధించి నామిని వివరాలతో అప్డేట్ చేయాలి.
YSR BHIMA WEA APP (Click Here)
- నామిని మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారి బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉండవలెను.
PROCESS :
- WEA తన యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి బయోమెట్రిక్ ద్వారా వైయస్సార్ బీమా WEA అప్లికేషన్ లో లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో CLAIMS అనే ఆప్షన్ను టిక్ చేయాలి.
- Claim పై క్లిక్ చేసిన తరువాత సచివాలయ పరిధిలో అర్హుల జాబితా చూపిస్తుంది.
- లిస్టులో పాలసీ హోల్డర్ పేరు, బియ్యం కార్డు నెంబరు, నామిని పేరు, మండలం పేరు, గ్రామ సచివాలయం పేరు, గ్రామ సచివాలయం కోడ్లు వస్తాయి.
- మీరు లిస్ట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు సభ్యుని క్లైమ్ వివరాలు స్క్రీన్ కనిపిస్తుంది
- సభ్యుని క్లైమ్ వివరాలు స్క్రీన్ లో గ్రామ సచివాలయం పేరు, గ్రామ సచివాలయం కోడు, క్లైమ్ కోడ్, బియ్యం కార్డు నెంబరు, పాలసీ హోల్డర్ పేరు పాలసీ హోల్డర్ ఆధార్ నెంబరు, లింగము, వయస్సు, నామిని పేరు, నామిని ఆధార్ నెంబరు, నామినీ సంబంధము, నామిని ఫోను నెంబరు, క్లైమూ కారణము, సంఘటన తేదీ, సంఘటన ప్రదేశము, క్లైమూ విధానము, సమాచారం ఇచ్చిన వారి మొబైల్ నెంబర్లు వస్తాయి.
- ఇక్కడ రూ.10,000/- ఇచ్చారా అనే ప్రశ్నకి అవును/ లేదు అనే ఆప్షన్ లు వస్తాయి.
- మీరు లేదు సెలెక్ట్ చేసుకుంటే కారణముకి సంబంధించిన లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఒక కారణము సెలెక్ట్ చేసుకోవాలి.
- తరువాత Continue ఆప్షన్ క్లిక్ చేసి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఆధార్ నెంబర్తో WEA Authentication చేయాలి.
- WEA Authentication తరువాత Data Saved Successfully అని మెసేజీ వస్తుంది.
- ఒకవేళ రూ. 10,000 ఇచ్చారా అనే ప్రశ్నకి అవును సెలెక్ట్ చేసుకుంటే Vocher Number మరియు Vocher Date ని ఇవ్వాలి.
- Take Vocher Image వద్ద Vocher Image Photo ని Upload చేయాలి. అలాగే Take Nominee Image వద్ద నామినీ Photo ని అప్లోడ్ చేసి నామినీ తో బయోమెట్రిక్ Authentication చేయాలి.
- నామినీ Authentication చేసిన తరువాత WEA Authentication Screen వస్తుంది.
- అక్కడే వచ్చే అన్ని Conditions చదివి Accept చేసి WEA Authentication చేయాలి.
- WEA Authentication చేసిన తరువాత Data Saved Successfully అని మెసేజీ వస్తే అయ్ నట్టు.
Process Document :