Marriage Certificate in Grama Ward Sachivalayam
మ్యారేజ్ సర్టిఫికెట్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ?
- వివాహ ధృవీకరణ పత్రం (MARRIAGE CERTIFICATE) కోసం గ్రామ/వార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మ్యారేజ్ సర్టిఫికెట్ ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ?
- గ్రామాల్లో పెళ్లి అయిన రోజు నుంచి 60రోజులు, అర్బన్ లో 90 లోపు అప్లికేషన్ కు అవకాశం. నిర్ణీత గడువు దాటిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.
మ్యారేజ్ సర్టిఫికెట్ దరఖాస్తు ఫీజు ఎంత ?
- పెళ్లి అయిన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకుంటే ₹150/-, అదే 30రోజులు దాటితే ₹250/- ఫీజు.పెళ్లి ఏ ప్లేస్ లో జరిగితుంది అనే విషయం ప్రకారం గ్రామం లేదా అర్బన్ అవుతుంది.
మ్యారేజ్ సర్టిఫికెట్ ను సచివాలయం లో ఎవరు దరఖాస్తు ఆన్లైన్ చేస్తారు?
- గ్రామాల్లో దరఖాస్తు చేయు వారు పంచాయతీ కార్యదర్శి Gr-VI(డిజిటల్ అసిస్టెంట్), అమోదించు వారి పంచాయతీ సెక్రటరీ (DDO) అదే అర్బన్ లో దరఖాస్తు చేయు వారు వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ఆమోదించు వారు మునిసిపల్ కమిషనర్.
మ్యారేజ్ సర్టిఫికెట్ దరఖాస్తు చేసిన ఎన్ని రోజులలో సర్టిఫికెట్ వస్తుంది ?
- 15 రోజులలో సర్టిఫికెట్ వస్తుంది.
మ్యారేజ్ సర్టిఫికెట్ వర్క్ ఫ్లో ఏమిటి?
- DA/WEDPS LOGIN AP SEVA PORTAL-->PANCHAYAT SECRETARY / MC
మ్యారేజ్ సర్టిఫికెట్ కు PS Gr-VI(DA) / WEDPS వారి AP సేవ పోర్ట్ల్ లో ఎక్కడ ఆప్షన్ ఇచ్చారు?
- Home Page లో Registration & Stamps Department లో MARRIAGE CERTIFICATE అనే ఆప్షన్ లో ఆన్లైన్ ఆప్షన్ ఇచ్చారు.
మ్యారేజ్ సర్టిఫికెట్ కు దరఖాస్తు ఆన్లైన్ చేయు సమయం లో AP SEVA పోర్టల్ లో అడిగే వివరాలు ఏంటి ?
- వివాహం జరిగిన రోజు
- వేదిక (RESIDENCE/FUNCTION HALL/WORSHIP PLACE/OTHERS)
- జిల్లా
- మండలం
- సచివాలయం
- పంచాయతీ/WARD వివరాలు
- Application Form
పెళ్లి కూతురుకు సంబందించి ఏఏ వివరాలు అవసరం ?
AADHAR ఎంటర్ చేసిన తర్వత OTP/BIO METRIC OPTION ద్వారా EKYC పూర్తి చేయాలి.
BRIDE తరపున ఇద్దరు సాక్షులు కు సంబందించి ఈ కింది వివరాలు ఇవ్వాలి
- ఆధార్
- పూర్తి పేరు
- తండ్రి లేదా భర్త పేరు
- చిరునామా
- వయసు
- వృత్తి
- సంబంధం
- పాస్ పోర్ట్ సైజు ఫోటో
పెళ్లి కొడుకు సంబందించి ఏఏ వివరాలు అవసరం ?
AADHAR ఎంటర్ చేసిన తర్వత OTP/BIO METRIC OPTION ద్వారా EKYC పూర్తి చేయాలి.
పెళ్లి కొడుకు తరపున ఇద్దరు సాక్షులు కు సంబందించి ఈ కింది వివరాలు ఇవ్వాలి
- ఆధార్
- పూర్తి పేరు
- తండ్రి లేదా భర్త పేరు
- చిరునామా
- వయసు
- వృత్తి
- సంబంధం
- పాస్ పోర్ట్ సైజు ఫోటో
మ్యారేజ్ సర్టిఫికెట్ కు అవసరం అయిన దృవపత్రలు :
- వివాహం ఫోటో
- శుభలేఖ
- BRIDE & BRIDE GROOM యొక్క ఆధార్ CARDs(AGE PROOF)
- PROOF OF RESIDENCE (ELECTRICITY/RICE CARD/TELEPHONE BILL/AADHAR CARD/VOTER ID/PASSPORT/DRIVING LICENCE/MGNREGA JOB CARD)
Important Links | |
Subject | Link |
గ్రామ వార్డు వాలంటీర్ల సమాచారం | Click Here |
సచివాలయం ఉద్యోగుల సమాచారం | Click Here |
వైస్సార్ కల్యాణ మస్తు సమాచారం | Click Here |
ఆయుష్మాన్ భారత్ పూర్తి సమాచారం | Click Here |
సిటిజెన్ అప్డేట్ | Click Here |
PS Gr-VI (DA) సమాచారం | Click Here |