Jagananna Vidya Deevena and Jagananna Vasathi Deevena Scheme 2023
- తేదీ (17.04.2023) జరగబోయే వసతి దీవెన కార్యక్రమం రద్దు.సీఎం జగన్ అనంతపురం జిల్లా నార్పలలో పర్యటన ఈ 26.04.2023కు వాయిదా.
◼ సంబందించిన ఉత్తరువులు : Click Here
- Quarter Wise పేమెంట్ డీటెయిల్స్ చూడవచ్చు.
- Bill Approved అని ఉంటే రెండు లేదా మూడు రోజుల్లో పడుతుంది. అమౌంట్ పడిన తరువాత స్టేటస్ Success గా మారుతుంది.
- అమౌంట్ రిలీజ్ ఐన వెంటనే లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించదు. కాస్త టైం పడుతుంది.
◼ JVD 2022-23 Time Line : Click Here
2022-23 వెరిఫికేషన్ కొరకు పెండింగ్ లో ఉన్న విద్యార్థుల సమాచారం :
- Pending Secreatiat Verification Students List For 2022-23 Academic Year Option Enabled In Navasakam Portal WEA Login
- 2022-23 Academic Year JVD కి సంబందించి "Pending Secreatiat Verification students list for 2022-23 Academic Year" అనే ఆప్షన్ నందు students అందరికీ కూడా కచ్చితంగా Five Step Verification చెయ్యాలి.
- మీ సచివాలయం కి సంబందించిన ఎవరైనా స్టూడెంట్ పేరు లిస్ట్ లో లేకపోతే "JVD Secretariat Verification for 2022-23 Academic Year" అనే ఆప్షన్ నందు student యొక్క Aadhar number enter చేసి Secretariat mapping చేసుకొని Five Step Verification పూర్తి చెయ్యొచ్చు.
- ప్రస్తుతం BOP app నందు Student Verification 2021-22 Academic Year 4వ విడత కి సంబందించినది.
- JVD Five Step Verification 2022-23 Academic year కి సంబందించినది.
- ప్రస్తుతం BOP app నందు student eKYC కి, Navasakam login JVD Five step verification కి ఎటువంటి link లేదు. Verification pending list లో వున్న students అందరికి కూడా కచ్చితంగా five step verification చెయ్యాలి.
జగనన్న విద్యా దీవెన 2021-22 4వ విడత సమాచారం :
- 2021-22 సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన నాలుగో విడత నగదును ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు నవంబర్ 10 2022న విడుదల చేయనున్నారు.
- ప్రభుత్వ ఉత్తర్వులు GOMS-81,Dt 07-05-2019 ప్రకారము 2021-22 విద్యా సంవత్సర పరీక్షా ఫలితాలు మరియు సెమిస్టర్ వివరాలు అధికారిక పోర్టల్ లో మాపింగ్ చేయవలెను కావున నగదు విడుదలకు ముందు జరగవలసిన కార్యక్రమలు అన్నీ కూడా దిగువ తెలిపిన తేదీలలో పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. ఒకవేళ సెమిస్టర్ పరీక్షలు ఇంకను నిర్వహించకపోయినా లేదా నిర్వహించి ఫలితాలు ఇంకను రాకపోయినా గత సెమిస్టర్ యొక్క వివరాలతో మ్యాపింగ్ కార్యక్రమం పూర్తి చేయాలి.
- 25-10-2022 : అన్ని కాలేజీలు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్లను హోటల్లో ఎంట్రీ చేయాలి.
- 26-10-2022 : అన్ని యూనివర్సిటీలు / బోర్డులు / డిపార్ట్మెంట్లు లు పరీక్షా ఫలితాలను ఆయా యూనివర్సిటీలకు లేదా బోర్డులకు పంపించవలెను.
- 27-10-2022 : జ్ఞానభూమి టెక్నికల్ టీం వారు విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలను విద్యార్థుల హాల్ టికెట్లకు మ్యాపింగ్ చేయవలెను.
- 28-10-2022 : జ్ఞానభూమి టెక్నికల్ టీం వారు పరీక్షా ఫలితాలు మ్యాపైన విద్యార్థులు మ్యాప్ కాని విద్యార్థుల వివరాలను కాలేజ్ వారి లాగిన్ లో ప్రదర్శించవలెను.
- 19 to 31 -10-2022 : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన WEA / WEDPS వారు విద్యార్థుల యొక్క బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా eKYC పూర్తి చేయవలెను.
- 25-10-2022 : కాలేజీ ప్రిన్సిపల్ వారు విద్యార్థుల యొక్క హాజరు ను ఆన్లైన్ లాగిన్ లో నెలవారీగా అప్డేట్ చేయవలెను.
- 31-10-2022 : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన WEA / WEDPS మరియు సచివాలయ CO లు వారి పరిధిలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లుల ఆధార్ కార్డుకు బ్యాంక్ మ్యాపింగ్ అయినదో లేదో తెలుసుకొని అవ్వని వారికి వెంటనే మ్యాపింగ్ చేసుకోమని తెలియజేయవలెను.
- 04-11-2022 : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన WEA / WEDPS వారు eKYC మరియు పరీక్షా ఫలితాల ఆధారంగా విడుదలైన తుది అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించవలెను.
- జగనన్న విద్యా దీవెన 2021-22 4వ విడతకు సంబందించి లబ్ధిదారుల eKYC వేయించుటకు Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 8.7 లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.జగనన్న విద్యా దీవెన 4th Quarter కి సంబందించి Students యొక్క eKYC verification కొరకు Beneficiary Outreach version 8.7 App నందు "4th Quarter eKYC" option provide చేయడం జరిగినది.Students యొక్క eKYC verification కి సంబందించి Biomtric & Irish authentication తో పాటు FACIAL AUTHENTICATION option కూడా provide చేయడం జరిగింది. "Facial Authentication" ద్వారా కూడా students యొక్క eKYC verification complete చెయ్యొచ్చు.ఈ ఆప్షన్ ఉపయోగించుకోటానికి Aadar Face RD మొబైల్ అప్లికేషన్ Install చేసుకోవాలి .
- జగనన్న విద్యా దీవెన పథకం 4వ విడత కి సంబందించి "STUDENTS యొక్క eKYC verification" కొరకు Beneficiary Outreach new version 8.7 app నందు option provide చేయడం జరిగింది.WEAs తో పాటు వాలంటీర్స్ లాగిన్ నందు కూడా "Student eKYC" option provide చేయడం జరిగింది.
- Students వేరే దూర ప్రాంతాలలో చదువుతూ వుంటే, అటువంటి students వారికి దగ్గరలో వున్న సచివాలయంకి వెళ్లి WEA/WEDPS login నందు "Search by student Aadhar" option ద్వారా eKYC వెయ్యొచ్చు.
- WEAs/WEDPS login నందు మాత్రమే "Search by student Aadhar" option provide చేయడం జరిగింది. వాలంటీర్స్ లాగిన్ నందు "Search" option లేదు.
- వాలంటీర్స్ అందరు కూడా eKYC కి enable అయిన students లో ఎవరైనా students death/ineligible వారు వుంటే, అటువంటి students యొక్క eKYC pending లో పెట్టి, ఆ students యొక్క వివరాలు WEAs కి inform చెయ్యాలి.
జగనన్న విద్యా దీవెన 2021-22 3వ విడత సమాచారం :
Step 1 : WEA/WWDE వారి ఆధార్ నెంబర్ తో బయోమెట్రిక్ ద్వారా Beneficiary Outreach App లో login అవ్వాలి.
జగనన్న విద్యా దీవెన - వసతి దీవెన రెన్యువల్ సమాచారం :
- 2022-2023 విద్యా సంవత్సరమునకు గాను జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులైన SC / ST / BC / EBC / Minority / Disabled విద్యార్థిని / విద్యార్థులు ' జ్ఞానభూమి వెబ్ సైట్" లో (http://jnanabhumi.ap.gov.in) రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేసుకొనుట కొరకు ప్రభుత్వము వారు అవకాశము కల్పించుట జరిగినది.
- కావున జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ విషయమును గ్రహించి మీకళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ రెన్యువల్ దరఖాస్తును పంపిణి చేసి మరియు దరఖాస్తులోని అన్ని వివరములను పూర్తి చేసి, దరఖాస్తు మీద విద్యార్థి మరియు తల్లిదండ్రుల సంతకము తీసుకోని వాటిని మీ పరిధిలో ధ్రువీకరించి, అర్హత కలిగిన రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులన్నిటిని జ్ఞానభూమి వెబ్ సైట్ లో మీకు ఇవ్వబడిన కళాశాల లాగిన్ లో నమోదు చేసి అప్లోడ్ చేయవలెను.
- రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు గాను గత సంవత్సరము విద్యార్థి సాధించిన మార్కులు మరియు హాల్ టికెట్ నెంబరును ఖచ్చితముగా నమోదు చేయవలెను మరియు గ్రామపంచాయతీ మరియు మునిసిపల్ కార్యాలయములలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల పిల్లలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు అని తెలియపరచటమైనది.
- ఆ విధముగా చేసిన విద్యార్ధిని/విద్యార్థులకు మాత్రమే 2022-2023 విద్యా సంవత్సరమునకు "జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన" మంజూరు చేయుట జరుగును.
- కావున జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ విషయము నందు ఆసక్తి చూపి, మీ కళాశాలలో చదువుచున్న అర్హత కలిగిన విద్యార్థులందరికి ఈ సమాచారము తెలియపరచి మరియు అవగాహనా కల్పించి ది.30-09-2022 తేది లోపు ' జ్ఞానభూమి వెబ్ సైట్ " (http://jnanabhumi.ap.gov.in ) లో రెన్యువల్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొనవలసినదిగా కృష్ణాజిల్లా, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారిత అధికారియైన శ్రీమతి కె.సరస్వతి గారు తెలియపరచటమైనది.
Note : విద్యార్థులు రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేది: 30-09-2022.
పథకానికి సంబంధించిన వివరాలు (జగనన్న విద్యా దీవెన RTF) :
- జగనన్న విద్యా దీవెన పథకంలో ITI నుండి Ph.D వరకు (ఇంటర్మీడియట్ మినహా) చదువుకుంటున్న SC, ST, BC, EBC (కాపులు మినహా), కాపు, మైనారిటీ మరియు వికలాంగులైన విద్యార్థులలో అర్హులైన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయడమే లక్ష్యం.
పథకానికి సంబంధించిన వివరాలు (జగనన్న వసతి దీవెన MTF) :
- జగనన్న వసతి దీవెన పథకంలో ITI విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.10,000/-, పాటటెక్నిక్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000/- ఇతర డిగ్రీ, అంతకంటే ఎక్కువ కోర్సులకు ఒక్కొక్కరికి రూ.20,000/- అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఆహారం మరియు హాస్టల్ ఖర్చులు అందిచడమే ప్రథమ లక్ష్యం.
పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి :
- a) సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు)
- b) వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (పట్టణ ప్రాంతాలు)
అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్థిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హత:
1.నివాసం నిబంధనలు :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసిగా ఉండాలి.
2 మొత్తం కుటుంబ ఆదాయం :
- మొత్తం కుటుంబం యొక్క వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు
3 మొత్తం కుటుంబానికి గల భూమి :
- లబ్ధిదారులు 10 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 25 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 25 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారు అర్హులు
4 ప్రభుత్వ ఉద్యోగి / ఫించనుదారు:
- కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు. అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి.
5. కోర్సు పూర్తి
- కాలేజీ / యూనివర్సిటీలు లేదా గుర్తించబడిన విద్యా సంస్థలలో విద్యార్ధులు రెగ్యులర్ కోర్సులలో ప్రవేశం పొంది ఉండాలి.
6. అర్హత గల కోర్సులు :
- B. Tech , B. Pharmacy, ITI, Polytechnic , B. Ed, M.Tech, M. Pharmacy, MBA, PG, Other Degrees
- Note : పోస్టు గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులకు సంబంధించి ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీలలో చదివే వారు మాత్రమే అర్హులు.
7. అర్హత గల విద్యాసంస్థలు :
ఈ క్రింద తెల్పిన విద్యా సంస్థలలో ప్రవేశం పొందినవారు అర్హులు:
- ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్),
- రాష్ట్ర యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు కాలేజీలు/ బోర్డులు,
- డే స్కాలర్ విద్యార్థులు, కాలేజీలకు అనుసంధానించబడిన హాస్టల్ విద్యార్థులు (CAH), మరియు సంబంధిత శాఖకు అనుసంధానించే బడిన హాస్టల్ విద్యార్థులు (DAH).
8. హాజరు :
- 75% హాజరు ఉండేలా చూసుకోవాలి.
9. అవసరం అయ్యే డాక్యుమెంట్ లు :
- ఆధార్ కార్డు
- రైస్ కార్డు/ ఆదాయ ధృవపత్రం
- కాలేజీ ప్రవేశ వివరాలు
- తల్లిదండ్రుల వివరాలు
- కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు కారనే ధృవపత్రం/ నాలుగు చక్రాల వాహనం లేదనే ధృవపత్రం / 1500 చ.అడుగుల పైన పట్టణ ప్రాంతంలో ఆస్తి లేదనే ధృవపత్రం
10. నాలుగు చక్రాల వాహనం :
- లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు , ట్రాక్టర్లు , ఆటోలు ఈ షరతు నుండి మినహాయింపు).
11. పట్టణాల్లో ఆస్తి :
- ఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1500 చ.అల స్థలం ( నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది).
12 ఆదాయపు పన్ను :
- ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు.
13. వయస్సు & లింగం :
- బాల, బాలికలు ఇద్దరూ అర్హులే అర్హత గల నిర్ణీత కోర్సుకు తగిన వయస్సు కలిగి ఉండాలి.
14. కులం & కేటగిరీ :
- ST , SC. BC . EBC (కాపులు మినహా), కాపు, మైనారిటీ మరియు వికలాంగుల కేటగిరీలకు చెందిన విద్యార్థులు అర్హులు.
15 అనర్హతలు :
- ప్రైవేటు యూనివర్సిటీలు/ డీమ్డ్ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు (ప్రభుత్వ కోటా మినహా).
- కరెస్పాండెన్స్ కోర్సు విధానంలోనూ,
- దూర విద్యా విధానంలోనూ చదువుతున్న విద్యార్థులు.
- మేనేజిమెంట్ / NRI కోటాలో అడ్మీషన్ పొందిన విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
తక్షణ అప్పీలేట్ అథారిటీ:
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి / మున్సిపల్ కమీషనర్
సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు:
- లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబరు: 1902
- ఫిర్యాదులను jnanabhumi.jvdschemes@gmail.com అనే ఈ మెయిల్ అడ్రస్ కు పంపవచ్చు. మరింత సమాచారం కొరకు http://navasakam.ap.gov.in అనే వెబ్ సైటును చూడవచ్చు.