GSWS Employees Transfers 2023 Process GSWS Employees Transfers 2023 Process

GSWS Employees Transfers 2023 Process

GSWS Employees Transfers Process, Documents, FAQs, Time Line Complete Information

GSWS Employees Transfers Process, Documents, FAQs, Time Line Complete Information

New Updates : 

  • అగ్రికల్చర్ / హార్టికల్చర్ / సెరికల్చర్ అసిస్టెంట్లకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ట్రాన్స్ఫర్లు నిలిపివేత.
  • Transfer Withdrawal ఆప్షన్ ను HRMS లో ఇవ్వటం జరిగింది . ఒక సారి Withdrawal చేసాక మరలా పెట్టుకునే సదుపాయం లేదు .
  • బదిలీలకు సంబంధించి మొదటిగా ఆనులైన్ ప్రాప్తికి మండలాలు / ULB లు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది.
  •  మండలాలలోని ఏ గ్రామ / వార్డు సచివాలయం అనేది ఆఫ్లైన్ ఫిజికల్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది.
  • ఈ బదిలీ ప్రాసెస్ మొత్తానికి పాత జిల్లాను యూనిట్ గా తీసుకొని జరగడం జరుగుతుంది.
  • బదిలీలకు  సంబంధించి పూర్తి ప్రాసెస్ జూన్ 15 నాటికి పూర్తి అవుతుంది.
  • ANM వారికి ప్రస్తుతానికి పరస్పర బదిలీలకు మాత్రమే అవకాశం ఉంది. 

                                            

                                                   రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాల యాల శాఖ సంబంధిత ఉద్యోగుల బదిలీలకు సం బంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దర ఖాస్తులు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఉద్యోగులు అన్లైన్ పోర్టల్ లో తమ బదిలీ దర ఖాస్తుల నమోదుకు వీలు కల్పించారు. ఈ మేరకు శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శుక్రవారం శాఖ అధికారులతో సమావేశమై బదిలీల ప్రక్రియ షెడ్యూల్ను ఖరారు చేశారు. సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే HRMS పోర్టల్లోనే బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచారు . ఆన్లైన్లో బదిలీల దరఖాస్తు నమోదు సమయం లో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రా లపై సొంత ధృవీకరణతో కూడిన సంతకాలు చేసి, వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉద్యోగుల బదిలీల ఆన్లైన్ దర ఖాస్తు ప్రక్రియ మొదలయ్యే సమయానికి ముందే జిల్లాల వారీగా, ఉద్యోగ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను వెబ్ పోర్టల్లో ఉంచాబోతున్నారు.



బదిలీలు ఎలా జరుగును ?

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రాసెస్ మొత్తం మూడు స్టెప్ లో ఉంటుంది.

  1. మొదట ఉద్యోగి ఆన్లైన్లో రిక్వెస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారు.
  2. అర్హతల మేరకు మండలం/ULB లొ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది.
  3. అప్పాయింటింగ్ అథారిటీ సచివాలయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ చేసిన తరువాత ఏ గ్రామా లేదా వార్డు సచివాలయము పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది.


బదిలీ దరఖాస్తు కు ఎవరు అర్హులు ?

  • ఎనర్జీ అసిస్టెంట్ మినహా మిగిలిన అందరూ కూడా బదిలీలకు అర్హులు.
  •  2019 మరియు 2020 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాయిన్ అయ్యి ఉండాలి.
  •  తేదీ మే 25, 2023 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి అయి ఉండాలి.
  •  తేదీ మే 25, 2023 నాటికి సర్వీసు రెగ్యులర్ అయి ఉండాలి.
  •  క్రమశిక్షణ చర్యలు / ACB / విజిలైన్స్ కేసులు పెండింగ్ ఉన్నవారు ట్రాన్స్ఫర్ కు అనర్హులు.


నోట్ : GO 371 Dt 16.05.2023 ప్రకారం MPHA(F)/ANM వారికి పరస్పర బదిలీ మాత్రమే అవకాశం ఉంటుంది.


బదిలీలలో ఎన్ని మండలాలు /ULB లు సెలెక్ట్ చేసుకోవచ్చు ?

ఉద్యోగి తన HRMS పోర్టల్ లొ తనకి నచ్చిన 5 ప్రాధాన్యత మండలాలు లేదా ULB ఎన్నుకోవాలి.


కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి ?

  • బదిలీ దరఖాస్తు ఫారం 
  • NO DUES CERTIFICATE (MPDO/MC వారి నుంచి)
  • వితంతువులకు - భర్త మరణ ధ్రువీకరణ పత్రం 
  • మెడికల్ గ్రౌండ్ వారికి - జిల్లా లేదా రాష్ట్ర మెడికల్ బోర్డు సర్టిఫికెట్
  • Spouse గ్రౌండ్ - మ్యారేజ్ సర్టిఫికెట్ , Spouse ఆధార్, ఉద్యోగి ఐడి కార్డు 


ఎన్ని రకముల బదిలీలు ఉంటాయి ?

ప్రస్తుతమున్న జిల్లాలో బదిలీలు :

కింద తెలిపిన బదిలీలకు అవకాశం ఉంటుంది 

  • ఒంటరి మహిళ / వితంతువు
  • మెడికల్ గ్రౌండ్ ఎవరైతే క్యాన్సరు,గుండె సమస్యలు, నరాల సర్జరీ, కిడ్నీ మార్పిడి, ఎముకల టీబీ సమస్యలు ఉన్నవారికి. ( ఉద్యోగికి కానీ లేదా భర్త లేదా భార్యకు గాని లేదా వారిపై డిపెండ్ అయిన పిల్లలకు గాని లేదా వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు గాని 
  • Spouse గ్రౌండ్ ( భర్త లేదా భార్య ప్రభుత్వ ఉద్యోగి అయినట్టయితే )
  • పరస్పర బదిలీలు (ఈ ఆప్షన్ కింద కేవలం మండలం లేదా ULB లొ ఒక ఆప్షన్ మాత్రమే ఇవ్వడం జరుగును )
  • ఇతర బదిలీలు ( మొదట పైన తెలిపిన బదిలీలు ప్రాధాన్యత అయిన తరువాత ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగును )


ఇతర జిల్లాకు బదిలీ :

ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీకి సంబంధించి కింద తెలిపిన బదిలీలకు అవకాశం కల్పించారు

  • Spouse
  • పరస్పర బదిలీ

ఇతర జిల్లా బదిలీలకు సంబంధించి తప్పనిసరిగా ఆ జిల్లాలో క్యాడర్ లొ నాన్ లోకల్ వారు 15% మించి ఉండకూడదు.


బదిలీలకు సంబంధించి సమస్యల వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ?

బదిలీలకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలున్నా లేదా టెక్నికల్ సమస్యలు వచ్చినట్టైనా వారు ట్రాన్స్ఫర్ హెల్ప్ లైన్ నెంబర్ ను కాంటాక్ట్ అవ్వవలసి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు కాల్ చేసే అవకాశం ఉంటుంది.

Contact Numbers :

  • 9010656383
  • 7981927494
  • 8309961905


Online Transfer Application Process 

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ ను నమోదుకు తేదీ 29-05-2023 నుండి అవకాశాన్ని ఇచ్చారు. అయితే దిగువతెలిపిన 6 కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది.

  1. Mutual
  2. Spouse
  3. Medical
  4. Widow
  5. Single women
  6. Other


  • ముందుగా దిగువ తెలిపిన లింకు పై క్లిక్ చేసి మీ యొక్క HRMS (LEAVES APPLY చేస్తున్న) యూజర్ నేమ్, PASSWORD తో లాగిన్ అవ్వండి.

Click Here

  • TRANSFER MODULE" పై క్లిక్ చేయగానే దిగువ విధంగా "Transfer Request Application" Page ఓపెన్ అవుతుంది.
  • ఆ పేజీ లో ఉద్యోగి యొక్క వివరాలు కనబడతాయి దాంతోపాటు ముందుగా బదిలీ యొక్క రకాన్ని ఎంపిక చేసుకోవాలి

    1. Within District (జిల్లా పరిది లో)
    2. Inter District (అంతర జిల్లా).

Within District (జిల్లా పరిది లో) ఎంపిక చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకునే విధానం.

ముందుగా "Within District" ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. తరువాత జిల్లాను ఎంపిక చేసుకోవాలి.

తరువాత పైన తెలిపిన 6 క్యాటగిరిలో మీరు ఏ కేటగిరీకి దరఖాస్తు చేయాలనుకున్నారో దానిని ఎంపిక చేసుకోవాలి.


I.MUTUAL TRANSFER (పరస్పర బదిలీ) : 

  1. MUTUAL TRANSFER కొరకు దరఖాస్తు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఎవరి స్థానానికి బదిలీ కోరుకుంటున్నారో ముందుగా వారి CFMS ఐడిని తెలుసుకొని ఉంచుకోవాలి. 
  2. బదిలీలకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులందరు సంబంధిత MPDO/ మునిసిపల్ కమిషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ (NO DUES CERTIFICATE)ను అప్లోడ్ చేయాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. దీని కొరకు స్క్రీన్ పై కనబడుతున్న "choose file" option ను సెలెక్ట్ చేసుకున్న తరువాత, ముందుగా సేవ్ చేసుకున్న PDF (1 M.B కంటే తక్కువ ఉండాలి) ఫైల్ను ఎంచుకున్న తర్వాత, అప్లోడ్పై క్లిక్ చేయండి. ఫైల్ అప్లోడ్ చేయబడిన తర్వాత "File Uploaded Successfully" సందేశాన్ని చూడవచ్చు.
  3. ఇప్పుడు మీరు ఎవరి స్థానానికి పరస్పర బదిలీ కోరుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క CFMS నంబర్ను నమోదు చేసి, ఆపై ప్రివ్యూపై క్లిక్ చేయాలి. అప్పుడు ఆ ఉద్యోగి పేరు, హోదా CFMS id మరియు ఇతర అవసరమైన వివరాల వంటి వివరాలను చూడవచ్చు.
  4. తరువాత మీరు ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం ఎంపిక కాబడ్డారో ఆ సంవత్సరం అనగా 2019 లేదా 2020 ని ఎంచుకోవాలి.
  5. తరువాత మీరు ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం ఎంపిక కాబడ్డారో ఆ సంవత్సరం అనగా 2019 లేదా 2020ని ఎంచుకోవాలి.
  6. తరువాత మీకు వచ్చిన ర్యాంక్ను నమోదు చేయాలి.
  7. ఆ తరువాత ప్రివ్యూ(PREVIEW)పై క్లిక్ చేయండి.
  8. ఇప్పుడు ఫంక్షనరీ పరస్పర బదిలీకి సంబంధించి నమోదు చేసిన వివరాలను చూడగలరు.
  9. నమోదు వివరాలు సరిగ్గా ఉంటే, "Submit" బటన్పై క్లిక్ చేయండి.
  10. అప్పుడు మీకు "are you sure want to submit" అని అడుగుతుంది. నమోదు చేసిన వివరాలన్నీ ఖచ్చితంగా ఉంటే, దయచేసి "OK" బటన్పై క్లిక్ చేయండి.
  11. మీరు OK బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు రిఫరెన్స్ ఐడితో విజయవంతంగా సమర్పించిన సందేశాన్ని చూడవచ్చు.
  12. రిఫరెన్స్ ఐడి మెసేజ్ తర్వాత, మీరు ప్రింట్ ఎంపికపై క్లిక్ చేసి, వివరాల ప్రింటవుట్ తీసుకోవచ్చు. ఫిజికల్ కౌన్సెలింగ్ సమయంలో మీరు ఈ ప్రింట్ అవుట్ ను తీసుకొని వెళ్ళాలి.


II. SPOUSE CASES

  1. ఉద్యోగి పైన తెలిపిన 6 కేటగిరీలలో Spouse (జీవిత భాగస్వామి) ఎంపికను ఎంచుకున్న తర్వాత వారు క్రింది వివరాలను నమోదు చేయాలి.
  2. MPDO/మునిసిపల్ కమీషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ (NO DUE CERTIFICATE)అప్లోడ్ చేయండి.
  3. జీవిత భాగస్వామి యొక్క ఆధార్ నంబర్ను నమోదు చేయండి.
  4. జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ రకాన్ని ఎంచుకోండి అనగా ఎ) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి బి) సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగి సి) PSU .
  5. ఇచ్చిన డ్రాప్ డౌన్ నుండి డిపార్ట్మెంట్ /ఆర్గనైజేషన్ ని ఎంచుకోండి.
  6. "జీవిత భాగస్వామి పేరు నమోదు చేయండి.
  7. జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగి ID ని నమోదు చేయండి.
  8. జీవిత భాగస్వామి యొక్క హోదా నమోదు చేయండి..
  9. జీవిత భాగస్వామి పని చేసే స్థానం (సమీప సెక్రటేరియట్ కోడ్ని నమోదు చేయండి).
  10. జీవిత భాగస్వామి పనిచేస్తున్న కార్యాలయ అధికారి ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయండి.
  11. వివాహ ధృవీకరణ పత్రం కాపీని అప్ లోడ్ చేయండి.
  12. నోటిఫికేషన్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
  13. ఎంపిక ర్యాంక్ను నమోదు చేయండి.
  14. పై వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత చివరగా మీకు అనువుగా ఉండే ఐదు మండలాలను ఎంపిక చేసుకోవాలి.

Note :  మండలాల ఎంపిక display అనేది ఉద్యోగి హోదా అనుసరించి ఉంటుంది.


III.MEDICAL GROUNDS :

  1. ఉద్యోగి మెడికల్ గ్రౌండ్స్ ను ఎంచుకున్నట్లయితే, కింది వివరాలను నమోదు చేయాలి.
  2. MPDO/మునిసిపల్ కమీషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయండి.
  3. ఇచ్చిన మెను నుండి సంబంధిత మెడికల్ వ్యక్తిని ఎంచుకోండి.
  4. ఇచ్చిన మెను నుండి అనారోగ్యం రకాన్ని ఎంచుకోండి.
  5. రాష్ట్రం/జిల్లా బోర్డు జారీ చేసిన అధీకృత వైద్య ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయండి.
  6. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
  7. ర్యాంక్ నమోదు చేయండి.
  8. 5 మండలాలను ఎంచుకోండి.
  9. ప్రివ్యూని ఎంచుకొని వివరాలు సమర్పించాలి. 


IV.WIDOW

  1. MPDO/మునిసిపల్ కమీషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయండి.
  2. మరణించిన వ్యక్తి (ఉద్యోగి భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం.
  3. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
  4. ర్యాంక్ నమోదు చేయండి.
  5. 5 మండలాలను ఎంచుకోండి.
  6. ప్రివ్యూను ఎంచుకుని, వివరాలను సమర్పించండి.


V. SINGLE WOMEN :

  1. MPDO/మునిసిపల్ కమీషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయండి.
  2. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
  3. ర్యాంక్ నమోదు చేయండి.
  4. 5 మండలాలను ఎంచుకోండి.
  5. ప్రివ్యూను ఎంచుకుని, వివరాలను సమర్పించండి.


VI. OTHERS :

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ లో కొత్తగా Others అనే క్యాటగిరి ను ఇవ్వటం జరిగింది .

  1. Transfer Grounds Others ఎంచుకోండి.
  2. MPDO/మునిసిపల్ కమీషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ (NO DUE CERTIFICATE) అప్లోడ్ చేయండి.
  3. నోటిఫికేషన్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
  4. ఎంపిక ర్యాంక్ను నమోదు చేయండి. పై వివరాలు అన్నీ
  5. నమోదు చేసిన తరువాత చివరగా మీకు బదిలీకి అనువుగా ఉండే ఐదు మండలాలను ఎంపిక చేసుకోవాలి.
  6. ప్రివ్యూను ఎంచుకుని, వివరాలను సమర్పించండి (Submit).


2.Inter District (అంతర్ జిల్లా బదిలీ):

ఎవరైనా సచివాలయ ఉద్యోగి తాను పనిచేస్తున్న జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ కోరుకున్న యెడల వారికి దిగువ తెలిపిన రెండు కేటగిరీ ల వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అవి.

  1. MUTUAL
  2. SPOUSE I.MUTUAL

1. MUTUAL :

MUTUAL TRANSFER కొరకు దరఖాస్తు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఎవరి స్థానానికి బదిలీ కోరుకుంటున్నారో ముందుగా వారి సిఎఫ్ఎంఎస్ (CFMS ID) ఐడిని తెలుసుకొ ని సిద్ధంగా ఉంచుకోవాలి.

  1. బదిలీలకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులందరు సంబంధిత MPDO/ మునిసిపల్ కమిషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ (NO DUES CERTIFICATE)ను అప్లోడ్ చేయాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. దీని కొరకు స్క్రీన్ పై కనబడుతున్న "choose file" option ను సెలెక్ట్ చేసుకున్న తరువాత, ముందుగా సేవ్ చేసుకున్న PDF (1 M.B కంటే తక్కువ ఉండాలి) ఫైల్ను ఎంచుకున్న తర్వాత, అప్లోడ్పై క్లిక్ చేయండి. ఫైల్ అప్లోడ్ చేయబడిన తర్వాత "File Uploaded Successfully" సందేశాన్ని వీక్షించవచ్చు.
  2. ఇప్పుడు మీరు ఎవరి స్థానానికి పరస్పర బదిలీ కోరుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క CFMS నంబర్ను నమోదు చేసి, ఆపై ప్రివ్యూపై క్లిక్ చేయాలి. అప్పుడు ఆ ఉద్యోగి పేరు, హోదా CFMS id మరియు ఇతర అవసరమైన వివరాల వంటి వివరాలను చూడవచ్చు.
  3. తరువాత మీరు ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం ఎంపిక కాబడ్డారో ఆ సంవత్సరం అనగా 2019 లేదా 2020ని ఎంచుకోవాలి.
  4. తరువాత మీకు వచ్చిన ర్యాంకును నమోదు చేయాలి.
  5. ఆ తరువాత ప్రివ్యూ (PREVIEW)పై క్లిక్ చేయండి.
  6. ఇప్పుడు ఫంక్షనరీ పరస్పర బదిలీకి సంబంధించి నమోదు చేసిన వివరాలను చూడగలరు.
  7. నమోదు వివరాలు సరిగ్గా ఉంటే, "Submit" బటన్పై క్లిక్ చేయండి.
  8. అప్పుడు మీకు "are you sure want to submit" అని అడుగుతుంది. నమోదు చేసిన వివరాలన్నీ ఖచ్చితంగా ఉంటే, దయచేసి "OK" బటన్పై క్లిక్ చేయండి.
  9. మీరు OK బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు రిఫరెన్స్ ఐడితోనమోదు వివరాలు సరిగ్గా ఉంటే, "Submit" బటన్పై క్లిక్ చేయండి.
  10. అప్పుడు మీకు "are you sure want to submit" అని అడుగుతుంది. నమోదు చేసిన వివరాలన్నీ ఖచ్చితంగా ఉంటే, దయచేసి "OK" బటన్పై క్లిక్ చేయండి.
  11. మీరు OK బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు రిఫరెన్స్ ఐడితో విజయవంతంగా సమర్పించిన సందేశాన్ని చూడవచ్చు.
  12. రిఫరెన్స్ ఐడి మెసేజ్ తర్వాత, మీరు ప్రింట్ ఎంపికపై క్లిక్ చేసి, వివరాల ప్రింటవుట్ తీసుకోవచ్చు. ఫిజికల్ కౌన్సెలింగ్ సమయంలో మీరు ఈ ప్రింట్ అవుట్ ను తీసుకొని వెళ్ళాలి.
  13. దరఖాస్తుదారు యొక్క స్థానిక కేడర్ ను (Local Cadre) ఎంచుకోండి (వ్యక్తి యొక్క స్థానిక జిల్లా)
  14. Tick The Consent and, ప్రివ్యూపై క్లిక్ చేసి, వివరాలు పరిపూర్ణమైన తర్వాత వివరాలను సమర్పించండి.


2.Spouse :

  • ఉద్యోగి పైన తెలిపిన 6 కేటగిరీలలో Spouse (జీవిత భాగస్వామి) ఎంపికను ఎంచుకున్న తర్వాత వారు క్రింది వివరాలను నమోదు చేయాలి.
  • MPDO/మునిసిపల్ కమీషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ (NO DUE CERTIFICATE అప్లోడ్ చేయండి.
  • జీవిత భాగస్వామి యొక్క ఆధార్ నంబర్ను నమోదు చేయండి.
  • జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ రకాన్ని ఎంచుకోండి అనగా ఎ) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి బి) సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగి సి) పిఎ
  • ఇచ్చిన డ్రాప్ డౌన్ నుండి డిపార్ట్మెంట్ /ఆర్గనైజేషన్ని ఎంచుకోండి.
  • జీవిత భాగస్వామి పేరు నమోదు చేయండి
  • జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగి ID ని నమోదు చేయండి.
  • జీవిత భాగస్వామి యొక్క హోదా నమోదు చేయండి..
  • జీవిత భాగస్వామి పని చేసే స్థానం (సమీప సెక్రటేరియట్ కోడ్ని నమోదు చేయండి).
  • జీవిత భాగస్వామి పనిచేస్తున్న కార్యాలయ అధికారి ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయండి.
  • వివాహ ధృవీకరణ పత్రం కాపీని అప్లోడ్ చేయండి.
  • నోటిఫికేషన్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
  • ఎంపిక ర్యాంకును నమోదు చేయండి.
  • పై వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత చివరగా మీకు బదిలీకి అనువుగా ఉండే ఐదు మండలాలను ఎంపిక చేసుకోవాలి.

  • "జీవిత భాగస్వామి యొక్క స్థానిక కేడర్ ( Local Cadre Of The Spouse ) ( జీవిత భాగస్వామి యొక్క జిల్లాను ఎంచుకోండి)
  • ( Tick The Consent ) సమ్మతి గుర్తుకు టిక్ చేయం
  • పై వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత చివరగా మీకు బదిలీకి అనువుగా ఉండే ఐదు మండలాలను ఎంపిక చేసుకోవాలి.

Note : మండలాల ఎంపిక display అనేది ఉద్యోగి హోదా అనుసరించి ఉంటుంది.


బదిలీలకు సంబంధించి ఖాళీల వివరాలు ఎలా ?

బదిలీలకు సంబంధించి ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతానికి ఆనులైన్లో ఎటువంటి ఆప్షన్ లేదు. కానీ GSWSHelper ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల నుంచి రెస్పాన్స్ తీసుకోవడం జరిగింది . 

సచివాలయ ఉద్యోగుల వారీగా వివరాలు :

  1. Panchayat Secretary Grade -V  
  2. Panchayat Secretary Grade -VI (Digital Assistant)  
  3. Welfare and Education Assistant     
  4. Village Agriculture Assistant Grade -II  
  5. Village Horticulture Assistant   
  6. Village Sericulture Assistant   
  7. Animal Husbandry Assistant   
  8. Village Fisheries Assistant   
  9. Engineering Assistant (Grade-II)   
  10. Village Revenue Officer (Grade -II)  
  11. Village Surveyor (Grade-III)   
  12. Ward Administrative Secretary  
  13. Ward Sanitation & Environment Secretary (Grade-II)     
  14. Ward Planning & Regulation Secretary (Grade-II)     
  15. Ward Education and Data Processing Secretary  
  16. Ward Welfare & Development Secretary (Grade-II)  
  17. Ward Amenities Secretary (Grade-II)  
  18. ANM (Grade -III)  
  19. Gram Mahila Samrakshna Karyadarshi (Grade-III) 
  20. Ward Revenue Secretary  
  21. Ward Health Secretary   
  22. Ward Mahila Samrakshna Karyadarshi (Grade-III)   


బదిలీలకు సంబంధించి ప్రశ్న - సమాధానాలు : 

ప్రశ్న 1 : సచివాలయ ఉద్యోగి 2019 మరియు 2022 నోటిఫికేషన్ లో జాయిన్ అయ్యి, తేదీ 25-05-2023 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కానీ ప్రొబేషన్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు . ప్రొబేషన్ డిక్లేర్ అయినట్టు ఆర్డర్ కాపీ కూడా రాలేదు. వారు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా ?

సమాధానం : లేదు ప్రొబేషన్ డిక్లేర్ అవ్వకుండా బదిలీకు అప్లికేషన్ పెట్టుకోడానికి అనర్హులు.


 ప్రశ్న 2 : ఎనర్జీ అసిస్టెంట్ వారు బదిలీలకు అర్హులా? 

 సమాధానం : కాదు.


ప్రశ్న 3: బదిలీలకు సంబంధించి దరఖాస్తును OFFLINE లో ఇవ్వాలా లేదా ONLINE లో అప్లై చేసుకోవాలా 

సమాధానం : ONLINE Only


ప్రశ్న 4: ట్రాన్స్ఫర్ యూనిట్ కొత్త జిల్లాని తీసుకుంటారా లేదా పాత జిల్లాల ప్రకారమే ట్రాన్స్ఫర్ ఉంటుందా ? 

సమాధానం : పాత జిల్లా ప్రకారమే ప్రస్తుతానికి బదిలీలు ఉంటాయి.


ప్రశ్న 5: ఉద్యోగికి బదిలీ దరఖాస్తు చేయు సమయంలో తనకు నచ్చిన మండలం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా ? 

సమాధానం : ఉద్యోగి దరఖాస్తు చేసుకునే సమయంలో ఐదు మండలాలు వరకు తనకు నచ్చిన మండలాలు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.


ప్రశ్న 6: ఉద్యోగి తన సొంత గ్రామాలేదు వార్డు సచివాలయానికి బదిలీ పెట్టుకోవచ్చా? 

సమాధానం : లేదు.


ప్రశ్న 7: ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు ఉన్నట్టు అయితే వారు బదిలీలకు అర్హులా ? 

సమాధానం : అర్హులు కారు.


ప్రశ్న 8: ఉద్యోగి No Due Certificate ఎవరిది సబ్మిట్ చేయాలి. 

సమాధానం : MPDO / MC వారు ఇచ్చినది మాత్రమే.


ప్రశ్న 9: బదిలీలకు సంబంధించి చివరి తేదీ ఏమైనా పెరిగే అవకాశం ఉన్నదా? 

సమాధానం : లేదు పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారమే బదిలీలు కొనసాగుతాయి.


ప్రశ్న 10: బదిలీలకు సంబంధించి ఎటువంటి అర్జీలు ఉన్నట్టయితే ఉద్యోగి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? 

సమాధానం : అర్జీలు పెట్టుకోవటానికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.


ప్రశ్న 11: ఉద్యోగి ఒకేసారి రెండు రకముల బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చా ? 

సమాధానం : అవకాశం లేదు.


ప్రశ్న 12 : బదిలీలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటె ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి  ?

సమాధానం :  9010656383 , 7981927494 , 8309961905


Note : బదిలీలకు సంబంధించి సమయానుసారం ప్రశ్నా సమాధానాలు ఈ పేజీలో అప్డేట్ అవ్వడం జరుగును. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.

Transfers Requests Report Upto 03-06-2023 :

  1. Ananthapuram  
  2. Chittoor   
  3. East Godavari   
  4. Guntur   
  5. Krishna   
  6. Kurnool  
  7. Prakasam  
  8. Nellore  
  9. Srikakulam  
  10. Vishakhapatnam   
  11. Vizianagaram 
  12. West Godavari  
  13. Kadapa  

Downloads : 

  1. Transfer GO 
  2. HRMS Transfer User Manual  
  3. Functionaries Transfer Guidelines 
  4. No Due & No Charge Certificate 
  5. Spouce Certificate
  6. Employee Authorization Letter  
  7. Group Insurence Scheme Certificate   
  8. Service Verification Certificate 
  9. Instructions to District Medical Board For Issue Medical Certificate 


ఈ పోస్ట్ కేవలం సమాచారం నిమిత్తం మాత్రమే పోస్ట్ చేయడం జరిగినది. పూర్తి సమాచారం కోసం మీ పై అధికారులను సంప్రదించగలరు.

-GSWSHelper-

Post a Comment

20 Comments
  1. Pwd candidates ki preference isthu option Mari ivvara??

    ReplyDelete
  2. Please PWD vallaki option ivvandi OH VH vallu dhooram velli jobs ela cheseyagalaru anukuntunnaru.... Idhi em transfer asalu

    ReplyDelete
  3. Pwd vallaki option ivvandi sir please

    ReplyDelete
  4. వేరే మండలాల్లో others కి పెట్టుకుంటే మనకి వచ్చే ప్లేస్ నచ్చకపోతే .ముందు చేస్తున్న సచివాలయం లో ఉందిపోవచా??

    ReplyDelete
  5. Mandalalu option petykonte gramalu Ela select chesukovali kavalasena gramam rakapothe transpar skpi cheyacha sir

    ReplyDelete
  6. sir I have joined in last counselling in 2019 . rank was not allotted to me in merit list and order copy also .please give solution . spouse transfer purpose .
    thank you

    ReplyDelete
  7. నమస్తే అండి,
    నేను 2019 లో vaa గా జాబ్ లో join అయ్యాను, 2 maternity లీవ్ లు తీసుకోవడం వలన సెప్టెంబర్ 15,2022 నాటికి నా ప్రోబషన్ పూర్తి అయినట్టు ఆర్డర్స్ ఈ ఏప్రిల్ నెల 25 వ తేదీ న release చేశారు,
    వాటి ప్రకారం ప్రస్తుతం మే నెల శాలరీ బిల్ కొత్త payscale తో apply చేశారు కానీ ఇంకా అరియర్స్ రాలేదు సెప్టెంబర్ నెల నుంచి...

    ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, NO DUE సర్టిఫికెట్ ఏ విధం గా తీసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి???

    మా MPDO గారిని అడిగితే మీ అరియర్శా బిల్లు మీ శాలరీ వేసే వాళ్ళే చూసుకుంటారు, అయితే మీ డ్రాయింగ్ ఆఫీసర్ తో no due సర్టిఫికెట్ మీద sign చేయించుకొని తీసుకొస్తే నేను కౌంటర్ sign చేస్తా అన్నారు.

    కావున నాకు అరియర్స్ వచ్చేలా, అలానే transfer అయ్యేలా ఎలా ముందుకు వెళ్లాలో తెలియచేయగలరు... Time చూస్తే చాలా తక్కువ గా ఉన్నది.. దయచేసి నా ప్రాసెస్ ఎవరైనా తెలిసినవాళ్లు నాకు చెప్పగలరు... Please

    ReplyDelete
    Replies
    1. Apply for transfer... Your new ddo will process your arrears with no due certificate....

      Delete
  8. 1. Unmarried women comes under single woman category or not
    2. Own mandal lo transfer pettocha
    3 transfer request petti, vachina places nachakapothey old place lo continue avvocha
    4. Priority order among these 6 categories

    ReplyDelete
  9. Inter district mutual transfer ki apply chesanu maku five mandals select cheskone option ledu so nenu mutual teskunna person work chese mandal ki veltana leka vere mandal ki kuda vese chances unnaya plz clarify

    ReplyDelete
  10. DASHBOARD OPEN LO UNTE BAVUNDEDHI SIR. EVAREVARU APPLY CHESUKUNNARU. MANAM APLY CHEYADANIKI EASY GA UNDEDHI.

    ReplyDelete
  11. How to find rank

    ReplyDelete
  12. Manaki nachani place vaste malli tirigi patha place ki racha

    ReplyDelete
  13. Anm's ki interdistrict transfers lo others option kalpinchandi sir , married female employees educated place local Ani theeskoni posting icharu but marriage ayina vaallu varey district lo family untaru (husband address native avuthundi kada please maaku maa adhar address prakaram transfers kalpinchandi chala suffer avuthunnamu sir 🙏🏻🥺🥺

    ReplyDelete
  14. HRMS లో Transfer Apply చేయుటకు మొదట్లో 5 mandals mandatory field loo ఇచ్చారు, ఒక్క mandal interest ఉన్నప్పటికీ చేసేది ఏమీ లేక 5 mandals select చేసుకోవలసి వచ్చింది చాలా మంది. కానీ తరువాత నచ్చిన mandal (less than or equal to 5 mandals) select చేసుకునేలా ఇచ్చారు. ఇలా మధ్యలో ఈ option ని మార్చడం వళ్ల చాలా మంది ఈ అవకాశాన్ని కోల్పోయారు.
    మరి వీరి పరిస్థితి ఏమిటి.

    ReplyDelete
  15. Sir..counselling time lo interdistrict mutual transfer kosam adhikaarulu verify chese documents emito konchem teliyaparachagalaru

    ReplyDelete
  16. Sir transfer apply chesaka technical issue valla withdraw chesam. Malli re apply avvatledu. Ma applications consider chestara? Cheyara?

    ReplyDelete
  17. Sir రిఫరెన్స్ ఐడి ok చేసినతర్వాత Print తీసుకోలేదు అది back button press అయిపోయింది Sir ఫిజికల్ కౌన్సిలింగ్ సమయంలో ఇది తీసుకువెళ్ళాలి కదా Sir ఈ print కోసం ఏదయినా option ఉంటుందా Sir..

    ReplyDelete
  18. No Disiplenary cases certificate pdf

    ReplyDelete