ysr cheyutha scheme faq in telugu
వైయస్సార్ చేయూత ( YSR Cheyutha ) పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు అక్షరాల సంవత్సరానికి 18750 రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసినదే. 2023,-24 సంవత్సరానికి సంబంధించి కొత్త దరఖాస్తుల ప్రక్రియ మరియు గత సంవత్సర లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొనసాగుతున్నది. అయినప్పటికీ చాలా సచివాలయాల్లో చాలా సమస్యల వలన అప్లికేషన్ ప్రాసెస్ అవటం లేదు. తరచుగా ప్రజలకు మరియు ఉద్యోగులకు వచ్చే సమస్యలు మరియు వాటి యొక్క సమాధానాలు ఇప్పుడు చూద్దాం
ప్రశ్న : ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు శానిటేషన్ వర్కర్లు వారి కుటుంబ సభ్యులు వైయస్సార్ చేయూత ( YSR Cheyutha ) పథకానికి అర్హులా ?
ఎవరైతే ఆశా వర్కర్లుగా లేదా అంగన్వాడీ టీచర్లుగా లేదా శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తుంటారో వారు అనర్హులు వారి కుటుంబానికి చెందినవారు అర్హులు.
ప్రశ్న : హోంగార్డులో / వీఆర్ఏలు వారి కుటుంబ సభ్యులు వైయస్సార్ చేయూత పథకానికి అర్హులా?
హోంగార్డులు లేదా వీఆర్ఏలు వైస్సార్ చేయూత పథకాన్ని అనర్హులు కానీ వారి కుటుంబ సభ్యులు అర్హులు. అయినప్పటికీ గ్రామాల్లో వారి కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం నెలకు 10వేల లోపు అదే పట్టణాలలో 12 వేల లోపు ఉండాలి.
ప్రశ్న : వెరిఫికేషన్ లిస్టులో పేరు లేకపోతే వారికి కొత్తగా దరఖాస్తు చేయాలా ?
అవును ప్రస్తుతం వెరిఫికేషన్ లిస్ట్ లో పేరు లేకపోతే వారికి వెంటనే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రశ్న : ఓసి లో ముస్లింలు ఉన్నారు. వారికి ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ చెయ్యాలి. వాళ్ళ కుల ధ్రువీకరణ పత్రంలో ఓసి ముస్లిం అని ఇస్తారు కానీ వారు మైనారిటీ వారు.
అందరూ కోసి మైనారిటీస్ వారు వైయస్సార్ చేయూత పథకం 2023-24 అర్హులు.
ప్రశ్న : చేయూత పథకం 2023 24 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు దారిని యొక్క వయసు ఏ రోజు నుంచి ఏ రోజు మధ్య ఉండాలి.
దరఖాస్తుదారులు తప్పనిసరిగా 13.08.1963 నుంచి 12.08.1978 మధ్య జన్మించి ఉండాలి.
ప్రశ్న : వైయస్సార్ పెన్షన్ కానుక లో భాగంగా పెన్షన్ తీసుకుంటున్న వారు వైయస్సార్ చేయూత పథకానికి అర్హులవుతారా లేదా అనర్హులవుతారా ? ఎస్టి కులంలో 50 సంవత్సరాల లోపు వారికి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది వారు కూడా అర్హుల ?
60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పెన్షన్దారుడు వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులు.
ప్రశ్న : లబ్ధిదారుల కుటుంబం నందు ముందుగా వైయస్సార్ చేదోడు, వైయస్సార్ నేతాన నేస్తం, వైయస్సార్ వాహన మిత్ర వంటి పథకాలు నందు లబ్ధి పొంది ఉన్నారు. అటువంటి వారు చేయూత పథకానికి అర్హులు అవుతారా ?
అర్హులు అవుతారు కానీ లబ్ధిదారుడు ఈ బీసీ నేస్తం మరియు కాపు నేస్తం వంటి పథకాలు పొంది ఉండకూడదు.
ప్రశ్న : వెరిఫికేషన్ చేయు అధికారి కేవలం కొత్త వారికి మాత్రమే వెరిఫికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలా లేదా పాత వారికి కూడా అవసరమా ?
కొత్త మరియు పాత లబ్ధిదారుల అందరికీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారం అవసరం ఉంటుంది.
ప్రశ్న : ప్రభుత్వ ఉద్యోగులు హోం గార్డులు ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు ఎవరికైతే 12 వేల లేదా 10వేల ఆదాయం కన్నా ఎక్కువ పొందుతున్నారో వారు వివరాలు NBM లొ చూపించటం లేదు. వారు ఈ పథకానికి అర్హులా?
ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రాప్తికి వారు అనర్హులు.
ప్రశ్న : ఎస్టీ వాల్మీకి, వెళ్తుబెంతు ఒరియా,బుడగ జంగం, యెనేటి కొండు వారికి స్వీయ దృవీకరణ పత్రం ద్వారా గతంలో దరఖాస్తు చేసాము ప్రస్తుతం వెరిఫికేషన్ లో వారికి కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. మరలా స్వయ ధ్రువీకరణ పత్రం ద్వారా కొత్తగా అప్లికేషన్ చేసుకునే ఆప్షన్ ఏమైనా ఇస్తారా ?
లబ్ధిదారులకు ఎవరికైతే కుల ధ్రువీకరణ పత్రం ఉండదో వారి వివరాలు CEO, SERP వారికి PDDRA వారు పంపవలసి ఉంటుంది.
ప్రశ్న : వెరిఫికేషన్ లో భాగంగా అందరికీ తప్పనిసరిగా కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలా ? మరియు ఏపీ సేవా పోర్టల్ ద్వారా ఇచ్చిన సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయా ? అలాగే Re-Issuance ద్వారా ఇచ్చిన వాటిని కూడా అప్లోడ్ చేయవచ్చా ?
ఆధార్ కు లింక్ అయినటువంటి ఏ సర్టిఫికెట్ అయినా అప్లోడ్ చేయవచ్చు అవి ఏపీ సేవ లేదా Re Issuance అయినా చెల్లుబాటు అవుతుంది.
ప్రశ్న : కొందరికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒక దగ్గర అప్లికేషన్ ఒక దగ్గర ఉన్నాయి అటువంటి వారికి వెరిఫికేషన్ ఎలా చేయాలి ?
వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరిగా ఎక్కడ అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటుందో అక్కడ మాత్రమే చేయాలి. ఒకవేళ అక్కడ మ్యాపింగ్ అవ్వకపోతే వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకొని వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
ప్రశ్న : ఆదాయపు పన్నుకు సంబంధించి వెబ్ సైట్ లొ రిమార్కులు తొలగించారు వాళ్లు ప్రస్తుతం ఆదాయపు పన్ను పేమెంట్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ చూపించడం లేదు కాబట్టి వారిని అర్హులుగా చేయవచ్చా ?
ఎవరికైతే గ్రామాల్లో 10000 పట్టణాల్లో 12,000 దాటి ఆదాయం ఉంటుందో వారు అనర్హులు.
ప్రశ్న : విద్యుత్ మీటరు మరియు అర్బన్ ప్రాపర్టీ అందరికీ ట్యాగింగ్ చేయాలా ?
అందరికీ అవసరం లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి ఎవరికి అయితే విద్యుత్ మీటరు నెంబరు ట్యాగింగ్ అవలేదు వారికి మాత్రమే నెంబర్ పై ట్యాగింగ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అర్బన్ లో ఉన్నటువంటి వారికి ఎవరికీ అయితే ఎటువంటి అర్బన్ ప్రాపర్టీ ట్యాగింగ్ అవ్వకపోయి ఉంటుందో వారికి మాత్రమే మరలా ట్యాగింగ్ చేయాలి.
ప్రశ్న : ఇల్లు అద్దెకి ఉన్నవారికి ఎవరి కరెంటు మీటరు ట్యాగింగ్ చెయ్యాలి ?
లబ్ధిదారుని పేరు మీద సొంత మీటరు లేను అప్పుడు అద్దె ఇంటిలో ఉన్నటువంటి కరెంటు మీటరుకు ట్యాగింగ్ చేయాలి.
ప్రశ్న : ఒక డోరు నెంబర్లు రెంటికి ఉన్న వారివి కరెంటు మీటరు, ప్రాపర్టీ టాక్స్, అసెస్మెంట్ నెంబరు ట్యాగింగ్ చేస్తారు కానీ అర్బన్ ఏరియాలో మనం ట్యాగ్ చేసిన తర్వాత లబ్ధిదారుడు వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి ?
ఏ సమస్య రాదు వారి వివరాలు ఫీల్డ్ వెరిఫికేషన్లు ఎంటర్ చేయవచ్చు.
ప్రశ్న : ఒక లబ్ధిదారుడు రెండు అసెస్మెంట్ నెంబర్స్ ఉండి ఒక హౌస్ లో మాత్రమే ఉంటే రెండు హౌస్లను కూడా పరిగణలోకి తీసుకోవాలా ?
ప్రస్తుతం ఏ ఇంటిలో ఉంటున్నారో ఆ ఇంటి వివరాలు మాత్రమే ఎంటర్ చేయాలి.
ప్రశ్న : అర్బన్ ఏరియాలో చాలామంది అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ గా ఉంటారు వారికి ఏ అసెస్మెంట్ మరియు ఎలక్ట్రిసిటీ సర్వీస్ నెంబరు ఉండవు వారికి ఏమి చేయాలి ?
అటువంటి కేసులను వదిలి పెట్టవచ్చు.
ప్రశ్న : వైయస్సార్ చేయూత లబ్ధిదారులకి ప్రాపర్టీ,పవర్ బిల్ ట్యాగ్ సంబంధించి కొందరికి రెండు అసెస్మెంట్ నెంబర్లు రెండు పవర్ బిల్లు కూడా ఉన్నాయి కానీ రెండు ఇళ్లను రెంట్ కి ఇవ్వలేదు వీళ్ళకి రెండు ట్యాగింగ్ చేయాలా?
వారు ప్రస్తుతం ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటి వివరాలు మాత్రమే అప్డేట్ చేయాలి.
ప్రశ్న : కొందరు లబ్ధిదారులకి ప్రాపర్టీ అత్తయ్య మామయ్య పేరుమీద ఉన్నాయి అత్తయ్య మామయ్య చనిపోయారు ఒక్కరే వారసులు అటువంటి వాళ్లకి ప్రాపర్టీ సొంత అని పెట్టాలా లేదా రెంట్ అని పెట్టాలా ?
సొంత అని పెట్టవచ్చు.
ప్రశ్న : లబ్ధిదారునికి గ్రామాల్లో ఏవైనా ప్రాపర్టీలు ఉన్నట్టయితే వాటిని ట్యాగ్ చేయవచ్చా?
కేవలం అర్బన్ ప్రాపర్టీలను మాత్రమే ట్యాగ్ చేయాలి.
ప్రశ్న : విద్యుత్ వినియోగం ఎన్ని నెలల సరాసరి తీసుకోవాలి ?
12 నెలల సరాసరి తీసుకోవాలి.