Aadudam Andhra Registration Process, Team Creation, Prize Money, Guidelines
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్రా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
- ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాల వయస్సు పైన ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు.
- ఆటగాడు గ్రామంలో శాశ్వత నివాసి కావచ్చు లేదా తాత్కాలికంగా గ్రామం/పట్టణంలో ఉండవచ్చు.లేదా గ్రామంలో చదువుకోవచ్చు. పట్టణాలు GS/WS స్థాయిలో పాల్గొనవచ్చు.
- ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్లో ఆడేందుకు ఉద్దేశపూర్వకంగా గ్రామానికి వచ్చిన క్రీడాకారులు అర్హులు కారు .
- క్రీడాకారులు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి మరియు పాల్గొనడానికి గరిష్ట వయోపరిమితి లేదు.
- ప్రభుత్వ ఉద్యోగులు, పచివాలయం ఉద్యోగులు మరియు వాలంటీర్లు అందరూ ఆడుదం ఆంధ్రా టోర్న మెంట్లో పాల్గొనేందుకు అర్హులు కారు.
- ఒక క్రీడాకారుడు గరిష్టంగా రెండు విభాగాల్లో మాత్రమే పాల్గొనవచ్చు..
- టోర్నీని నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
- ఈవెంట్లు పురుషులు మరియు మహిళలకు వేర్వేరుగా నిర్వహించిబడతాయి.
- రిజిస్ట్రేషన్ పై ఎటువంటి సమస్యలు ఉన్న 8977611399 నెంబర్కు ఫోన్ చెయ్యవచ్చు .
టోర్నమెంట్లు విధానం ఎలా ఉంటుంది ?
ఈ టోర్నమెంట్లు డిసెంబర్ 15వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంతో పాటు, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం.
రిజిస్ట్రేషన్ కు కావలసిన వివరములు :
- ప్లేయర్ ఆధార్ నెంబరు
- ప్లేయర్ మొబైల్ నెంబరు
- మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- పేరు
- డేట్ అఫ్ బర్త్
- చిరునామా
- వాలంటరీ పేరు
- వాలంటరీ మొబైల్ నెంబరు
ఆడుదాం ఆంధ్రాలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అవ్వడం ఎలా ?
Aadudam Andhra Online Registration Process
Step 1 : ముందుగా ఆడుదాం ఆంధ్ర వెబ్ సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ యాజ్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
Step 2 : Register Now ! అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి .
Step 3 : Register as Player అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ప్లేయర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. User Consent పై టిక్ చేసి, Accept పై క్లిక్ చేయాలి.
Step 4 : ప్లేయర్ మొబైల్ నెంబర్ ఎంటర్ Get OTP పై క్లిక్ చేయాలి.
Step 5 : Info పేజీ ఓపెన్ అవుతుంది. OK పై క్లిక్ చేయాలి.
Step 6 : OTP ఎంటర్ చేసి Confirm OTP పై క్లిక్ చేయాలి.
Step 6 : Competitive Games లో ఒకటి లేదా రెండు టిక్ చేయాలి. Non Competitive Games లో నచ్చినవి సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేయర్ ఫోటో అప్లోడ్ చేయాలి.
Step 7 : వాలంటీర్ వద్ద హౌస్ మాపింగ్ ప్రకారం ఆధార్ ప్రకారం వివరాలు వస్తాయి. రాకపోతే వివరాలు ఎంటర్ చేయాలి. అందులో సచివాలయం పేరు సచివాలయం ఉన్న పిన్కోడు వాలంటరీ పేరు వాలంటరీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి.
Step 8 : తర్వాత చిరునామా రుజువు పత్రాన్ని సెలెక్ట్ చేసుకుని , అప్లోడ్ చేయాలి. తరువాత రిజిస్టర్ పై క్లిక్ చేయాలి.
Step 9 : ప్లేయర్ యొక్క రిజిస్ట్రేషన్ కార్డు వస్తుంది పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తి అయినట్టు.
అన్ లైన్ లో మీ టీం దరఖాస్తు చేసుకోవటం ఎలా ?
Aadudam Andhra Team Creation Process
Step 1: క్రికెట్, వాలీ బాల్ వంటి Team Event లో పాల్గొనే క్రీడాకారులు ముందుగా పైన తెలిపిన విధంగా ప్రతి ఒక్కడు వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక గ్రామ సచివాలయం నుండి ఎవరైతే మీ టీంలో ఆడాలి. అనుకుంటున్నారో అంతమంది వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకావాలి.
Step 2: తర్వాత అందులో ఎవరైతే కెప్టెన్ గా ఉంటారో ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి తరువాత My Team అని ఆప్షన్ను ఎంపిక చేసుకోగానే ఆ గ్రామ సచివాలయం పరిధి లో ఆ ఆట కు. సంబంధించి రిజిస్టర్ అయిన ప్లేయర్ల అంతమంది కనిపిస్తారు.
Step 3: అక్కడ కనిపిస్తున్న పేర్ల నుండి మీ టీం లో చేర్చుకోవలసిన వారి పేర్లను ఒక్కొక్కరుగా ఎంపిక చేసుకోవాలి, ముందుగా ఒక ప్లేయర్ను ఎంపిక చేసుకోగానే ఆ ప్లేయర్ ఏ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యున్నారో అ మొబైల్ నెంబర్ ను టైప్ చేసి Get OTP పై క్లిక్ చేయగానే అతని మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి. సబ్మిట్ చేయగానే అతను మీ టీం లో నమోదు అవుతారు. ఈ విధంగా మీ టింలో అంతమంది మెంబర్లను ఎంపిక చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ టీం తదుపరి లాగిన్లకు వెళుతుంది.
రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు ?
- 15 ఏళ్లు పైబడిన వారందరూ ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- పైన తెలిపిన విధంగా మీ మొబైల్ ఫోన్ సహాయం తో online లో Registration కావొచ్చు.
- రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 1092కి కాల్ చేయవచ్చు లేదా మీ సమీపంలోని సచివాలయాన్ని సంప్రదించవచ్చు.
ఆడుదాం ఆంధ్రా పోటీల విజేతలకు ప్రైజ్ మనీ ఎంత ?
క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు
- నియోజకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే రూ.35 వేలు, జిల్లాస్థాయిలో రూ.60 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలుగా ఉంది.
- రెండో ప్రైజ్ నియోజకవర్గస్థాయిలో రూ.15 వేలు, జిల్లాస్థాయిలో రూ.30 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.3 లక్షలుగా నిర్ణయించారు.
- మూడో ప్రైజ్ నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
బ్యాండ్మింటన్ డబుల్స్ విభాగంలో
- మొదటి బహుమతి ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో రూ. 20 వేలు, జిల్లాస్థాయిలో రూ.35 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
- రెండో ప్రైజ్ నియోజకవర్గస్థాయిలో రూ.10 వేలు, జిల్లాస్థాయిలో రూ.20 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.1 లక్షగా నిర్ణయించారు.
- మూడో ప్రైజ్ కింద నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.50 వేలుగా నిర్ణయించారు.
కార్యక్రమం ఎలా జరుగుతుంది ?
కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది:
- గ్రామ/వార్డు సచివాలయ స్థాయి: 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50 లక్షల మ్యాచ్లు జరుగుతాయి.
- మండల స్థాయి: 680 మండలాల్లో మొత్తం 1.42 లక్షల మ్యాచ్లు జరుగుతాయి.
- నియోజకవర్గ స్థాయి: 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్లు జరుగుతాయి.
- జిల్లా స్థాయి: 26 జిల్లాల్లో 312 మ్యాచ్లు జరుగుతాయి.
- రాష్ట్ర స్థాయి: 250 మ్యాచ్లు జరుగుతాయి.
- ఈ కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్తో పాటు సంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలు కూడా నిర్వహించబడతాయి.
- విజేతలకు భారీగా నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, మెమెంటోలు ఇవ్వబడతాయి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా పోటీల విజేతలకు భారీగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు.
Caste Survey 2023 Schedule - కుల గణన సర్వే 2023 షెడ్యూల్ :
- గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్ : డిసెంబర్ 5 2023 లోపు
- సచివాలయ సిబ్బందిని ఎన్యుమరేటర్ మరియు సూపర్వైజర్ వారితో టాగింగ్ చేయుట : డిసెంబర్ 6 2023 లోపు
- క్యాస్ట్ సర్వే చేయు వారికి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చుట : డిసెంబర్ 8 2023 లోపు
- ఇంటింటికి వెళ్లి గ్రామ వార్డు సచివాల సిబ్బంది సర్వే ను మొదలుపెట్టి పూర్తి చేయుట : డిసెంబర్ 9 న మొదలు అయ్యి డిసెంబర్ 18 వరకు (10 రోజులు)
- హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వారు సచివాలయంలో డేటా ఇచ్చుట : డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 23 వరకు (5 రోజులు)
- గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వే చేసిన డేటాను వాలిడేషన్ మరియు వెరిఫికేషన్ చేయుట : డిసెంబర్ 31 లోపు