Aadudam Andhra Registarion Details Correction Process
గ్రామ వార్డు వాలంటీర్ వారు GSWS Volunteer App లో ఆడుదాం ఆంధ్ర సర్వే చేసిన తర్వాత మరలా ఆడుదాం ఆంధ్ర వెబ్ సైట్లో ప్లేయర్ / ఆడియన్స్ రిజిస్ట్రేషన్ చేయనవసరం లేదు. సర్వే సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ తో ప్లేయర్ లేదా ఆడియన్ ఆడుదాం ఆంధ్ర వెబ్సైట్లో లాగిన్ అవ్వవచ్చు.
Caste Survey 2023 Schedule - కుల గణన సర్వే 2023 షెడ్యూల్ :
adudam andhra registration last date :
- గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్ : డిసెంబర్ 5 2023 లోపు
- సచివాలయ సిబ్బందిని ఎన్యుమరేటర్ మరియు సూపర్వైజర్ వారితో టాగింగ్ చేయుట : డిసెంబర్ 6 2023 లోపు
- క్యాస్ట్ సర్వే చేయు వారికి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చుట : డిసెంబర్ 8 2023 లోపు
- ఇంటింటికి వెళ్లి గ్రామ వార్డు సచివాల సిబ్బంది సర్వే ను మొదలుపెట్టి పూర్తి చేయుట : డిసెంబర్ 9 న మొదలు అయ్యి డిసెంబర్ 18 వరకు (10 రోజులు)
- హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వారు సచివాలయంలో డేటా ఇచ్చుట : డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 23 వరకు (5 రోజులు)
- గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వే చేసిన డేటాను వాలిడేషన్ మరియు వెరిఫికేషన్ చేయుట : డిసెంబర్ 31 లోపు
ఆడదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్ తప్పుగా చేస్తే ఎలా మార్చుకోవాలి ?
Correct Aadudam Andhra Registration Details :
ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేయు సమయంలో వివరాలు అనగా ఫోటో, చిరునామా, ఎంచుకున్న క్రీడలు తప్పుగా నమోదు చేసి ఉంటే వాటిని సరి చేసుకోవటానికి ఆప్షన్ కలదు. ఒకసారి సరి చేసుకున్న తరువాత టీము క్రియేట్ అయ్యేలోపు ఎన్నిసార్లు అయినా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ విధంగా వివరాలు అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయండి.
Step 2 : రిజిస్ట్రేషన్ చేయు సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యండి.
Step 3 : మొబైల్ నెంబర్ కు వచ్చినటువంటి 6 అంకెల OTP ను ఎంటర్ చేసి Confirm OTP పై క్లిక్ చెయ్యండి.
Step 4 : Set Login Password లో కొత్తగా గుర్తున్నటువంటి పాస్వర్డ్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. Confirm Login Password వద్ద అదే పాస్వర్డ్ ను మరలా ఎంటర్ చేయవలెను. Captcha కోడ్ ఎంటర్ చేసి Change Password పై క్లిక్ చెయ్యండి.
Step 5 : Log In Page లో User ID వద్ద మొబైల్ నెంబర్ ను, Password వద్ద ముందుగా ఇచ్చిన Password ను ఎంటర్ చేయాలి. Captcha Code ఎంటర్ చేసి Log In పై క్లిక్ చేయాలి.
Step 6 : ప్లేయర్ యొక్క డాష్ బోర్డు కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
Step 7 : My Profile పై క్లిక్ చేయాలి.
Step 8 : ఏ వివరాలు మార్చాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఉన్న పెన్ గుర్తుపై క్లిక్ చేయాలి. తరువాత మార్చాలి అనుకునే వివరాలు అప్డేట్ చేసి సేవ్ పై క్లిక్ చేసినట్లయితే వివరాలు మారుతాయి. పై విధంగా ప్లేయర్ యొక్క ఫోటో అడ్రస్ వివరాలు మరియు ఎంచుకున్న క్రీడలను మార్చుకోవచ్చు.
కార్యక్రమం ఎలా జరుగుతుంది ?
కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది:
- గ్రామ/వార్డు సచివాలయ స్థాయి: 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50 లక్షల మ్యాచ్లు జరుగుతాయి.
- మండల స్థాయి: 680 మండలాల్లో మొత్తం 1.42 లక్షల మ్యాచ్లు జరుగుతాయి.
- నియోజకవర్గ స్థాయి: 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్లు జరుగుతాయి.
- జిల్లా స్థాయి: 26 జిల్లాల్లో 312 మ్యాచ్లు జరుగుతాయి.
- రాష్ట్ర స్థాయి: 250 మ్యాచ్లు జరుగుతాయి.
- ఈ కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్తో పాటు సంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలు కూడా నిర్వహించబడతాయి.
- విజేతలకు భారీగా నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, మెమెంటోలు ఇవ్వబడతాయి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా పోటీల విజేతలకు భారీగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు.
ఆడుదాం ఆంధ్రా పోటీల విజేతలకు ప్రైజ్ మనీ ఎంత ?
Aadudam Andhra Prize Money
క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు
- నియోజకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే రూ.35 వేలు, జిల్లాస్థాయిలో రూ.60 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలుగా ఉంది.
- రెండో ప్రైజ్ నియోజకవర్గస్థాయిలో రూ.15 వేలు, జిల్లాస్థాయిలో రూ.30 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.3 లక్షలుగా నిర్ణయించారు.
- మూడో ప్రైజ్ నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
బ్యాండ్మింటన్ డబుల్స్ విభాగంలో
- మొదటి బహుమతి ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో రూ. 20 వేలు, జిల్లాస్థాయిలో రూ.35 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
- రెండో ప్రైజ్ నియోజకవర్గస్థాయిలో రూ.10 వేలు, జిల్లాస్థాయిలో రూ.20 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.1 లక్షగా నిర్ణయించారు.
- మూడో ప్రైజ్ కింద నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.50 వేలుగా నిర్ణయించారు.