Aadhaar Name Correction With Caste Certificate in telugu Aadhaar Name Correction With Caste Certificate in telugu

Aadhaar Name Correction With Caste Certificate in telugu

 

#AadhaarNameCorrection TeluguTips #PublicServiceInfo #TeluguReaders #AadhaarGuide #CasteCertificate #NameCorrectionProcess #AadhaarCardHelp #AadhaarUpdate #TeluguBlog #TelanganaUpdates #AndhraPradeshUpdates #CasteCertificateTelugu  #AadhaarTelugu #UIDAITelugu

Aadhaar Name Correction With Caste Certificate in telugu


ఆధార్ కార్డులో పేరు మార్చుకోవటానికి Aadhaar Name Correction మీ దగ్గర ఉన్న కుల ధ్రువీకరణ పత్రము Caste Certificate లేదా ఓబిసి సర్టిఫికెట్ OBC Certificate ఉంటే సరిపోతుంది అనే విషయం మీకు తెలుసా ? అవును మీరు విన్నది నిజమే ఆధార్ కార్డులో పేరు మార్చుకోవటానికి మన దగ్గర ఉన్నటువంటి కుల ధ్రువీకరణ పత్రము అదే క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఓబీసీ సర్టిఫికెట్ Aadhaar Name Correction With Caste Certificate ఉంటే సరిపోతుంది .


క్యాస్ట్ సర్టిఫికెట్ తో మన ఆధార్ కార్డులో పేరుని Aadhaar Name Correction With Caste Certificate  ఎలా మార్చుకోవాలి ? ఎక్కడ మార్చుకోవాలి? ఎంత ఛార్జ్ అవుతుంది ? సర్టిఫికెట్ ఎలా ఉండాలి ? ఎన్ని రోజుల్లో అప్డేట్ అవుతుంది ? అనే పూర్తి విషయాలు ఈ పోస్టులో చూద్దాం .

All Aadhaar Services In telugu

వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విన్నపం ఏంటంటే కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయినట్టు అయితే వెంటనే ఇటువంటి అప్డేట్లు మీకు రోజు అందుతాయి.


సర్టిఫికెట్ ఎలా ఉండాలి ?

మీరు రెగ్యులర్గా మీ యొక్క గ్రామా / వార్డు సచివాలయం లేదా మీ సేవలో దరఖాస్తు చేసినటువంటి కుల ధ్రువీకరణ పత్రము  ఉంటే సరిపోతుంది  . SC /  ST వారికి  ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ సరిపోతుంది , అదే BC వారికి తప్పనిసరిగా OBC సర్టిఫికెట్ ఉండాలి . ఈ సర్టిఫికెట్ కొరకు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో లేదా గ్రామ / వార్డు సచివాలయంలో  ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్  కొరకు దరఖాస్తు చేసి ఆమోదం పొందిన తరువాత కిందను చూపిన విధముగా మీకు సర్టిఫికెట్ వస్తుంది . 

#AadhaarNameCorrection TeluguTips #PublicServiceInfo #TeluguReaders #AadhaarGuide #CasteCertificate #NameCorrectionProcess #AadhaarCardHelp #AadhaarUpdate #TeluguBlog #TelanganaUpdates #AndhraPradeshUpdates #CasteCertificateTelugu  #AadhaarTelugu #UIDAITelugu


ఈ సర్టిఫికెట్ పై పైన ఫోటోలో చూపించిన విధంగా అప్లికేషన్ చేసే వారి యొక్క ఫోటో అంటించి , సంబంధిత మండల తహసీల్దారు వారి స్టాంపు వేయించుకుంటే సర్టిఫికెట్ ప్రూఫ్ గా పని చేస్తుంది .


ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి ?


ఆధార్ కార్డులో క్యాస్ట్ సర్టిఫికేట్ తో పేరు మార్చుకోవటానికి Aadhaar Name Correction With Caste Certificate సొంతంగా ఆన్లైన్ లో అవకాశం లేదు. కేవలం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ కు వెళ్లి మాత్రమే మీరు  కాస్ట్ సర్టిఫికెట్ తో ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది .


దరఖాస్తుకు ఏం కావాలి ?

ఆధార్ కార్డులో క్యాస్ట్ సర్టిఫికెట్ తో పేరు మార్చుకోవటాని Aadhaar Name Correction With Caste Certificate కి మొదటగా 

  1. పైన చూపినటువంటి కుల ధ్రువీకరణ పత్రము లేదా ఓ బి సి సర్టిఫికెట్ ఉండాలి  
  2. అప్లికేషన్ చేయువారు తప్పనిసరిగా ఆధార్ సెంటర్ కు వెళ్లాలి  
  3. వారి ఆధార్ కార్డులో పేరు గతంలో రెండు సార్లు మించి అప్డేట్ చేసి ఉండకూడదు 
  4. ఆధార్ కార్డు యాక్టివ్ లో ఉండాలి  
  5. ఆధార్ కార్డు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి అయి ఉండాలి  
  6. అప్లికేషన్ ఫారం తీసుకొని వెళ్ళాలి [ Download Form


అప్లికేషన్ ఫీజు ఎంత ?

ఆధార్ కార్డులో క్యాస్ట్ సర్టిఫికెట్ తో పేరు అప్డేట్ చేసుకోవడాని Aadhaar Name Correction With Caste Certificate కి అప్లికేషన్ ఫీజు ఆధార్ సెంటర్లో కేవలం 50 రూపాయలు మాత్రమే.


ప్రాసెస్ ఎలా ఉంటుంది ?

మొదటగా అప్లికేషన్ చేయువారు ఆధార్ సెంటర్  పైన చెప్పిన విధంగా ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఓబీసీ సర్టిఫికెట్ను మరియు దరఖాస్తు ఫారం ను తీసుకొని వెళ్ళాలి.

దరఖాస్తు ఫారం ఫిల్ చేయాలి . [ ఫిల్ చేయు విధానము ]

ఆధార్ ఆపరేటర్ వారు అప్లికేషన్ చేస్తున్న వారి ఫోటో మరియు ఐరిష్ లేదా బయోమెట్రిక్ తీసుకుంటారు .

క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఓబిసి సర్టిఫికెట్ ఒరిజినల్ స్కాన్ చేస్తారు .

సర్టిఫికెట్ లో ఉన్నటువంటి పేరును నమోదు చేస్తారు.

ఆపరేటర్ వారి బయోమెట్రిక్ వేసి దృవీకరణ చేస్తారు .

చివరగా రసీదు ప్రింట్ వస్తుంది . రసీదు పై ఆపరేటర్ మరియు దరఖాస్తుదారుని సంతకం చేసి  అప్లోడ్ చేస్తారు .

50 రూపాయల ఫీజు తీసుకుంటారు.

 ఆధార్ ఆపరేటర్ వారు రసీదును అప్లికేట్కు ఇస్తారు .


ఎన్ని రోజుల్లో పేరు అప్డేట్ అవుతుంది  ?

సాధారణంగా  ఆధార్ కార్డులో పేరు అప్డేట్ అవ్వటానికి  రెండు రోజుల నుంచి పది రోజుల సమయం పడుతుంది డాక్యుమెంట్లో ఏదైనా సమస్య ఉన్న లేదా బయోమెట్రిక్ సమస్య ఉన్న పది రోజులకు మించి 90 రోజుల వరకు సమయం పడుతుంది . 

Success Case Receipt

Aadhaar Name Correction With Caste Certificate in telugu Video 



అప్డేట్ అయ్యిందా లేదా అని మీరు కింద తెలిపిన విధంగా స్టేటస్ తెలుసుకోవచ్చు

Know Application Status

Post a Comment

0 Comments