Annadata Sukhibhava Scheme 2025
📌 What is the Annadata Sukhibhava Scheme 2025?
అన్నదాత సుఖీభవ పథకం Annadata Sukhibhava Scheme అనేది చిన్న, సన్నకారు ,కౌలు రైతులకు నగదు రూపంలో సాయం అందించాలనే ఉద్దేశంతో AP Govt ప్రారంభించిన Scheme . కేంద్ర ప్రభుత్వం 2019 నుండి అందిస్తున్న PM Kisan Scheme తోపాటు రాష్ట్ర ప్రభుత్వం Annadata Sukhibhava Scheme ను అందిస్తుంది అంటే కేంద్రం PM Kisan Scheme ద్వారా అందించే Rs.6000/- కు రాష్ట్ర ప్రభుత్వం Rs.14000/- కలిపి మొత్తం నగదు Rs.20,000/- ను 3 విడతలుగా అందిస్తుంది . Annadhata Sukhibhava Scheme Start Date - June 12th 2025
👨🌾 Eligibility Criteria for Farmers in 2025
State : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు.
Farmer Type : చిన్న, సన్నకారు రైతులు (5 ఎకరాల లోపు భూమి కలిగినవారు) మాత్రమే అర్హులు.
Age : వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Land Document : భూమికి సంబంధించి పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్‌బుక్ తప్పనిసరిగా ఉండాలి.
Name Link : రైతు పేరు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి.
e Crop Booking : రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి.
Tenant Farmers : భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు (Tenant Farmers) కూడా ఈ పథకానికి అర్హులు. అయితే, తప్పనిసరిగా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం [ CCRS Card ] ఉండాలి.
[ సాధారణంగా పీఎం-కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ, అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు. ]
Tenant Farmers Eligible For Annadata Sukhibhava Scheme ?
సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న అన్నదాతలకు (కౌలు రైతులు Tenant Farmers) కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, కౌలు రైతు ధ్రువీకరణ పత్రం (CCRC Card) కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
Ineligible Criteria For Annadata Sukhibhava Scheme ?
Income Tax : గత ఆర్థిక సంవత్సరం లో ఆదాయపన్ను (Income Tax) చెల్లించేవారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు.
Employees : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు.
Political : ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు.
Pension : రూ. 10 వేలు, అంతకంటే ఎక్కువ పింఛను పొందేవారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు.
Family Unit : అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేయనున్నారు. అంటే, ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురి పేరిట భూమి ఉంటే వారిలో ఒక్కరికే లబ్ధి చేకూరుతుంది.
Land Holding : భూమి రెండు వేరువేరు కుటుంబాలకు చెందిన వ్యక్తుల పేరుపై ఉన్నట్లయితే ఆ రెండు కుటుంబాలు ఈ పథకానికి అర్హత పొందుతారు
📄 Documents Required to Apply for the Annadata Sukhibhava Scheme
- Farmer Aadhaar Card
- ROR 1B / Patta / Passbook
- Bank Passbook [ Aadhaar linked ]
- Mobile Number [ Working ]
- Survey Numbers [ As Per ROR ]
- Passport Size Photo [ Farmer ]
📝 How to Apply for Annadata Sukhibhava Scheme Online
అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్, బ్యాంకు పాస్ బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రం Raithu Seva Kendram లో అధికారులను సంప్రదించాలి. అక్కడి VAA/ VHA / VSA సిబ్బందికి వివరాలను అందించాలి.
🔻
అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి, వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల Annadata Sukhibhava Scheme Eligible జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు.
🔻
రైతుసేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్‌ల్యాండ్ డేటాను ఉన్నతాధికారులు MRO / MAO పరిశీలించి, అర్హులైన వారిని Annadata Sukhibhava Scheme Eligible List లో చేరుస్తారు.
🔻
ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
💸 Financial Assistance and Benefits under the Annadhata Sukhibhava Scheme
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-Kisan Scheme పథకానికి అనుబంధంగా Annadhata Sukhibhava Scheme ను రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14000 కలిపి మొత్తం Annadhata Sukhibhava Scheme Amount రూ.20,000లను నేరుగా రైతుల Aadhaar Linked Bank Account బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.
Annadhata Sukhibhava Scheme Approval Process 2025
అర్హులైన రైతులు తమ వివరాలను రైతుసేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు.
🔻
రైతుసేవా కేంద్రాల వారీగా రికార్డయ్యే వెబ్‌ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో (Village Agricultural Assistants) పాటు మండల వ్యవసాయ అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలను పరిశీలిస్తారు.
🔻
అనంతరం వ్యవసాయాధికారి ఆ వివరాలను ఫార్వార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తాయి.
🔻
వివరాలన్నీ సరిగా ఉంటే అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో ఆ రైతు పేరును చేరుస్తారు. వెబ్‌ల్యాండ్‌లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు.
🔻
క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు.
How to Check Annadata Sukhibhava Scheme 2025 Application Status Online
Step 1 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేయండి
Step 2 : Home Page లోని 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 3 : మీ Aadhaar Card Number లేదా Mobile Number ను ఎంటర్ చేసి, స్క్రీన్‌పై కనిపిస్తున్న Captcha ను ఎంటర్ చేయండి.
Step 4 : ఆ తర్వాత Search ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ (పెండింగ్, వెరిఫైడ్, రీజెక్ట్, పేమెంట్ జమ అయినది) చూపిస్తుంది.
Reject మినహా ఇంకేం వచ్చినా సమస్య లేనట్టు రిజెక్ట్ అని వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా రైతులు వారి రైతు సేవ కేంద్రంలోని అధికారులు కానీ లేదా మండలాధికారులు గాని లేదా జిల్లా స్థాయి అధికారులు కానీ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది . VAA ఆమోదం తెలిపిన తర్వాత మండల స్థాయి అధికారైన MAO వారి ఆమోదం తెలపాల్సి ఉంటుంది . రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించినా, వారి లాగిన్ ద్వారా స్టేటస్ తనిఖీ చేస్తారు. అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు.
✅ Key Features of Annadata Sukhibhava Scheme 2025
- రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం.
- అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20,000 పెట్టుబడి సహాయం.
- రైతులందరికీ విత్తనాలు, ఎరువులు మరియు విపత్తులకు సంబంధించిన బీమా కల్పించడం.
- రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహించడం.
- రైతుల సామాజిక స్థితి, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం.
- వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం.
📆 Important Dates and Deadlines for 2025
Annadata Sukhibhava Scheme 2025 Apply Last Date And Verification Last Date : అన్నదాత సుఖీభవ 2025 దరఖాస్తుకు చివరి తేదీ: May 20 , 2025
🤔 Frequently Asked Questions (FAQs)
ప్రశ్న 1 : నాకు పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు జమ అవుతున్నాయి? అన్నదాత సుఖీభవ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా..?
సమాధానం : పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి చేకూరుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నా నష్టంలేదు. అధికారులు డేటాను పరిశీలించి కొత్తగా అర్హులైన రైతులను జాబితాలో చేరుస్తారు.
ప్రశ్న 2 : కుటుంబంలో ఎంత మందికి అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ చేస్తారు?
సమాధానం : అన్నదాత సుఖీభవ పథకాన్ని ఒక కుటుంబం యూనిట్‌గా తీసుకొని అమలు చేస్తున్నారు. అంటే భార్య, భర్త, పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. కొత్తగా పెళ్లయిన పిల్లలను వేరే కుటుంబంగా పరిగణిస్తారు. అందువల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వెంటనే తమ వివరాలను రైతు సేవా కేంద్రంలో రిజిస్టర్ చేయించుకోవాలి.
ప్రశ్న 3 : నాకు ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే నిధులు రావా?
సమాధానం : పీఎం కిసాన్ కింద అందజేసే రూ.2000 లకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే నిధులను కలిపి రైతు ఖాతాలో జమ చేస్తుంది. మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.20 వేలు (పీఎం కిసాన్ 6000 + అన్నదాత సుఖీభవ 14,000) రైతు ఖాతాలో జమ చేస్తారు. అయితే, ఈ సీజన్‌కు సంబంధించి పీఎం కిసాన్ నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. వారందరికీ పీఎం కిసాన్ నిధులు పోను, అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే నిధులు జమ అవుతాయి.
ప్రశ్న 4 : ఏయే పంటలు పండించే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుంది?
- వ్యవసాయంతో పాటు
- పండ్ల తోటలు,
- ఉద్యానవన తోటలు,
- పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు
సాగు చేసే రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు.
ప్రశ్న 5 : అన్నదాత సుఖీభవ పథకం ఎవరికి వర్తించదు?
సమాధానం :
- ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుంది.
- ఆర్థికంగా బాగా ఉన్నవారికి, ఆదాయపు పన్ను చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు.
- మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్లు లాంటి వారికి,
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించందు.
- అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు,
- స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు.
- నెలకు రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ పథకానికి అనర్హులు.
- అయితే, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఉంది.
ప్రశ్న 6 : అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు స్టేటస్‌ను మాత్రం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ (https://annadathasukhibhava.ap.gov.in ) లో లాగిన్ అయి, ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆధారంగా రైతులు తమ దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.