PM-KISAN డబ్బులు ఎందుకు పడటం లేదు?
✅ Resource Center

PM-KISAN డబ్బులు ఎందుకు పడటం లేదు?

 

PM Kisan Payment Not Credited Reasons and Solutions 2025 | PM-KISAN eKYC NPCI Linking Issues

PM Kisan Payment Not Credited Reasons & Solutions 2025

ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం రైతులకు ₹6,000 ఆర్థిక సహాయం అందించే PM-KISAN Samman Nidhi Scheme క్రింద కొంతమంది రైతులకు డబ్బులు పడటం లేదు. కారణాలు ఏమిటి? వాటి పరిష్కారాలు ఏమిటి? ఇప్పుడు ఒక్కొక్కటి స్పష్టంగా చూద్దాం.


🟩 1. eKYC పూర్తి చేయకపోవడం (PM Kisan eKYC Issue)

పథకం పొందడానికి eKYC తప్పనిసరి. ఇది పూర్తి చేయకపోతే ఏ విడత కూడా జమ కాదు.

✔ పరిష్కారం

  • మీ దగ్గరలోని Meeseva / CSC Center కు వెళ్లాలి
  • Biometric / Iris Authentication తో eKYC పూర్తి చేయాలి
  • eKYC పూర్తైన తర్వాత 30–60 రోజుల్లో డబ్బులు జమ అవుతాయి


🟦 2. Aadhaar–Passbook Link లేకపోవడం (Aadhaar Linking Issue)

భూస్వామ్యం ధృవీకరణ కోసం Aadhaar–Land Passbook Linking తప్పనిసరి.

✔ పరిష్కారం

  • గ్రామ సచివాలయంలో Digital Assistant వద్ద అప్లికేషన్ సమర్పించాలి
  • Tahsildar Approval తర్వాత
  • RBK → PM-KISAN Portal లో వివరాలు అప్డేట్ అవుతాయి


🟨 3. Bank Account NPCI Mapping లేకపోవడం (NPCI Seeding Error)

NPCI Seeding లేకపోతే PM-KISAN డబ్బులు పడవు.

✔ పరిష్కారం

  • మీ బ్యాంక్‌లో Aadhaar Seeding with NPCI చేయాలి
  • లేదా IPPB (India Post Payments Bank) లో కొత్త ఖాతా ఓపెన్ చెయ్యండి
  • NPCI లింక్ అయిన తర్వాత 30–90 రోజుల్లో ఆగిపోయిన విడత జమ అవుతుంది


🟧 4. 2019 తర్వాత భూంయూటేషన్ (Land Mutation After 2019)

2019 ఫిబ్రవరి తర్వాత భూమి మ్యూటేషన్ జరిగినవారి దరఖాస్తులు ఆటోగా నిలిపివేయబడతాయి.

✔ ప్రత్యేక నియమం

  • రైతు మరణిస్తే, భార్య/భర్త నామినీగా Mutation చేసి Re-Apply చేస్తే అర్హత పొందుతారు.


🟥 5. ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉన్న అనుమానం (Duplicate Beneficiary Issue)

ఈ సంవత్సరం ఎక్కువగా నిలుపుదల కారణం ఇదే.

✔ పరిష్కారం

  • Field Verification పూర్తయ్యాక అర్హులైన రైతులకు డబ్బులు తిరిగి జమ అవుతాయి.


🟪 6. అనర్హుల జాబితాలో ఉండడం (PM Kisan Ineligible Categories)

  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
  • పెన్షన్ పొందేవారు
  • Income Tax చెల్లించేవారు
  • ప్రజాప్రతినిధులు


PM-KISAN Payment Not Credited Reasons & Solutions

సమస్య కారణం పరిష్కారం
eKYC ఖాతా నిలుపుదల Meeseva/CSC Biometric eKYC
Aadhaar–Passbook అర్హత నిలిపివేత గ్రామ సచివాలయంలో లింక్ చేయాలి
NPCI Mapping బ్యాంక్ తిరస్కారం బ్యాంక్లో Aadhaar Seeding
2019 తర్వాత మ్యూటేషన్ అర్హత రద్దు నామినీ అప్లై చేయాలి
Duplicate Family విడత నిలిపివేత Field Verification

FAQs – PM-KISAN డబ్బులు ఎందుకు పడటం లేదు?

❓ ప్రశ్న ✔ సమాధానం
1️⃣ PM-KISAN డబ్బులు ఎందుకు నిలిపివేస్తారు? eKYC లేకపోవడం, NPCI లింక్ లేకపోవడం, Aadhaar mismatch, ఒకే కుటుంబం అనుమానం.
2️⃣ eKYC తర్వాత ఎన్ని రోజుల్లో డబ్బులు పడతాయి? సాధారణంగా 30–60 రోజుల్లో విడత జమ అవుతుంది.
3️⃣ NPCI లింక్ అయిందో ఎలా చెక్ చేయాలి? బ్యాంక్‌లో “Aadhaar Seeding Status” అడిగితే వెంటనే చెబుతారు.
4️⃣ PM-KISAN Helpline? 155261 / 011-24300606
5️⃣ ఒకే కుటుంబంలో ఇద్దరికి డబ్బులు వస్తాయా? లేదు.


🌾 PM Kisan 2025 Eligibility Criteria

📌 అర్హత ప్రమాణం ℹ️ వివరాలు
🌍 State All Indian Farmers
🚜 Farmer Type Small & Marginal Farmers
🎯 Age 18+ Years
📄 Land Documents Valid Pattadar Passbook
🔗 Name Link Aadhaar Linked Name
👨‍🌾 Tenant Farmers Eligible with CCRS Card
💰 Income Tax Tax Payers Not Eligible
🏛 Employees Govt Employees Not Eligible
🗳 Political Leaders Not Eligible
👨‍👩‍👧 Family Unit One Beneficiary per Family


🧾 AP Farmer Mutation (Death Case) Process – Step-by-Step

1️⃣ 🏢 MeeSeva Portal → Land Mutation
2️⃣ 📄 అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి
3️⃣ 🏛 Tahsildar Verification
4️⃣ 💻 Webland లో Mutation Entry
➡️ ✅ Mutation పూర్తయ్యాకే పథకాల నిధులు జమ అవుతాయి

⚠️ Aadhaar Mapping / NPCI Seeding సమస్యలు – పరిష్కారాలు

⚠️ Common Issue ✔️ Solution
🔐 Aadhaar–Bank Error 📍 RSK లో Status Check
🔄 NPCI Inactive 🏦 Bank లో NPCI Seeding
🆔 Duplicate Aadhaar 📝 MeeSeva లో Correction
❗ Name Mismatch 👤 Aadhaar Name = Bank Passbook Name


🌐 PM Kisan Eligibility Status Check Online


Post a Comment

0 Comments