జనాభా గణనలో ఈ తప్పులు చెయ్యకండి ! ఎన్యుమరేటర్లు మరియు సూపర్ వైజర్ల కోసం ముఖ్యమైన సూచనలు | Census 2027 Training Key Points for Enumerator

జనాభా గణనలో ఈ తప్పులు చెయ్యకండి ! ఎన్యుమరేటర్లు మరియు సూపర్ వైజర్ల కోసం ముఖ్యమైన సూచనలు | Census 2027 Training Key Points for Enumerator

AP TS Census 2027 Enumerator Training Manual and HLB Mapping Guide

జనాభా గణన 2027 : ఎన్యుమరేటర్ & సూపర్వైజర్ కీలక అంశాలు (Census Training Key Points)

GSWS Helper ద్వారా మీకోసం జనాభా గణన 2027 (Census 2027) శిక్షణలో ముఖ్యమైన పాయింట్లు – ఎన్యుమరేటర్ (Enumerator) & సూపర్వైజర్ (Supervisor) కోసం సంపూర్ణ గైడ్. భారతదేశపు అతిపెద్ద ప్రజా ప్రాజెక్టులలో ఇది ఒకటి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ లెక్కింపు విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది. HLB (House Listing Block), HLO (Houselisting Operations), మ్యాపింగ్ సింబల్స్ పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడమైంది.

ముందుగా కొన్ని అబ్రివేషన్ లు ఇక్కడ తెలుసుకుందాం!

HLB అంటే House Listing Block (గృహ గణన బ్లాక్). ఇది జనాభా గణనలో అతి చిన్న విభాగం. ప్రతి ఎన్యుమరేటర్కు ఒక HLB కేటాయించబడుతుంది, దీనిలో సుమారు 150 నుండి 180 ఇళ్లు లేదా 650 నుండి 800 మంది జనాభా ఉంటారు.

HLO అంటే Houselisting Operations (గృహ గణన ప్రక్రియ). ఇది జనాభా గణనలో మొదటి దశ.

  • దీని ద్వారా దేశంలోని అన్ని ఇళ్లను జాబితా చేస్తారు.
  • ఇళ్లలోని సౌకర్యాలు (నీరు, విద్యుత్, గ్యాస్ వంటివి) మరియు ఆస్తుల వివరాలను సేకరిస్తారు.
  • ఎన్యుమరేటర్లు ఈ సమాచారాన్ని సేకరించడానికి HLO Mobile App అనే డిజిటల్ యాప్ను ఉపయోగిస్తారు.

1. CENSUS 2027 PHASES (జనాభా గణన 2027 దశలు)

దశ (Phase)ప్రక్రియ పేరునిర్వహించే సమయం (Tentative Dates)సేకరించే వివరాలు
మొదటి దశగృహ గణన (Houselisting & Housing Census)ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు ( మే 11 – జూన్ 9 – తెలంగాణ )ఇళ్ల సంఖ్య, ఇంటి రకం, తాగునీరు, విద్యుత్, ఇంధనం మరియు ఇతర గృహ సౌకర్యాలు.
రెండవ దశజనాభా గణన (Population Enumeration)ఫిబ్రవరి 9, 2027 నుండి ఫిబ్రవరి 28, 2027 వరకువ్యక్తిగత వివరాలు (పేరు, వయస్సు, లింగం, విద్య, మతం, వృత్తి, మాతృభాష మొదలైనవి).
తుది దశపునఃపరిశీలన (Revision Round)మార్చి 1, 2027 నుండి మార్చి 5, 2027 వరకుగణన జరిగిన తర్వాత జన్మించిన లేదా మరణించిన వారి వివరాలను అప్డేట్ చేయడం.

2. ENUMERATOR DUTIES (ఎన్యూమరేటర్ విధులు)

Sl NoTaskDescription
1MAPమొదటి ౩ రోజులు మనకు ఇచ్చిన HLB బ్లాక్ ని మొత్తం తిరిగి అన్ని భవనాలను కవర్ అయ్యేలా ఒక మ్యాప్ గీయాలి.
2APPHLO ఆప్ ని వాడటం
3SELF ENUMERATION ACCEPTANCEఫీల్డ్ లోకి వెళ్ళినపుడు ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తే ఆ సమాచారం ని కూడా నిర్ధారణ చేయాలి.
NOTE: SELF ENUMERATION డేటా మన HLO ఆప్ లో ఉంటుంది. లేదా మనకు చార్జ్ ఆఫీసర్ / సూపర్ వైజర్ ద్వారా అందును.

3. MAP DRAWING TIPS (మ్యాప్ ఎలా వేయాలి…టిప్స్)

  1. మొదట ఔట్ లైన్ మ్యాప్ గీయండి.
  2. తర్వాత రోడ్లు, కాలువలు, లాంటివి గీయాలి.
  3. తర్వాత భవనాలు, గుడి, చర్చి, మసీదులు లాంటి ల్యాండ్ మార్క్ లు గుర్తించాలి.

4. HLB MAPPING SYMBOLS (HLB మ్యాపింగ్ గుర్తుల పట్టిక - Updated)

అంశం (Feature)మ్యాపింగ్ గుర్తు (Symbol)వివరణ (Description)
పక్కా నివాస భవనం□ (ఖాళీ చతురస్రం)నివాసానికి ఉపయోగించే పక్కా ఇళ్లకు ఖాళీ చతురస్రం.
పక్కా నివాసేతర భవనం■ (Shaded Square)ఆఫీసులు, దుకాణాలు వంటి పక్కా భవనాలకు Shaded Square.
కచ్చా నివాస భవనం△ (ఖాళీ త్రిభుజం)నివాసానికి ఉపయోగించే కచ్చా ఇళ్లకు ఖాళీ త్రిభుజం.
కచ్చా నివాసేతర భవనం▲ (Shaded Triangle)నివాసేతర అవసరాలకు వాడే కచ్చా భవనాలకు Shaded Triangle.
పక్కా రోడ్డు════తారు లేదా సిమెంట్ రోడ్లు.
కచ్చా రోడ్డు----మట్టి రోడ్లు లేదా చిన్న దారులు.

ఇంకా గుడి, చర్చి, మసీదు లాంటి వాటిని కూడా భవనం నెంబర్ ఇస్తూ మ్యాప్ లో గుర్తించాలి.

మ్యాప్ వేసే సందర్భంలో 2 అంశాలు కీలకం.

  1. భవనం - BUILDING
  2. గణన గృహం - CENSUS HOUSE

5. BUILDING EXPLANATION (భవనం వివరంగా)

భవనం అంటే

  • భూమి మీద నిర్మించిన కట్టడం.
  • 4 గోడలు & పై కప్పు ఉండాలి.
  • భవనాలు నివాసాలుగా & నివాసేతరముగా ఉండవచ్చు.
  • నివాసేతరము గా = అంటే దుకాణాలు, వ్యాపార గృహాలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ప్రార్థనా స్థలాలు, గోదాములు.
  • ఒక్కోసారి భవనాలు – నివాసం+దుకాణం, నివాసం + వర్క్ షాప్, నివాసం+ కార్యాలయం మొదలైన కలయికతో కూడా ఉండవచ్చు.
  • PREMISES( ప్రహరీ ) తో ఉన్నదీ – ఒక భవనం గా పరిగణించాలి.
  • NOTE: అన్ని భవనాలకు ప్రహరీ ఉండవచ్చు. ఉండకపోవచ్చు.
  • అలాగే ఒక ప్రహరీ లోపల ఒకటి కంటే ఎక్కువ భవనాలు కూడా ఉండవచ్చు.

6. CENSUS HOUSE EXPLANATION (గణన గృహం వివరంగా)

గణన గృహం అంటే

గణన గృహం ను ఎలా అంచనా వేయాలంటే … ప్రధాన ద్వారం - యాజమాన్యత - ఒకే కుటుంబ వాడకం లాంటి విషయాలను ఏక కాలంలో పరిగణన లోకి తీసుకోవాలి.

భవనంగణన గృహం రాసే విధానం
1ఒకటే కుటుంబం ఉంటే, అప్పుడు ఒకటే గణన గృహం = 1
2ఒక భవనంలో కింద ఒక పోర్షన్ (కుటుంబంతో ఉంటె), పైన 1 పోర్షన్ (ఖాళీ/కుటుంబంతో) ఉంటే, అప్పుడు మొత్తంగా 2 గణన గృహాలు = 2(2)
3ఒక భవనం లో ఒక పోర్షన్ కుటుంబంతో ఉండి, ఇంకో పోర్షన్ దుకాణం ఉంటే, అప్పుడు మొత్తంగా 2 గణన గృహాలు = 3(2)
4ఒక భవనంలో 2 రూంలు-ఒక కుటుంబం కి, ౩ రూంలు ఇంకో కుటుంబం కి ఉంటే, అప్పుడు మొత్తంగా 2 గణన గృహాలు = 4(2)
5ఒక భవనంలో స్కూల్/హాస్పిటల్/ హాస్టల్ ఉండి ఆ సంస్థాగత కుటుంబపు యజమాని, వార్డెన్, వాచ్ మాన్ అదే భవనంలో వేరు వేరు గణన గృహంలలో ఉంటే, అప్పుడు మొత్తంగా 4 గణన గృహాలు. ఎలా అంటే 1-సంస్థాగత కుటుంబం, 2-యజమాని, ౩-వార్డెన్, 4-వాచ్ మాన్ = 5(4)
6ఒక అపార్ట్ మెంట్( ఒకే రిజిస్ట్రేషన్) లో 3 ప్లాట్లు ఉంటే, అప్పుడు మొత్తంగా 3 గణన గృహాలు = 6(3)
7-8-9ఒక అపార్ట్ మెంట్ లో 3 ప్లాట్లు ఉండి, అవి వేరు వేరు రిజిస్ట్రేషన్ కలిగి ఉంటే - ప్రతి ప్లాట్ ఒక ప్రత్యేక భవనం గా పరిగణిస్తారు, అప్పుడు 3 భవనాలు – 3 గణన గృహాలు = 7-8-9

మొత్తంగా భవనం-గణన గృహం ల నిర్ధారణ చేయుటయే మొదటి ౩ రోజుల ప్రధాన పని. ఏ భవనము ను విడిచి పెట్టవద్దు.

7. COMMON DOUBTS (అందరికీ వచ్చే సందేహాలు - వివరణ)

  • మాములు కుటుంబం అంటే ఒకే దగ్గర ఉండి వంట చేసుకొని తినే కుటుంబం.
  • సంస్థాగత కుటుంబం అంటే – హోటల్స్ , మెస్సులు, వసతి గృహాలు, బిక్ష గాళ్ళ గృహాలు, వృద్ధాశ్రమాలు , అనాధ శరణాలయాలు, జైళ్ళు, మొ…
  • కచ్చా ఇల్లు అంటే – కాల్చని ఇటుకలు, వెదురు, మట్టి, గడ్డి, తుంగ, తాటాకు, ప్లాస్టిక్/పాలిథీన్ వదులుగా పేర్చిన రాళ్లతో కట్టిన ఇండ్లు.
  • పక్కా ఇల్లు అంటే – కింది వాటిని పరిగణన లోకి తీసుకోవాలి.
గోడలు కట్టుటకు వాడిన వస్తువులుపై కప్పు వేయుటకు వాడిన వస్తువులు
రాయి, GI (గాల్వనిజేషన్ ఐరన్ ), మెటల్/సిమెంట్ రేకులు, కాల్చిన ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, కాంక్రీట్, టింబర్సిమెంట్ పెంకులు, యంత్రపు తయారీ పెంకులు, కాల్చిన ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, రాయి, పలక, GI (గాల్వనిజేషన్ ఐరన్ ), మెటల్/సిమెంట్ రేకులు, కాంక్రీట్, టింబర్

8. SUPERVISOR DUTIES (సూపర్వైజర్ విధులు)

  • ప్రతీ 4 / 6 గురు ఎన్యూమరేటర్ లకి ఒక సూపర్ వైజర్ ఉంటారు.
  • ఈయన ఎన్యూమరేటర్ ల పనిని పర్యవేక్షిస్తారు.
  • ఎన్యూమరేటర్ లకు వచ్చే సందేహలను తీర్చాలి.

మరింత అదనపు సమాచారం ఇదే వెబ్ పేజిలో అప్డేట్ చేస్తాము.

9. FREQUENTLY ASKED QUESTIONS (తరచు ప్రశ్నలు)

Q1: 2027 జనాభా గణన ఎప్పుడు ప్రారంభమవుతుంది?
గృహ గణన (Houselisting) ఏప్రిల్ 2026 నుండి, ప్రధాన జనాభా గణన ఫిబ్రవరి 9, 2027 నుండి ప్రారంభమవుతుంది.
Q2: HLO యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి?
సంబంధిత సూపర్వైజర్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా డౌన్లోడ్ లింక్ అందుతుంది. ప్రస్తుతం ట్రైనింగ్ ఫేజ్ లో ఉంది.
Q3: HLB బ్లాక్ లో ఎన్ని ఇళ్లు ఉంటాయి?
150-180 గృహాలు లేదా 650-800 మంది జనాభా వరకు ఉంటుంది.
Q4: ఎన్యుమరేటర్ మ్యాప్ ఎక్కడ సృష్టించాలి?
మొదట ఆ ఫీల్డ్ విజిట్ చేసి, అన్ని భవనాలు, రోడ్లు, ల్యాండ్ మార్క్లు గుర్తించి HLO యాప్ లో లేదా కాగితం మీద మ్యాప్ తయారుచేయాలి.
Q5: సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏమిటి?
పౌరులు తమంతట తాముగా ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవడం. ఆ డేటాను ఎన్యుమరేటర్ ధృవీకరించాలి.
Q6: కచ్చా మరియు పక్కా ఇళ్లకు మ్యాపింగ్ సింబల్ ఏమిటి?
కచ్చా: త్రిభుజం (ఖాళీ/నిండిన), పక్కా: చతురస్రం (ఖాళీ/నిండిన).
Q7: సూపర్వైజర్ యొక్క ప్రధాన పాత్ర?
4-6 ఎన్యుమరేటర్లను మానిటర్ చేయడం, సందేహాలు క్లియర్ చేయడం, డేటా ఖచ్చితత్వం నిర్ధారించడం.
Q8: గణన గృహం (Census House) ఎలా లెక్కించాలి?
ప్రధాన ద్వారం, యాజమాన్యం, విడి కుటుంబ వాడకం - ఈ మూడు ఆధారంగా నిర్ధారించాలి.
Q9: సంస్థాగత కుటుంబం అంటే?
హోటల్, హాస్టల్, వృద్ధాశ్రమం, జైలు, అనాధ శరణాలయం వంటివి.
Q10: పునఃపరిశీలన దశలో ఏమి చేస్తారు?
ఫిబ్రవరి 28 తర్వాత జన్మించిన/మరణించిన వారి వివరాలు అప్డేట్ చేస్తారు (మార్చి 1-5, 2027).

More resources from GSWS Helper

© 2025 GSWS Helper - Educational & Employment Updates | జనాభా గణన శిక్షణ సహాయం
Disclaimer: This is a training reference post only. Always refer to official Census authorities for latest guidelines.

Post a Comment

0 Comments