AP Local Body Elections: BC, SC, ST Reservationsపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

AP Local Body Elections: BC, SC, ST Reservationsపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

AP Panchayat Elections 2026 BC Reservation G.O.Ms.No.153 and 50 percent reservation limit

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో BC (Backward Classes), SC (Scheduled Castes), ST (Scheduled Tribes) రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. G.O.Ms.No.153, తేదీ 11-10-2026 ద్వారా గతంలో జారీ చేసిన G.O.Ms.No.105, తేదీ 20-08-2026లో మార్పులు చేసింది.

హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, Dedicated Commission సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా SC, ST, BC వర్గాలకు కలిపి ఉండే మొత్తం vertical reservations ఏ గ్రామీణ స్థానిక సంస్థలోనూ 50 శాతానికి మించకూడదనే నిబంధనకు అనుగుణంగా రిజర్వేషన్లను నిర్ణయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ముఖ్యమైన వివరాలు:
  • G.O. నంబర్: G.O.Ms.No.153
  • జారీ తేదీ: 11-10-2026
  • శాఖ: Panchayat Raj & Rural Development (E&R) Department
  • ప్రధాన అంశం: పంచాయతీరాజ్ సంస్థల్లో BC, SC, ST రిజర్వేషన్ల నిర్ణయం
  • రిజర్వేషన్ల పరిమితి: SC, ST, BC vertical reservations కలిపి 50 శాతానికి మించకూడదు.

AP Panchayat Elections 2026 Latest Update

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 ఆగస్టు 2026న G.O.Ms.No.105 ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో BCలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో W.P. (PIL) No.194 of 2026తో పాటు ఇతర సంబంధిత కేసుల్లో సవాలు చేశారు.

2026 అక్టోబర్ 1న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, SC, ST, BC వర్గాలకు కలిపి మొత్తం vertical reservations 50 శాతాన్ని మించే మేరకు G.O.Ms.No.105, తేదీ 20-08-2026, అలాగే G.O.Rt.No.1065, తేదీ 19-08-2026 ఉత్తర్వులు చెల్లుబాటు కావని పేర్కొని ఆ మేరకు వాటిని రద్దు చేసింది.

అదే సమయంలో, వర్తించే చట్టం, అవసరమైన empirical data సేకరణ ప్రక్రియకు అనుగుణంగా BC రిజర్వేషన్ల శాతాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించవచ్చని హైకోర్టు పేర్కొంది.

ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, 9 అక్టోబర్ 2026న సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించి Special Leave Petitionను కొట్టివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 11న G.O.Ms.No.153ను జారీ చేసింది.

Important Details of G.O.Ms.No.153

వివరాలు సమాచారం
G.O. నంబర్ G.O.Ms.No.153
జారీ తేదీ 11-10-2026
శాఖ Panchayat Raj & Rural Development (E&R) Department
గత ఉత్తర్వులు G.O.Ms.No.105, తేదీ 20-08-2026
హైకోర్టు తీర్పు 01-10-2026
సుప్రీంకోర్టు ఉత్తర్వు 09-10-2026
Dedicated Commission సిఫార్సుల ఆమోదం G.O.Ms.No.17, Backward Classes Welfare Department, తేదీ 10-10-2026
ప్రధాన పరిమితి SC, ST, BC vertical reservations మొత్తం 50 శాతానికి మ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
✕