Sachiavalayam Hardware Complaints process In VSWS Portal
Step 1 : మొదట పోర్టల్ https://vsws.co.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత DA/WDPS వారి మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి . DA/WDPS యొక్క ఏ నెంబర్ ఉందొ తెలుసుకోవడానికి Click Here . క్లిక్ చేసిన తర్వాత సచివాలయం కోడ్ ను ఎంటర్ చేసి "Get Mobile Number" పై క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ యొక్క చివర మరియు మొదటి రెండు నెంబర్ లు చూపిస్తాయి. సచివాలయం కోడ్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి Click Here. ఒక వేల అక్కడ ఇచ్చిన నెంబర్ తప్పుగా ఉన్నా లేదా నెంబర్ రిజిస్ట్రేషన్ కాకపోతే ఈ లింక్ Click Here లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ పై క్లిక్ చేసి నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ First Name, Last Name, Mobile Number, Email ( Optional ), Choose Role లో Village / Ward Secreteriat అని సెలెక్ట్ చేయాలి,additional Info దగ్గర Remarks ఏమైనా ఉంటే వాటిని రాయాలి. Submit పై క్లిక్ చెయ్యాలి.
Step 2 : లాగిన్ పేజీ ఓపెన్ చేసి నెంబర్ ను ఎంటర్ చేసిన GET OTP పై క్లిక్ చేస్తే 4 అంకెల OTP వస్తుంది. ఆ OTP నీ ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేయాలి.తరువాత Set Your Profile లో First Name, Last Name, Email ఇవ్వాలి. SUBMIT పై క్లిక్ చేయాలి. Profile Set Successfully అని వస్తుంది. హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
Step 3 : తర్వాత ఒక్కొక్క పరికరాన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. అంటే హార్డ్ వేర్ ను యాడ్ చేయవలసి ఉంటుంది. అందులో మొదటగా యాడ్ చేయడం కోసం Add Inventory అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Create Inventory లో హార్డ్ వేర్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. సచివాలయం కి ఇచ్చిన హార్డ్వేర్ వస్తువులు చిన్న ఐకాన్ రూపంలో చూపిస్తుంది. అక్కడున్న అన్నీ హార్డ్వేర్ను ఒక్కొక్కటిగా ఆడ్ చేయాలి. ఉదాహరణ కు కంప్యూటర్ సింబల్ పై క్లిక్ చేస్తే, సచివాలయానికి ఇచ్చిన కంప్యూటర్ వివరాలు ఎంటర్ చేయాలి. అందులో భాగంగా కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరు, సీరియల్ నెంబర్ ( ఎక్కడ ఉంటుందో సాంపిల్ ఇమేజ్ చూపిస్తుంది), తరువాత స్టేటస్ మీద సెలెక్ట్ చేయాలి. అక్కడ ఆప్షన్స్ Working లేదా Not Working ఆప్షన్స్ ఉంటాయి. సరిగా పని చేస్తున్నట్టు అయితే Working అని ఏమైనా సమస్యలు లేదా ఆగిపోయినట్లు అయితే Not Working అని సెలెక్ట్ చేయాలి . Not Working అని టిక్ చేస్తే, ఫిర్యాదు పెట్టాలా? వద్దా? అని వస్తుంది. అక్కడ Yes పెట్టాలి, తర్వాత బేసిక్ చెకప్ లు చేసి Tick చేయాలి. వెంటనే సంబంధిత హార్డ్వేర్ లో వచ్చే సమస్యలు వరుస క్రమంలో చూపిస్తాయి అందులో ఒకటి సెలెక్ట్ చేయాలి. అందులో సమస్య లేకపోతే కింద బాక్స్ లో రాసి పెట్టవలెను . సమస్యను క్లియర్ చేసే సమయంలో వెండర్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో వారి పేరు మరియు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వవలెను .DA/WDPS లేకపోతే సచివాలయం లో అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది డీటెయిల్స్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
Step 4 : తరువాత హోమ్ పేజీ లో చూపిస్తుంది . ఎటువంటి సమస్య లేకపోతే హోమ్ పేజీ ఐకాన్ పై ✅️ఇలా చూపిస్తుంది. అదే సమస్య ఉంటే ⚠️ ఇలా చూపిస్తుంది. రెండవ కంప్యూటర్ ను ఆడ్ చేయడానికి మరల పై ప్రాసెస్ ను ఫాలో అవ్వాలి . హోం పేజీలో ఉన్న ఐకాన్ పై ఉన్నటువంటి నెంబరు మొత్తం ఉన్న పరికరాల సంఖ్యను తెలియజేస్తుంది . తర్వాత మనకి Add Inventory లో సచివాలయం లో ఉన్నటువంటి వస్తువులను యాడ్ చేయాలి.హార్డ్ వేర్ ఐకాన్ పక్కన ఉన్న రిఫరెన్స్ నెంబర్ పై క్లిక్ చేసి ఫిర్యాదు స్టేటస్ తెలుసువచ్చు.మరింత సమాచారం కోసం www.gswshelper.com ను ఫాలో అవ్వండి.
Step 5 : తర్వాత Internet అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వాడుతున్న ఇంటర్నెట్ కనెక్షన్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్ ను సెలెక్ట్ చేయాలి. అక్కడ కనెక్షన్ స్పీడ్ Poor గా ఉంటే దగ్గరలో ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ వివరాలు రాయాలి ఒక వేల సరిగా ఉంటే Good సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. Cerificates పై క్లక్ చేసి హై సెక్యూరిటీ స్టేషనరీ సర్టిఫికెట్స్ సచివాలయంలో ప్రస్తుతం ఉన్నటువంటి కౌంట్ అనేది రాసి Submit పై క్లిక్ చేయాలి. ఒక వేల తప్పుగా రాసినట్లయితే లేదా కొన్ని రోజుల తర్వాత అప్డేట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఫై క్లిక్ చేసి మళ్లీ కౌంట్ వేసి సచివాలయాల్లో వాడగా మిగిలినవి ఎన్ని అయితే ఉన్నాయో వాటిని మళ్లీ ఎంటర్ చేసి మళ్లీ సబ్మిట్ చేయాలి.
Step 6 : Service Requests ఆప్షన్ ఉంటుంది అందులో వాలంటీర్ అవ్వచ్చు లేదా సచివాలయం ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డ్స్ పోయినట్లయితే "Activate Replaced SIM" అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ సిమ్ కార్డు యొక్క నెంబరు, 20 డిజిట్ ల సిమ్ నెంబర్, సర్వీస్ ప్రొవైడర్ వివరాలు నమోదు చేసి Activation Request పై క్లిక్ చేయాలి. తర్వాత డామేజ్ అయిన హై సెక్యూరిటీ పేపర్స్ కోసం ఇక్కడ "Report Damaged Certs" ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.అక్కడ ఎన్ని పేపర్ లు పాడు అయ్యాయో అనగా చిరిగి పోవటం , తడిచి పోవటం , ప్రింట్ సరిగా రాక పోవటం ఇలా వాటి మొత్తం కౌంట్ వేసి Submit చేయాలి. సచివాలయం కు ఏదైనా హార్డ్వేర్ రాక పోయి ఉంటే లేదా అవసరం అయినచో "Request Inventory " అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసి Choose Device Types లో ఏం కావాలో సెలెక్ట్ చేసి Choose Applicable Reason(s) లో ఎందు వలన కావాలో సెలెక్ట్ చేసి రేమార్క్ వ్రాసి Request పై క్లిక్ చేయాలి .
Step 7 : ఇక్కడ మండలం వారీగా జిల్లా వారీగా రాష్ట్ర వ్యాప్తంగా డాష్ బోర్డు రిపోర్ట్ అనేది తెలుసుకోవడానికి ఆప్షన్ఉంది. పై అధికారులు రిపోర్ట్ అడిగినట్లు అయితే హోమ్ పేజీ ప్రింట్ ఇచ్చినట్లయితే పూర్తి రిపోర్ట్ వస్తుంది. హోం పేజ్ లో ఒక్కొక్క ఐకాన్ పై మనకి కౌంట్ అనేది చూపిస్తుంది ఇన్ కేస్ కంప్యూటర్ సింబల్ పై రెండు ఉంటే సచివాలయంలో రెండు ఉన్నట్లు, స్కానర్ సింబల్ పై కౌంట్ ఒక 20 చూపిస్తే ఆ సచివాలయానికి 20 స్కానర్ లు ఉన్నట్లు. పై పూర్తి ప్రాసెస్ లో ఏ సమస్య వచ్చినా support@vsws.co.in కు మెయిల్ చేయాలి. లేదా 9154409886 లేదా 9154409884 నెంబర్లకు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది.