Mahila Police Probation Declaration Process
గ్రామ వార్డు సచివాలయాల్లో సేవలు అందిస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లరేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన గవర్నమెంట్ ఆర్డర్(GO) రూపంలో విడుదల చేయడం జరిగింది. తేదీ 29.9.2021 నాడు GO.109 ని విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GMSK/WMSK వారి విధివిధానాలను Andhra Pradesh Grama Mahila samrakshana karyadarshi / ward Mahila samrakshana karyadarshi subordinate service rules 2019 ఖరారు చేస్తూ ముందుగా GO.126 Dt. 01.10.201 విడుదల చేయటం జరిగింది. అందులో జాబ్ చార్ట్, ఛానల్ , సబార్డినేట్ రూల్స్ పూర్తి విధివిధానాలు ఖరారు చేయడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు CBAS ను రద్దు పరిచిన తరువాత ప్రతి సచివాలయ సిబ్బంది యొక్క మాతృ డిపార్టుమెంటు ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు విధివిధానాలు ఖరారు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా హోమ్ డిపార్ట్మెంట్ వారు GMSK/WMSK వారికి ప్రోబషన్ డిక్లరేషన్ పూర్తి చేసుకోని రెగ్యులర్ కొరకు కొరకు కొన్ని టెస్టులను ఖరారు చేయడం జరిగింది.
పైన తెలిపిన సబార్డినేట్ సర్వీసు రూల్స్ లో రూల్ 7, సబ్ రూల్ 3 లో కింద తెలిపిన వాటిని జోడిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు ప్రొబేషన్ పీరియడ్ లో కింద తెలిపినటువంటి టెస్టులను తప్పనిసరిగా పాస్ అవ్వవలసి ఉంటుంది. అలా ప్రొబేషన్ పీరియడ్ లో పాస్ అవని వారికి ఒక సంవత్సరం టైం ఇవ్వటం జరుగుతుంది. అప్పటికీ పాస్ అవని వారు వారి సర్వీసు ఆధారంగా పూర్తిగా సర్వీసు నుంచి తొలగించే అవకాశం కూడా ఉంటుంది.
టెస్టులలో భాగంగా మొదట టెస్ట్ పేరు ప్రాజెక్టు వర్క్ ఒక వారం ఉంటుంది. మొత్తం 25 మార్కులకు గాను పాస్ అవ్వడానికి 10 మార్కులు రావాలి. ఇందులో ముఖ్యంగా జాబు చార్ట్ లో ఉన్నటువంటి అంశాలపై రిపోర్టును తయారు చేయవలసి ఉంటుంది. రెండవ టెస్ట్ మల్టిపుల్ ఛాయిస్ కోషన్స్ రూపంలో ఉంటుంది. మొత్తం 75 మార్కులకు గాను పాస్ అవ్వడానికి 30 మార్కులు రావాలి. సమయం ఒక గంట అనగా 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో ప్రశ్నలు పూర్తిగా జాబ్ చార్ట్ మరియు సిటిజన్ సర్వీసులపై ఉంటుంది..
⭐️ GO126,Dt. 01.10.2019 : Click
⭐️ GO109, Dt. 29.09.2021 : Click
⭐️Project Work : Click