How to pay CSC amount in grama ward sachivalayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ముందుగా ఉన్నటువంటి e- సర్వీసులతో పాటు కొత్తగా CSC, ఆధార్ సర్వీసులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని సచివాలయాల్లో మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాలకు CSC మరియు ఆధార్ సర్వీస్ లు ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాలకు CSC సర్వీసులు మొదటగా ఇవ్వటం జరుగుతుంది. తరువాత అవసరానికి అనుగుణంగా ఆధార్ సెంటర్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది.
CSC సర్వీసులకు సంబంధించి సచివాలయాల్లో పూర్తి బాధ్యత గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ వారికి పట్టణాల్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారికి ఇవ్వటం. ఆయా సచివాలయాలకు ముందుగానే CSC యొక్క యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ మర్చిపోయినట్లు అయితే సంబంధిత జిల్లా గ్రామ వార్డు సచివాలయ టెక్నికల్ టీం వారికి కాంటాక్ట్ అవ్వాలి. CSC సర్వసులు మొత్తం https://digitalseva.csc.gov.in ద్వారా ఇవ్వాలి. సర్వీసులు ప్రారంభించిన తర్వాత సర్వీసుల ద్వారా కలెక్ట్ చేసినటువంటి సర్వీస్ రుసుములను అంటే ఫీజుల చలానా మాత్రం గ్రామ వార్డు సచివాలయ అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ చేసుకోవాలి. . ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలో, డిపాజిట్ చెయ్యాలి తెలుసుకుందాం
Step 1 : ముందుగా గ్రామ వార్డు సచివాలయ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి .
Step 2 : హోమ్ పేజీ మెయిన్ బార్ లో "Services" అనే ఆప్షన్ క్లిక్ చేసి అందులో " CSC&Aadhar Service Challan Generation" పై క్లిక్ చేయాలి.
Step 3 : Category లో "CSC services" ను సెలెక్ట్ చేసుకోవాలి.
Step 4 : "Services Wise Challan Generation" పై క్లిక్ చేయాలి. CSC లో ఇచ్చిన సర్వీసెస్ ల లిస్ట్ అమౌంట్ చూపిస్తుంది అప్పుడు "GENERATE CHALLAN" పై క్లిక్ చేయాలి..
Step 5 : చలానా చూపిస్తుధి. అందులో ముఖ్యం గా Beneficiary Name,Beneficiary Account, Number, Beneficiary IFSC Code, Bank Name, Amount to be Remitted, Amount In Words, Remitter's Name, Remitter's A/C No, Remitter's Bank Name, Remitter's IFSC Code, VLE/DA/WEDPS NAME, VLE/DA/WEDPSID, VLE/DA/WEDPS Mobile, Number, Grrama/Ward Secretariat, Code, Status, Date of Challan Generated వివరాలు చూపిస్తాయి. Status లో చలానా జనరేట్ చేసే టప్పుడు Initiated అనీ పేమెంట్ పూర్తి అయ్యాక Success అనీ చూపిస్తుంది.
Step 6 : పేమెంట్ రెండు విధాలుగా చెయ్యవచ్చు. ఒకటి బ్యాంకు కు వెళ్లి NEFT ద్వారా డిపాజిట్ చెయ్యటం, రెండోది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చెయ్యటం. బ్యాంకు ద్వారా అయితే పై రసీదు మరియు చెక్ బుక్ పేపర్ సరపోతుంది అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పై రసీదులో Beneficiary Name,Beneficiary Account, Number, Beneficiary IFSC Code, Amount to be Remitted వివరాలు సరిపోతాయి. పేమెంట్ NEFT మాత్రమే చెయ్యాలి. IMPS చెయ్యకూడదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయటనికి ICICI చలానా పేమెంట్ విధానం లో చెయ్యండి. అందులో పేరు, A/C నెంబర్, IFSC పైన తెలిపిన రసీదులో ఉన్నట్టు ఇస్తే సరి పోతుంది.
Step 7 : "Transaction History" లో పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.