Village Horticulture Assistants Probation Declaration Process
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగానోటిఫికేషన్ నెంబర్ 01/2019 Dt.26.7.2018 మరియు 01/2020 Dt.10.1.2020 ద్వారా మొత్తం 2404 గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్లు నియామకం జరిగింది.
ప్రభుత్వం సూచించిన విధంగా ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1996, రూల్ నెంబర్ 10 నీ సవరిస్తూ తెలియజేయునది ఏమనగా డైరెక్ట్ గా నియమితులైన ప్రతి గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ తప్పనిసరిగా ప్రొబేషన్ కాలం పూర్తి అయ్యే సమయంలో "అగ్రికల్చర్ డిపార్ట్మెంటల్ టెస్ట్" పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ సమయంలో డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయిన వారు మాత్రమే ప్రోబషన్ డిక్లరేషన్ అయ్యి రెగ్యులర్ అవుతారు.
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ వారు రాష్ట్రంలో ఉన్నటువంటి హార్టికల్చర్ డిపార్టుమెంటు డిప్యూటీ డైరెక్టర్ , ప్రాజెక్ట్ డైరెక్టర్, APMIP మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1996 ప్రకారం ఎవరైతే రెండు సంవత్సరాల ప్రోబషన్ కాలం పూర్తి చేసుకొని డిపార్ట్మెంట్ టెస్ట్ పూర్తి చేస్తారో వారికి వెంటనే రెగ్యులర్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.