How to write 9 Registers of Digital Assistant and WEDPS in Grama Ward Sachivalayam How to write 9 Registers of Digital Assistant and WEDPS in Grama Ward Sachivalayam

How to write 9 Registers of Digital Assistant and WEDPS in Grama Ward Sachivalayam

How to write 9 Registers of Digital Assistant and WEDPS in Grama Ward Sachivalayam



Digital Assistant and WEDPS Register to be maintain In Grama Ward Sachivalayam

గౌరవ GVWV&VSWS డిపార్ట్మెంట్ డైరెక్టర్ వారి ఆదేశాలతో మెమో నెంబర్ :7/VSWS/FIN/2020 తేదీ 14/7/2021 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయ లలో DDO's తప్పనిసరిగా  ఆడిట్ కొరకు 9 రిజిస్టర్లు తప్పకుండా సచివాలయంలో ఎప్పటికి అప్పుడు అప్డేట్ తో అందుబాటులో ఉండాలి.

circular

రిజిస్టర్ - 1 [ Collection Register (Paid) ] :

అందిస్తున్నటువంటి సర్వీసులలో దేనికి అయితే ఛార్జ్ వుంటుందో అవన్నీ రిజిస్టర్ లో రాయాలి. ప్రభుత్వం వారు సర్వీసులకు సర్వీస్ ఛార్జ్ తీసుకోవాలి అని మెన్షన్ చేస్తే వాటిని కూడా తప్పనిసరిగా ఈ రిజిస్టర్ లో రాయాలి. 


1. S.NO : సీరియల్ నెంబర్ సెక్షన్ లో ప్రతి సర్వీసుకు ఒక ఎంట్రీ ఉంటుంది. పెయిడ్ సర్వీస్ కనుక P తో సర్వీసెస్ నెంబర్లను రాయవలెను. ఉదాహరణ కు P1, P2, P3 ఇలా రాయాలి. ఇలా రాసిన సీరియల్ నెంబర్లు రిజిస్టర్ -3 లో ఎన్ని సర్వీసులకు కలిపి చలానా జనరేట్ చేస్తున్నామో వాటిని తెలియజేయాలి. Ex. P1 నుంచి P15 వరకు ఒక చలానా జనరేట్ చేసినట్లు అయితే రిజిస్టర్ -3 లో Sl.No of Txns For Which Challan Raised లో P1-P15 ల రాయాలి

2. Date of Service Request : సర్వీసు నమోదుచేసిన తేదీను DD/MON/YYYY ఫార్మాట్ లో వెయ్యాలి.

3. Category Of Service And Service Code : క్యాటగిరి అనేది రెండు మాత్రమే ఉంటాయి ఒకటి మీ సేవ ఇంకొకటి నాన్ - మీసేవ. మీ సేవ లాగిన్ లో చేసినటువంటి సర్వీసులకు కేటగిరి మీ సేవ అని మిగతా సర్వీస్ ల అన్నిటికీ నాన్ మీ సేవ అని రాయాలి. మీ సేవ సర్వీసెస్ కోడ్స్ కోసం Click Here.  Entry Ex. Meeseva/808

4. Name of service and department : సర్వీస్ యొక్క పేరు మరియు సర్వీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ నో మెన్షన్ చేయాలి . Ex. Family member certificate - revenue

5. Department Transaction Id / Application Id : సర్వీసు యొక్క రసీదు పై ఉన్నటువంటి అప్లికేషన్ ఐడి లేదా డిపార్ట్మెంట్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి ని రాయాలి.   Ex. ROR012145131662

6. Name Of Applicant : సర్వీస్ ఎవరైతే పెడుతున్నారో వారి యొక్క పేరును రాయాలి. రాసేటప్పుడు పూర్తి పేరు ను రాయాలి. సర్వీసు ఎవరి పేరు మీద పెడుతున్నారో అది రాయకూడదు.

7. Applicant Phone Number : అప్లికేషన్ పెట్టిన వారి యొక్క పనిచేస్తున్న ఫోన్ నెంబర్ ను రాయాలి.

8. UPI Ref Number : మోడ్ ఆఫ్ పేమెంట్ దగ్గర CFMS పేమెంట్ కాకుండా యూపీఐ సెలెక్ట్ చేసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ రాయాలి. ఒకవేళ ఈ మోడ్ లో పేమెంట్ చేయకపోతే NA ( Not Applicable )అని రాయాలి.

9. UPI Amount Collected : పై మోడ్ లో పేమెంట్ చేసినట్లయితే మొత్తం అమౌంట్ రాయాలి.

10. UPI status ( Succ/Fail) : పై మూడు లో పేమెంట్ చేసినట్టయితే సక్సెస్ అయితే సక్సెస్ అని ఫెయిల్ అయితే ఫెయిల్ అని రాయాలి. ఒకవేళ పేమెంట్ చేయకపోతే NA అని రాయాలి. 

11. Amount collected in cash : సర్వీసు గాను సిటిజన్ నుంచి తీసుకున్న మొత్తం అమౌంట్ ను రాయాలి.

12. data of service delivery : సర్వీస్ డెలివరీ డేట్ అనగా హై సెక్యూరిటీ పేపర్ పై ప్రింట్ ఇచ్చిన తేదీని రాయాలి / డిపార్ట్మెంట్ ఆమోద డేట్ ను రాయాలి.

13. Challan generated (√ / × ) : జనరేట్ చేసిన చలానా లో సంబంధిత సర్వీసు ఉన్నట్టయితే √ అనీ లేక పోతే × అనీ రాయాలి.

14. Challan type generated : సంబంధిత సర్వీసు ఏ చలానాలో అయితే కవర్ అవుతుందో ఆ చలానా టైపు ను రాయాలి. Ex. ICICI చలానా

15. Challan Deposited (√ / × ) : సంబంధిత సర్వీస్ కవర్ అవుతున్న టువంటి చలానా డిపాజిట్ చేసినట్లయితే √ అని చేయకపోతే × అని రాయాలి.

16. Status Of Reconciliation With Portal : సంబంధిత సర్వీస్ కవర్ అవుతున్న టువంటి చలానా GSWS సైట్ లో Paid గా చూపిస్తున్నట్లు అయితే Reconciled అనీ కాక పోతే Not Reconciled అనీ రాయాలి. 

17. Remarks : ఎంట్రీ లో రాసినటువంటి సర్వీసుకు సంబంధించిన ఎటువంటి రిమార్కులు అంటే ఇందులో రాయాలి.


రిజిస్టర్ - 2 [ Free Services Register ]:

అందిస్తున్న అటువంటి సర్వీసులలో దేనికి అయితే సర్వీస్ ఛార్జి ఉండదో వాటిని ఈ రిజిస్టర్ లో రాయాలి



1. S.NO : సీరియల్ నెంబర్ సెక్షన్ లో ప్రతి సర్వీసుకు ఒక ఎంట్రీ ఉంటుంది. ఫ్రీ కనుక F తో సర్వీసెస్ నెంబర్లను రాయవలెను. ఉదాహరణ కు F1, F2, F3 ఇలా రాయాలి. 

2. Date of Service Request : సర్వీసు నమోదుచేసిన తేదీను DD/MON/YYYY ఫార్మాట్ లో వెయ్యాలి.

3. Category Of Service And Service Code : క్యాటగిరి అనేది రెండు మాత్రమే ఉంటాయి ఒకటి మీ సేవ ఇంకొకటి నాన్ - మీసేవ. మీ సేవ లాగిన్ లో చేసినటువంటి సర్వీసులకు కేటగిరి మీ సేవ అని మిగతా సర్వీస్ ల అన్నిటికీ నాన్ మీ సేవ అని రాయాలి. ఇందులో ఎక్కువ నాన్ మీసేవ ఎంట్రీ లు వస్తాయి.మీ సేవ సర్వీస్ ఉండక పోవొచ్చు. 

4. Name of service and department : సర్వీస్ యొక్క పేరు మరియు సర్వీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ నో మెన్షన్ చేయాలి . 

5. Department Transaction Id / Application Id : సర్వీసు యొక్క రసీదు పై ఉన్నటువంటి అప్లికేషన్ ఐడి లేదా డిపార్ట్మెంట్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి ని రాయాలి.

6. Name Of Applicant : సర్వీస్ ఎవరైతే పెడుతున్నారో వారి యొక్క పేరును రాయాలి. రాసేటప్పుడు పూర్తి పేరు ను రాయాలి. సర్వీసు ఎవరి పేరు మీద పెడుతున్నారో అది రాయకూడదు.

7. Applicant Phone Number : అప్లికేషన్ పెట్టిన వారి యొక్క పనిచేస్తున్న ఫోన్ నెంబర్ ను రాయాలి.

8. Status Of Reconciliation With Portal : ఆన్లైన్లో సర్వీసెస్ లిస్ట్ లో ఇస్తున్న సర్వీస్ ఎంట్రీ ఉంటే Reconciled అనీ లేకపోతే Not Reconciled అనీ రాయాలి. 

9.Remarks : ఎంట్రీ లో రాసినటువంటి సర్వీసుకు సంబంధించిన ఎటువంటి రిమార్కులు అంటే ఇందులో రాయాలి.


రిజిస్టర్ - 3 [ Challan Register ]:

సర్వీసుల అమౌంట్ను ప్రభుత్వ ఖాతాలో జమ చేయటానికి జనరేట్ చేసే చలానా వివరాలకోసం ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.


1. Sl.No : చలానా నెంబర్ లు 1 నుంచి మొదలు రాయాలి.

2. Date of Challan Gen : చలానా జనరేట్ చేసిన తేదీ ను రాయాలి.

3. Mode Of Challan : చలానా ఏ మోడ్ లో జనరేట్ చేశారో రాయాలి. Ex. ICICI Challan

4.Challan Number : చలానా యొక్క రిఫరెన్స్ నెంబర్ ను రాయాలి

5. Date Of Challan Valid Upto : చలానా ఎప్పటి వరకు పని చేస్తుందో ఆ తేదీని రాయాలి. ప్రస్తుతం జనరేట్ చేస్తున్నటువంటి ఐసిఐసిఐ చలానా లో ఎటువంటి చివరితేదీ ఇవ్వలేదు కావున నాట్ అప్లికేబుల్ NA అనీ రాయాలి.

6.Sl.No of Txns For Which Challan Raised : జనరేట్ చేసినటువంటి చలానా లో రిజిస్టర్ 1 లో కవర్ అవుతున్న టువంటి సర్వీస్ ల రేంజ్ రాయాలి. Ex. P1 to P20

7. Total Amount As Per Register : రిజిస్టర్ ప్రకారం మొత్తం అమౌంట్ ఎంతో రాయాలి. ప్రభుత్వం వారు సర్వీసులకు ఎక్స్ట్రా చార్జ్ తీసుకోమని విధివిధానాలు ఖరారు చేసినట్టు అయితే చలానా కంటే రిజిస్టర్ ప్రకారం ఎక్కువ అమౌంట్ ఇక్కడ వస్తుంది.

8. Total Amount As Per Portal : జనరేట్ చేసిన చలానా లో మొత్తం అమౌంట్ రాయాలి.

9. Date Of Challan Deposited : చలానాను డిపాజిట్ చేసినటువంటి తేదీలు రాయాలి. బ్యాంకు ద్వారా గానీ లేదా ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని డిపాజిట్ చేయవచ్చు. పూర్తి వివరాలు Click Here

10. Deposit Reference Number: డిపాజిట్ చేసిన రిఫరెన్స్ నెంబర్ ను రాయాలి. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే UTR నెంబర్ రాయాలి.

11.Status Of Reconciliation With Portal : డిపాజిట్ చేసిన తర్వాత వెబ్ సైట్ నందు చలానా పేమెంట్ స్టేటస్ లో Paid అని వస్తే Reconciled అనీ రాకపోతే Not Reconciled అని రాయాలి.

12. Remarks : చలానా కు సంబంధించి ఎటువంటి రిమార్క్ లు ఉన్నట్టయితే ఇక్కడ రాయాలి. 


రిజిస్టర్ - 4 [ Cash Balance Register]:

ఆఫీసు లో ప్రతిరోజూ ఉన్నటువంటి అమౌంటు, కలెక్ట్ చేసిన అమౌంట్ డిపాజిట్ చేసిన అమౌంట్ చివరగా మిగిలిన అమౌంట్ వివరాల కోసం ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి


1.Date : ఎంట్రీ రాస్తున్న తేదీ రాయాలి 

2. Day : రాస్తున్న రోజు ఏ రోజు అయితే ఆ రోజు రాయాలి. Ex. Monday, Tuesday ఇలా

3. Opening Balance : గడిచిన రోజు వరకు సర్వీసుల ద్వారా కలెక్ట్ చేయబడి డిపాజిట్ చేయకుండా మిగిలిన మొత్తాన్ని ఎంట్రీ రాస్తున్న రోజు రాయాలి.  Ex. ₹ 1250

4. Amount Collected From Citizen : ఆరోజు మొత్తానికి ప్రజలనుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ వ్రాయాలి.

5. Amount Deposited Into Bank Account : ఆ రోజుకి బ్యాంకులో డిపాజిట్ చేసిన లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసిన మొత్తం అమౌంట్ ఎంతో రాయాలి. 

6. Closing Cash Balance : ఆరోజు చివరికి మిగిలిన టువంటి మొత్తం అమౌంట్ ఉంది రాయాలి.

Closing Cash Balance = Opening Balance + Amount Collected From Citizen -Amount Deposited Into Bank Account

7. UPI Ref. No or Challan No / Type in Cash of Deposit : బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి రిఫరెన్స్ నెంబర్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ను రాయాలి. 

8. Verified By : DDO వారు లేదా సంబంధిత పై అధికార్ల సంతకం తీసుకోవాలి. 

9. Remarks : ఎటువంటి రిమార్క్ లు ఉన్న ఇక్కడ రాయాలి.Ex. Paid,


రిజిస్టర్ - 5 [ Imprest Register ( Expenses Register )]:

సచివాలయంలో చేస్తున్నటువంటి పూర్తి ఖర్చుల వివరాలను ఈ రిజిస్టర్ లో రాయవలసి ఉంటుంది. ఇ రిజిస్టర్ DDO వారి అండర్ లో ఉంటుంది.


1.Serial Number : ఒకటి తో మొదలుపెట్టి సీరియల్ నెంబర్ ను రాయాలి. 

2.Voucher Number : వోచర్ నెంబర్ ను ఇక్కడ రాయాలి. ప్రతి ఖర్చు కూడా తప్పనిసరిగా వోచారు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఖర్చు చెయ్యాలి. 

3.Cash Balance On Hand / Withdrawal From Bank: ఖర్చులకు గాను చేతిలో ఎమౌంట్ పెట్టారా లేదా బ్యాంకు నుంచి విత్తనాలు చేశారా చేసిన మొత్తం విలువ ఇక్కడ వేయాలి. ఆ కర్చు అయిన మొత్తం రూ. లో రాయాలి

4.Particulars: మొదట బ్యాంకు నుంచి ఎంత డ్రా చేశారో లేదా చేతిలో ఉన్న అమౌంట్ ఎంత తీశారో రాయాలి తరువాత ఎంట్రీ లో దేనికి ఖర్చు చేశారో ఆ వివరాలు ఇక్కడ రాయాలి. 

5.Amount Spent : ఎంత మొత్తం ఖర్చు చేశారో రాయాలి 

6.Spent By : ఎవరు ఖర్చు చేశారో వారి పేరు రాయాలి 

7.Authorised By : తనిఖీ చేస్తున్న ఇటువంటి అధికారి పేరు రాయాలి. 

8.Mode Of Receipt / Payment: ఖర్చు చేసిన అమౌంట్ ఏవిధంగా పేమెంట్ చేశారో ఆ మోడ్ రాయాలి . లేదా Withdraw చేసిన అమౌంట్ ఏ మోడ్ లో చేసారో రాయాలి. Ex. Cash 

9.Remarks: ఖర్చుకు లేదా విత్డ్రా కు సంబంధించి ఎటువంటి రిమార్క్ ఉన్న ఇక్కడ రాయాలి.


రిజిస్టర్ - 6 [ Reconciliation Record ]:

రికార్డు ప్రాప్తికి మరియు ఆన్లైన్ ప్రాప్తికి వివరాలు సరిపోయే లేవా అని తెలుసుకోవడానికి ఈ రిజిస్టర్ ఉపయోగపడుతుంది.


I, II, III reconciliations అన్నిటికి CFMS, UPI & ICCI కలమ్ లు ఉంటాయి. Reconciliation టైపు బట్టి పై మూడింటిలో ఒక దానిలో వివరాలు నమోదు చేసి మిగిలిన వాటిలో - గా రాయాలి. మరలా వాటిలో Txns అనగా మొత్తం ట్రాన్సాక్షన్ ల సంఖ్య మరియు Amount దగ్గరా ఆ ట్రాన్సక్షన్ ల మొత్తం అమౌంట్ ఉంటాయి.


I. Paid Services reconciliation:

1 Paid Transactions Successful as per Register 1 (Collections Service Register Paid) : ఒక చలానా లో కవర్ అయినటువంటి విజయవంతంగా చేయబడిన సర్వీసెస్ మొత్తం సంఖ్య మరియు అమౌంటు CFMS/UPI/ICICI లో ఎందులో జనరేట్ చేస్తే అందులో వేయాలి. 

2 Transactions generated as per Portal: వెబ్ సైట్ నందు చూపిస్తున్న మొత్తం ట్రాన్సాక్షన్ ల సంఖ్య మరియు అమౌంటు రాయాలి.

3 Difference (1-2): పై రెండింటికీ మధ్య డిఫరెన్స్ ను ఇక్కడ రాయాలి 

4 Transactions 'missing in Portal" but in Register 1: రిజిస్టర్ 1 లో ఉంటూ పోర్టల్ లో కనిపించనటువంటి ట్రాన్సాక్షన్ లు ఉంటే ఇక్కడ రాయాలి. 

5 Transactions 'missing in Register 1 Collections: Register(Paid)" but in Portal: పోర్టల్ లో కవర్ అవుతూ రిజిస్టర్ లో మిస్సయిన అటువంటి ట్రాన్సాక్షన్ లు ఉంటే ఇక్కడ రాయాలి 

6 Other Adjustments: పై వివరాలలో ఎడ్జస్ట్ చేసినటువంటి వివరాలు ఉంటే ఇక్కడ రాయాలి. దీనితో ఎక్కువగా పని ఉండదు.


II.Challans Deposited reconciliation:

7. Challans raised and successfully deposited as per Register 3 (Challan Register): రిజిస్టరు-3 ప్రకారం చలానా జనరేట్ చేసి విజయవంతంగా డిపాజిట్ చేసిన వివరాలు రాయాలి. 

8. Challans & Amount Deposited as per Portal: వెబ్సైట్ ప్రకారం చలానా జనరేట్ చేసి విజయవంతంగా డిపాజిట్ చేసిన వివరాలు ఇక్కడ రాయాలి. 

9. Difference (7-8): పై రెండిటి మధ్య తేడా ఉంటే ఎక్కడ రాయాలి 

10.Challans missing in Portal: పోర్టల్ ప్రకారం ఏవైనా చలానాలు మిస్ అయి ఉంటే ఇక్కడ రాయాలి 

11. Other Adjustments: పై అన్నిటిలో ఏదైనా సర్దుబాటు చేసి ఉంటే ఇక్కడ రాయాలి.


III. Cash Balance reconciliation:

12.Net Amount Collected not deposited (1-7): వరుస సంఖ్య 1 మరియు 7 ల మధ్య తేడాలు ఇక్కడ రాయాలి. 

13. Closing Cash Balance as per Register-4 (Cash Balance Register): రిజిస్టర్ 4 ప్రకారం క్లోజింగ్ బ్యాలెన్స్ ఆ ట్రాన్సక్షన్ మొత్తానికి ఇక్కడ రాయాలి. 

14. Difference(12-13): పై రెండిటి మధ్య తేడాలు ఇక్కడ రాయాలి 

15. Challans not deposited + transactions for which challan not generated as per portal: చలానాలు జనరేట్ చేసి డిపాజిట్ చేయనవి, చలానాలు జనరేట్ చేయకుండా మిగిలి ఉన్న ట్రాన్సాక్షన్ మొత్తం వివరాలు ఇక్కడ రాయాలి. 

16. Difference : పై రెండిటి మధ్య తేడాను ఇక్కడ రాయాలి 


IV. Free Services reconciliation:

17.Free Transactions Successful as per Register 2 Free Service Register: రిజిస్టర్ - 2 ప్రకారం మొత్తం ఉచిత సర్వీసుల సంఖ్య మరియు అమౌంటు ఇక్కడ రాయాలి 

18. Transactions as per Portal: వెబ్సైట్ ప్రకారం మొత్తం ఫ్రీ సర్వీసుల సంఖ్య రాయాలి 

19 Difference (17-18): పై రెండిటి మధ్య తేడాని కి రాయాలి 

20.Transactions "Un reconciled as per Free Service Register: పై రెండిటి మధ్య తేడా ఏదైనా ఉంటే ఆ వివరాలు ఇక్కడ రాయాలి. 


రిజిస్టర్ - 7 [ High Security Register ]:

సచివాలయాలకు ప్రభుత్వం అందిస్తున్న అటువంటి హై సెక్యూరిటీ బాండ్ పేపర్ కోసం ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. 


1.Serial Number: సీరియల్ నెంబర్ 1 తో మొదలుపెట్టి రాయాలి 

2.Date : రిజిస్టర్ లో ఎంట్రీ చేస్తున్న తేదీ రాయాలి 

3.Opening Stock: రిజిస్టర్ లో ఎంట్రీ చేస్తున్న అప్పటి వరకు ఉన్న మొత్తం స్టాక్ కౌంట్ రాయాలి 

4.Receipts Number: రాస్తున్న రోజు ఏమైనా హై సెక్యూరిటీ పేపర్స్ వచ్చినట్లయితే వాటిని కౌంట్ రాయాలి 

5a. Issue Nos: రాస్తున్న రోజు ఎన్ని ఇష్యూ చేస్తున్నామో వాటి కౌంట్ రాయాలి. ఒకటి మాత్రమే రాయాలి 

5b.Application Id: పైన హై సెక్యూరిటీ పేపర్ ఏ అప్లికేషన్ కు ఇస్తున్నాము ఆ అప్లికేషన్ ఐడి రాయాలి . 

6.Closing Stock: ఆ రోజు చివరకు ఉన్నటువంటి మొత్తం హై సెక్యూరిటీ స్టాక్ మొత్తం కౌంట్ రాయాలి.

Closing Stock= Opening Stock + Receipts Number - Issues

6=3+4-(5a Total ) 

7.Authorisation Signature: పై వివరాలు ఎవరు తనిఖీ చేస్తున్నారో వారి సంతకం ఉండాలి.


Register - 8 [ Stationery Register ]:

సచివాలయం లో ఉన్నటువంటి స్టేషనరీ కోసం ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. పుస్తకాలు,రికార్డులు,A4 బండిళ్లు, కాలిక్యులేటర్లు అలాంటివి ఇందులో రాయాలి 


Stationery Name : 

1.Serial Number: సీరియల్ నెంబర్ 1 తో స్టార్ట్ చేయాలి 

2.Date: ఎంట్రీ రాస్తున్న డేట్ రాయాలి 

3.Opening Stock: ఎంట్రీ రాస్తున్న తేదీనాటికి ఉన్నటువంటి కౌంట్ రాయాలి 

4.Purchases: ఎంట్రీ రాస్తున్న రోజు ఏదైనా స్టేషనరీ ఐటమ్స్ ఉన్నట్లయితే వాటికి కౌంట్ రాయాలి 

5.Consumption : ఎంట్రీ రాస్తున్న రోజు ఏదైనా స్టేషనరీ ఉపయోగించినట్లయితే వాటి యొక్క కౌంట్ రాయాలి 

6.Closing: ఎన్టీ రాస్తున్న రోజుకి మిగిలిన స్టేషనరీ కౌంట్ రాయాలి. 

7.Stock Remarks: స్టాక్ కు సంబంధించి ఎటువంటి మాకున్న ఇందులో రాయాలి.

పై కాలములు అన్నీ కూడా ఒక స్టేషనరీ ఐటమ్ కు ఒకటి రాయవలసి ఉంటుంది. స్టేషనరీ అవసరం, వినియోగం బట్టి ఒక్కో స్టేషనరీ కి ఎన్ని పేజీలు వదులుకోవాలి అనేది ఐచ్ఛికం.


 రిజిస్టర్-9 [ Asset / Stock Entry Register ]:

సచివాలయాల్లో ఉన్నటువంటి అసెట్ లేదా స్టాక్ వివరాలు ఎంటర్ చేయడానికి ఈ రిజిస్టర్ ఉపయోగపడుతుంది. ఇందులో మొబైల్ ఫోను,యుపిఎస్,FP స్కానర్ లు, ఫర్నిచర్, ప్రింటర్ అలాంటి వివరాలు నమోదు చేయాలి

1.Serial Number : సీరియల్ నెంబర్ 1 నుంచి మొదలు పెట్టాలి 

2. Name Of Asset : అసెట్ యొక్క పేరు రాయాలి 

3.Date Of Receipt Of Asset: అసెట్ తీసుకున్నటువంటి తేదీని రాయాలి 

4.Stock Quantity Received : ఎన్ని తీసుకున్నామో వాటి కౌంట్ రాయాలి 

5. In Use: తీసుకున్నటువంటి వాటిలో ఎన్ని ఉపయోగంలో ఉన్నాయో వాటి కౌంట్ రాయాలి 

6.Not In Use: తీసుకున్నటువంటి వాటిలో ఎన్ని ఉపయోగంలో లేవో వాటి కౌంట్ రాయాలి 

7.Remarks : ఆ అసెట్ కు సంబంధించి ఎటువంటి రిమార్క్ ఉన్న రాయాలి.