Ward Sachivalayam Employees Probation Declaration Process Ward Sachivalayam Employees Probation Declaration Process

Ward Sachivalayam Employees Probation Declaration Process

Ward Sachivalayam Employees Probation Declaration Process


Ward Sachivalayam Employees Probation Period Declaration Process

Rc.No.16/D/2021, Dt.13-02-2021 , GVWV & VSWS విభాగం ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ Credit Based Assessment System (CBAS) పరీక్షను ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సర్క్యులర్ ను విడుదల చేసింది. అందులో 40% మార్కులు సాధించిన వార్డు సచివాలయ కార్యదర్శులకకు ప్రొబేషన్ డిక్లేర్ చెప్తారు అని తెలియజేశారు. 


Rc.No.69/D/2021, Dt.03-08-2021 సర్కులర్ ప్రకారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు CBAS ను రద్దు చేయడం జరిగింది. మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించడం జరిగింది. గ్రామ సచివాలయం లో అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క విధంగా విధి విధానాలను ఖరారు చేయడం జరిగింది. కానీ వార్డు సచివాలయ ఉద్యోగుల అందరికీ డిపార్ట్మెంట్ టెస్ట్ ను ఖరారు చేస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది 


AP మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 ప్రకారం వార్డు సచివాలయ అధికారుల నియామకాలు , G.O.MS.No.286, MA&UD డిపార్ట్మెంట్, Dt.07-11-2019 ప్రకారం జారీ చేయబడ్డారు


Ward Administrative Secretary, Ward Education & Data Processing Secretary, Ward Sanitation & Environment Secretary Grade II, Ward Amenities Secretary Grade II, Ward Planning & Regulation Secretary Grade-II, Welfare & Ward Welfare & Development RDMA Concerned Development Secretary Grade-II వారికి G.O.MS.No.286, MA&UD డిపార్ట్మెంట్, Dt.07-11-2019   ఆర్డర్ లో రూల్ 12 ప్రకారం "సర్వీసులో ఒక కేటగిరీకి నియమించబడిన ప్రతి వ్యక్తి, అతను విధుల్లో చేరిన తేదీ నుండి, ప్రత్యక్షంగా మరియు ఒక సంవత్సరం మొత్తానికి నియామకం చేయబడితే, మూడు సంవత్సరాల నిరంతర వ్యవధిలో మొత్తం రెండు సంవత్సరాల పాటు ప్రొబేషన్‌లో ఉండాలి పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియమించబడితే రెండేళ్ల నిరంతర వ్యవధిలో విధుల్లో ఉంటారు "


రూల్ 14 ప్రకారం,

(1) "ఏదైనా కేటగిరీలో ప్రత్యక్ష నియామకం ద్వారా నియమించబడిన ప్రతి వ్యక్తి ప్రోబషన్ కాలంలో  Accounts Test for Subordinate Officers-Part-I & Part-II (2)   పరీక్షలలో ఉత్తీర్ణత సాధించండి:

1.ఎవరైనా ప్రోబషన్ వ్యవధిలో లేదా పొడిగించిన వ్యవధిలో పై పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోతే, అతడిని సర్వీస్ నుండి డిస్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 

2. పైన పేర్కొన్న కాలాన్ని ఎప్పటికప్పుడు హోమ్ డిపార్టుమెంటు పొడిగించవచ్చు.

3. పరీక్షలో ఉత్తీర్ణులైతే తప్ప ఏ వ్యక్తి కూడా ప్రమోషన్‌కు అర్హులుకారు. 


View More