E Shram Card Full Details In Telugu E Shram Card Full Details In Telugu

E Shram Card Full Details In Telugu

E Shram Card Full Details In Telugu

E Shram Card Full Details In Telugu

పథకం ఉద్దేశం మరియు ప్రణాళిక :

కరోనా ఆపత్కాల సమయంలో వలస కార్మికులు మరియు అసంఘటిత కార్మికుల ఇబ్బందులు మరియు కష్టాలను పరిగణలోకి తీసుకుని స్పెషల్ లీప్ పిటిషన్ 6/2020, తేది 29.06.2021 ద్వారా సుప్రీమ్ కోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో e-SHRAM PORTAL ప్రవేశపెట్టింది. తేది 26.08.2021 నుండి అసంఘటిత రంగ కార్మికుల రిజిస్ట్రేషన్ జరుగును.

ఎవరు అర్హులు :

  1. భవన మరియు నిర్మాణ కార్మికులు, 
  2. వలస కార్మికులు, 
  3. చిన్న మరియు సన్నకారు రైతులు, 
  4. వ్యవసాయ కూలీలు, 
  5. కౌలు రైతు, 
  6. మత్స్యకారులు, 
  7. పశుపోషణలో నిమగ్నమైన వారు, 
  8. బీడీ రోలింగ్ లేబులింగ్ మరియు ప్యాకింగ్; 
  9. భవన మరియు నిర్మాణ కార్మికులు; 
  10. తోలు కార్మికులు, 
  11. వడ్రంగి; 
  12. ఉప్పు కార్మికులు, 
  13. ఇటుక బట్టీలు మరియు రాతి క్వారీలలో కార్మికులు, 
  14. సా మిల్లులలో కార్మికులు; 
  15. మంత్రసానులు; 
  16. క్షురకులు, 
  17. కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు; 
  18. వార్తాపత్రిక విక్రేతలు, 
  19. రిక్షా పుల్లర్లు; 
  20. ఆటో డ్రైవర్లు; 
  21. సెరికల్చర్ కార్మికులు; 
  22. వడ్రంగులు; 
  23. చర్మ శుద్ధి కార్మికులు; 
  24. సాధారణ సేవా కేంద్రాలు; 
  25. వీధి వర్తకులు; 
  26. MNGRGA కార్మికులు; 
  27. ళ్లలో పనిచేసే పనిమనుషులు, 
  28. అగ్రికల్చరల్ వర్కర్స్, 
  29. స్ట్రీట్ వెండోర్స్, 
  30. ఆశ వర్కర్స్, 
  31. అంగన్వాడీ వర్కర్స్, 
  32. మత్స్య కార్మికులు, 
  33. ప్లాంటేషన్ వర్కర్స్, 
  34. ఇళ్లకు తిరిగి పాలు పోయు వారు , 
  35. హమాలీలు, 
  36. లఘు వ్యాపారస్తులు మొదలైనవారు.


  • ESI & EPF సభ్యత్వం లేనివారు అర్హులు
  • 16-59 సంవత్సర మధ్య వయస్కులు ఈ పథకమునకు అర్హులు పుట్టిన తేదీ (26-08-1961 to 25-08-2005) మధ్య ఉన్నవారు అర్హులు


ఈ పథకంలో చేరు విధానం:

e-SHRAM PORTAL నందు రిజిస్ట్రేషన్ కొరకు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. eShram Official website i.e  https://register.eshram.gov.in/#/user/self  ఉచితంగా పేర్లు నమోదు జరుగును. నమోదు ప్రక్రియ సమీప CSC Centres & Post Office, గ్రామ , వార్డు సచివాలయములలో లలో జరుగును. కార్మిక శాఖ వారి కార్యాలయములలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి సహాయ సహకారం కార్మికులకు అందించబడును.

  • ఇది పూర్తిగా ఉచితం

కావలసిన డాక్యుమెంట్ లు :

  1. ఆధార్ కార్డు
  2. బ్యాంకు పాస్ బుక్
  3. ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్
  4. అప్లికేషన్ ఫారం 

ఈ పథకముల వలన లాభాలు:

  1. అసంఘటిత కార్మికులు సామాజిక భద్రతా చట్టము క్రింద సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతారు
  2. అసంఘటిత కార్మికుల, వలస కార్మికుల కోసం పాలసీ & ప్రోగ్రామ్ లో డేటాబేస్ ప్రభుత్వానికి సహాయపడుతుంది
  3. అసంఘటిత కార్మికుల వృత్తి, నైపుణ్యాభివృద్ధి , మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుంది
  4. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కొరకు ఆర్ధిక సహాయం (Direct Bank Transfer) ద్వారా కార్మికుల/నామినీల ఎకౌంటు నకు నేరుగా జమ చేయబడుతుంది. అసంఘటిత మరియు వలస కార్మికులూ నమోదు చేసుకోండి లబ్ది పొందండి.


CSC లాగిన్ ద్వారా అప్లికేషన్ పెట్టె విధానం


 NCO Codes :   Click Here 

Step 1-2: మొదటగా మొదటగా డిజిటల్ సేవ పోర్టల్ ( https://digitalseva.csc.gov.in/ ) ఓపెన్ చేయాలి. లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. లాగిన్ అయ్యాక సెర్చ్ బార్ లో eshram అని ఎంటర్ చెయ్యాలి. eShram-NDUW Registration అని చూపిస్తున్న దానిపై క్లిక్ చెయ్యాలి.

లేదా

https://register.eshram.gov.in లింక్ పై క్లిక్ చెయ్యాలి. అక్కడ "Registration Through CSC" పై క్లిక్ చెయ్యాలి. CSC యూసర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చెయ్యాలి.
లేదా
GSWS అధికారిక వెబ్ సైట్ ( https://gramawardsachivalayam.ap.gov.in/ ) నందు హోమ్ పేజీ లో CSC ఆప్షన్ పై క్లిక్ చేయాలి. డిజిటల్ సేవ పోర్టల్ ( https://digitalseva.csc.gov.in/ )కు రీ డైరెక్ట్ అవుతుంది. లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. లాగిన్ అయ్యాక సెర్చ్ బార్ లో eshram అని ఎంటర్ చెయ్యాలి. eShram-NDUW Registration అని చూపిస్తున్న దానిపై క్లిక్ చెయ్యాలి.


Step 3 : Dash Board సెక్షన్ ఓపెన్ అవుతుది. అందులో "NEW Registration" పై లేదా "UW REGISTER" పై క్లిక్ చెయ్యాలి.     

Step 4: ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైక్ నెంబర్ ఎంటర్ చేసి , CAPTCHA కోడ్ టచ్ చేసి గెట్ వాటిపై క్లిక్ చేయాలి. ఓటిపి ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేసిన తర్వాత ఆధార్ ఈ కేవైసీ ఆప్షన్ చూపిస్తుంది . అక్కడ సిటిజన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫింగర్ప్రింట్ లేదా ఐరిష్ స్కానర్ లేదా OTP ద్వారా అతేంటికేషన్ చేయాలి  .

Step 5 : ఆధార్ ఈ కేవైసీ వివరాలు చూపిస్తాయి అందులో       బ్యాంకు వివరాలు,  ఆధార్ యొక్క చివరి నాలుగు అంకెలు మరియు బ్యాంకు ఆధార్ లింక్ స్టేటస్ చూపిస్తాయి.  Agree పై క్లిక్ చేసి Continue To Enter Other Details పై క్లిక్ చేయాలి



Step 6 : Personal Information లో భాగంగా
మొబైల్ నెంబర్ను 
ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ( Optional)
ఈమెయిల్ ( Optinal )
వివాహం స్థితి
తండ్రి పేరు
రిజర్వేషన్
దివ్యంగ స్థితి నామినీ వివరాలు ఇవ్వాలి



Step 7 : Residential Detail లో భాగం గా
 ఇంటి నెంబరు
లొకాలిటీ
రాష్ట్రము
 జిల్లా
మండలము
పిన్ కోడ్
ప్రస్తుత చిరునామాల ఉన్నటువంటి సంవత్సరాలు వలస కార్మికులు కాదా అవునా ఇవ్వాలి.


Step 8 : Educational Qualifications లో భాగం గా
 విద్యా అర్హత
 నెలవారి జీతము స్లాబ్
 నెలవారీ జీతం కు సంబంధించిన ప్రూఫ్ ఉన్నట్లయితే అప్లోడ్ చేయాలి.


Step 9 : Occupation Details లో భాగం గా
ప్రాథమిక వృత్తి,
ప్రాథమిక వృత్తిలో సంవత్సరాల అనుభవం,
ఇంకొక వృత్తి ఏదైనా చేసినట్లయితే దానిని తెలియ జేయాలి,
 వృత్తి ఆధారిత సర్టిఫికెట్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయాలి.
 స్కిల్స్ ఉన్నట్లయితే వాటిని మెన్షన్ చేయాలి,
 తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ  పై క్లిక్ చేయాలి.


Step 10 : బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవ్వాలి. ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఎకౌంటు active lo ఉన్నట్లయితే, అదే బ్యాంకు ను లింకు చేయాలనుకుంటే YES ఫై క్లిక్ చేసి  SAVE & CONTINUE పై క్లిక్ చేయాలి. లేదా వేరొక బ్యాంకు ఎకౌంటు ఇవ్వాలి అనుకుంటే రిజిస్టర్ విత్ బ్యాంకు అకౌంట్ వద్ద నో ను సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చి SAVE & CONTINUE పై క్లిక్ చేయాలి.

Step 11 : ఇప్పటివరకు ఇచ్చిన వివరాలు అన్ని చూపిస్తాయి సరిచూసుకొని అన్నీ సరి పడినట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ వద్ద టిక్ ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చెయ్యాలి. ఒకవేళ వివరాలు తప్పుగా నమోదు అయినట్లయితే వెనుకకు వెళ్లి మరల వివరాలు ఇవ్వవలెను.


Step 12 : UAN కార్డు డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకోవలెను.



 సిటిజన్ లాగిన్ లో అప్లికేషన్ చేయు విధానం

Step 1 : https://register.eshram.gov.in లింక్ పై క్లిక్ చెయ్యాలి. అందులో Self Registration వద్ద ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైక్ నెంబర్ ఎంటర్ చేసి , CAPTCHA కోడ్ టచ్ చేసి గెట్ వాటిపై క్లిక్ చేయాలి. ఓటిపి ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేసిన తర్వాత ఆధార్ ఈ కేవైసీ ఆప్షన్ చూపిస్తుంది. పైన చూపిన Step 5 నుంచి ఫాలో అవ్వాలి. 

ముఖ్య గమనిక :
పై రిజిస్ట్రేషన్ కు ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది, రెన్యువల్ చేసుకోవడానికి ప్రస్తుతం ఎటువంటి అవకాశం లేదు భవిష్యత్తులో వచ్చినట్లయితే అప్పుడు రెన్యూవల్ చేసుకోవాలి, ఇన్కమ్ టాక్స్ పేమెంట్ చేయకుండా రిటర్న్స్ సమర్పించిన వారు ఎవరైనా ఉంటే వారు దీనికి అర్హులు.

e-SHRAM Application Form   CLICK HERE