Village Revenue Officer VRO Probation Declaration Information
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడు-II వారి ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి. తేదీ 1.10.2021 నాడు మెమో REV01 - 1476328 / GWS-350/2021 ను గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ V ఉషారాణి IAS వారు ఆంధ్ర ప్రదేశ్ CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విజయవాడ వారికి CCLA లెటర్ Nనెంబర్ IV(1)/143-1/2021.Dt. 11.8.2021 ఆధారంగా ఇవ్వటం జరిగింది.
GO.417, Rev(Ser. III) తేదీ: 27.9.2019 ఉత్తర్వుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సర్వీస్ రూల్స్ 2008 లో రూల్ నెంబర్ 12 మరియు 13 మార్చుతూ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. అందులో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-2 అనే కొత్త పోస్ట్ ను చేర్చడం జరిగింది. ముందుగా ఉన్న VRO అనే పోస్టును VRO గ్రేడ్-I మరియు VRO గ్రేడ్-II గా మార్చడం జరిగింది.
సీనియారిటీ అనేది జాయిన్ అయినటువంటి తేదీలను పరిగణలోకి తీసుకొని జరుగుతుంది . ఏ గ్రేడ్ విఆర్వో వారి సీనియార్టీ లిస్టు ఆ గ్రేడ్ లకు ఉండడం జరుగుతుంది. Compassionate Appointment కూడా రెండు గ్రేడ్ల వీఆర్వోలకు వర్తిస్తుంది అందుకు గాను సర్వీస్ కాలపరిమితిలో అనగా 60 సంవత్సరాల లోపు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ రకమైన అపాయింట్మెంట్ కు భార్య / భర్త లేదా ఆధారిత కొడుకు లేదా కూతురు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి రెండు గ్రేడ్ల VRO ల యొక్క పని విధానం, జాబ్ చార్ట్ ఒకే విధంగా ఉంటాయి. వీఆర్వో వారి సర్వీసు రూల్స్ రెండు గ్రేడ్ల వారికి వర్తిస్తాయి.
మొదటి విడత నోటిఫికేషన్ లో జాయిన్ అయినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-2 (VRO Gr-II)వారికి ముందుగా ఉన్నటువంటి విఆర్వో వారి సర్వీసు రూల్స్ ప్రకారం ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ చేయవలసి ఉంటుంది అని గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ V ఉషారాణి ఐఏఎస్ వారు పై ఉత్తర్వుల ప్రకారం తెలియజేశారు.
◾️ ప్రోబషన్ డిక్లరేషన్ మెమో : Click Here
◾️ GO417 : Click Here