One Time Settlement Scheme Details One Time Settlement Scheme Details

One Time Settlement Scheme Details

One Time Settlement Scheme Details


One Time Settlement Scheme Details 

'One Time Settlement' అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 'AP Housing Corporation' నుంచి రుణాలు తుసుకున్న వారికి, తీసుకొని వారికి, సొంత ఖర్చులతో హౌసింగ్ సైట్ లో గృహాలను నిర్మించుకున్న వారికి  ఈ స్కీం వర్తిస్తుంది. అందులో భాగం గా సొంత ఖర్చులతో నిర్మించుకున్న వారికి ఉచితంగా, మిగతా వారు రుసుము చెల్లిస్తే వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వారి పరిధిలోని గ్రామ వార్డు సచివాలయం లోనే ఇస్తారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పేరు "జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం".


ఇందులో భాగంగా మొదట వివరాలను Andhra Pradesh Housing Corporation వారు సెప్టెంబర్ 25, 2021 న డేటా ను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యటం జరుగుతుంది. అక్కడ నుంచి గ్రామ వార్డు సచివాలయాలకు PMU Housing సైట్ కు ఫార్వర్డ్ అవుతాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన అవుతుంది. తరువాత గ్రామ వార్డు సచివాలయాల్లో నే       One Time Settlement రుసుము చెల్లించిన తరువాత లబ్ధిదారుల ఇళ్లపై పూర్తి హక్కులు కల్పిస్తూరిజిస్ట్రేషన్ చేస్తారు. 'రుణ విముక్తి - శాశ్వత భూ హక్కు బధళాయింపు' ఈ పథకం ముఖ్య నినాదం.


జగనన్న సంపూర్ణ  గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ చార్జీలు

సంవత్సరం 1983 నుంచి 2011 మధ్యలో గృహం నిర్మించుకున్న  మొదట  అవకాశం ఉంటుంది. తక్కువ చెల్లింపులతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందించటం జరుగుతుంది. రుసుముల వివరాలు చూసుకున్నట్టు అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోటానికి గ్రామీణ ప్రాంతాల్లో ₹10,000/-, నగర పంచాయితీల్లో ₹15,000/-, నగర కార్పొరేషన్ లో ₹20,000/- గా ఉంటుంది. అధికారి మరణిస్తే వారి వారసులకు పై రుసుము మాత్రమే ఉంటుంది, కానీ ఇతరులకు రిజిస్ట్రేషన్ కు మాత్రం రెట్టింపు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ₹20,000/-, నగర పంచాయితీల్లో ₹30, 000/-, నగర కార్పొరేషన్ లో ₹40,000/- గా ఉంటుంది.





గ్రామ సచివాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి పాల్గొని వారు మరియు వారి యొక్క విధులు:

1. వాలంటీర్లు

2. పంచాయతీ సెక్రెటరీ

3. డిజిటల్ అసిస్టెంట్

4. VRO

5. ఇంజనీరింగ్  అసిస్టెంట్ 



పంచాయతీ సెక్రటరీ : 


పై వివరాలు నమోదు లో భాగంగా మొదటగా ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ వారు పంపించిన డేటా ను తెలుసుకోవడానికి PMU హౌసింగ్ అను వెబ్ సైట్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీ వారి లాగిన్ లో పని అవుతుంది. ఒకవేళ సంబంధిత పంచాయతీ సెక్రెటరీ లాగిన్ మర్చిపోయినట్టు అయితే సంబంధిత జిల్లా అధికారులను సంప్రదిస్తే వారు యూజర్నేమ్, పాస్వర్డ్ చెప్పటం జరుగుతుంది. వెబ్ సైటు లింకు Click Here, పై క్లిక్ చేసిన వెంటనే కింద చూపించిన విధంగా హోం పేజీ ఓపెన్ అవుతుంది.


ప్రభుత్వం వారు ఇచ్చిన Username & Password ను ఎంటర్ చేసి Captcha కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చెయ్యాలి. వెంటనే పాత పాస్వర్డ్ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ను రెండుసార్లు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చెయ్యాలి . కొత్త పాస్వర్డ్ నోట్ చేసుకోవాలి. తరువాత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లో భాగంగా పంచాయతీ సెక్రటరీ పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. వెంటనే Profile Updated Successfully అని వస్తుంది. తర్వాత లాగిన్ పేజీ లో యూజర్ నేమ్ మరియు కొత్తగా పెట్టిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. తరువాత One Time Settlement అనే ఆప్షన్ క్లిక్ చెసి List Of Beneficiaries ను ఎంచుకుని Secretariat Tagging పై క్లిక్ చేయాలి.


Secretariat Tagging   చూపిన విధంగా చూపిస్తుంది . అందులో Click Here To Download The List అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే లిస్టు PDF రూపంలో డౌన్ లోడ్ అవుతుంది.

 

సంబంధిత గ్రామ వార్డు వాలంటీర్ లకు లిస్టులను ఇచ్చి,2 రోజులలోపు వివరాల PART - A (పోస్ట్ దిగువ ఇవ్వటం జరిగింది) ఫార్మాట్ లో  సేకరించి  తరువాత లిస్టులను PS  వారు  క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రింటు తీసుకున్న పేపరు పై వివరాలు అన్నీ పూర్తిగా రాసుకొని, వెబ్ సైట్ లో లబ్ధిదారు సచివాలయం పేరు మరియు కోడు, వాలంటీర్ క్లస్టర్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. లబ్ధిదారుని ఆధార్ నెంబరు తప్పుగా నమోదు అయి ఉంటే దానిని కూడా ఎంటర్ చేసి అప్డేట్ పై క్లిక్ చేయాలి. Beneficiary details updated successfully అని వస్తుంది. ఈ విధంగా అందరి వివరాలు నమోదు చేసి అప్డేట్ చేయాలి. తరువాత పని సంబంధిత డిజిటల్ అసిస్టెంట్  వారి  నుంచి మొదలు అవుతుంది.



డిజిటల్ అసిస్టెంట్ :


పంచాయతీ సెక్రెటరీ వారి లాగిన్ లో డేటా ఎంట్రీ పూర్తి అయిన తరువాత వాలంటీర్ ఐ‌డి తో లబ్ధిదారుల వివరాలు చూపిస్తాయి. ఆ క్రమంలో లబ్ధిదారుల వివరాలు ప్రింట్ తీసి ఆయా వాలంటీర్ కు ఇవ్వాలి. వాటితో పాటుగా PART - B అప్లికేషన్ ఫారం ఇవ్వాలి. లబ్ధిదారుని వివరాలు PART - B రాసే సమయంలో సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ / గ్రామ సర్వేయర్ వారితో సంబంధిత వాలంటీర్ ఉండాలి. పూర్తి అయిన PART - B ఫారాలను వాలంటీర్ వద్ద కలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వాటిని సంబంధిత పంచాయతీ సెక్రెటరీ వారు ఆమోదం తెలిపిన తర్వాత లబ్ధిదారుని వివరాల ప్రాప్తికి ఎంత నగదు కట్టాలో జనరేట్ అవుతుంది.


గ్రామ రెవెన్యూ అధికారి (VRO) :


వాలంటీర్ వద్ద ఉన్నటువంటి PART - B అప్లికేషన్లు తీసుకొని ఎంక్వయిరీ చేయాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా వచ్చిన లిస్టులో ఉన్న పేరు దారుడు బ్రతికి ఉన్నట్టయితే వారి వివరాలు ఎంక్వయిరీ లో సరిగా ఉంటే డైరెక్టుగా ఎంక్వయిరీ పూర్తి అవుతుంది. ఒకవేళ వారి వారసులు ఆ ప్రాపర్టీ లో ఉన్నట్లయితే వారు నిజంగా వారసులు అని ఎంక్వైరీ లో రుజువు అయినట్టయితే అప్పుడు ఎంక్వైరీ పూర్తవుతుంది.అప్పడు PART-C అప్లికేషన్ ఫారం లో వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ కొనుగోలుదారుడు సరి అయిన డాక్యుమెంట్లు చూపించినట్టు అయితే అక్కడితో ఎంక్వైరీ పూర్తి అవుతుంది. ఇక్కడ కూడా PART-C అప్లికేషన్ ఫారం రాయవలసి ఉంటుంది. సర్వే పూర్తి కాకుండా వాయిదా వేయబడిన వారి వివరాలు విఆర్వో వారికి ఇచ్చినటువంటి లాగిన్ లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. పూర్తి ఎంక్వైరీ అయిన తరువాత ఆ వివరాలు ఆన్లైన్లో వారికి ఇచ్చినటువంటి లాగిన్ లో నమోదు చేయవలసి ఉంటుంది.


ఇంజనీరింగ్ అసిస్టెంట్ : 


వీఆర్వో వారి ఎంక్వయిరీ పూర్తి అయిన తరువాత కొలతలకు సంబంధించిన సమాచారము కై లబ్ధిదారుల వివరాలు సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి ఫార్వర్డ్ చేస్తారు. PART-D అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ వారికి ఫార్వర్డ్ చేయాలి.


🔹జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ముఖ్యమైన లింకులు :


1. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం - One Time Settlement ( OTS )- పూర్తి సమాచారం :   Click Here


2. వాలంటీర్ వారు PART B అప్లికేషన్ సర్వే చేయు విధానం : Click Here


3. VRO వారు PART C అప్లికేషన్ సర్వే చేయు విధానం : Click Here


4. ఇంజనీరింగ్ అసిస్టెంట్ / టౌన్ ప్లానింగ్ సెక్రటరీ వారు PART D అప్లికేషన్ సర్వే చేయు విధానం : Click Here


5. డిజిటల్ అసిస్టెంట్ వారు OTS వివరాలను ఆన్లైన్ చేయు విధానం : Click Here