Panchayat Secretary Gr V Must Pass CPT During Probation Period
గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ 2019 ద్వారా నియమితులైన పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ - V వారి ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు ముఖ్యమైన అప్ డేట్ రావడం జరిగింది. పంచాయతీ రాజ్ మరియు రూరల్ డిపార్ట్మెంట్ కమిషనర్ అయినటువంటి ఎం.గిరిజాశంకర్ IAS వారు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా, జిల్లా పంచాయతీ ఆఫీసర్ ( DPO ) వారికి ముఖ్యమైన లెటర్ ను ఫార్వర్డ్ చేయడం జరిగింది.
గవర్నమెంట్ ఆర్డర్ GO. No.148, Dt.27.09.2019 ప్రకారం ప్రతి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-V వారు వారి ప్రొబేషన్ పీరియడ్ లో తప్పనిసరిగా డిపార్ట్మెంటల్ టెస్ట్ ( అకౌంట్ టెస్ట్ పేపర్ I మరియు పేపర్ II ) తో పాటు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష ( Computer Proficiency Test) ను పాస్ కావాలి. ఒకవేళ పాస్ అవ్వకపోతే ప్రొబేషన్ పీరియడ్ పెరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు నోటిఫికేషన్ నెంబర్-18/2021 ద్వారా కంప్యూటర్ నైపుణ్య పరీక్షకు నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. కంప్యూటర్ నైపుణ్య పరీక్ష పాస్ అవ్వని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 వారు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే పెట్టుకొని అవకాశం ఉంది.
◾️ GO. 148 : Click Here
◾️Circualar : Click Here
◾️CPT Notification : Click Here