Pradhan Mantri Awas Yojana PMAY 2.0: Key Rules, Eligibility Criteria, and Application Process
What is Pradhan Mantri Awas Yojana PMAY 2.0 Scheme in Telugu ?
ఫిర్యాదు లేని సొంత భూమి కలిగి లేదా సొంత భూమి లేనివారు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Pradhan Mantri Awas Yojana [ PMAY 2.0 ] Gramin Housing Scheme ద్వారా PMAY 2.0 Scheme Amount Rs2,50,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎటువంటి భూమి లేకుండా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారు దరఖాస్తు చేసినట్లయితే దరఖాస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి. ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తుందో అప్పుడు వీరికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది తరువాత Pradhan Mantri Awas Yojana [ PMAY 2.0 ] Housing Scheme ద్వారా ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది . దరఖాస్తు చేయాలనుకునేవారు గ్రామ సచివాలయాలు అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి వార్డు సచివాలయంలో అయితే వార్డ్ అమ్నిటీ సెక్రటరీ వారికి కింద తెలిపిన దరఖాస్తులను సెట్ ఇవ్వాల్సి ఉంటుంది.
PMAY 2.0 - Eligibility Criteria
- గతంలో ఎప్పుడు ఇల్లు మీ పేరు మీద శాంక్షన్ అయ్యి ఉండరాదు .
- పక్క ఇల్లు కలిగిన హౌస్ టాక్స్ మీ పేరు పై ఉండ రాదు .
- ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు .
- 4 చక్రాల వాహనం ఉండరాదు .
- ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను కట్టరాదు .
- భూమి ఉంటె , కనీసం 340 చదరపు అడుగుల భూమి ఉండాలి .
- అప్లికేషన్ చేస్తున్న వారు ఉన్న రైస్ కార్డు / రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎవరికీ గతంలో హౌస్ శాంక్షన్ అయ్యి ఉండరాదు
PMAY 2.0 - Documents Required
- ఆధార్ కార్డుల జెరాక్స్ [ భార్య + భర్త ] సంతకాలతో
- రేషన్ కార్డు / బియ్యం కార్డు జెరాక్స్
- బ్యాంకు అకౌంట్ జెరాక్స్ [ భార్య + భర్త ]
- జాబ్ కార్డు జెరాక్స్
- దరఖాస్తు దారుని పాస్ పోర్ట్ సైజు ఫోటో [ 2 ]
- పట్టా లేదా పొజిషన్ సర్టిఫికెట్ జెరాక్స్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
- పనిచేస్తున్న మొబైల్ నెంబర్
PMAY 2.0 - Eligibility Check
దరఖాస్తు చేస్తున్నవారు ఈ పథకానికి అర్హులా ? కాదా ? అని తెలుసుకోవడానికి ముందుగా మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ వారిని కాంటాక్ట్ అయినట్లయితే వారు మీ యొక్క ఆధార్ నెంబరు మరియు మీ యొక్క రేషన్ కార్డు నెంబరు ప్రాప్తికి వారి యొక్క Beneficiary Search లో అర్హులా కాదని చెప్పి చెక్ చేస్తారు. అర్హులు అని తెలియజేసినట్లయితే అప్పుడు దరఖాస్తుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లను సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డ్ అమ్మినిటీ సెక్రటరీ వారికి ఇవ్వాల్సి ఉంటుంది.
మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయితే వెంటనే ఇటువంటి అప్డేట్లు మీకు రోజు అందుతాయి.
సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేకి నాలుగు లక్షల 30000 ఇస్తామన్నారు ఆ పథకం ఉందా లేదా
ReplyDelete