స్పెషల్ చీఫ్ సెక్రటరీ , గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారి ఆదేశాల ( మెమో నెంబర్ 137/2021 Dt.29.09.2021) మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు సంబందించిన లైన్ డిపార్టుమెంటు సర్వీస్ రూల్స్ లను, ప్రొబేషన్ పీరియడ్ లో పాస్ అవ్వాల్సిన టెస్టులను, ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC ద్వారా లేదా సంబంధిత డిపార్ట్మెంట్ పెట్టిన టెస్టులు ఆధారం గా అర్హత పొందిన సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ కాలం పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ చేయవలసిందిగా ఆదేశించారు.
కృష్ణాజిల్లా, జిల్లా పంచాయతీ ఆఫీసర్ (DPO) వారు పై ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అందరూ MPDO వారు పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ V & VI(డిజిటల్ అసిస్టెంట్ )వారి వివారాలు ను Soft Copy మరియు సంతకం తో ఉన్న కాపీలు తేదీ 21.10.2021 లోపు జిల్లా పంచాయతీ అధికారి ( DPO ) ఆఫీస్ కు అందజేయాలి.
జిల్లాలో ఉన్నటువంటి అందరు విస్తరణ అధికారి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ EO(PRRD) వారు ఒక డిజిటల్ అసిస్టెంట్ వారితో తేదీ 22.10.2021 నాడు DPO ఆఫీస్ లో JC(VSWS) వారితో జరిగే మీటింగ్ కు హాజరు అయ్యి కింద ఇవ్వబడిన ఫార్మాట్ లో ఒక్కో సెట్ Soft Copy , 2 సెట్ ల సంతకం తో ఉన్న కాపీలను డివిజన్ పంచాయితీ ఆఫీస్ లో అందజేయాలి.సంబంధిత డివిజన్ పంచాయతీ ఆఫీసు లో అందరూ సర్వీస్ వివరాలు చెక్ చేసుకుని, సంబంధిత రిపోర్ట్ అదే రోజు డిపిఓ ఆఫీసుకు అందజేయగలరు.
ఫార్మాట్ వివరాలు :
పంచాయతీ కార్యదర్శి గ్రేడు V & -VI ( డిజిటల్ అసిస్టెంట్ ) :
- S. No
- పూర్తి పేరు
- మండలం పేరు
- గ్రామ సచివాలయం పేరు
- పుట్టిన తేదీ
- ప్రోసిడింగ్ నెంబరు మరియు తేదీ
- జాయినింగ్ తేదీ
- పోలీస్ వెరిఫికేషన్ జరిగిందా లేదా( Antecedence Verification )
- డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ వివరాలు
- ఎటువంటి సెలవులు తీసుకున్నారా ( మాతృత్వ, EOL, Study Leave, Medical Leave )
- సర్వీసు రెగ్యులర్ చేయు తేదీ
- సంబంధిత వ్యక్తి రెగ్యులర్ కు అర్హులా? కాదా?
- రీమార్కులు
మెమో నెంబర్ 137/2021 Dt.29.09.2021 ప్రకారం ప్రతి జిల్లా పంచాయతీ అధికారి (DPO) వారిద్వారా పై రకంగా ఉత్తర్వులు వెలువడుతాయి. కావున సంబంధిత వివరాలు సిద్ధం చేసుకోవడం వలన వివరాలు అడిగిన వెంటనే ఇవ్వడానికి సులువుగా ఉంటుంది.