ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేదీ 2, అక్టోబర్ 2019 వ సంవత్సరం లో 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయటం అందరికీ తెలిసినదే. అందులో 1,34,000 గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని నియమించడం కూడా జరిగింది. తేదీ 2 అక్టోబర్ 2021 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు కాలం పూర్తి చేసుకున్న ప్రతి సచివాలయ సిబ్బందికి సర్వీసు రూల్స్ ప్రకారం ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి.
వివిధ సచివాలయ సిబ్బంది, సర్వీస్ రూల్స్, శాఖ
పై ఉద్యోగులందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే సమయంలో ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు వారి డిపార్ట్మెంట్ వారు తెలియజేసిన విషయాలు
- రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ సమయంలో 15 వేల గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. ప్రొబేషన్ పీరియడ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి జాయినింగ్ నుంచి రెండు సంవత్సరాల తర్వాత రెగ్యులర్ పే స్కేల్ వస్తుంది .
- ఆయా సమయంలో ( time to time ) ప్రభుత్వం వారు ఇచ్చే ఉత్తర్వులను , AP State & Subordinate Service Rules ను పాటించకపోతే ప్రొబేషన్ కాలం పొడిగించడం జరుగుతుంది.
- ప్రవేశం కాలంలో తప్పనిసరిగా ఇండక్షన్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ టెస్ట్ లు పాతవి అవ్వకపోయినా విజయవంతంగా ప్రొఫెషన్ కాలం పూర్తి చెయ్యకపోయినా సర్వీసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
- ప్రవేశం పీరియడ్స్ సమయంలో సంబంధిత ఉద్యోగిని ప్రభుత్వం ఎటువంటి సమాచారం లేకుండా సర్వీసు నుంచి తొలగించే అధికారం కింది విషయాల్లో ఉంటుంది.
- ఉద్యోగానికి అనర్హులుగా ఉంటే
- ప్రదర్శన సరిగా లేకపోతే
- ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఇచ్చినటువంటి వివరాలలో ఎటువంటి తప్పులు ఉన్నచో వెంటనే సర్వీసు నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది
పై వివరాలను అనుసరించి సంబంధిత డిపార్ట్మెంట్ వారు సర్వీసు రూల్స్ లను రూపొందించడం జరిగింది. వాటిలో APPSC ద్వారా డిపార్టుమెంటు టెస్ట్ / ప్రొబేషన్ టెస్ట్ పొందుపరచడం జరిగింది. సంబంధిత కలెక్టర్లు, జిల్లా అధికారులు, మునిసిపల్ అధికారులు సర్వీస్ రూల్స్ ల ప్రాప్తి కి సచివాలయ ఉద్యోగులకు ప్రొఫెషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ చేయవలసిందిగా ఆంధ్ర ప్రదేశ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అజయ్ జైన్ IAS వారు పై మెమో ద్వారా తెలియజేశారు.