
Wednesday Meeting In Grama Ward Sachivalayams
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరియు సర్వీసులను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో 15004 గ్రామ వార్డు సచివాలయ లను ఏర్పాటు చేస్తూ సచివాలయ సిబ్బందిని మరియు వాలంటీర్లను నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సచివాలయానికి మరియు వాలంటీర్లకు ఐటీ - హార్డువేరు ను ఇవ్వటం జరిగింది.
Inventary Supplied to Each Grama Ward Sachivalayam
- కంప్యూటర్ డెస్క్ టాప్ లు
- 1 UPS
- 1 ప్రింటర్
- 1 లామినేషన్ మెషిన్
- 1 Android Mobile + 4G SIM
- 1 ఐరిష్ స్కానర్
- 1 ఫింగర్ ప్రింట్ స్కానర్
- హై సెక్యూరిటీ స్టేషనరీ
Inventary Supplied to Each Grama Ward Volunteer
- 1 Android Mobile
- 4G SIM
- 3స్కానర్
Inventary Supplied to Each Mahila Police in Grama Ward Sachivalayam
- 1 Android Mobile
- 4G SIM
పై అన్నీ కూడా CEOs ZPP/DPOs, District Head quarter Municipal commissioners,MPDOs / Municipal Commissioners వారి ద్వారా అందించటం జరిగింది.
హార్డ్ వేరు సమస్య ఇప్పటి వరకు జిల్లా స్థాయి లో కొంత మేర పూర్తి అయినను సచివాలయ స్థాయిలో ఇంకనూ ఐటీ హార్డ్వేర్ సమస్య తో పాటుగా, CFMS ఐడి, శాలరీ , arrear Salary, ID Cards, స్కానర్, మొబైల్ Sim cards మరియు మొబైల్ నెటవర్క్ సమస్యలను క్లియర్ చెయ్యటానికి ప్రభుత్వం వారు ఆయా AMC ( Annual Maintenance Contractors ) వెండర్లతో 3 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది.
గౌరవ గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారి ఆదేశాల మేరకు పై ఐటీ హార్డ్ వేర్ విషయాలను పరిగణలోకి తీసుకొని సమస్యలను పూర్తిగా తగ్గించేందుకు వివిధ స్థాయిలో ఒక సిస్టమును తీసుకురావాలి అని ఉద్దేశంతో వివిధ స్థాయిలో అనగా సచివాలయం, మండలం/ మున్సిపాలిటీ, జిల్లా /HOD ఉన్నటువంటి అధికారులు వారి స్థాయిలో ప్రతి బుధవారం రివ్యూ మీటింగ్ పెట్టవలసి ఉంటుంది.
Wednesday Meeting Schedule
✅️నెలలో మొదటి బుధవారం :
సచివాలయ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ / వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ
✅️నెలలో రెండవ బుధవారం :
మండలం / మున్సిపాలిటీ స్థాయిలో MPDO /MC
✅️ నెలలో మూడవ బుధవారం :
జిల్లా స్థాయిలో JC ( VSWS )
✅️నెలలో నాలుగవ బుధవారం :
రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్, గ్రామ వార్డు సచివాలయ శాఖ
Note :
ఆ నెలలో ఆయా బుధవారం సెలవు రోజు అయినట్టయితే తరువాత వచ్చే వర్కింగ్ డే రోజు మీటింగు కండక్ట్ చేయాలి.
Wednesday Meeting Quation and Answers
విషయం 1 : పై అధికారుల తనిఖీ
పరిస్కారం : పై అధికారులు తనిఖీ కి వచ్చేటప్పుడు వాటికి సంబంధించిన వివరాలు రికార్డులో నమోదు చేయాలి
విషయం 2 : వాలంటీర్ల శాలరీ లకు సంబంధించి Salary not credited, arrear salaries, CFMS ID not generated, Head of account not mapped properly, Not assigned the Maker ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే
పరిష్కారం :
- వాలంటీర్ వారి పొజిషన్ Vacant or Not అనేది చెక్ చేయాలి. తప్పుగా ఉంటే మార్చుకోవాలి
-Workflow configuration లో Maker సరిగ్గా నమోదు చేయాలి.
- ప్రతినెలా వాలంటీర్లకు సరిగా శాలరీలు పడుతున్నాయా లేదా అనేది సరి చూసుకోవాలి
- ఒకవేళ వారికి శాలరీలు క్రెడిట్ కాకపోతే దానికి సంబంధించి అర్జీ నమోదు చేసి ఫాలోఅప్ చేయాలి.
విషయం 3: సచివాలయానికి ఇవ్వబడిన Desktops, UPS, Printer, Laminating Machine, IRIS Scanners, Mobiles, FPS,SIMs & Secured base stationery సరిపడినంత రాకపోతే
పరిష్కారం : సంబంధిత MPDO/MC వారికి రిపోర్ట్ చేయాలి.
విషయం 4: హార్డ్ వేరు సరిగా పని చేయకపోతే లేదా రిపేరు అయినట్టయితే
పరిష్కారం : vsws పోర్టల్లో అర్జీ నమోదు చేయాలి
విషయం 5: మొబైల్ ఫోను సరిగా పని చేయకపోతే
పరిష్కారం : ప్రభుత్వం నిర్ణయించిన అటువంటి MI సర్వీసింగ్ సెంటర్ కు సంబంధిత సచివాలయ ఉద్యోగులు లేదా వాలంటీర్ ఇవ్వాలి. లేదా 9502345678 అనే నెంబర్కు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు.
విషయం 6 : ఫింగర్ ప్రింట్ స్కానర్ లో పని చెయ్యకపోతే
పరిష్కారం : PS/WAS వారు సంబంధిత MPDO/MC వారికి అందజేసిన తరువాత JC ఆఫీస్ సర్వీస్ ఇంజనీరు కు చేరే విధంగా ఫాలో అప్ చేయాలి.
విషయం 7 : సచివాలయంలో హై సెక్యూరిటీ స్టేషనరీ సర్టిఫికెట్ 50 కన్నా తక్కువ ఉంటే
పరిష్కారం : సంబంధిత MPDO/MC నుంచి తీసుకోవాలి
విషయం 8 : SIM యాక్టివేషన్ లేదా పోయిన
పరిష్కారం: వాలంటీర్ వారిని దగ్గరలో ఉన్నటువంటి కస్టమర్ సర్వీస్ సెంటర్ నుండి కొత్త సిమ్ము తీసుకొని వాటి వివరాలు VSWS పోర్టల్ లో అప్ డేట్ చేయాలి.
విషయం 9 : ఒకవేళ మొబైలు సిమ్ము హార్డువేరు తక్కువగా ఉన్నట్లయితే
పరిష్కారం : తొలగించబడిన లేదా రిజైన్ చేయబడిన వాలంటీర్ నుంచి తీసుకొని కొత్త వాలంటీర్ కి ఇవ్వాలి. సంబంధిత MPDO/MC వారికి రిపోర్టు చేయాలి
విషయం 10: హై వోల్టేజ్, విద్యుత్ సమస్యలు
పరిష్కారం : సచివాలయానికి ఎర్తింగ్ చేయించాలి.
ప్రతి మొదటి బుధవారం మీటింగ్కు పూర్తి అయిన తరువాత ఇవ్వబడిన EXCEL FORMAT లో మీటింగ్ రిపోర్టు సంబంధిత MPDO/MC వారికి PS/WAS వారు అందజేయాలి.
పై ప్రతి విషయానికి సంబంధించి మండల స్థాయి మరియు జిల్లా /HOD స్థాయిలో ప్రతినెల రెండవ మరియు మూడవ బుధవారం నాడు మీటింగ్ నిర్వహించి రిపోర్టులను వారి పై అధికారులకు పంపించాలి. రాష్ట్ర స్థాయిలో గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు పర్యవేక్షిస్తారు.