Ayushman Bharat Health Cards Ayushman Bharat Health Cards

Ayushman Bharat Health Cards

Ayushman Bharat Health Cards

Ayushman Bharat Health Cards   


ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి ?
  • ఈ పథకం కింద దేశంలోని పేద వర్గాలకు ప్రభుత్వం ఉచిత చికిత్సను అందిస్తుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఆయుష్మాన్ కార్డును జారీ చేస్తుంది. 
  • ఈ ఆయుష్మాన్ పథకం కింద అర్హులైన వ్యక్తులకు ఆయుష్మాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. కార్డు పొందిన లబ్దిదారుడు అత్యవసర పరిస్థితుల్లో రూ. 5 లక్షల వరకు ఏ ఆసుపత్రులలో అయినా ఉచితంగా చికిత్స పొందవచ్చు

ఆయుష్మాన్ భారత్ పథకంకు అర్హులు ఎవరు?
  • 10 కోట్ల కుటుంబాలకు పీఎంజేఏవై వర్తిస్తుంది. వీరిలో ఎనిమిది కోట్ల గ్రామీణ కుటుంబాలు, 2.33 కోట్ల పట్టణ ప్రాంత కుటుంబాలు ఉన్నాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనివారు, కేవల వేతనం మాత్రమే తీసుకునేవారు, ఇతరత్రా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు దీనికి అర్హులు.
  • పట్టణ ప్రాంతాల్లో చేసే వృత్తుల ఆధారంగా లబ్దిదారులను నిర్ణయిస్తారు. ఈ పథకం కింద కేంద్రం ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షలు అందజేస్తుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, 16 నుంచి 59 ఏళ్ల వయసున్న మగవాళ్లు లేని కుటుంబాలకు, బిచ్చగాళ్లకు, వికలాంగులు ఉన్న కుటుంబాలు, ఏ పనీ చేయలేని వృద్ధులున్న కుటుంబాలకు, ఇల్లు లేని, రోజు కూలీకి వెళ్లేవారు, ఆదివాసీ సమాజాలు, చట్టబద్ధంగా స్వేచ్ఛ పొందిన కట్టుబానిసలు, సరైన ఇల్లు లేనివారు, లేక ఒక్క గదిలో జీవిస్తున్న కుటుంబాలు, పారిశుద్ధ్య పనుల్లో ఉన్న కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలు పొందగలరు.
  • పట్టణ ప్రాంతాల్లో బట్టలు ఉతికేవాళ్లు/చౌకీదార్లు, చినిగిన బట్టలు ఏరుకునేవారు, మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, రిపెయిర్ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు, తోటమాలీలు, వీధులు ఊడ్చేవాళ్లు, చేతి వృత్తులు చేసుకునేవాళ్లు, హస్తకళల కార్మికులు, కుట్టుపనివాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, ప్లంబర్లు, మేస్త్రీలు, భవన నిర్మాణ కూలీలు, పోర్టర్లు, వెల్డర్లు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, వాహనాలు నడిపే డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్లు, రిక్షా తొక్కేవారు, చిన్న సంస్థల్లో సహాయకులుగా పనిచేసేవారు, డెలివరీ బాయ్స్, షాప్ కీపర్లు, వెయిటర్లు, అందరూ ఈ పథకం నుంచి లబ్ది పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ పథకంకు అర్హతలను తెలుసుకోవటం ఎలా ?
  • మీరు ఆయుష్మాన్ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా అధికారిక పోర్టల్ కి వెళ్లాలి.
  • తర్వాత ఇక్కడ మీరు ‘యామ్ ఐ ఎలిజిబుల్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.
  • ఇప్పుడు మీరు ఇక్కడ రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీరు మొదట మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, రెండవదానిలో మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • అప్పుడు మీకు అర్హత ఉందా లేదా? అనేది తెలిసిపోతుంది. అర్హత ఉంటే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దీని తర్వాత మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా సమర్పించాలి.
  • మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఇస్తారు.
  • ఆ తర్వాత మీరు 15 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.
  • 15 రోజుల తర్వాత మీ ఇంటి చిరునామాకు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ వస్తుంది.
  • ఆ తర్వాత మీరు ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆసుపత్రిలోనైనా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ (PM-JAY) e-KYC  సమాచారం :
  • ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (PM-JAY) ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2019 నుండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నిర్వహిస్తూ ఉన్నది.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 55,30,834 కుటుంబాలు అందులో 1.79 కోట్ల ప్రజలు PM-JAY పథకానికి అర్హులు అని నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) తెలియజేయడం జరిగినది.
  • NHA వారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య స్కీములను కలిపి "
  • AYUSHMAN AROGYASRI CARD" (ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ కార్డు) ను పైన తెలిపిన లబ్ధిదారుల నుంచి వివరాలను తీసుకొని అందజేయవలసిందిగా State Helth Authority (SHA), YSR Arogyasri Health Care Trust (YSRAHCT) వారికి తెలియజేసియున్నారు.

AYUSHMAN AROGYASRI CARD (ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ కార్డు) రిజిస్ట్రేషన్, ప్రింటింగ్, పంపిణి కు సంబందించిన వివరాములు :
  1. ప్రతీ లబ్ధిదారునికి పై కార్డుల రిజిస్ట్రేషన్ కోసం PMJAY MOBILE అప్లికేషన్ ఇవ్వటం తో పాటుగా అందులో ముఖ ధ్రువీకరణ ఆప్షన్ ( Aadhaar Based Face Authentication) ఇవ్వటం జరిగింది.
  2. గ్రామ వార్డు వాలంటీర్లకు లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చేయుటకు లాగిన్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.క్లస్టర్ పరిధిలో వారికీ మరియు ఇంచార్జ్ ఇచ్చిన క్లస్టర్ లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ చేయుటకు అవకాశం ఇవ్వటం జరిగింది.
  3. రిజిస్ట్రేషన్ eKYC విజయవంతం గా పూర్తి అయిన లబ్ధిదారుల కు PM-JAY - Dr YSR Arogya Sri Card జనరేట్ అవుతుంది.
  4. ప్రింటింగ్ కొరకు అమోదించిన ప్రింటింగ్ సంస్థలకు eKYC పూర్తి అయిన లబ్ధిదారుల కార్డులు ప్రింటింగ్ అవుతుంది.
  5. ప్రింటింగ్ అయిన కార్డులు గ్రామ వార్డు సచివాలయం లో పనిచేస్తున్న ANM / WHS వారికీ అందించటం జరుగును. వారు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అందించటం జరుగును. 
  6. కార్డు లబ్దిదారులకు ఇస్తూ Acknowledgment తీసుకొని అందజేయాలి. 
  7. కార్డు ప్రింటింగ్,పంపిణి మొత్తం ప్రక్రియ తేదీ 15 నవంబర్ 2022 లోపు పూర్తి చెయ్యాలి.రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేదీ 05 అక్టోబర్ 2022 లోపు పూర్తి చెయ్యమని తెలియజేసీఉన్నారు.
అధికారిక ఉత్తర్వులు 👇


ఆయుష్మాన్ భారత్ (PM-JAY) e-KYC ఎవరికి చెయ్యాలి ?

ఆయుష్మాన్ భారత్ కార్డులకు e-KYC మొదలు అయ్యి ఇంకనూ చాలా వాలంటీర్లకు ఎవరికి సర్వే చెయ్యాలో తెలియటం లేదు. మరియు ఎందుకు సర్వే చేస్తారో తెలియటం లేదు. ముందుగా సచివాలయం లోని ANM వారు ఏఏ కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ సర్వే చేస్తారో వారికి కార్డులు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఏఏ కుటుంబంలో అందరికి రిజిస్ట్రేషన్ అవుతాయో ఆ కార్డులు e-KYC కొరకు వచ్చాయి. 

క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా మీ క్లస్టర్ ఐడి తో ఉన్న ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల వివరాలు పొందవచ్చు. 

Click Here

Note :

క్లస్టర్ కోడ్ అనగా సచివాలయం కోడ్ + వాలంటీర్ క్లస్టర్ నెంబర్

Ex. Sachivalayam Code - 10190201, వాలంటీర్ క్లస్టర్ - 2 అయితే అప్పుడు క్లస్టర్ కోడ్ = 10190201002. క్లస్టర్ -11 అయితే క్లస్టర్ కోడ్ - 10190201011 అవుతుంది. 


వాలంటీర్ లాగిన్ నెంబర్ మార్చుకునే విధానం :

  1. సచివాలయం లో PS Gr-VI(డిజిటల్ అసిస్టెంట్) లేదా వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి AP సేవ పోర్టల్ లాగిన్ ఓపెన్ చెయ్యాలి.
  2. Other Services ఓపెన్ చెయ్యాలి.
  3. Edit Employees / Volunteers Details పై క్లిక్ చేయాలి. అందులో Edit Volunteers Details పై క్లిక్ చేయాలి. 
  4. వాలంటీర్ పేరు పక్కన ఉండే Edit ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  5. Volunteer Mobile ఆప్షన్ లో ఏ నెంబర్ తో లాగిన్ ఆప్షన్ కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. Update పై క్లిక్ చేయాలి.

అప్డేట్ చేసిన 2-3 రోజుల్లో అప్డేట్ అవుతుంది. కొందరికి వెంటనే అవుతన్నాయి

లేదా

జిల్లా GSWS అధికారులు పెట్టె గూగుల్ ఫారం లో లాగిన్ అవ్వని వాలంటీర్ల సమాచారం అప్డేట్ చేస్తే వారు అప్డేట్ చెయ్యటం జరుగును.


రిపోర్ట్ స్టేటస్ తెలుసుకునే లింక్ :

వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ eKYC చేసిన వారి జాబితా తెలుసుకునే విధానము :


Step 1 : మొదట కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయాలి.👇🏿


Step 2 : Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చేసిన వెంటనే login పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Password మరియు OTP అనే ఆప్షన్ లు ఉంటాయి అందులో Password అనే ఆప్షన్ ను టిక్ చేసి User ID & Password Enter చేయాలి.Sign పై క్లిక్ చేయాలి.

User ID : 28stateuser
Password : 28stateuser@1234


Step 3 : BIS eKYC Request Status Report పేజీ లో “eKYC Andhra Pradesh – with Secretariat" అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెంటనే ఈ రోజు వరకు జిల్లా వారీగా సమాచారం చూపిస్తుంది.

Step 4 : జిల్లా,మండలం, సచివాలయం, తేదీ లు ఎంచుకోవాలి. అప్పుడు వాలంటీర్ పేర్లతో మొత్తం ఎన్ని eKYC కు వచ్చాయి, ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయో చూపిస్తుంది.

లేదా

Step 1 : ముందుగా కింద లింక్ ఓపెన్ చెయ్యాలి. Click Here పై క్లిక్ చేయండి. 👇🏿👇🏿
Click Here

Step 2 : లాగిన్ పేజీ లో ఆయుష్మాన్ భారత్ కు లాగిన్ అయిన వాలంటీర్ మొబైల్ నెంబర్ ను Sign In పేజీ లో Operator ను ఎంచుకొని Enter Your Mobile Number వద్ద ఎంటర్ Get OTP పై క్లిక్ చేసి మొబైల్ కు వచ్చే OTP ఎంటర్ చేయాలి. 

Step 3 : ముందుగా PMJAY CONSOLIDATED DATA పై క్లిక్ చేసి BENEFICIARY SEARCH BY VILL/TOWN ను ఎంచుకోవాలి. 

Step 4 : సచివాలయం వారీగా వివరాలు తో కూడిన Excel షీట్ ఓపెన్ అవురుంది. మొదటి కలమ్ A లో వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ eKYC చేసిన వారి లిస్ట్ ఓపెన్ అవుతుంది.

లేదా 

Step 1 : మొదట కింద లింక్ ఓపెన్ చేయాలి  👇
Click Here
Step 2 : CARD-DRIVE అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Login పై క్లిక్ చెయ్యకూడదు.

Step 3 : eKYC RECEIVED REPORT - STATE WISE ను ఎంచుకొని అవసరం అనుగుణంగా Today / Yesterday / Weekly / Last 30 Days ను ఎంచుకోవాలి. ఇక్కడ Last 30 Days ఎంచుకోవాలి.

Step 4 : State గా Andhra Pradesh ను ఎంచుకోవాలి.
District సెలెక్ట్ చేసుకోవాలి.

Step 5 : అప్పుడు User ID & Password అడుగుతుంది.

User ID : apsha
Password apsha#4321 ఎంటర్ చేయాలి.

Step 6 : మండలం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మండల పరిధిలో Operator గా నమోదు అయిన వాలంటీర్ల పేర్లు వస్తాయి. eKYC Mode / Authentication Mode లో Requested
Approved, Rejected, Pending, Delivered, OTP Finger, Iris,Face లిస్ట్ లు వస్తాయి. మండలం పేరు సెలెక్ట్ చేసుకున్న తరువాత డౌన్లోడ్ బటన్ ⬇️ పై క్లిక్ చేస్తే Excel డౌన్లోడ్ అవుతుంది.

అవసరమైన మొబైల్ యాప్ Install చేయటం మరియు మీరు ఆపరేటర్ గా నమోదు ప్రక్రియ :

మీ మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ తప్పనిసరిగా 9 లేదా అంతకన్నా ఎక్కువ వెర్షన్ ఉపయోగం లో ఉండాలి మొదటగా మీరు మీ మొబైల్ ఫోన్లో 'ఆయుష్మాన్ భారత్ మొబైల్ అప్లికేషన్' మరియు 'ఆధార్ ఫేస్ ఐడి' అనే మొబైల్ అప్లికేషన్ లు Install చేసుకోవాలి.

Download V 3.1.53 Mobile App  New👇🏿

Click Here

తరువాత ఆయుష్మాన్ భారత్ అప్లికేషన్ లో "NHA Data Privacy Policy" విధానానికి 'ACCEPT' పై క్లిక్ చేయాలి. వెంటనే వచ్చిన అప్లికేషన్ HOME PAGE లో LOGIN ను CLICK చేసి SELECT LANGUAGE వద్ద భాషను సెలెక్ట్ చేసుకోవాలి. లాగిన్ యాప్ వద్ద OPERATOR అని సెలెక్ట్ చేసుకొని మీ రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి NEXT పై క్లిక్ చేయాలి. వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేసి NEXT పై క్లిక్ చేయాలి.

వాలంటీర్లు జాయిన్ అయినప్పుడు ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ తో లాగిన్ అవకాశం ఉంటుంది.

ఇప్పుడు మీరు మర్చిపోకుండా ఉండే ఒక నాలుగు అంకెల PIN ఎంటర్ చేయాలి. గమనిక ఈ నాలుగు అంకెల PIN నెంబర్ ఉపయోగించి మాత్రమే మీరు ఎప్పుడూ ఈ యాప్  వాడగలుగుతారు కావున మీరు ఈ పిన్ను గుర్తు ఉండేలా ఒక నాలుగు అంకెల నెంబర్ను ఉంచవలసిందిగా మనవి. ఇక్కడితో ఆపరేటర్ గా మీరు నమోదు అయినట్టే .


ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మొబైల్ అప్లికేషన్ యాప్ తో ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు నమోదు మరియు ఆన్లైన్ కార్డు జనరేట్ చేసే విధానం :

ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డును రెండు రకాలుగా నమోదు చెయ్యవచ్చు

  1. ఆధార్ UHID ద్వారా లబ్ధిదారులను గుర్తించి (Search by ID)
  2. వారి జిల్లా, మండలం, సచివాలయం, క్లస్టర్ (Search By Village / Town)

1. ఆధార్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి (Search by ID):

తద్వారా వారి ఆధార్ ను ఉపయోగించి మీరు (Search By ID) నుండి నమోదు చేయవచ్చు నమోదు చేయవలసిన లబ్ధిదారుని ఆధార్ ఎంటర్ చేయగానే వారి కుటుంబ సభ్యుల వివరాలు వస్తాయి.

అందులో మీరు నమోదు చేసే వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి వివరాల వద్ద ఉన్న AUTHENTICATE అనే బటన్ ను క్లిక్ చేసి నమోదు చేసే లబ్ధిదారుని ఆధార్ కు అతని ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో కనుక్కొని Authorization Type లో MOBILE OTP,  FACE AUTHENTICATION మరియి BIOMETRIC ను ఎంచుకోవాలి.

FACE AUTHENTICATION ఎంచుకుంటే క్రింద తెలిపిన ఐదు విషయాలు పాటించవలసి ఉంటుంది:

  1. మీరు లబ్ధిదారుని మీ ఫోను ఎదురుగా ఉండవలసి ఉంటుంది ఫోన్ లో సెల్ఫీ కెమెరా ఆన్ చేయరాదు.
  2. ఫోనుకు మరియు లబ్ధిదారునికి మధ్య కనీసం ఒక అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి అంతకుముంచి తక్కువ ఉన్న లేదా ఎక్కువ ఉన్నా కెమెరా ఆ వ్యక్తిని గుర్తించకపోవచ్చు.
  3. లబ్ధిదారుని మీద సరిపడా వెలుతురు పడేలా చూసుకోవాలి. 4.ఈ పేస్ ద్వారా చేసే పద్ధతిలో లబ్ధిదారుడు కనీసం రెండు లేదా మూడుసార్లు కనురెప్పలు ఆడించవలసి ఉంటుంది.
  4. మొబైల్ ఫోన్ను మరియు లబ్ధిదారునికి వీలైనంతవరకు కదలకుండా ఉండేలా చూడాలి.
  5. మొబైల్ ఫోను మరియు లబ్ధిదారులు ఎదురెదురుగా ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ✅️ Tick వచ్చి Image Successfully Captured అని వస్తే లబ్ధిదారుని ఫేస్ ద్వారా గుర్తించే ప్రక్రియ అయినట్టుగా. ఒకవేళ కింద చూపిన ఎర్ర రంగులో ❌️ సింబల్ వచ్చినచో మళ్ళీ Face Authentication గుర్తించే ప్రక్రియ పైన తెలిపిన విధంగా మళ్లీ చేయవలసి ఉంటుంది.


MOBILE OTP ఎంచుకుంటే లబ్ధిదారునికి వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి నమోదు చేయాలి. ఇప్పుడు పైన తెలిపిన విధంగా మొబైల్ నెంబర్ ను నమోదు చేసి వచ్చిన OTP మళ్ళీ ఎంటర్ చేసి ఫోటో తీసి SUBMIT క్లిక్ చేసి నమోదు ముగించాలి.ఇక్కడితో EKYC ద్వారా గుర్తించే విధానం ముగిసినట్టు.


ఇప్పుడు లబ్ధిదారుని మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి దానికి వచ్చిన OTP ఎంటర్ చేసి TAKE PHOTO అని క్లిక్ చేయాలి లబ్ధిదారుని ఫోటోని తీయవలసి ఉంటుంది ఒకవేళ ఫోటో సరిగ్గా రాకపోతే సరిగా వచ్చేలా మరోసారి ఫోటో తీయాలి ఆ తరువాత రాష్ట్రం జిల్లా మండలం గ్రామం ఎంచుకోవాలి.తరువాత Terms & Conditions అనే చెక్ బాక్స్ ను Tick చేసి Submit బటన్ ను క్లిక్ చేయాలి. .


గమనిక : లబ్ధిదారుని క్రింద చూపిన విధంగా చాతి పైన వరకు PASSPORT SIZE ఫోటో మాత్రమే తీయాలి.


ఒకవేళ మీరు పొంద పరిచిన వివరాలు ఆధార్ తో సరిపడే ఉంటే AUTO APPROVAL పద్ధతి ద్వారా కార్డు వెంటనే జనరేట్ అవుతుంది. ఏ లబ్ధిదారుల వివరాలైతే ఆధార్ వివరాలతో సరిపోలేదు ఈ కేవైసీ అయిన ఆ లబ్ధిదారుల వివరాలు ట్రస్ట్ ఆరోగ్యశ్రీ వారి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది ట్రస్ట్ వారు ఆమోదించిన తర్వాత మాత్రమే వారికి కార్డు జనరేట్ అవుతుంది.


సచివాలయానికి చెందిన ANM, వాలంటీర్ల ద్వారా ఆ సచివాలయ పరిధిలో గుర్తించబడిన అన్ని కుటుంబాల నమోదు అయ్యే విధానం పర్యవేక్షిస్తారు. AUTO APPROVAL అయిన లబ్ధిదారులకు ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ PVC హెల్త్ కార్డు ప్రింటింగ్ కి పంపబడతాయి. ప్రింట్ అయిన ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ PVC హెల్త్ కార్డులను సచివాలయంలోని ANM లకు అందించడం జరుగుతుంది. వాటిని పైన తెలిపిన విధంగా సదరు వాలంటీర్ కు పంపిణీ చేయించే బాధ్యత ANM పై ఉంటుంది.

2.రాష్ట్రం జిల్లా మండలం సచివాలయం క్లస్టర్ (Search By Village / Town ) :

ఈ పద్ధతి ద్వారా ముందుగా

State (రాష్ట్రము) : ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకొని

District (జిల్లా) : మీ జిల్లా

Block (మండలం) : మీ మండలం

Village ( సచివాలయం) : మీ సచివాలయం

Cluster (క్లస్టర్) : మీ వాలంటరీ క్లస్టర్ను


ఎంచుకొని 'View List' నొక్కిన వెంటనే ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల వివరాలు వస్తాయి. అందులో మీరు పేరు ద్వారా లబ్ధిదారుని వెతికే సౌలభ్యం ఉండటం వల్ల మీరు నమోదు చేయబోయే లబ్ధిదారుని ఆ లిస్టు నుండి వెంటనే ఎంచుకోవచ్చు అందులో మీరు నమోదు చేసే లబ్ధిదారును ఎంచుకొని పైన తెలిపిన Mobile OTP లేదా Face Authentication ప్రక్రియ ద్వారా ఈ కేవైసీ చేసే నమోదు చేయవలసి ఉంటుంది.


పంపిణీ చేయు విధానం :

'Card Delivery' నీ సెలెక్ట్ చేసుకుని లబ్ధిదారుని ఆధార్ ద్వారా కుటుంబ సభ్యుల లిస్టు వస్తాయి వచ్చిన కుటుంబ సభ్యుల వివరాలలో AUTHENTICATED అని ఉన్న లబ్ధిదారుల కార్డులు మాత్రమే పంపిణీ చేయటానికి వీలవుతుంది. కార్డులు నేరుగా లబ్ధిదారుని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇవ్వవచ్చు అందుకుగాను SELF, FAMILY అని రెండు OPTION లు ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో లబ్ధిదారుడైతే SELF అని లేదా కుటుంబ సభ్యులైతే FAMILY అని ఎంచుకొని సబ్మిట్ క్లిక్ చేసి కార్డు తీసుకోదలిచిన వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా కార్డు డెలివరీ చేయవలసి ఉంటుంది. 

DOWNLOAD USER MANUAL👇👇👇

Click Here 


ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు డౌన్లోడ్ ప్రాసెస్ :
  1. వాలంటీర్ల పరిధిలో ఆయుష్మాన్ భారత్ PMJAY సర్వే చేస్తున్నప్పడు డిజిటల్ హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసి లబ్ధిదారులకు ఇవ్వటనికి ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ సెక్షన్ కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసాక ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
  2. అక్కడ Already have a ABHA number ? Login అనే ఆప్షన్ చూపిస్తుంది అక్కడ Login పై క్లిక్ చేయాలి.
  3. Login Using అని Mobile, ABHA Number అని రెండు ఆప్షన్ లు చూపిస్తాయి. ABHA Number అంటే ఆయుష్మాన్ భారత్ నెంబర్. తెలిసి ఉంటే దానిని Tick చెయ్యండి లేక పోతే రిజిస్ట్రేషన్ టైం lo ఇచ్చిన మొబైల్ నెంబర్ గుర్తు ఉంటే Mobile పై క్లిక్ చెయ్యండి    NOTE: ABHA Number తెలుసుకోటానికి Forgot Your ABHA number? ఆప్షన్ లో Aadhaar Number లేదా మొబైల్ నెంబర్ తో తెలుసుకోవచ్చు. లేదా కింద ఆయుష్మాన్ భారత్ (PMJAY) e-KYC ఎవరికి చెయ్యాలి ? సెక్షన్ లో లింక్ ఇవ్వటం జరిగింది. ఆ లింక్ లో లబ్ధిదారుల ABHA నెంబర్ లు ఉంటాయి.
  4. Mobile Number ద్వారా అయితే Enter Your Mobile Number దగ్గర 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, I'm not a robot బాక్స్ పై టిక్ చేయాలి. ✅️ ఇలా వచ్చాక Continue పై క్లిక్ చేయాలి.
  5. 6 అంకెల OTP వస్తుంది. Enter OTP వద్ద ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ పై లింక్ అయిన పేర్లు తో ఆయుష్మాన్ భారత్ కార్డుల వివరాలు వస్తాయి.
  6. ABHA number - XXXXXXXXXXXX అని ఉన్న నెంబర్ పై క్లిక్ చేయాలి. వెంటనే Your ABHA number Card అని డిజిటల్ కార్డు చూపిస్తుంది. Download ABHA number Card పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  7. My Account సెక్షన్ లో కార్డులో వివరాలు మార్చుకునే అవకాశం అనగా ఫోటో, పేరు, మొబైల్, e-Mail, రాష్ట్రము, జిల్లా ఉన్నాయి.
  8. ABHA Number ద్వారా అయితే ABHA number సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ABHA number దగ్గర మీ ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి తరువాత Year Of Birth దగ్గర మీ మీరు పుట్టిన సంవత్సరం ఎంటర్ చేసి Iam Not robot అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైనల్ గా Continue అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
  9. "OTP on Mobile Number linked with Aadhaar,OTP on Mobile Number linked with your ABHA number" అనే ఆప్షన్లు ఉంటాయి వాటిలో OTP on Mobile Number linked with Aadhaar అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి continue ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక పేజీ ఓపెన్ అవుతుంది.
  10. మీ ఆధార్ నెంబర్ కి రిజిస్టర్ ఐన మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి CONTINUE అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఆయుష్ మాన్ భారత్ హెల్త్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.

ఆయుష్మాన్ భరత్ అధికారిక వెబ్ సైట్ 👇🏽