Incharge Of Vacant Digital Assistant Post
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం (GGMP) అనే ప్రోగ్రామ్ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఆ ప్రోగ్రాంలో ప్రభుత్వంకు అందిన విన్నపాలలో ముఖ్యంగా సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి ఇన్చార్జ్ విషయం ఒకటి.
కింద చూపిన డాక్యుమెంట్లో రిఫరెన్స్ ఒకటి మరియు రెండు ప్రకారం గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంటుందో అక్కడ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారిని ఇన్చార్జిగా వేయటం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ఉద్యోగుల అసోసియేషన్ వారి రిప్రజెంటేషన్ తేదీ 16-8-2022 ప్రకారం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగి యొక్క పాత్ర సచివాలయ పరిమితి వరకు ఉంటుందని మరియు వారు సచివాలయంలో ఆఫీస్ ఇన్చార్జిగా ఉంటారని. అదే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉద్యోగులు ఫీల్డ్ వరకు చేయవలసి ఉన్నందున డిజిటల్ అసిస్టెంట్ యొక్క ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించినచో ఫీల్డ్ వరకు కుదర నందు వలన వారికి ఇన్చార్జి బాధ్యతలు నుంచి తప్పించవలసిందిగా తెలియజేశారు.
పై విన్నపము మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు రాష్ట్రంలో ఉన్న అందరూ కలెక్టర్లకు పై విషయాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగినది. సంబంధిత ఎంపీడీవో వారు ఉత్తర్వులోని విషయాలను అమలు చేయవలసిందిగా ఉత్తర్వులలో తెలియజేశారు.
డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఎవరిని ఇన్చార్జ్ చేయాలో ఉత్తర్వులలో పేర్కొనలేదు.
Download Circular 👇🏽👇🏽