Re - Issuance Of Integrated Certificate Updates Re - Issuance Of Integrated Certificate Updates

Re - Issuance Of Integrated Certificate Updates

Re - Issuance Of Integrated Certificate Updates

Re - Issuance Of Integrated Certificate Updates

  •  గ్రామ వార్డు సచివాలయ శాఖ వారు Re-Issuance Of Integrated Certificate సర్వీసును గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ / వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో ప్రారంభించడం జరిగింది.


  • ఈ సర్వీసు క్యాటగిరి - A సర్వీస్ కింద వస్తుంది. అనగా అప్లికేషన్ పెట్టుకున్న 15 నిమిషాల లోపు లబ్ధిదారులు సచివాలయంలో సర్వీస్ను పొందవచ్చును.

  • గతంలో APSEVA (సచివాలయం లో మెయిన్ వెబ్ సైట్ లో పొందిన) లేదా మీ సేవా (సచివాలయం లో లేదా మీ సేవా సెంటర్ లో ) లో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసి ఉండి మరియు అప్లికేషన్ చేయు సమయంలో ఆధార్ కార్డు లింక్ చేసినట్టయితే వారు ఈ సర్వీస్ పొందుటకు అర్హులవుతారు.


  • ఈ సర్టిఫికేటు పాత తేదీతో కాకుండా ఏ రోజు అప్లికేషన్ చేస్తారో ఆ తేదీతో అప్పుడు ఉన్నటువంటి తహసిల్దారు MRO వారి డిజిటల్ సంతకంతో వస్తుంది.


  • ఈ సర్టిఫికేటు జీవిత కాలము చెల్లుబాటు కలిగి ఉంటుంది.


  • ఈ సర్టిఫికెట్ అన్ని పథకాలకు మరియు అడ్మిషన్లకు చెల్లుబాటు అవుతుంది.


  • ఈ సర్వీసు యొక్క SLA సమయము 15 నిమిషములు.


  • సర్వీస్ ఛార్జ్ రూ.40/-


Procedure For Giving Service :


  • Step 1 : మొదటగా VSWS వెబ్సైటు ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి . వెబ్ సైట్ లింక్


  • Step 2 : Services సెక్షన్ లో Re-Issuance of Certificate అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


  • Step 3 : Common Application Form లో లబ్ధిదారుని ఆధార నెంబర్ ఎంటర్ చేసి వివరాలను వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది.


  • Step 4 : Service Application సెక్షన్ లో Relation With Applicant దగ్గర గత అప్లికేషన్ లో ఉన్న వ్యక్తి తో ప్రస్తుత లబ్ధిదారుని రిలేషన్ ఎంచుకోవాలి. Service Type Income Certificate / Integrated Certificate లో ఎదో ఒకటి ఎంచుకోవాలి. Application Number దగ్గర పాత అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. Get Details ను క్లిక్ చేయాలి.


  • Step 5 : ID Proof దగ్గర అప్లికేషన్ చేయు వారిది లేదా వారి పేరెంట్స్ ది ఎదో ఒక ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. I Agree పై క్లిక్ చేసి Show Payment పై చేయాలి.


  • Step 6 : Online (Bill Desk ద్వారా) లేదా Cash లో ఒకటి ఎంచుకొని Confirm Payment పై క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.Print Receipt పై క్లిక్ చేసి రసీదు మరియు Print Certificate పై క్లిక్ చేసి సర్టిఫికెట్ ను ప్రింట్ తీసి లబ్ధిదారునికి అందజేయాలి. 



User Manual   :

Post a Comment

1 Comments
  1. But its showing only last 4 yers integrated certificate..if any certificate above 4 years its showing expired ..please check that ..in actually caste doesn't have validity ..income.has 4 years validity ..some bug i guess

    ReplyDelete