YSR Kalyanamasthu New Application Online Process YSR Kalyanamasthu New Application Online Process

YSR Kalyanamasthu New Application Online Process

YSR Kalyanamasthu & Shaadi Thofa New Application Online Process

YSR Kalyanamasthu & Shaadi Thofa New Application Online Process

New Change In Application Verification Process In WEA/WWDS NBM login, Dt.17.03.2023 :

  • కళ్యాణమస్తు పథకానికి సంబందించి DA/WEDS login నందు new application apply చేసిన తరువాత ఇప్పటి నుంచి, పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు ఇద్దరూ ఏ సచివాలయాలకి సంబందించిన వారో, ఆ సచివాలయాల యొక్క ఇద్దరూ WEAs/WWDS logins కి verification కొరకు application forward అవుతుంది.
  • DA/WEDS login లో apply చేసిన తరువాత పెళ్ళికూతురు ఏ సచివాలయం కి సంబందించిన వారో ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి, మరియు పెళ్ళికొడుకు ఏ సచివాలయం కి సంబందించిన వారో ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి verification కొరకు forward అవుతుంది.
  • గతంలో DA/WEDS login నందు apply చేసిన తరువాత, పెళ్లికూతురు ఏ సచివాలయం కి సంబందించిన వారు అయితే ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి application forward అయ్యేది. అయితే ఇప్పటి నుంచి DA/WEDS login లో apply చేసిన తరువాత పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరికి సంబందించిన WEAs/WWDS వారి యొక్క login నందు వెరిఫికేషన్ చెయ్యవలసి వుంటుంది.
  • పెళ్లి కూతురు మరియు పెళ్ళికొడుకు ఇద్దరు సచివాలయాలకి సంబందించిన WEAs/WWDS verification తరువాత, పెళ్లికూతురు సచివాలయం ఏ mandal నకు సంబందించినదో, next verification కొరకు ఆ mandal యొక్క MPDO/MC గారి login కి forward అవుతుంది.


Bride & Groom Location Based :

Case 1 : Bride & Bridegroom Different Secretariats :: పెళ్లికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరు కూడా వేరు వేరు సచివాలయాలకి సంబందించిన వారు అయిన సందర్బంలో మాత్రమే ఇద్దరూ WEAs/WWDS కూడా వారి లాగిన్ నందు వెరిఫికేషన్ చెయ్యవలసి ఉంటుంది.

Case 2 : Bride & Bridegroom Same Secretariat :: పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరూ కూడా ఒకే సచివాలయం కి సంబందించిన వారు అయితే ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి మాత్రమే application forward అవుతుంది. ఆ సచివాలయం యొక్క WEA/WWDS verification complete చేస్తే సరిపోతుంది.

Case 3 : Application Rejected at Collector level :: కళ్యాణమస్తూ పథకానికి సంబందించి సరియైన documents upload చెయ్యకపోవటం వలన Collector గారి login నందు reject చేయబడితే, అటువంటి వారు సరియైన documents తో DA/WEDS login నందు మరల కొత్తగా apply చేసుకోవచ్చు.

దరఖాస్తుకు ముందు గుర్తుంచుకోవలసిన విషయములు :

  • పెళ్లికూతురు మరియు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఈ పథకానికి సంబంధించి అర్హతా ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • పెళ్లికూతురు 18 సంవత్సరాలు, పెళ్లి కొడుకు 21 సంవత్సరాలు పెళ్లి రోజు నాటికి పూర్తి అయి ఉండాలి.
  • ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా పెళ్లికొడుకు పెళ్ళికూతురు యొక్క వయసును సిస్టం ఆటోమేటిక్ గా తీసుకుంటుంది.
  • పెళ్లి అయిన రోజు నుంచి 30 రోజుల లోపు ఈ పథకాలకు దరఖాస్తుకు అప్లికేషన్ చేసుకొని ఉండాలి.
  • తేదీ అక్టోబర్ 1 2022 తర్వాత జరిగిన పెళ్లిళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  • ఇద్దరూ పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. SSC బోర్డు లో 10వ తరగతి పూర్తి చేసి ఉంటే వారి 10వ తరగతి వివరాలు ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అలాకాకుండా వేరొక బోర్డు లో పదవ తరగతి పూర్తి చేసినట్టు అయితే సర్టిఫికెట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
  • కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఆధారతో టాకింగ్ జరిగి ఉండాలి అనగా సచివాలయంలోని ఏపీ సేవా పోర్టల్ లో పొంది ఉండాలి.
  • ఆధార్ కార్డు కు లింక్ అయిన వివాహ ధ్రువీకరణ పత్రము మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
  • ఇద్దరూ వికలాంగులు అయితే ఇద్దరికి సంబంధించిన సదరము సర్టిఫికేటు లో శాశ్వత వికలాంగ తత్వం కలిగి ఉండాలి.
  • కార్మిక సంఘానికి సంబంధించిన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి మెంబర్షిప్ ఐడి ను లేబర్ డిపార్ట్మెంట్ వారి డేటాతో సరిపోల్చుకొని ధ్రువీకరించడం జరుగుతుంది.
  • పెళ్లికూతురు మరియు పెళ్లి కొడుకు తప్పనిసరిగా ఆంధ్ర ప్రదేశ్ కి చెంది ఉండాలి & సిక్స్ స్టెప్ కి అర్హులై ఉండాలి
Download Application Form 👇🏽👇🏽


దరఖాస్తు చేయు విధానము :

  • ముందుగా కింద ఇవ్వబడిన లింకు ఓపెన్ చేస్తే NBM పోర్టల్ ఓపెన్ అవుతుంది.

Click Here

  • లాగిన్ అయ్యాక Home page ఓపెన్ అవుతుంది. అందులో "NBM Scheme Module" ఓపెన్ చేయాలి. అందులో "YSR Kalyanamasthu / YSR Shaadi Thofa" ను క్లిక్ చేయాలి."New Application Form" పై క్లిక్ చేయాలి.

  • Bride & Groom Basic Details సెక్షన్ ఓపెన్ అవుతుంది. అందులో పెళ్లికూతురు (Bride) కు సంబంధించిన ఆధారు నెంబర్ను ఎంటర్ చేసి బయోమెట్రిక్ ధ్రువీకరణ చేసిన తర్వాత కొన్ని వివరాలు వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఎంటర్ అవుతాయి. * మార్క్ కలిగిన మిగతా వివరాలు అన్నీ కూడా మాన్యువల్ గా ఎంటర్ చేయాలి.అదేవిధంగా పెళ్లి కొడుకు (Groom) కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి. తరువాత Continue పై క్లిక్ చేయాలి.
  • Bride And Groom New Application Form ఓపెన్ అవుతుంది. Whether the applicant is Differently Abled Or Not ను సెలెక్ట్ చేసుకోవాలి. పెళ్లికూతురు వికలాంగురాలు కాకపోతే No అని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ వికలాంగురాలు అయితే YES అని సెలెక్ట్ చేసి సదరం సర్టిఫికెట్ నెంబర్ను ఎంటర్ చేసి SEARCH పై క్లిక్ చేయాలి. సదరం సర్టిఫికెట్ నెంబరు కరెక్ట్ గా ఉండి మరియు ఆధార్ కార్డుకు లింకు అయి ఉన్నట్టయితే సదరం వివరాలు వస్తాయి అప్పుడు సదరం సర్టిఫికెట్ స్కాన్ కాపీని అప్లోడ్ చేయాలి.
  • Brides Caste Certificate Number వద్ద పెళ్లి కూతురు యొక్క కుల ధ్రువీకరణ పత్రం యొక్క నెంబర్ను ఎంటర్ చేసి SEARCH పై క్లిక్ చేయాలి. కుల ధ్రువీకరణ పత్రానికి మరియు ఆధార్ కార్డు నెంబర్ కు టాకింగ్ అయినట్టు అయితే వివరాలు ఆటోమేటిగ్గా చూపిస్తాయి లేకపోతే దరఖాస్తు చేయటానికి వీలు అవ్వదు.
  • Brides Income Certificate Number వద్ద పెళ్లి కూతురు యొక్క ఆదాయ ధ్రువీకరణ పత్రం యొక్క నెంబర్ను ఎంటర్ చేసి SEARCH పై క్లిక్ చేయాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రానికి మరియు ఆధార్ కార్డు నెంబర్ కు టాకింగ్ అయినట్టు అయితే వివరాలు ఆటోమేటిగ్గా చూపిస్తాయి లేకపోతే దరఖాస్తు చేయటానికి వీలు అవ్వదు.వివరాలు చూపించినట్టయితే ఆదాయ ధ్రువీకరణ పత్రం స్కాన్ కాపీని అప్లోడ్ చేయాలి.
  • Education Certificate Type వద్ద పెళ్లికూతురు 10వ తరగతి SSC బోర్డులో చదివినట్లయితే SSC అని వేరే బోర్డులో చదివినట్లయితే OTHER అని సెలెక్ట్ చేసుకోవాలి. SSC బోర్డు అయితే 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి SEARCH పై క్లిక్ చేయాలి. OTHER బోర్డు అయితే పదవ తరగతి సర్టిఫికెట్ యొక్క స్కాన్ కాపీని అప్లోడ్ చేయాలి.
  • పెళ్లి కుమారుడు సంబంధించి పై వివరాలు అనగా Differently Abled Or Not,Caste Certificate Number,Income Certificate Number,Education Certificate వివరాలు పెళ్లి కూతురుకు ఎంటర్ చేసిన విధంగా ఎంటర్ చేయాలి.
  • Marriage Category ప్రకారము పెళ్లికూతురు మరియు పెళ్లి కొడుకుల యొక్క కులం,వికలాంగత్వం, కార్మిక గుర్తింపు ప్రకారం ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాలి
  1. Same Caste
  2. Inter Caste
  3. Differently Abled
  4. BOCWWB Member
Marriage Category (పెళ్లి రకము) నిర్ధారించి విధానము
  1. పెళ్లికూతురు SC పెళ్లి కొడుకు SC అయితే పెళ్లి రకము Same Caste
  2. పెళ్లికూతురు SC పెళ్లి కొడుకు SC మినహా వేరే కులము అయితే పెళ్లి రకము Inter Caste
  3. పెళ్లికూతురు ST పెళ్లి కొడుకు ST అయితే పెళ్లి రకము Same Caste
  4. పెళ్లికూతురు ST పెళ్లి కొడుకు ST మినహా వేరే కులము అయితే పెళ్లి రకము Inter Caste
  5. పెళ్లికూతురు BC పెళ్లి కొడుకు BC అయితే పెళ్లి రకము Same Caste
  6. పెళ్లికూతురు BC పెళ్లి కొడుకు BC మినహా వేరే కులము అయితే పెళ్లి రకము Inter Caste
  7. పెళ్లికూతురు OC Minority - OC Muslim పెళ్లి కొడుకు OC Minority - OC Muslim అయితే పెళ్లి రకము Same Caste
  8. పెళ్లికూతురు OC Minority - OC Muslim పెళ్లి కొడుకు OC Minority - OC Muslim మినహా వేరే కులము అయితే పెళ్లి రకము Inter Caste
  9. పెళ్లికూతురు పెళ్లి కొడుకు ఏ కులానికి చెందిన వారైనా ఇద్దరిలో ఒకరు వికలాంగులు అయితే పెళ్లి రకము Differently Abled.
  10. పెళ్లికూతురు లేదా తల్లిదండ్రులులో ఒకరు లేదా అందరూ కార్మిక సంఘంలో గుర్తింపు మెంబరు అయి ఉండి ఏ కులము అయినా, పెళ్ళికొడుకు ఏ కులానికి చెందిన వారైనా పెళ్లి రకము BOCWWB
NOTE : వికలాంగురాలు కానీ మరియు కార్మిక శాఖలో గుర్తింపు మెంబర్ కానీ OC మహిళ అయితే పెళ్ళికొడుకు వికలాంగుడు తప్ప ఏదైనా కూడా వారు దరఖాస్తు చేయడానికి అర్హులు కారు.

  • Select Marriage Type లో మొదటి పెళ్లి అయితే 1st Martaige అని వితంతువు పెళ్లి అయితే 2nd Marriage అని సెలెక్ట్ చేయాలి. 1st Martaige అయితే వివాహ ధ్రువీకరణ పత్రం నెంబరు ఎంటర్ చేసి SEARCH పై క్లిక్ చేయాలి అన్ని వివరాలు ఆటోమేటిక్ గా వస్తాయి తరువాత వివాహ దృవీకరణ పత్రం స్కాన్ కాపీని అప్లోడ్ చేయాలి.2nd Marriage అయితే Husband Death Certificate, Widow Pension Card, Affidavit లో వారి వద్ద ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం ఒకటి లేదా అన్ని సర్టిఫికెట్లను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వాటిని తరువాత స్కాన్ కాపీని అప్లోడ్ చేయాలి. తరువాత రెండవ సారి జరిగిన వివాహ ధ్రువీకరణ పత్రం నెంబరు ఎంటర్ చేసి స్కాన్ కాపీని కూడా అప్లోడ్ చేయాలి. వివాహ ధ్రువీకరణ పత్రము తప్పనిసరిగా ఆధార్ నెంబర్తో టాగ్ అయి ఉండాలి అనగా వివాహ ధ్రువీకరణ పత్రము తప్పనిసరిగా గ్రామ / వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకొని ఉండాలి.

 గ్రామ వార్డు సచివాలయాల్లో వివాహ ధ్రువీకరణ పత్రము దరఖాస్తు చేసుకునే విధానము.


  • తరువాత అప్లికేషన్ సంబంధిత  WEA/WWDS వారి లాగిన్ కు ఫార్వర్డ్ అవ్వటం జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్ తో కూడిన రసీదు డౌన్లోడ్ చేసి లబ్ధిదారునకు ప్రింట్ ఇవ్వవలెను. 

  •  తరువాత  WEA/WWDS వారు NBM పోర్టల్ లో లాగిన్ అయ్యి HOME PAGE లో NBM SCHMES MODULE లో YSR Kalyanamasthu / YSR Shaadi Thofa పై క్లిక్ చేయాలి. అందులో రెండు ఆప్షన్ లు చూపిస్తాయి.
  1.  Verification
  2.  Download Field Verification Form

  • Download Field Verification Form పై క్లిక్ చేసిన వెంటనే 2 పేజీ ల వెరిఫికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఫెల్డ్ వెరిఫికేషన్ చేసి వివరాలు నమోదు చేసి Signature Of Applicant వద్ద దరఖాస్తుదారని, Signature Of  WEA/WWDS వద్ద WEA/WWDS  వారి సంతకం చేయాలి.
  • తరువాత WEA/WWDS  వారు లాగిన్ లో Verification పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ వివరాలు మరియు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను రివ్యూ చేయవలెను. ఫీల్డ్ వెరిఫికేషన్ వివరాలతో YES అయితే Recommendation అని NO అయితే రిమార్కును ఎంటర్ చేయవలెను. తరువాత ఫీల్డ్ వెరిఫికేషన్ డాక్యుమెంటు మరియు ఫోటోను అప్లోడ్ చేయవలెను. అప్లికేషన్ సంబంధిత MPDO/MC వారి లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది. 
Download Application Process User Manual 👇
Click Here

తరుచుగా అడుగుతున్న ప్రశ్నలు - సమాదనాలు :
Qn 1 : చాలామంది బెనిఫిషరీస్ లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లు మేము కూడా అప్లై చేయవచ్చా సార్ అని అడుగుతున్నారు.
Ans : 01.10.2022 తరవాత జరిగిన వివాహం మాత్రమమే పరిగణింపబడుతుంది. పెళ్లి జరిగిన 60 రోజుల లోపు ధరఖాస్తు చేసుకోవాలి.

Qn 2 : పెళ్లికూతురు OR పెళ్లి కొడుకు పక్క రాష్ట్రం వాళ్లు ఉంటే ఈ స్కీమ్ కి అర్హులా?
Ans : పెళ్లికూతురు మరియు పెళ్లి కొడుకు తప్పనిసరిగా ఆంధ్ర ప్రదేశ్ కి చెంది ఉండాలి.

Qn 3 : పెళ్లికూతురు వాళ్ళు చాలా పేదవాళ్లు, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ పెన్షనర్ ఉంటే అటువంటి వాళ్ళు Eligible అవుతారా సార్ ?
Ans : పెళ్లికూతురు మరియు పెళ్లి కొడుకు ఇద్దరూ సిక్స్ స్టెప్ కి అర్హులై ఉండాలి.

Qn 4 : 10 వ తరగతి దూరవిద్య విధానంలో పూర్తి చేసిన వారు అర్హుల.
Ans : అర్హులు, 10 వ తరగతి పూర్తయినది అని నిర్ధారించే సర్టిఫికేట్లు "other" అనే ఆప్షన్ లో అప్లోడు చేయండి.

Qn 5 : BOCWWB CARD కలిగిన వారు లేదా వారి కుటుంబ సభ్యులు CASTE - OC అయితే వారు దరఖాస్తు చేసుకోవచ్చా
Ans : పెళ్ళికూతురుకు కానీ తన తల్లి తండ్రులుకు కాని BOCWWB CARD కలిగి ఉండాలి.

Qn 6 : అమ్మాయికి మొదటి వివాహం అబ్బాయికి సెకండ్ marriage...ఇలాంటి cases లో దరఖాస్తు చేయవచ్చునా
Ans : అవును ధరఖాస్తు చేసుకోవచ్చును

Qn 7 : Minortiess OC Muslim వాళ్ళు అర్హులు అవుతారా
Ans : అవును

Qn 8 : OC caste అమ్మాయి, ST caste అబ్బాయి marriage చేసుకున్నారు. అమ్మాయి కి కల్యాణమస్తు apply చేయవచ్చా?
Ans : అర్హులు కాదు. పెళ్ళికూతురు SC

Qn 9 : వరుడు మాత్రమే వికలాంగుడై ఉండి వధువు వికలాంగురాలు కాకుండా OC అయితే అర్హుల ?
Ans : SC/ST/BC/Minorities/differently abled/ BOCWWB members అయితేనే అర్హులు.