MLC Elections 2023 Information
- ఈ ఎన్నికల్లో పార్టీల గుర్తులు, ఎలక్ట్రానిక్ మెషీన్లు వుండవు. బ్యాలెట్ పేపర్లు మాత్రమే వుంటాయి. అభ్యర్థి పేరు, ఫోటో ఉంటుంది.
- ఎన్నికల అధికార్లు ఇచ్చిన పెన్ మాత్రమే వాడాలి.
- ప్రాధాన్యతా క్రమంలో అందరి కంటే ఎక్కువగా ఇష్టపాత్రుడైన వారి పేరు ఎదురుగా గల గడిలో 1 అని అంకెను వెయ్యాలి.
- ఆ తర్వాత ఇష్టమైన వారికి ప్రాధాన్యతను బట్టి 2, 3, 4 ఓట్లు వెయ్యవచ్చు. లేదా వెయ్యకుండా వదిలెయ్యనూ వచ్చు.
- ఒక్కరికే ఓటు వెయ్యనక్కరలేదు. అవసరమనుకొంటే ఎందరికయినా ఓటు వెయ్యవచ్చు. ఒకే అంకెను (నెంబరు) ఇద్దరికి వెయ్యరాదు. వేసినచో ఓటు చెల్లదు.
- 1 వెయ్యకుండా 2, 3, 4 వేస్తే ఓటు చెల్లదు.
- 1, 2, 3, 4 ఈ అంకెలే వెయ్యాలి. I, II, III ఇలాంటివి వెయ్యరాదు. వేస్తే ఓటు చెల్లదు. అక్షరాలు రాసిన చెల్లదు.
- అంకెలు కాకుండా ✅️❎️ లాంటి గుర్తులు వేస్తే ఓటు చెల్లదు.
- ఓటింగ్కు వెళ్ళేటప్పుడు ఎన్నికల సంఘం సూచించిన ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పక తీసుకువెళ్ళండి.
- వీలున్నంత వరకు ఎక్కువ మందికి ఓటు వేయండి. దీనివల్ల మీరు మొదట ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి నష్టం రాదు.
- అన్ని బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను ఒక డ్రమ్ములో కుమ్మరించి వాటిని కలిపేస్తారు.
- ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసే అవకాశం ఏమాత్రం లేదు.
- అభ్యర్థి గెలుపుకు చెల్లిన ఓట్లలో సగం + 1 రావాలి.
- తొలుత (1) మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. వీటిలోనే చెల్లిన ఓట్లలో సగం +1 వస్తే ఆ అభ్యర్ధిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2, 3, 4 ఓట్లు లెక్కించాల్సిన అవసరం రాదు.
- మొదటి (1) ఓట్లు ఎవరికీ సగం +1 రాకపోతే అందరి కంటే తక్కువ మొదటి ఒట్లు వచ్చిన వారిని (ఎలిమినేట్) తొలగిస్తారు. అతని రెండవ (2) ఓట్లను మిగిలినవారికి ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. ఇప్పుడు ఏ అభ్యర్థికైనా సగం + 1 వస్తే అతన్ని గెలిచినట్లు ప్రకటిస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ముగుస్తుంది.
- అప్పటికీ సగం + 1 రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన వారిని తప్పించి అతని రెండవ (2) ఓట్లను మిగిలినవారికి ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. అప్పటికీ ఎవరికీ సగం + 1 రాకపోతే ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఇద్దరి మూడవ (3) ఓట్లు కూడా లెక్కించి పైవారికి కలుపుతారు.
- ఇలా సగం + 1 వచ్చే వరకు క్రింది నుండి తక్కువ ఓట్లు వచ్చిన వారి 2, 3, 4, ఓట్లు ఇలా ఒక క్రమంలో కలుపుకుంటూ పోతారు.
- చివరిరా సగం +1 రాకపోతే ఎలిమినేట్ కాని చివరి అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు.
- మనం మొదటి ఓటు వేసిన అభ్యర్థి పోటీ నుంచి ఎలిమినేట్ అయితే మాత్రమే అతని 2, 3, 4 ఓట్లు లెక్కిస్తారు. కాబట్టి అతనికి వచ్చే నష్టం ఏమీ వుండదు.
Know Your Polling Station :
MLC Elections 2023 లో మీ పోలింగ్ స్టేషన్ వివరాలు, మీ పేరుతో నే కింది వెబ్ పేజీలో తెలుసుకోవచ్చు. కింద ఇవ్వబడిన జిల్లా నియోజకవర్గాల పట్టభద్రుల MLC ఓటర్ లాస్ట్ లు విడుదల అవ్వటం జరిగింది.
- Srikakulam,
- Vizianagaram,
- Visakhapatnam;
- Prakasam,
- Nellore,
- Chittoor,
- Kadapa,
- Anantapur,
- Kurnool .
పోలింగ్ స్టేషన్ ల వారీగా MLC వోటర్ జాబితా డౌన్లోడ్ లింక్.
Know your MLC Application Status By Name:
కింద ఇవ్వబడిన లింక్ [ Click Here ] పై క్లిక్ చేయండి. మీరు ఆన్లైన్ లో నమోదు చేసిన form నంబర్ (Form 18/Form 19) ను సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓటు కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ను పూర్తి చేసిన తరువాత Record submitted successfully. Your application number is... F18-123456789 అని వచ్చి ఉంటుంది. ఆ నంబర్ ను Enter చేసి Search పై క్లిక్ చేయండి.మీరు Enter చేసిన అప్లికేషన్ నంబర్ వారి వివరాలు కనిపిస్తుంది. ప్రక్కనే View Status అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ఏ Status లో ఉందో తెలుసుకోవచ్చు.లేదా కొత్తగా దరఖాస్తు దారిని పేరు ను NAME బాక్స్ లో ఎంటర్ చేసి VIEW STATUS పై క్లిక్ చేసినట్లయితే వారి యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది. అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా ప్రాసెస్ అయి కంప్లీట్ అయిందా అనేది ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తుదారుని పేరు ఎంటర్ చేసేటప్పుడు ముందుగా వారి యొక్క పేరు ఎంటర్ చేసి తరువాత వారి యొక్క ఇంటి పేరు ఎంటర్ చేయవలెను.
- గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమయింది.కావున అర్హులైన వారందరూ వెంటనే నమోదు చేసుకోవాలని మనవి చేయుచున్నాను .
- 2022లో ఆంధ్రప్రదేశ్ లో Online లో ఓటరుగా నమోదు చేసుకోవాలని CEO ఆంధ్ర ప్రదేశ్ MLCని ఆహ్వానించారు.
- అర్హత గల దరఖాస్తుదారులు ఫారమ్ 18 కోసం ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా ERO లేదా నియమించబడిన అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు.
- CEO AP ఓటర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ సేవను ప్రారంభించడం ద్వారా మాన్యువల్ ఓటరు నమోదు విధానాన్ని క్రమబద్దీకరించాలని మరియు ఎన్నికల సౌలభ్యాన్ని పెంచాలని తెలియజేసారు.
- AP CEO పోర్టల్లో, పౌరులు అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు AP MLC ఓటర్ నమోదు కోసం తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్ వేశారు.MLC ఎన్నికలు అసెంబ్లీ మరియు పార్లమెంట్ల కంటే కొంచెం భిన్నమైన ప్రక్రియ మరియు విధానాన్ని అనుసరిస్తాయి.
- ఇంజనీరింగు డిగ్రీ గాని, డిగ్రీకి సమానమైన డిప్లొమా గాని, ఓపెన్ డిగ్రీ, ఎం.బి.బి.ఎస్. అగ్రికల్చర్, ఆయుర్వేదిక్ ముసుగు డిగ్రీని తే.30.10.2019 నాటికి పొందినవారు, గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేయించు కొనవలెను.
- ఆన్ లైన్ ceoandhra.nic.in ద్వారా కూడా తేదీ 23.02.2023 లోగా నమోదు చేసుకోనవచ్చును..
- ఇంతకు ముందు ఉన్న ఓట్లు అన్నియు రద్దు కాబడినది.
- గాన డిగ్రీ పట్టభద్రులందరూ సంబంధిత నియోజక వర్గమునకు సంభందించి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకొనవలేనని
AP MLC ఓటరు నమోదుకు అర్హత :
- దరఖాస్తుదారు తప్పనిసరిగా సంబంధిత గ్రాడ్యుయేట్ ఎలక్టోరల్ జిల్లాలోనే నివసించాలి.
- October 30, 2019 కి కనీసం మూడేళ్ల ముందు డిగ్రీని పొంది ఉండాలి.
- తప్పనిసరిగా ఇటీవలి Passport Size ఫోటో అప్లికేషన్తో పాటు జత చేయాలి.
- డిగ్రీ / డిప్లొమా సర్టిఫికెట్లు / మార్కులు లేదా ఇతర విద్య సంబంధిత ధృవపత్రాల జాబితా తప్పనిసరిగా దరఖాస్తుకు జోడించబడాలి మరియు నియమించబడిన అధికారి / గెజిటెడ్ అధికారి / నోటరీ పబ్లిక్ ఆఫీసర్ చేత ధృవీకరించబడాలి.
- పాత గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.
- పాత ఓటరు జాబితా చెల్లదు.
MLC ఓటరు నమోదు కోసం అవసరమైన పత్రాలు :
- One passport-size photo
- Mobile number
- Aadhaar card Xerox
- General Voter ID Card Xerox
- Convocation or Provisional Certificate of Degree passed
ఆంధ్రప్రదేశ్ MLC ఓటరు నమోదు కోసం ఆన్లైన్ ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ క్రింద తెలిపిన విదంగా Online ప్రక్రియలో మన పట్టభద్రుల ఓటు కేవలం 3,4 నిమిషాలలో నమోదు చేసుకోవచ్చు.
- కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే నమోదు పేజి(FORM -18) కి కనెక్ట్ అవుతుంది.
- Graduates Constituency అనే చోట (Drop down list నుంచి ) అక్కడ నియోజకవర్గం వివరాలు సెలెక్ట్ చేయాలి, అలాగే జిల్లా ని కూడా సెలెక్ట్ చేయాలి
- పక్కనే ఉన్న Choose File అనే చోట క్లిక్ చేసి మన యొక్క ఫోటోను మన ఫోన్ Gallery లేదా ఫైల్స్ అనే ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకొని Upload అనే బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మన ఫోటో అటాచ్ అయ్యి కనబడుతుంది.ఫోటో అటాచ్ చేసే ప్రక్రియలో మన ఫోటో size 100KB లేదా అంతకంటే తక్కువ ఉండాలి లేదంటే upload చేయలేము.ఫోటో సైజ్ ని క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చ
- Applicant details Section మన పూర్తి పేరు, చిరునామా వివరాలు నమోదు(enter) చేయాలి.
- AC & EPIC ఇక్కడ ఓటరు నంబర్ ని ఎంటర్ చేయాలి
- Aadhaar Details ఇక్కడ కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది
- Garduate సెక్షన్ దగ్గర డిగ్రీ అయితే Graduate సెలెక్ట్ చేయాలి డిప్లొమా అయితే Diploma సెలెక్ట్ చేసుకోవాలి.I am a Graduate of the దగ్గర మన విద్యార్హత (మనం పాసయిన డిగ్రీ ) ఎంటర్ చేయాలి.
- తరువాత సెక్షన్ మనం చదివిన యూనివర్సిటీ పేరు ఎంటర్ చేయాలి తరువాత in the year of అనే చోట మనం పాస్ అయిన సంవత్సరం ఎంటర్ చేయాలి.తరువాత choose File అనే చోట మన సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని upload మీద క్లిక్ చేయాలి.
- Record submitted successfully your application No అని వస్తుంది దయచేసి ఆ నంబర్ ని నోట్ చేస్కోండి.
పైన చెప్పిన విదంగా మీ అమూల్యమైన ఓటు నమోదు చేసుకుంటారని.మీ అందరికి సవినయంగా మనవి ,మీరు ,మీ కుటుంబ సభ్యులు ,స్నేహితులు ఓటర్లుగా నమోదు కావలెనని కోరుచున్నాను.
Downloads :
1. MLC Elections 2023 Schedule : Click Here