New Vote Card Application Process in Telugu | కొత్త ఓటర్ కార్డు కు దరఖాస్తు చేయు విధానము New Vote Card Application Process in Telugu | కొత్త ఓటర్ కార్డు కు దరఖాస్తు చేయు విధానము

New Vote Card Application Process in Telugu | కొత్త ఓటర్ కార్డు కు దరఖాస్తు చేయు విధానము


  • కొత్తగా ఓటర్ కార్డు కు దరఖాస్తు కు అప్లికేషన్ లు ఓపెన్ అయ్యాయి. ముందు గా NVSP సైట్ లొ అయ్యేవి కానీ అన్ని ఆప్షన్ లు ECI సైట్ కు మార్చాబడ్డాయి. 
  • కొత్త ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోటానికి ఇప్పుడు అందరికి అవకాశం ఉంది మరియు దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు.దరఖాస్తు ను మొబైల్ లొ కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు.
  • ఒక్క సారి ఓటర్ నమోదు చేసిన తరువాత సంబందించిన BLO వారు ఆమోదం చేస్తే ఎలక్షన్ కమీషన్ నుంచి కార్డు ప్రింట్ అయి వస్తుంది. e-ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
  • మీ మొబైల్ లొ దరఖాస్తు చేసుకోటాయిని ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు. కొత్తగా అప్లికేషన్ చేసుకోటానికి కేవలం ఆధార్ కార్డు, ఫోటో ఉంటే సరిపోతుంది.


New Vote Card Application Process :

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేయండి.

Click Here

Step 2 : మీకు ముందుగా NVSP సైట్ లొ లేదా ECI సైట్ లొ అకౌంట్ ఉంటే Login పై లేదంటే Sign-Up పై క్లిక్ చేయండి. అకౌంట్ ఉందొ లేదో తెలియక పోయినా Sign-Up పై క్లిక్ చేయండి.

Step 3 : మీ Mobile Number బాక్స్ లొ మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.ఏ నెంబర్ అయినా పర్వాలేదు లేదు. Captcha కోడ్ ఎంటర్ చేసి  Continue   పై క్లిక్ చేయండి.

Step 4 : First Name,Last Name లొ మీ పేరు ను, Password, Confirme Password లొ కొత్త పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. Password లొ 1,2,3.. A, B, C.. a, b, c.. @, #, ₹... ఇలా అన్నిటీలో ఒకటి ఉండేలా ఎంటర్ చేయండి. Note చేసుకోండి. Request OTP పై క్లిక్ చేయండి.

Step 5 : మీరు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. Verify & Submit పై క్లిక్ చేయండి.

Step 6 : "You Are Successfully Signed Up Kindly Login With Your New Credentials" అని చూపిస్తుంది. అంటే మీకు ECI సైట్ లొ మీకు అకౌంట్ క్రియేట్ అయ్యింది అని అర్థము. Login పై క్లిక్ చేయండి.

Step 7 : Registratered Mobile No వద్ద మీ మొబైల్ నెంబర్, Password వద్ద ముందు పెట్టిన పాస్వర్డ్ ఎంటర్ Captcha ఎంటర్ చేసి Request OTP పై క్లిక్ చేయండి.

Step 8 : మీరు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. Verify & Login పై క్లిక్ చేయండి.

Step 9 : కొత్తగా ఓటర్ కార్డుకు దరఖాస్తు చేయుటకు Home పేజీ లొ Fill Form 6 పై క్లిక్ చేయండి. 

మొత్తం 12 సెక్షన్ లలో డేటా ఫిల్ చేయాలి. అవి.

  1. Select State, District & AC
  2. Personal Details
  3. Relatives Details
  4. Contact Details
  5. Aadhaar Details
  6. Gender
  7. Date of Birth details
  8. Present Address Details
  9. Disability Details
  10. Family member Details
  11. Declaration
  12. Captcha

పై డేటా అంత ఫిల్ చేసాక ఫైనల్ సబ్మిట్ చేయాలి.

Step 10 : అందులో మొదటిది State, District & Assembly Constituency / Parliamentary Constituency సెక్షన్ లొ

  • రాష్ట్రములో
  • జిల్లా
  • నియోజకవర్గం

వివరాలు ఇవ్వాలి. ↓Next పై క్లిక్ చేయాలి.

Step 11 : Personal Details లొ

  • మొదటి పేరు
  • ఇంటి పేరు
  • పాసుపోర్టు సైజు ఫోటో

అప్లోడ్ చేయాలి. ఫోటో JPG / JPEG ఫార్మాట్ లొ 2MB కు మించి ఉండరాదు. తరువాత  ↓Next పై క్లిక్ చేయాలి

Step 12 : Relatives Details లొ

తండ్రి / తల్లి / భర్త / భార్య / సంరక్షకుల / హిజ్రాల కు సంబందించి

  • పేరు
  • ఇంటి పేరు

వివరాలు ఎంటర్ చేసి,  ↓Next పై క్లిక్ చేయాలి

Step 13 : Contact Details లొ

సొంత లేదా పైన తెలిపిన వారి మొబైల్ నెంబర్ ఎంటర్ Send OTP ద్వారా OTO Send చేసి OTP ను ఎంటర్ చేసి Verify చేయాలి. మొబైల్ నెంబర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నారో అదే మొబైల్ నెంబర్ భవిష్యత్తులో కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇతర ఇతర విషయాలకు ఉపయోగపడుతుంది.

E-mail ID వివరాలు ఉంటే ఎంటర్ చేయాలి. లేదంటే అవసరం లేదు. తరువాత ↓Next పై క్లిక్ చేయాలి

Step 14 : Aadhaar Details లొ

  • ఆధార్ నెంబర్

ను ఎంటర్ చేసి ↓Next పై క్లిక్ చేయాలి.

Step 15 : Gender లొ

లింగము ను

  • Male
  • Female
  • Third Gender

లొ ఒకటి సెలెక్ట్ చేసి  ↓Next పై క్లిక్ చేయాలి.

Step 16 : Date of Birth details లొ

  • Date Of Birth (DD/MM/YYYY)

ను ఎంటర్ చేసి సర్టిఫికెట్ ను 2MB లోపు JPG/JPEG/PDF ఫార్మాట్ లొ అప్లోడ్ చేయాలి.

కింద తెలిపిన DOB డాక్యుమెంట్ లలో ఏ ఒక్కటి అప్లోడ్ చేస్తే సరిపోతుం

  • DateBirth Certificate issued by Competent Local Body/Municipal Authority/Registrar of Births & Deaths
  • Aadhaar Card
  • Pan Card
  • Driving License
  • Certificates of Class X or Class XII issued by CBSE/ICSE/ State Education Boards, if it contains Date of Birth
  • Indian Passport

డాక్యుమెంట్ పై అభ్యర్థి తప్పనిసరిగా Self Attested చేయాలి అనగా జెరాక్స్ కాపీ పై సంతకం / నిషాని పెట్టాలి.తరువాత  ↓Next పై క్లిక్ చేయాలి.

Step 17 : Present Address Details లొ

ప్రస్తుతం అభ్యర్థి ఉన్నటువంటి

  • డోరు నెంబరు
  • వీధి పేరు
  • గ్రామం పేరు
  • పోస్టు ఆఫీసు
  • పిన్ కోడ్
  • మండలము లేదా బ్లాక్
  • జిల్లా
  • రాష్ట్రము

వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్ ను 2MB లోపు JPG/JPEG/PDF ఫార్మాట్ లొ అప్లోడ్ చేయాలి.

కింద తెలిపిన Address డాక్యుమెంట్ లలో ఏ ఒక్కటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది.

  • Water/Electricity/Gas connection Bill for that address(atleast 1 year)
  • Aadhaar Card
  • Current passbook of Nationalized/Scheduled Bank/Post Office
  • Indian Passport
  • Revenue Department's Land Owning records including Kisan Bahi
  • Registered Rent Lease Deed(In case of tenant)
  • Registered Sale Deed(In case of own house)

డాక్యుమెంట్ పై అభ్యర్థి తప్పనిసరిగా Self Attested చేయాలి అనగా జెరాక్స్ కాపీ పై సంతకం / నిషాని పెట్టాలి.తరువాత ↓Next పై క్లిక్ చేయాలి.

Step 18 : Disability Details లొ

దివ్యంగులు (వికలాంగులు) అవ్వక పోతే ఈ సెక్షన్ వదిలేయొచ్చు. అయితే మాత్రమే కింద తెలిపిన వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి

  • Locomotive (ఎముక సంబందించిన)
  • Visual (కళ్ళకు సంబందించిన)
  • Deaf & Dumb (చెవుడు & మూగ)
  • Other (ఇతరులు)

Certificate ఉంటే Yes పెట్టి అప్లోడ్ చేయాలి. లేకపోతే NO అని టిక్ చేయాలి. తరువాత  ↓Next పై క్లిక్ చేయాలి.

Step 19 : Family member Details లొ

కుటుంబంలో ఎవరికైనా ఓటరు కార్డు ఉంటే మాత్రమే ఈ సెక్షన్ ను టచ్ చేయాలి లేకపోతే అవసరం లేదు. కుటుంబంలో తల్లి తండ్రి సంరక్షకులకు కార్డు ఉంటే ఎంటర్ వారి పేరు, సంబంధం, ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి  ↓Next పై క్లిక్ చేయాలి.

Step 20 : Declaration లొ

  • గ్రామం / టౌన్ 
  • రాష్ట్రము / UT
  • జిల్లా

ను ఎంటర్ చేసి, ప్రస్తుత నివాసంలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు సంవత్సరము మరియు నెలను ఎంటర్ చేయాలి. తరువాత ప్రస్తుతము దరఖాస్తు చేస్తున్న ప్లేసును ఎంటర్ చేసి దరఖాస్తు తేదీని ఎంటర్ చేయాలి తరువాత  ↓Next పై క్లిక్ చేయాలి.

Step 21 : Captcha లొ

చూపిస్తున్న Captcha కోడ్ ఎంటర్ చేయాలి.

Step 22 : తరువాత Save పై క్లిక్ చేయాలి.

Step 23 : Preview and Submit పై క్లిక్ చేయాలి.అన్ని వివరాలు సరి చూసుకోవాలి. తప్పుగా ఉంటే Keep Editing ఆప్షన్ ద్వారా సరి చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే Submit పై క్లిక్ చేయాలి.

Step 24 : Are you sure you want to submit this form? అని వస్తుంది. Yes పై క్లిక్ చేయాలి. 

Step 25 : అప్లికేషన్ సబ్మిట్ అవుతూ Acknowledgment Number వస్తుంది. ఆ నెంబర్ నోట్ చేసుకోవాలి. Download Acknowledgment ద్వారా రసీదు డౌన్లోడ్ అవుతుంది.ప్రింట్ తీసుకొని జాగ్రత్త ఉంచుకోవాలి. BLO వారి ఆమోదం అయ్యాక మీకు ఓటు కార్డు నెంబర్ వస్తుంది. మరియు పోస్ట్ ద్వారా కొత్త కార్డు మీరు ఇచ్చిన చిరునామా కు వస్తుంది.లేదా మీ BLO వారి వద్దకు వస్తుంది. 

How to know New Vote Card Application Status ?

దరఖాస్తు స్టేటస్ తెలుసుకునే విధానం :

Step 1 : పై న చెప్పిన వెబ్ సైట్ లొ లాగిన్ అయ్యాక హోమ్ పేజీ లొ Track Application Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 2 : Reference Number లొ Acknowledgment Number ను ఎంటర్ చేసి, రాష్ట్రము సెలెక్ట్ చేసుకోని Submit పై క్లిక్ చేయాలి. 

Step 3 :Current Status ద్వారా ప్రస్తుత స్టేటస్ ను తెలుసుకోవచ్చు. 



మరింత సమాచారం >>
close