Ayushman bharat Cards eKYC Process and Report
తేదీ 17-04-23 నాటి సమాచారం :
ఆయుష్మాన్ భారత్ సర్వేకు సంబంధించి సచివాలయ లొ వాలంటీర్ వారీగా రిపోర్టును అందించవలసిందిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడడం జరిగింది. దానికిగాను జిల్లా ఆరోగ్యశ్రీ టీం వారు ప్రతి మండలానికి మెయిల్ రూపంలో సందేశం పంపించడం జరిగినది. వాలంటీర్లు ఇవ్వవలసిన ముఖ్యమైన డేటా
- ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి మొబైల్ అప్లికేషన్లు మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయి (సంఖ్య)
- అందులో ఎంతమందికి eKYC పూర్తి అయినది
- మరణించిన వారి సంఖ్య
- వలస లో ఉన్న వారి సంఖ్య
- ఆధార్ కార్డు డేటా తప్పుగా చూపిస్తున్న వారి సంఖ్య
మరణించిన మరియు వలసలో ఉన్న వారికి సంబంధించి కావలసిన డేటా
- పేరు
- ఆధార్ కార్డు నెంబరు
- మరణముకు లేదా వలసకు కారణము
- ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్
- మొబైల్ నెంబరు
Note : తేదీ 25-04-23 లోపు కార్డుల ప్రింటింగ్ మొదలు అవుతుంది.
- Dr వైస్సార్ ఆరోగ్య శ్రీ ప్రోగ్రాం లొ భాగం గా 2019 జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకం ను నిర్వహిస్తుంది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) లెక్కల ప్రకారం మొత్తం 55,30,834 కుటుంబాలు అందులో 1.79 కోట్ల AB-PMJAY లబ్ధిదారులు ఉన్నారు.NHA వారి ఆదేశాల మేరకు AB-PMJAY లబ్ధిదారుల అందరికి కూడా హెల్త్ కార్డులను జనరేట్ చేసి అందించవలెను.
- ఈ హెల్త్ కార్డులకు గాను NHA వారు "ఆయుష్మాన్ - ఆరోగ్య శ్రీ కార్డు" అని పేరు పెట్టడం జరిగింది. మరియు వాటి రిజిస్ట్రేషన్, ప్రింటింగ్, డెలివరీ సంబందించి మార్గదర్శకాలు విడుదల చెయ్యటం జరిగింది.
మార్గదర్శకాలు :
- ప్రతి లబ్ధిదారుని రిజిస్ట్రేషన్ అనేది PMJAY అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలి. రిజిస్ట్రేషన్ ను ఆధార్ నెంబరు బేస్ మీద చేయవలెను. ముఖ / ఫింగర్ ప్రింట్ / OTP ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవలెను.
Download PMJAY V 3.1.72 Mobile App 👇🏿
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయటకు గాను గ్రామ వార్డు వాలంటీర్ వారికి మొబైల్ అప్లికేషన్ నందు లాగిన్ ఐడి ఇవ్వటం జరిగినది. వారి క్లస్టర్ పరిధిలో లబ్ధిదారులు అందరికీ కూడా వారు రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఇన్చార్జి క్లస్టర్ ఇచ్చినట్టయితే వారికి రిజిస్ట్రేషన్ చేయవలెను.క్లస్టర్ పరిధిలో అందరికీ రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు ఎవరు అయితే ముందుగా అర్హులై ఉన్నారో వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి.
Eligible List
- రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యి eKYC అయిన లబ్ధిదారులకు ఆయుష్మాన్ - ఆరోగ్య శ్రీ కార్డు జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన కార్డులు అన్నీ కూడా ప్రింటింగ్ కొరకు పంపించడం జరుగుతుంది.
- గ్రామ వార్డు ఉద్యోగులు అయిన ANM / వార్డు హెల్త్ సెక్రటరీ వారికి ప్రింట్ అయిన కార్డులు అందించటం జరిగింది. అవి సంబందించిన వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అందించాలి.
- లబ్ధిదారులు eKYC తీసుకొని సంబందించిన వాలంటీర్లు కార్డులను అందించవలెను.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి వాలంటరీ క్లస్టర్ పరిధిలో వాలంటీర్ వారు మరియు సచివాలయ పరిధిలో ANM / వార్డు హెల్త్ సెక్రటరీ వారు బాధ్యత వహించి పూర్తి చేయవలెను.
- జిల్లా పరిధిలో గ్రామ వార్డు సచివాలయ శాఖ నోడల్ ఆఫీసర్ వారు మరియు ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ వారు పర్యవేక్షించవలెను.
- విజయవంతమైన ఒక్కొక్క రిజిస్ట్రేషన్కు గాను వాలంటీర్ కు ₹5/- ఇవ్వటం జరుగుతుంది. పూర్తి నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
eKYC Report
Process 1
Step 1 : ముందుగా కింద లింక్ ఓపెన్ చెయ్యాలి. Click Here పై క్లిక్ చేయండి. 👇🏿👇🏿
Step 2 : లాగిన్ పేజీ లో ఆయుష్మాన్ భారత్ కు లాగిన్ అయిన వాలంటీర్ మొబైల్ నెంబర్ ను Sign In పేజీ లో Operator ను ఎంచుకొని Enter Your Mobile Number వద్ద ఎంటర్ Get OTP పై క్లిక్ చేసి మొబైల్ కు వచ్చే OTP ఎంటర్ చేయాలి.
Step 3 : ముందుగా PMJAY CONSOLIDATED DATA పై క్లిక్ చేసి BENEFICIARY SEARCH BY VILL/TOWN ను ఎంచుకోవాలి.
Step 4 : Beneficiary List లో Rural సెలెక్ట్ చేసుకోవాలి. అందులో రాష్ట్రము, జిల్లా, Block (మండలం), గ్రామం పేరు వద్ద సచివాలయం పేరు సెలెక్ట్ చేయాలి. వేటనే Copy, CSV, Excel, PDF, Print, Column Visibility (అంటే ఏ కలమ్ అవసరం లేదో అది సెలెక్ట్ చేసుకోవాలి) అందులో Excel పై క్లిక్ చేయాలి.ఓపెన్ చేయాలి.
Step 5 : Status లో
- Authenticated అనగా eKYC పూర్తి అయ్యింది అని అర్థము.
- Approval Pending అనగా వాలంటీర్ వద్ద eKYC పూర్తి అయ్యింది అని అర్థము కానీ ఇంకా జిల్లా స్థాయిలో ఆరోగ్య శ్రీ టీం వారు ఆమోదం తెలపాలి.సచివాలయ స్థాయిలో ఎం చేయనవసరం లేదు.
- Identified (Authenticate/Identify) అని వున్నవి అన్ని కూడా ఇంకా eKYC పూర్తి అవ్వలేదు అని అర్థము. అవన్నీ కూడా వాలంటీర్ వారీగా సెపెరేట్ చేసి, Note చేసుకోని eKYC పూర్తి చేయాలి.
Note :
- టెక్నికల్ సమస్య ఉన్నవారు Toll Free నెంబర్ - 14555 కాంటాక్ట్ అవ్వవలెను. లేదా జిల్లా GSWS టీం వారికి కాంటాక్ట్ అవ్వగలరు.
- ఒక వాలంటీర్ నెంబర్ లాగిన్ తో మొత్తం సచివాలయం రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది గమనించగలరు.
- వలసలో లో ఉన్న వారికి మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ద్వారా, వారి ఫోటో తో సర్వే పూర్తి చెయ్యవచ్చు. బయోమెట్రిక్ అవసరం లేదు.
- eKYC పూర్తి అయిన వారి వివరాలు,Death, Migration తో కూడిన లిస్ట్ లను సిద్ధం చేసుకోవలెను.
Process 2
Step 1 : మొదట ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయాలి.👉 Click Here
Step 2 : Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చేసిన వెంటనే login పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Password మరియు OTP అనే ఆప్షన్ లు ఉంటాయి అందులో Password అనే ఆప్షన్ ను టిక్ చేసి User ID & Password Enter చేయాలి.Sign పై క్లిక్ చేయాలి.
User ID : 28stateuser
Password : 28stateuser@1234
Step 3 : BIS eKYC Request Status Report పేజీ లో “eKYC Andhra Pradesh – with Secretariat" అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెంటనే ఈ రోజు వరకు జిల్లా వారీగా సమాచారం చూపిస్తుంది.
Step 4 : జిల్లా,మండలం, సచివాలయం, తేదీ లు ఎంచుకోవాలి. అప్పుడు వాలంటీర్ పేర్లతో మొత్తం ఎన్ని eKYC కు వచ్చాయి, ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయో చూపిస్తుంది.
Process 3
Step 1 : మొదట లింక్ ఓపెన్ చేయాలి 👉 Click Here
Step 2 : CARD-DRIVE అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Login పై క్లిక్ చెయ్యకూడదు.
Step 3 : eKYC RECEIVED REPORT - STATE WISE ను ఎంచుకొని అవసరం అనుగుణంగా Today / Yesterday / Weekly / Last 30 Days ను ఎంచుకోవాలి. ఇక్కడ Last 30 Days ఎంచుకోవాలి.
Step 4 : State గా Andhra Pradesh ను ఎంచుకోవాలి.
District సెలెక్ట్ చేసుకోవాలి.
Step 5 : అప్పుడు User ID & Password అడుగుతుంది.
User ID : apsha
Password : apsha#4321 ఎంటర్ చేయాలి.
Step 6 : మండలం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మండల పరిధిలో Operator గా నమోదు అయిన వాలంటీర్ల పేర్లు వస్తాయి. eKYC Mode / Authentication Mode లో Requested
Approved, Rejected, Pending, Delivered, OTP Finger, Iris,Face లిస్ట్ లు వస్తాయి. మండలం పేరు సెలెక్ట్ చేసుకున్న తరువాత డౌన్లోడ్ బటన్ ⬇️ పై క్లిక్ చేస్తే Excel డౌన్లోడ్ అవుతుంది.
Some name's are coming to apruval pending..
ReplyDelete8886565140
ReplyDelete9154400138
ReplyDelete9154400138
ReplyDelete9154400138
ReplyDelete9154538048
ReplyDelete6302898027
ReplyDelete