CFMS ID Aadhaar Linking Process CFMS ID Aadhaar Linking Process

CFMS ID Aadhaar Linking Process

CFMS ID Aadhaar Linking Process

CFMS ID Aadhaar Linking Process

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల మరియు ఉద్యోగుల ఐచ్చిక మేరకు CFMS Transactions లు ఎక్కువ భద్రతతో ఉండే విధం గా రెండు దశల ధ్రువీకరణ [ Two Factor Authentication ] ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగం GO.MS No 7 Dt 11/01/2023 ప్రకారం Adopt చేసుకోవటం జరుగుతుంది. ఆ ఉత్తర్వుల ప్రకారం CFMS మరియు HRMS అప్లికేషన్లు అన్నిటిని ఉపయోగించుకోవటానికి రెండు దశల ధ్రువీకరణ అనేది తప్పనిసరి. CFMS మరియు HRMS అప్లికేషన్లు లొ ఇకనుంచి లాగిన్ అవ్వాలి అంటే ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ తప్పనిసరి.CFMS ఐడి కలిగిన ప్రతి ఉద్యోగి లేదా వ్యక్తి వారి CFMS ఐడి ను ఆధార్కు మరియు మొబైల్ నెంబర్ కు లింక్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం అందించే వివిధ సర్వీస్లను సురక్షితంగా పొందవచ్చు.

CFMS ఐడి కు ఆధార్ లింక్ చేయటన్నే ఆధార్ వెరిఫికేషన్ లేదా eKYC లేదా Two Factor Authentication అని ఈ సందర్భంలొ పిలవడం జరుగుతుంది.
ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది సులభంగా ఎవరికి వారే HERB అనే వెబ్ సైట్ లొ కానీ లేదా HERB అనే మొబైల్ అప్లికేషన్ లొ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసిన తరువాత సంబందించిన DDO ఆమోదం తెలిపితే ఆధార్ వెరిఫికేషన్ లేదా eKYC లేదా ఆధార్ - CFMS లింక్ లేదా Two Factor Authentication అయినట్టే.CFMS కలిగిన వ్యక్తులు / ఉద్యోగులు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.


eKYC అనేది మూడు విధాలుగా చేసుకోవచ్చు :

  1. HERB అనే వెబ్ సైట్ లొ Self Login అనగా ఎవరికి వారు వారి లాగిన్ ద్వారా 
  2. HERB అనే మొబైల్ అప్లికేషన్ లొ Self Login అనగా ఎవరికి వారు వారి లాగిన్ ద్వారా
  3. ఉద్యోగుల రిక్వెస్ట్ మేరకు HERB వెబ్ పోర్టల్ లొ DDO వారి లాగిన్ ద్వారా


1) HERB అనే వెబ్ సైట్ లొ Self Login అనగా ఎవరికి వారు వారి లాగిన్ ద్వారా :

Step 1 : ముందుగా HERB వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

User ID వద్ద మీ 8 అంకెల CFMS ఐడి ను ఎంటర్ చేయాలి.

Password వద్ద cfss@123 ఎంటర్ చేయాలి.

ఓపెన్ అవ్వక పోతే Forgot Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ CFMS ఐడి ద్వారా Password మార్చుకోవచ్చు.

NIDHI Portal

Step 2 : ESS సెక్షన్ అనగా Employees Self Service అనే సెక్షన్ లొ ADHAR eKYC CONFIRMATION అనే ఆప్షన్ పై క్లిక్ చేయవలెను.

Step 3 : Employee Basic Details లొ Adhaar Card No వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింది చెక్ బాక్సు లో టిక్ చేసి eKYC పై క్లిక్ చేయవలెను.

Step 4 : select eKYC MODE లో రెండు అప్షన్లు కనిపిస్తాయి. 

  1. Bio-metric
  2. Adhar-OTP

పైదానిలో 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERATE OTP పై క్లిక్ చేయవలెను.

Step 5 : ఆధార్ కు లింకుఅయిన మొబైల నంబరుకు 6 అంకెలగల OTP వస్తుంది.ఈ OTP ని Enter The OTP అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్చేయవలెను. Successfelly Authentication కనిపిస్తుంది.Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను.Are You Want To Confirm? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను.

Step 6 : మరలా ఆధార్ కు లింకుఅయిన మొబైలునంబరును ఎంటరు చేసి Save And Farward To DDO పై క్లిక్ చేయవలెను.

Step 7 : Your status లో eKYC Authentication Successful And Farwarded To DDO Login కనిపిస్తుంది.తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc Confirmation పై క్లిక్ చేస్తే కిందివిధంగా మన Status కనిపిస్తుంది (YOUR REQUEST PENDING AT DDO) తరువాత DDO LOGIN లో APPROVE చేయాలసిఉంటుంది.


2) NIDHI App లొ Self Login అనగా ఎవరికి వారు వారి లాగిన్ ద్వారా :

Step 1 : ముందుగా HERB అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి.

NIDHI Mobile App

Step 2 : User ID వద్ద మీ 8 అంకెల CFMS ఐడి ను ఎంటర్ చేయాలి.

Password వద్ద cfss@123 ఎంటర్ చేయాలి.

ఓపెన్ అవ్వక పోతే Forgot Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ CFMS ఐడి ద్వారా Password మార్చుకోవచ్చు.

Step 3 : Home Page లొ Verify Aadar And Update Mobile Number పై క్లిక్ చేయాలి.

Step 4 : Aadar నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ పై క్లిక్ చేయాలి. Do-eKYC పై క్లిక్ చేయాలి.

Step 5 : ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు 6 డిజిట్ OTP వస్తుంది. అది ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.

Step 6 : Enter Your Aadhaar Linked Mobile Number లొ ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి.Submit పై క్లిక్ చేయాలి. 

 ఆధార్ కు ఏ నెంబర్ లింక్ అయినదో లింకు ద్వారా డైరెక్ట్ గా తెలుసుకోండి 👇🏿👇🏿

Click Here

Step 7 : eKYC completed successfully and forwarded to DDO అని వస్తే పూర్తి అయినట్టు. స్టేటస్ లొ Pending at DDO అని వస్తుంది.


3) ఉద్యోగుల రిక్వెస్ట్ మేరకు HERB వెబ్ పోర్టల్ లొ DDO వారి లాగిన్ ద్వారా :

Step 1 : ముందుగా NIDHI వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.User ID వద్ద మీ 8 అంకెల CFMS ఐడి ను ఎంటర్ చేయాలి.Password వద్ద DDO వారి Password ఎంటర్ చేయాలి.ఓపెన్ అవ్వక పోతే Forgot Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ CFMS ఐడి ద్వారా Password మార్చుకోవచ్చు.

Step 2 : Home Page లొ HR & Patroll లొ "Employee Aadhaar E-KYC Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : DDO Code ను డ్రాప్ డౌన్ లొ సెలెక్ట్ చేసి Submit పై క్లిక్ చేయాలి.

Step 4 : eKYC చేసిన చెయ్యని ఉద్యోగుల లిస్ట్ వస్తుంది. పేరు లేదా CFMS ఐడి ద్వారా కూడా సెలెక్ట్ చెయ్యవచు.

Step 5 : ఉద్యోగి ని సెలెక్ట్ చేసి E-KYC అనే ఆప్షన్ పై క్లిక్ చేసి Declaration Check box పై క్లిక్ చేయాలి. అందులో Biometric / Aadar OTP ద్వారా eKYC పూర్తి చేయాలి.

Step 6 : చివరగా ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Save చేస్తే Successfully Authenticated అని వస్తే పూర్తి అయినట్టు.


DDO ఆమోదం చేసే విధానము 

Step 1 : NIDHI పోర్టల్ లొ లాగిన్ అవ్వాలి.

Step 2 : HR & Payroll లొ Aadhaar eKYC Request Approve - DDO అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : Pending Reqesut లొ Search ద్వారా ఉద్యిగిని సెలెక్ట్ చేసి వివరాలు అన్ని సరి చూసుకొని Approve పై క్లిక్ చేయాలి. EMPLOYEE EKYC VERIFIED AND UPDATED SUCCESSFULLY అని వస్తే పూర్తి అయినట్టు  


Two Factor Authentication GO - Click Here