GSWS Volunteers Removal or Termination Process
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 66వేల గ్రామ వార్డు వాలంటీర్లను నియమిస్తూ గ్రామాల్లో 50 ఇళ్లకు ఒకరు మరియు అర్బన్ లో 70 నుండి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున ప్రభుత్వ పథకాలు మరియు సేవలకు సంబంధించి నవరత్నాలలో భాగంగా వారి సేవలను అందిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.
గ్రామ వార్డు వాలంటీర్ల నియామకానికి సంబంధించి ఇప్పటికే వారి విద్యా అర్హతలు మరియు జాబ్ చార్ట్ అందుబాటులో ఉంది . సెలక్షన్ కమిటీ ఆధారంగా గ్రామ వార్డు వాలంటీర్ల నియామకం అనేది ఉంటుంది. గ్రామాల్లో అయితే సెలక్షన్ కమిటీలో ఎంపీడీవో వారు ఛైర్మెన్ గా మరియు తహసిల్దారు & EO (PRRD) వారు మెంబెర్ గా ఉంటారు. అదే పట్టణాల్లో అయితే MC వారు చైర్మన్ గా మరియు తాసిల్దారు & ప్రాజెక్ట్ ఆఫీసర్ లేదా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఆఫ్ MEPMA వారు మెంబెర్ లు గా ఉంటారు.
గ్రామ వార్డు సచివాలయాలలో పని చేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వం ఆదేశించిన విధులను అతిక్రమించినా లేదా ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడినా, అటువంటి వారిని వెంటనే వాలంటీర్ పోస్ట్ నుంచి తొలగించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ వార్డు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు / రెగ్యులర్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధాన ఉద్యోగులు కారు అని ఉత్తర్వుల్లో ప్రస్తావించడం జరిగినది.
వాలంటీర్లను ఏ ప్రాతిపదికన వలన తొలగిస్తారు?
వాలంటీర్స్ పనితీరు లేదా కింద ఇవ్వబడిన ఏవైనా అతిక్రమణల ఆధారంగా తొలగించడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కింది వాటిలో ఏ ఒక్క దానిలో పేరు ఉన్నా వారిని తొలగించే అవకాశం ఉంటుంది.
- corruption (అవినీతి)
- Irresponsible and not discharging services properly(వృత్తి పట్ల బాధ్యత రహితం )
- Improper civic behaviour. (సరైన ప్రవర్తన లేకపోవడం )
- Moral turpitude (నైతిక విలువలు పాటించకపోవడం
- Committed and irregularity (ఏదైనా అతిక్రమణలకు పాల్పడినా)
Note : పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు.
వాలంటీర్లను ఏ పద్ధతిలో తొలగిస్తారు?
గ్రామ వార్డు వాలంటీర్ పై ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే ముందుగా పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు విచారణ జరిపి రిపోర్టును సంబంధించిన Appointing Authority అయిన MPDO / MC వారికి అందించవలసి ఉంటుంది.
పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు
- ఏ వాలంటీర్ పై ఫిర్యాదు అందినదో ఆ వాలంటీర్ కు తేదీ మరియు సమయంతో కూడిన విచారణకు హాజరు అవ్వవలసిందిగా నోటీసును అందించవలసి ఉంటుంది.
- ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వాలంటీర్ కు తెలియజేస్తూ , ఎవరైనా సాక్షులు ఉన్నట్టయితే వారి యొక్క స్టేట్మెంట్ తీసుకుంటూ వాలంటీర్ యొక్క స్టేట్మెంట్ ని కూడా తీసుకోవాలి.
- విచారణ రిపోర్టు మరియు Recommendation ను MPDO / MC వారికి అందించాలి.
పంచాయతీ సెక్రటరీ నిర్వహించే enquiry రిపోర్ట్ పైన ఈ ప్రక్రియ మొత్తం ఆధారపడి ఉంటుంది. తదుపరి స్టెప్ లో వాలంటీర్స్ ని తొలగించడానికి అవకాశం ఉంటుంది.
వాలంటీర్లు ఎలా అప్పీల్ చేసుకోవాలి ?
MPDO /MC నుండి తొలగింపు ఉత్తర్వులకు వచ్చిన వారం లోపు వాలంటీర్స్ తిరిగి Appeal చేసుకోవచ్చు.వీటిని పరిష్కరించడానికి డివిజన్ లెవెల్ లో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో RDO వారు చైర్మన్ గా, DLDO వారు Member Convenor గా , DPO & RD of Municipal Administration వారు ఇతర సభ్యులు గా ఉంటారు.