Jaganannaku chebudam JKC Program Jaganannaku chebudam JKC Program

Jaganannaku chebudam JKC Program

Jaganannaku chebudam  JKC Program

Jaganannaku chebudam JKC Program  

జనన్న చెబుదాం ప్రోగ్రాం ఉద్దేశం :

ప్రజల నుంచి వచ్చే అర్జీలను అత్యంత నాణ్యంగ పరిష్కరించాటమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం.


స్పందన కు జగనన్నకు చెబుదాం కు తేడా :

ప్రస్తుతం ప్రజల అర్జీలను స్పందన కార్యక్రమాన్ని ద్వారా నిర్వహించటం జరుగుతుంది. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా స్పందన కంటే మెరుగైన మరియు నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇక నుంచి స్పందన Helpline ను జగన్ననకు చెపుదాం Helpline గా, స్పందన వెబ్సైటు ను జగనన్నకు చెపుదాం వెబ్సైటు గా, GSWS లొ స్పందన డెస్క్ ను GSWS లొ జగనన్నకు చెపుదాం డెస్క్ గా, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లొ స్పందన కార్యక్రమం ఇక నుంచి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లొ జగన్ననకి చెపుదాం కార్యక్రమం గా పేర్లు మారనున్నాయి.


జగనన్నకు చెపుదాం అధికారిక వెబ్సైటు ఏంటి ?

What Is Official Website Of Jagananna Ki Chepudam ?

https://www.jkc.ap.gov.in

జగనన్నకు చెబుదాం లో ఉండే యూనిట్లు :

సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి. జిల్లా డివిజనల్ మరియు మండల స్థాయి మానిటరింగ్ యూనిట్లను ఆయా జిల్లాల గౌరవ జిల్లా కలెక్టర్ వారు మానిటరింగ్ చేస్తారు. 


జగనన్నకు చెబుతాం కార్యక్రమ ప్రారంభ తేదీ :  

ఆంధ్రప్రదేశ్‌లో మే 9, 2023 న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం అవుతుంది దీనిని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తారు. 


 జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ :

 1902


జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంబంధించి సీఎం గారి మాటల్లో : 

  • గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలన్నారు.ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యపడుతుందని చెప్పారు.
  • ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుందన్నారు. హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయని, వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు.
  • ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది ముఖ్యమైన విషయం అన్నారు. వ్యక్తిగత ఫిర్యాదులు, కుటుంబం స్థాయిలో వచ్చే ఫిర్యాదులను నమోదు చేసిన తర్వాత వాటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలన్నారు.
  • ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ చేస్తారని, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన లక్ష్యమన్నారు.
  • ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారని, వారి ఫిర్యాదులను నేరుగా తెలియచేయ వచ్చన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుందన్నారు.
  • ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్‌ అప్‌డేట్స్ అందుతాయన్నారు. హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుందని,
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారన్నారు. హెల్ప్‌లైన్‌ను ప్రజలు అంతా వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారని తెలిపారు.
  • జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయని, సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయన్నారు.ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేకాధికారులుగా ఉంటారని తెలిపారు.
  • క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారన్నారు. ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారని, కలెక్టర్లతో కలిపి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారన్నారు.
  • సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారని, ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారన్నారు.
  • ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే, దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారన్నారు. ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారని, పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారన్నారు.
  • చీఫ్‌ సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారని, ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారి పేరు పెట్టారంటే మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టేనని సిఎం తెలిపారు.
  • అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తాడని, అధికారులు అంత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే ,  కార్యక్రమం సమర్థవంతంగా సాగుతున్నట్టే లెక్క అని చెప్పారు.
  • ప్రజలకు నాణ్యంగా సేవలను అదించాలన్నదే దీని ఉద్దేశమన్నారు. జగనన్నకు చెబుదాం అమలుకు ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుందని, అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చన్నారు. వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుందన్నారు.

Jagananna Ki Chepudam Process Flow :

1.ముందుగా సిటిజన్ స్పందన కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తారు.

2.స్పందన కాల్ సెంటర్ ఏజెంట్ వారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు Track Grievance Status / Check Eligibility / Track Application Status ద్వారా సమాధానం ఇవ్వటం జరుగును. లేదా "Create a Grievence" ఆప్షన్ ద్వారా అర్జీ నమోదు చేస్తారు.

3.స్పందన ఏజెంట్ వారు అర్జీ నమోదు చేసిన వెంటనే అది సిటిజన్ సంబంధించిన చిరునామా కలిగిన సచివాలయంలో WEA / WWDS వారి లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది.

4.అర్జీలు రెండు రకములుగా ఉంటాయి

1) Service Request - ఆరు దశల ధ్రువీకరణ ఆధారంగా అనగా 

  1. భూమి, 
  2. అర్బన్ ప్రాపర్టీ, 
  3. 4 చక్రాల వాహనము,
  4. కరెంటు వినియోగము, 
  5. ఉద్యోగస్థితి, 
  6. కుల మరియు ఆదాయము 

సంబంధించి అర్జీ నమోదు.

2) Endorsement - ఇందులో 

  1. వయసు,
  2. లింగము, 
  3. పేమెంట్,
  4. One Family One Benefit,
  5. ఇతర ప్రభుత్వ పథకాలను పొందటం,
  6. వెరిఫికేషన్కు పెండింగ్ ఉండటం, 
  7. ఫీల్డ్ వెరిఫికేషన్ లో అనర్హులుగా గుర్తించటం, 
  8. ఈ కేవైసీ పూర్తి అయినప్పటికీ అర్హుల / అనర్హుల జాబితాలో లేకపోవటం,

వయసుకు సంబందించి :

  • ఆధార్ కార్డులో వయసు సరిగా ఉన్నప్పటికీ గ్రామ వార్డు వాలంటీర్ హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో తప్పుగా ఉండటం : ఇటువంటి సందర్భంలో సిటిజన్ వాలంటీర్ వద్ద eKYC చేసుకోవాలి.
  • ఆధార్ & హౌస్ హోల్డ్ మాపింగ్ లొ తప్పుగా ఉండటం :  ఇటువంటి సందర్భంలో సంబంధిత సిటిజన్ దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రంలో వారి వయసుని అప్డేట్ చేసుకోవాలి. తరువాత వాలంటీర్ వద్ద eKYC చేసుకోవాలి.
  • వయసు సరిగా ఆధార్ కార్డులో ఉన్నప్పటికీ ఆధార్ అప్డేట్ హిస్టరీ ప్రకారం పథకం అందనప్పుడు : ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఉన్న డేటా ప్రకారం వయసు మార్చుకోవటం వలన పథకం కు అనర్హులు అని తెలియజేయవలసి ఉంటుంది.

5. సచివాలయం లొ WEA / WWDS వారు వారికి వచ్చిన అర్జీలను 5 రోజుల లోపు క్లియర్ చెయ్యాలి. ముఖ్యం గా చేయవలసిన పనులు

1) Service Request Based Grievances : WEA / WWDS వారు సిటిజన్ కు కాంటాక్ట్ అయ్యి సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని వారి DA / WEDPS వారికి అందించాలి. వారు Service Request లొ అర్జీ నమోదు చేస్తారు.

2) Endorsement Based Grievances : WEA / WWDS వారు సిటిజన్ కు కాంటాక్ట్ అయ్యి అర్జీ ను క్లియర్ చెయ్యాలి. లేదా అర్జీలు క్లియర్ చేయుటకు కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొని సంబంధిత సిటిజన్ మరియు WEA / WWDS వారి సంతకం తో Endorsement ఆన్లైన్ చేయాలి.

6. స్వయానా గౌరవ జిల్లా కలెక్టర్ వారికి జగనన్నకి చెబుతాం (JKC) డాష్ బోర్డు ద్వారా 5 రోజుల లోపు సంబందించి WEA / WWDS వారు అర్జీ క్లియర్ చేసారో లేదో చూసే ఆప్షన్ ఉంటుంది. 

Downloads : 

  1. Jagananna Ki Chepudam User Manual  
  2. Jagananna Ki Chepudam Notes  
  3. Jagananna Ki Chepudam FAQs 
  4. Jagananna Ki Chepudam Talking Points  
  5. Jagananna Ki Chepudam Circular  


View More