Household Mapping Split Process Household Mapping Split Process

Household Mapping Split Process

Household Mapping Split Process


AP Govt Household Mapping Split Process

  • ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉన్న / ఒంటరిగా ఉంటూ  60 సవత్సరాల పైబడిన వారు ఉన్న / విడాకులు తీసుకున్న వారు ఉన్న వారిని రెండు కుటుంబాలుగా విభజనకు అవకాశం ఉంది
  • కొత్తగా హౌస్ మాపింగ్ గడువును 6 నెలల నుంచి కేవలం 21 రోజులకు కుదించటం జరిగింది
  • జనవరి నుండి జులై వరకు సచివాలయం లో చేసిన హౌస్ హోల్డ్ splitting లు అన్ని సక్సెస్ అయ్యి 2 హౌస్ హోల్డ్ లుగా అప్డేట్ అవ్వటం జరిగింది 
  • ఏ వాలంటీర్ కు మాపింగ్ అయ్యారో తెలుసుకునే లింక్  - Click Here 
  • NBM Portal Login Page Link - Click Here 
  • Latest GSWS Volunteer App - Click Here 

                                                                    అన్ని ప్రభుత్వ పథకాలకి ప్రామాణికంగా తీసుకునే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడమైతే జరిగింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ విభజనకు సంబంధించి ఆప్షన్ను కొత్తగా ఇవ్వటం జరిగినది. ఈ ఆప్షన్ ను Household Split అని పిలవటం జరుగుతుంది.


ప్రస్తుతానికి ఈ ఆప్షన్ 
ద్వారా 

  1. ఎవరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే రెండు కుటుంబాలు ( Wife-Husband ) ఉండి, విడివిడిగా జీవిస్తున్నారో వారు 
  2. ఒకే ఇంట్లో విడాకులు తీసుకున్న వారు ఉన్న
  3. 60 సంవత్సరాలు పైబడి ఉన్న వారు ఉన్న 
రెండు హౌస్ మాపింగ్ గా విభజనకు ఆప్షన్ ఉంది. ఈ సర్వీసు గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంటుంది. 

Marriage Split 

  • రైస్ కార్డు విభజనకు మరియు ఈ సర్వీస్ కు ఎటువంటి సంబంధం లేదు. రైస్ కార్డులో విడివిడిగా ఉండి హౌస్ హోల్ మ్యాపింగ్ లో ఒకే కుటుంబంలో ఉన్నట్టయితే వారు తప్పనిసరిగా ఈ ఆప్షన్ ద్వారా రెండు హౌస్ హోల్డ్ గా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా ప్రభుత్వం అందించే పథకాలు గాని, సర్వేలు గానీ హౌస్ హోల్డ్ మెంబర్ల ప్రాప్తికి అందించడం జరుగుతుంది.
  • హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వీస్ కు రైస్ కార్డ్ (రేషన్ కార్డ్) సర్వీస్ కు సంబంధం లేదు. రైస్ కార్డ్ లేకపోయినా లేదా కేన్సిల్ అయ్యిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ అయ్యాక మరలా తిరిగి అప్లయ్ చేసుకోవాలి.కావున ముందు హౌజ్ హోల్డ్ స్ప్లిట్ గురించి తెలుసుకుందాం.

Service Type : 

ఈ సర్వీసు క్యాటగిరి B కింద కు వస్తుంది.

Application Fee : 

సర్వీసుకు సంబంధించి ఎటువంటి ఫీజు ఉండదు.

SLA Period :

సర్వీసు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల లోపు అందించడం జరుగుతుంది.

Household mapping splitting application form - Click Here

Required Documents : 

సర్వీసు పొందుటకు కింద తెలిపిన వాటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది.

  1. వివాహ ధ్రువీకరణ పత్రము
  2. రైస్ కార్డు
  3. ఆరోగ్యశ్రీ కార్డు
  4. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
  5. పాస్పోర్టు
  6. ఆధార్ కార్డు

రెండు కుటుంబాలు విడిగా ఉంటున్నందుకు ప్రూఫ్ :

  1. ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా నిర్ధారించడం జరుగుతుంది.


Work Flow :

PS Gr-VI(DA) /WEDPS --> WEA / WWDS --> PS / WAS --> MPDO / MC

Application & PS Field Verification Form :  - Click Here


Household Mapping Split Application Process

PS Gr-VI(DA) / WEDPS 

AP Seva పోర్టల్ లొ లాగిన్ అవ్వాలి. Home Page లొ GSWS Services లొ Splitting Of Household Members Application Form పై క్లిక్ చేయాలి.


Basic Details లొ దరఖాస్తు దారుని Aadhaar Number ఎంటర్ చేసాక Pre-Fill పై క్లిక్ చేస్తే Automatic గ 

  • Citizen Name, 
  • Gender, 
  • Caste,
  •  DOB, 
  • Door No, 
  • District, 
  • Mandal/Municipality, 
  • Village / Ward Sachivalayam, 
  • PIN Code వివరాలు వస్తాయి . 

మిగతా వివరాలు అనగా 

  • Father / Husband Name, 
  • Religion, 
  • Qualification, 
  • Marital Status, 
  • Mobile Number, 
  • Post Office, 
  • Postal Village ను ఎంటర్ చేసి, 

Continue పై క్లిక్ చేయాలి.


Application Form లొ దరఖాస్తు దారుని ఆధార్ ఏ హౌస్ హోల్డ్ మాపింగ్ లొ ఉందొ ఆ కుటుంబ సభ్యుల అందరి వివరాలు మరియు వారి eKYC స్టేటస్ తో చూపిస్తుంది. కుటుంబ విభజనకు తప్పనిసరిగా అందరి eKYC స్టేటస్ Yes (Y) అని ఉండాలి. No (N) అని ఉంటే అప్లికేషన్ చేయటానికి అవ్వదు. N ఉన్నవారు వాలంటీర్ వద్ద వారి GSWS Volunteer అనే మొబైల్ అప్లికేషన్ లొ eKYC చేపించుకోవాలి.

Select Head of Family లొ ఆ కుటుంబ లొ ఎక్కువ వయసు ఉన్న మహిళకు(Female) సెలెక్ట్ చేసుకోవాలి. అలా లేనించే ఎక్కువ వయసు ఉన్న పురుషుడును(Male) సెలెక్ట్ చేసుకోవాలి.ఎవరిని అయితే సెలెక్ట్ చేస్తారో వారు కింద లిస్ట్ లొ Self గ చూపించటం జరుగుతుంది.


Service Type లొ Marriage Split సెలెక్ట్ చేసుకోవాలి.

Marital Status లొ అందరి వివాహ స్థితి ను ఎంచుకోవాలి.

Relationship లొ Head తో సంబంధం ఎంచుకోవాలి. ఇక్కడ వారు Male / Female ప్రకారం Relationship చూపించటం జరుగును. 

Split Type లొ ఎవరు అయితే పాత హౌస్ మాపింగ్ లొ ఉండాలి అనుకుంటున్నారో వారిని Existing Household లొ కొత్తగా హౌస్ హోల్డ్ మాపింగ్ లొ ఉండాలి అనుకున్నవారిని Marriage అని సెలెక్ట్ చేయాలి.ఇక్కడ ఒక సారి ఒక కుటుంబం మాత్రమే విభజన కు అవకాశం ఉంటుంది. తరువాత Preview Split పై క్లిక్ చేయాలి.

Household 1 Member Details మరియు Household 2 Member Details చూపితుంది. రెండిట్లో కుటుంబ పెద్దను ఎంచుకోవాలి. ఇక్కడ ఎక్కువ వయసు కలిగిన Female వారు లేనిచో Male Gender ను HOF గా ఎంచుకోవాలి. Relationships HOF అనుగుణంగా ఎంచుకోవాలి.

Household 1 & 2 లొ ఎవరిది అయిన ఒకరి ఆధార్ నెంబర్ తో బయోమెట్రిక్ / OTP (ఆధార్ ను లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వస్తుంది ) తో eKYC చెయ్యాలి .

Documents Upload సెక్షన్ లొ Household 1 & 2 కు సంబందించి ముందుగా చెప్పుకున్న వాటిలో ఎదో ఒకటి ఎంచుకొని , అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డులను కూడా అప్లోడ్ చెయ్యవచ్చు. అందులో C/O లొ వివరాలు Split కు అనుగుణంగా ఉంటే సరిపోతుంది. Show Payment పై క్లిక్ చేయాలి. రసీదు ను సిటిజెన్ కు అందజేయాలి. అందులో ఉండే అప్లికేషన్ తో సిటిజెన్ వారి అప్లికేషన్ ను ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.


WEA/WWDS 

AP SEVA పోర్టల్ లొ లాగిన్ అవ్వాలి. HOME PAGE లొ HH నెంబర్ తో అప్లికేషన్ కనిపిస్తుంది ఆ నెంబర్ పై క్లిక్ చేయాలి. దరఖాస్తు దారుని 

  • Basic Details,
  •  Present Address, 
  • Applicant Details, 
  • List Of Documents 

ఒక సారి సరి చుకోవాలి.


వెరిఫికేషన్ కు సంబంధించి నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు కనబడతాయి వాటికి అనుగుణంగా అన్నీ సరిగా ఉంటే YES అని సరిగా లేకపోతే NO అని సెలక్ట్ చేయాలి.

అడిగే ప్రశ్నలు 

  1. Whether Marriage Certificate/ Rice Card/Arogyasri Card/Family Member Certificate/Passport/Aadhaar for the resultant Household 1 is valid?
  2. Whether Marriage Certificate/ Rice Card/Arogyasri Card/Family Member Certificate/ Passport/Aadhaar for the resultant Household 2 is valid?
  3. Whether at least 2 alive married couples are present in the existing Household?
  4. Whether the two married couples live separately

Remarks లొ అప్లికేషన్ తరువాత స్థాయికి పంపించాలి అనుకుంటే Recommended అని రిజెక్ట్ చేయాలి అంటే Not Recommended అని సెలెక్ట్ చేయాలి.Check Box టిక్ చేసి Verification Document Upload చేసి Forward పై క్లిక్ చేయాలి.


PS/WAS 

పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రెటరీ వారి లాగిన్ కొత్తగా క్రియేట్ చేయవలసి ఉంటుంది. ముందుగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఆమోదం కొరకు ఉపయోగించే లాగిన్ దీనికి పనికిరాదు. మ్యారేజ్ సర్టిఫికెట్ లాగిన్ అనేది పంచాయతీ DDO లాగిన్ పై ఉంటుంది. కానీ ఇప్పుడు క్రియేట్ చేయబోయే లాగిన్ అనేది ఆ సచివాలయ పంచాయితీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ గా పనిచేస్తుంది ఉదాహరణకు WEA/WWDS వారి లాగిన్ లా ఉంటుంది.


Web Site : AP Seva Portal

User name :

SECCODE-PS/WS@apgsws.onmicrosoft.com

Password :

Re$t@Ap@SECCODE 


SECCODE - SAACHIVALAYAM CODE


లాగిన్ అయిన వెంటనే హోం పేజీలో Request List లొ WEA/WWDS వారు ఆమోదం చేసిన లిస్ట్ చూపిస్తుంది. అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. అవసరం మేరకు ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత WEA/WWDS వారి రిమార్కులను వెరిఫికేషన్ చేసిన తరువాత WEA/WWDS వారి లాగిన్ లొ ప్రశ్నలు చూపిస్తాయి. అన్ని సరిగా ఉంటే Yes అని సరిగా లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. WEA/WWDS వారి రిమార్క్ సరిగా ఉంటే Whether The WEA/WWDS Remarks Are Valid లొ Yes అని సరిగా లేనిచో No అని సెలెక్ట్ చేయాలి. Verification Document Upload చేసి అన్ని సరిగా ఉంటే Recommended అని లేనిచో Not Recommended అని సెలెక్ట్ చేసి చెక్ బాక్స్ టిక్ చేసి ఫార్వర్డ్ చేయాలి.


MPDO / MC 

MPDO / MC వారి AP Seva పోర్టల్ లాగిన్ లొ అప్లికేషన్ పై క్లిక్ చేసాక WEA/WWDS & PS/WAS వారి రిమార్కులను పరిగణించి ఆమోదం తెలుపవలసి ఉంటుంది. Digital Signature ద్వారా తుది ఆమోదం చేయవలసి ఉంటుంది.


Household Mapping Split Application Status : 

Step 1 : కింద లింక్ పై క్లిక్ చేయాలి. 

Click Here

Step 2 : Service Request Status Check అనే ఆప్షన్ లొ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి 🔍 పై క్లిక్ చేయాలి.

Step 3 : Application Status చూపిస్తుంది. Green Color లొ ఉంటే అవి పూర్తి అయినట్టు అర్థము. Orange Color లొ ఉంటే వారి వద్ద పెండింగ్ లొ ఉన్నట్టు అర్థము.


Single Old Age Person Household Split

  • కొత్తగా House Hold Split ఆప్షన్ లో Single Old Age Person Split ఆప్షన్ Activate చెయ్యటం జరిగింది.
  • ఈ ఆప్షన్ PS Gr-VI (DA) / WEDPS వారి AP సేవ పోర్టల్ లో అందుబాటులో ఉంది.ఈ ఆప్షన్ ఉపయోగించడానికి హౌజ్ హోల్డ్ లో ఒక జంట లేదా 35 సంవత్సరాలు దాటిన వారు ఉండాలి. 
  • Single House Hold Mapping ద్వారా విభజన కేవలం 01 వ్యక్తికి మాత్రమే అవుతుంది.
  • ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారి వయసు 60 సంవత్సరాలకన్నా ఎక్కువ ఉండాలి మరియు Widow / Widower అయ్యి ఉండాలి.
  • ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. మరియు డాక్యుమెంట్ సెక్షన్ లో Spouse Death Certificate / Rice Card/ Widow Pension Card అప్లోడ్ చేయాలి.