Citizen Outreach Program August - 2023 Citizen Outreach Program August - 2023

Citizen Outreach Program August - 2023

 

Citizen Outreach Program  August - 2023

AUGUST 2023 COP CITIZEN OUTREACH PROGRAM 

ఆగష్టు నెల 2023 కు సంబందించిన సిటిజెన్ ఔట్రీచ్ సర్వ్ తేదీ 25 & 26 న ఉంటుంది.

1. Citizen Outreach Program COP latest Updates :

    •  ఆగస్టు 28 నాడు కూడా కొనసాగనున్న అవుట్రిక్ సర్వే. 
    • COP యాప్ సర్వే లో పేర్లు మొత్తం మూడు కలర్స్ ఉంటుంది :  కాషాయం : కాషాయం కలర్ లో ఉన్న పేర్లు ఫోటో తీసి సబ్మిట్ చేస్తే గ్రీన్ కలర్ లో వస్తుంది కంప్లీట్ అని రెడ్ : రెడ్ కలర్ లో ఉన్న పేర్లు thumb వేయించాలి (thumb వేస్తేనే గ్రీన్ కలర్ లోకి వస్తాయి) గ్రీన్ : గ్రీన్ కలర్ లో సర్వే పూర్తయిన అన్ని పేర్లు గ్రీన్ కలర్ లోకి మారుతాయి
    • వాలంటీర్లు - సచివాలయ సిబ్బంది టీం గా ఏర్పడి ఈ ప్రోగ్రాం ను పూర్తి చేయాలి. అందరు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలి. సచివాలయ సిబ్బంది వారి వారి టీం ను లీడ్ చేస్తూ ప్రోగ్రాం ను పూర్తి చేయాలి.
    • ప్రోగ్రాం కు సంబందించిన విధి విధానాలు,ప్రశ్నలు, ప్రజలతో మాట్లాడవలసిన విషయాలు, సర్వే చేయు ప్రాసెస్ కు సంబందించిన యూసర్ మన్యుయల్ పోస్ట్ దిగువన ఇవ్వటం జరిగింది.
    • MPDO/MC వారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ పరుచుకొని అందరు తప్పనిసరిగా COP లొ జాయిన్ అయ్యే విధంగా గా చూడవలెను. ప్రోగ్రాం ను ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తూ ఇచ్చిన గడువులో పూర్తి చేయవలసిందిగా సచివాలయ ఉద్యోగులకు మార్గదర్శకాలు ఇవ్వవలెను. 

      1.1 Citizen Outreach program COP Report  :

      Click Here


      1.2 మరణించిన వారికి ఔట్రీచ్ సర్వే ఎలా పూర్తి చేయాలి ?


      • వాలంటరీ క్లస్టర్ పరిధిలో ఎవరైనా కుటుంబంలో మరణించిన వ్యక్తి ఉంటే వారికి సర్వే పూర్తి అవ్వదు. 
      • వారికి సర్వే పూర్తి అవ్వాలి అంటే చనిపోయిన వ్యక్తి ఈకేవైసీకి అందుబాటులో లేరు అని, కారణము చనిపోయారు అని సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఉద్యోగి లాగిన్ అయి ఉంటారో వారి Irish / Face / Biometric తో ధ్రువీకరణ చేయవలసి ఉంటుంది. 
      • కొంత సమయం తర్వాత వారి ఈకేవైసీ పూర్తి అయినట్టు వస్తుంది. అప్పుడు ఇంటిలో మిగిలిన వారి ద్వారా సర్వే పూర్తి చేయాలి.

      2. August Month COP Focus points :

      1. eKYC పెండింగ్ ఉన్న వారికి పూర్తి చేయాలి.
      2. సెప్టెంబర్  నెల లొ అందిననున్న వైస్సార్ చేయూత పథకం కోసం.

      3. Citizen Outreach Mobile App :

      Download COP App V3.2


      4. ప్రోగ్రాం సమయంలొ ప్రజలకు తెలియజేయవలసిన విషయాలు / COP Quationaries Related Information :


      eKYC సంబంధించి :

      • వాలంటీర్ల వద్ద హౌస్ హోల్డ్ మాపింగ్ అయిన తరువాత ఒక్క సారి కూడా వాలంటీర్ వారి GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లొ బయోమెట్రిక్ (eKYC) వేయని వారికి మాత్రమే సర్వే సమయం లొ e-KYC చూపిస్తుంది. e-KYC పెండింగ్ ఉన్న వారికి వెంటనే అప్లికేషన్ లొ e-KYC చేయాలి. అందుకు బయోమెట్రిక్ / ఐరిస్ / పేస్ / OTP ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి. eKYC చేసుకోకపోతే వారికి ప్రభుత్వ పథకాలు, సర్వీస్ లు డెలివరీ సమయం లొ సమస్యలు వస్తాయి.

      వైస్సార్ చేయూత కు సంబంధించి :

      • సెప్టెంబరు, 2023 నెలలో వై.యస్.ఆర్. చేయూత పథకం తాలూకా నగదు అర్హులైన లబ్దిదారులకు జమ చేయడం జరుగుతుంది. 45 నుండి 60 సంవత్సరముల వయస్సు కలిగిన బి.సి., ఎస్.సి., ఎస్.టి మరియు మైనారిటీ మహిళలు అర్హులు. మీరు ఈ పధకంకు సంబంధించి అర్హతలు కలిగి వుంటే దగ్గరలో ఉన్న సచివాలయంలో మంజూరు వివరాలు తెలుసుకోవచ్చు.


      5. సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు :

      • సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధి లోని కుటుంబాలను సంబంధిత గ్రామ/ వార్డు వాలంటీర్ తో పాటుగా సందర్శించవలెను. క్యాంపెయిన్ నిర్వాహకుని గా ప్రజలకు పరిచయం చేసుకోవలెను.
      • సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహణలో పాల్గొనే సిబ్బంది వారి మరియు సంబంధిత ఇతర కార్యదర్శులు నిర్వర్తించవలసిన విధులు మరియు బాధ్యతలను వివరించవలెను.
      • ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ గురించి ప్రజలకు వివరించవలెను.
      • సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి, గ్రామ/ వార్డు సచివాలయం లో లభించే విభిన్న ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవలసినదిగా ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయవలెను.

      • ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ మరియు సచివాలయ సిబ్బంది యొక్క వివరాలతో కూడిన ప్రజలందరికీ అందజేయవలెను.
      • గ్రామ/ వార్డు వాలంటీర్ల పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవలెను.
      • యాప్ లో ప్రశ్నావళిని గ్రామ/  వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయవలెను.
      • ప్రభుత్వ పథకాలు మరియు సేవల దరఖాస్తు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా సేకరించవలెను.
      • ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరభ్యంతరంగా సచివాలయాన్ని సందర్శించమని కోరాలి. వారి సమస్యల పరిస్కారం కోసం తాము ఉన్నాము అనే భరోసా కల్పించాలి.
      • పౌరుల ఫోటోని క్యాప్టర్ చేసి, తమ విలువైన సమయాన్ని కేటాయించి 'ఔట్ రీచ్ కాంపెయిన్' లో పాల్గొని సహకరించినందుకు అభినందిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపవలెను.


      6. సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/ వార్డు వాలంటీర్లు బాధ్యతలు :


      • సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధి లోని కుటుంబాలను సంబంధిత గ్రామ! వార్డు వాలంటీర్ తో పాటుగా సందర్శించవలెను. 
      • క్యాంపెయిన్ నిర్వాహకుని గా ప్రజలకు పరిచయం చేసుకోవలెను.
      • సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహణలో పాల్గొనే సిబ్బంది వారి మరియు సంబంధిత ఇతర కార్యదర్శులు నిర్వర్తించవలసిన విధులు మరియు బాధ్యతలను వివరించవలెను. 
      • ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ గురించి ప్రజలకు వివరించవలెను.
      • సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి, గ్రామ వార్డు సచివాలయం లో లభించే విభిన్న ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవలసినదిగా ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయవలెను.
      • ప్రభుత్వ సంక్షేమ పధకాల క్యాలెండర్ మరియు సచివాలయ సిబ్బంది యొక్క వివరాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలందరికీ అందజేయవలెను. 6. గ్రామ/వార్డు వాలంటీర్ల పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవలెను.
      • యాప్ లోని ప్రశ్నావళిని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయవలెను.
      • ప్రభుత్వ పథకాలు మరియు సేవల దరఖాస్తు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా సేకరించవలెను.
      • ప్రభుత్వ పథకాల లబ్దికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరభ్యంతరంగా సచివాలయాన్ని సందర్శించమని కోరాలి. వారి సమస్యల పరిస్కారం కోసం తాము ఉన్నాము అనే భరోసా కల్పించాలి.
      • పౌరుల ఫోటోని క్యాప్చర్ చేసి, తమ విలువైన సమయాన్ని కేటాయించి 'ఔట్ రీచ్ కాంపెయిన్ లో పాల్గొని సహకరించినందుకు అభినందిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు. తెలుపవలెను.
      • అతని/ ఆమెతో అనుబంధించబడిన గ్రామ/ వార్డు సెక్రటరీతో పాటు వారి క్లస్టర్ పరిధిలోని అన్ని హౌస్ హోల్డ్ లను(HH) కవర్ చేసేలా చూసుకోవడం సంబంధిత గ్రామ/ వార్డు వాలంటీర్ బాధ్యత.
      • గ్రామ/ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బందితో సమన్వయంతో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం/ పరిష్కరించడం వాలంటీర్ల బాధ్యత.
      • వారి క్లస్టర్ whatsapp గ్రూప్ లలో ప్రచార సమాచారాన్ని హౌస్ హోల్డ్ లతో ముందుగా  పంచుకోవడం వాలంటీర్ల బాధ్యత.
      • ప్రచారం తరువాత వాట్సాప్ గ్రూప్ లలో ఫీడ్‌బ్యాక్ మరియు చిత్రాలను పంచుకోవడం వాలంటీర్ల బాధ్యత.


      7. పౌరులతో మాట్లాడవలసిన అంశములు (Talking Points)

      • VSWS బృందం కేటాయించిన ప్రజలందరికీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ & వాలంటీర్ల వ్యవస్థల స్థాపన యొక్క ప్రాముఖ్యతను వివరించాలి. ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసిన ఉద్దేశాలను అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలి. 
      • గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ & వాలంటీర్ల వ్యవస్థలు ప్రవేశపెట్టక ముందు ఉన్న పాలనా పరమైన స్థితిగతులను వివరిస్తూ నేటి వ్యవస్థల పనితీరును వివరించాలి..
      • ప్రజలందరూ తప్పనిసరిగా వారి ప్రాంతంలోని సచివాలయం గురించి తెలుసుకోగలగాలి. VSWS బృందం వారి పరిధిలోని ప్రతి ఒక్కరినీ సచివాలయ వ్యవస్థ గురించి తెలుసా? లేదా? అని అడగాలి.
      • VSWS బృందం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన 4 పథకాల (పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం గురించి ప్రజలకు వివరించాలి. ప్రజలందరూ సంతృప్తి చెందేలా సచివాలయం అందించే అన్ని సంక్షేమ పథకాలు/సేవల యొక్క అమలు విధానం మరియు SLA వ్యవధిని గురించి తెలియజేయాలి.
      • ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల లబ్ది చేకూరుతున్నదా? ఉదా: కుటుంబంలోని సభ్యులలో పిల్లలకు అయితే జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి... వృద్ధులుఉన్నట్లైతే పింఛను, వ్యవసాయదారులైతే రైతు భరోసా తదితర పథకాలు అందుతున్నాయో, లేదో అడిగి రాసుకోవాలి. 
      • కుటుంబంలోని సభ్యులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ఎంత మేరకు అవగాహన ఉన్నదో అడిగి తెలుసుకోవాలి. అర్హతలున్నప్పటికీ ఏదైనా పథకం యొక్క ప్రయోజనాలను పొందలేకపోతున్నారా? లాంటి వివరాలను పరస్పరం తనిఖీ చేయాలి.
      • అర్హతలున్నప్పటికీ ఏదైనా పథకం యొక్క ప్రయోజనాలను పొందని లబ్దిదారులను గుర్తించి, వారితో సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా మాట్లాడవలెను. 
      • ఫిర్యాదుల పరిష్కారానికై ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 1902 మరియు స్పందన వ్యవస్థల గురించి ప్రజలందరికీ VsWS బృందం అవగాహన కల్పించాలి. ప్రభుత్వ పథకాలు, పౌర సౌకర్యాలకు సంబంధించిన గ్రీవెన్స్ గురించి ఫిర్యాదులను ఎలా నమోదు చేయాలి, VSWSతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎప్పుడు సంప్రదించాలి అనే విషయాల పట్ల అవగాహన కల్పించాలి.
      • ప్రజలకు తమ సచివాలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియాలి. 
      • CSC ద్వారా సచివాలయం అందించే అన్ని సేవల గురించి ప్రజలందరికీ వివరించాలి. ఉదాహరణకు విద్యుత్ బిల్లులు, ఆధార్ సేవలు (భవిష్యత్తులో) మొదలైనవి. 
      • 108 వంటి ముఖ్యమైన సంప్రదించవలసిన నంబర్ గురించి మరియు అవి దేనికి ఉపయోగించబడుతున్నాయనే దాని గురించి తప్పనిసరిగా వివరించాలి.
      • దిశా యాప్ యొక్క ప్రాముఖ్యలను ప్రజలకు వివరించాలి. మరియు యాప్ లోని ప్రతి ఫీడర్, దానిని ఎలా ఉపయోగించాలి మరియు అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎలా ఉపయోగపడుతుందో అర్థమయ్యేలా వివరించాలి..
      • హౌస్ హో కేటాయించిన వాలంటీర్ మరియు వారి సెక్రటేరియట్ సిబ్బంది పనితీరు గురించి ప్రజల నుండి తప్పనిసరిగా అభిప్రాయాలను సేకరించాలి.

      8. Citizen outreach Program COP Technical Issue Notes :

      • వ్యక్తి మరణించిన తరువాత Authentication వేసే సమయం లొ ఇలా ""As you mentioned like చనిపోయారు, The user have to Authorize to continue? "" వస్తే అప్పుడు ఉద్యోగి యొక్క బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది . 
      • అప్లికేషన్ ఉపయోగిస్తున్న సమయంలో "No Data Available" అని వస్తున్నట్లయితే అప్పుడు లాగౌట్ చేసి లాగిన్ అయినట్లయితే సమస్య క్లియర్ అవుతుంది. 
      • మొబైల్ అప్లికేషన్ లో ఒక్కసారి ఒక్కరు మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది.రెండో మొబైల్ లో లాగిన్ అవ్వటానికి ప్రయత్నిస్తే "Please relogin as user logged off or logged in from another device" అని వస్తుంది.
      • లాగిన్ అయ్యే సమయం ఎవరికి అయినా "Application will not work on this device as USB Debugging is enabled. 892" అని వస్తే వారు మొబైల్ లొ Developer Mode Settings లొ Usb Debugging ఆప్షన్ ను Disable చెయ్యండి.
      • సర్వే చేయు సమయం లొ "Please try again...Attempt to invoke virtual method 'boolean java.io.File.exists()' on a null object reference" లేదా "Auth XSD Validation Failed." లేదా "No Data Available" అని వస్తే అప్పడూ log Out చేసి మరలా లాగిన్ అవ్వాలి.
      • పంచాయతీ కార్యదర్శులకు (Gr I to V) ఈ మధ్యకాలంలో క్రియేట్ చేసిన గ్రామ వార్డు సచివాలయ యూసర్ నేమ్ తో లాగిన్ అయితే వారికి సర్వే ఓపెన్ అవుతుంది. అవి ఓపెన్ అవ్వక పోతే Sachivalayam Code - PS తో ట్రై చెయ్యండి.
      • ప్రభుత్వ స్కానర్లకు సంబంధించిన "Error:-warranty/ Subscription/Support Validity Is Over. Pl Renew." సమస్య క్లియర్ అవటం జరిగినది.
      • eKYC పూర్తి అయినా కూడా Partially Completed అని వస్తున్న వాటిని విడిచిపెట్టి మిగతా వాటిని పూర్తి చెయ్యాలి. తరువాత అప్డేట్ అవుతున్నాయి. 
      • కేవలం ఒక సారి ఒక మొబైల్ లొ మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
      • ఈ సారి eKYC పెండింగ్ ఉన్న వారికి బయోమెట్రిక్ / ఐరిష్ / Face / OTP ఆధారంగా eKYC చేయాలి. eKYC చెయ్యక పోతే PARTIALLY COMPLETED అని స్టేటస్ చూపిస్తుంది.
      • సర్వే సమయం లొ అందుబాటులో ఉన్న వారికి తప్పనిసరిగా eKYC చేయాలి. అందుబాటులో లేరు / వలసలో ఉన్నారు / మరణించారు అని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చెయ్యరాదు.
      • మొదటి రోజు 50%, మరుసటి 50% సర్వే పూర్తి అయ్యేలా చూడాలి.ఒకే రోజు 100% అయిన పర్వాలేదు కానీ 50% కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి.


      10. Citizen Outreach Program COP August- 2023 User Manual : 


      Post a Comment

      3 Comments