YSR Pension Kanuka latest Updates
సెప్టెంబర్ 2023 కొత్త పెన్షన్ ల సమాచారం :
- కొన్ని పెన్షన్ అప్లికేషన్స్ వివిధ టెక్నికల్ కారణాలవలన వెరిఫికేషన్ కు రావడం జరగలేదు అటువంటి అన్ని పెండింగ్ అప్లికేషన్స్ అన్ని అందరు MPDO / మునిసిపల్ కమీషనర్ గార్ల మొబైల్ అప్ కు వెరిఫికేషన్ కు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెండింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా సెప్టెంబర్ , 2 వ తారీకు సాయంత్రానికి వెరిఫికేషన్ పూర్తి చేసిన అర్హులైన పెన్షన్ దారులందరికి ౩వ తారీకున అమౌంట్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంది. కనుక అర్హులైన ప్రతి పెన్షన్ దారునికి పెన్షన్ అమౌంట్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంది.
- పంచాయతీ కార్యదర్శి / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి ఆమోదం తప్పనిసరి. WEA/WWDS వారు SS Pension వెబ్ సైట్ / YSRPK App లో పెన్షన్ స్టేటస్ లో Death Capture చేసిన తరువాత ఆ అప్లికేషన్ వారి పంచాయతీ కార్యదర్శి (PS) / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ (WAS) వారి లాగిన్ కు ఫార్వార్డ్ అవుతుంది. వారు ప్రొఫైల్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు OTP ద్వారా ధ్రువుకరించాలి. ప్రతీ నెల 19 లోపు Death Confirmation చేసిన పెన్షన్ లు ఆ తరువాత నెలలో పెన్షన్ లిస్ట్ లో డిలీట్ అవ్వటం జరుగును.
- మార్చ్ నెల 2023 సంబంధించి పెన్షన్ పేమెంట్ లకు గాను కొత్తగా ఆధార్ ముఖ ధ్రువీకరణ (Aadar Face Authentication) ఆప్షన్ ను YSR Pension kanuka App లో ఇవ్వటం జరిగింది.Face ఆప్షన్ వెంటనే ఇవ్వబడదు. దానికి గాను పెన్షన్ దారుని బయోమెట్రిక్ / ఐరిష్ ను కనీసం 3 సార్లు ఫెయిల్యూర్ అయిన తరువాత Face ఆప్షన్ చూపించటం జరుగును. Face ఆప్షన్ కూడా 3 సార్లు ఫెయిల్యూర్ అయితే అప్పుడు RBIS కు వెళ్ళటం జరుగును.
- Face ద్వారా పెన్షన్ ధ్రువీకరణ సమయం లో పెన్షన్ దారుని మొహం పై తగిన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా అప్లికేషన్ లో చూపించే విషయాలను ఫాలో అయితే వెంటనే కాప్చర్ చెయ్యటం జరుగును.
⛊పెన్షన్ నగదును గ్రామ వార్డు వాలంటీర్ వారు సాధారణ సెలవులతో సంబంధం లేకుండా నెలలో 1 నుంచి 5వ తేదీ లోపు పంపిణీ చేయవలసి ఉంటుంది.
⛊వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వారికి జనవరి 2023 నెల నుంచి నగదును రూ.2500 నుంచి 2750 కు పెంచటం జరిగింది.
⛊ పెన్షన్ పంపిణీ పూర్తి అయిన వెంటనే పంచగా మిగిలిన నగదును వెంటనే సంబంధిత WEA/WWDS వారికి అందజేయవలెను. పెన్షన్ పంపిణీ చివరి తేదీ పూర్తయిన వెంటనే 2 పని దినములలో నగదులు ప్రభుత్వానికి తిరిగి కట్టవలసి ఉంటుంది.
⛊పెన్షన్ నగదు ఏ నెలకు సంబంధించి ఆ నెలకు మాత్రమే విడుదల అవటం జరుగుతుంది.ఆయా నెలకు సంబంధించిన నగదు పెన్షన్ దారుడు తీసుకోకపోయినట్టయితే ఆ నగదు మరుసటి నెల ఆ నెలలో ఇచ్చే పెన్షన్ తో కలిపి ఇవ్వటం జరగదు. పెన్షన్ దారుడు వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా పరిగణించడం జరుగుతుంది. తరువాత మూడు నెలల లోపు వారి అర్జీ మేరకు పెన్షన్ పున ప్రారంభించడం జరుగుతుంది.
⛊పెన్షన్ నగదు ప్రతి నెల వారికి నచ్చిన ప్రదేశంలో తీసుకునే వెసులుబాటు పెన్షన్ దారులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్లినట్లయితే వారు గ్రామా లేదా వార్డు సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది.
⛊Remittance మొదలు రెండు రోజులు దాటిన తరువాత రోజుకు ₹ 100/- లేదా 18% వడ్డీ (ఏది ఎక్కువ అయితే అది ) ఫైన్ విధించబడును. Remittance తేదీ నుంచి 10 రోజులు దాటితే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడును.
⛊Startek Scanner Subscription Expire ఐనవారు ACPL యాప్ ఓపెన్ చేసి టాప్ లో రైట్ సైడ్ మూడు డాట్స్ మీద క్లిక్ చేసి Re-Register మీద క్లిక్ చెయ్యండి.
⛊పెన్షన్ పంపిణి సమయం లొ ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు :
⛊ సొంత STARTEK FM 220 స్కానర్ రీఛార్జ్ చేసుకునే లింక్ - Click Here
⛊ సొంత MAMTRA స్కానర్ రీఛార్జ్ చేసుకునే లింక్ - Click Here
⛊ ఆధార్ కార్డులో వయసును పెన్షన్ రూల్ కు వ్యతిరేకంగా మార్చిన వారు వైయస్సార్ పెన్షన్ కానుకకు అనర్హులు సంబంధించిన ప్రభుత్వ ఆర్డర్ కాపీ - Click Here
⛊విడాకులు తీసుకొని ఒంటరిగా బ్రతుకుతున్న మహిళలు మరియు అవివాహిత మహిళల పెన్షన్ దరఖాస్తు వయసులో 50 సంవత్సరాలకు పెంచుతూ విడుదలైన ప్రభుత్వ ఆర్డర్ కాపీ - Click Here
⛊వైయస్సార్ పెన్షన్ కానుక దరఖాస్తు విధానము, ఆమోదము విధానము, పెన్షన్ పంపిణీ విధానము, నగదు విత్ డ్రా మరియు బ్యాంకులో తిరిగి కట్టు విధానము, వివిధ ఉద్యోగుల పాత్ర కు సంబంధించిన సవరించిన ఉత్తర్వులు - Click Here
⛊ ఏఏ మెడికల్ పెన్షన్లు ఉంటాయి , ఏఏ మెడికల్ పెన్షన్లకు ఎంత నగదు వర్తిస్తుంది, సంబంధించి దరఖాస్తు విధానము, అప్లికేషన్ ఫారం తో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు - Click Here
⛊ వైస్సార్ పెన్షన్ కానుక కొత్త దరఖాస్తు ఫారం - Click Here
⛊ వైస్సార్ పెన్షన్ కానుక Field Verification Form - Click Here
⛊ పెన్షన్ పంపిణి రిపోర్ట్ - Click Here (జిల్లాల వారీగా)
⛊ సచివాలయం లో దరఖాస్తు చేసిన పెన్షన్ స్టేటస్ తెలుసుకునే లింక్ - Click Here
995305319427
ReplyDelete