EBC Nestham 2023 Complete Information
EBC Nestham Latest Updates :- 12-04-2023వ తేదీన "ఈబీసీ నేస్తం" పథకం ప్రారంభం.
ఈబీసీ నేస్తం పథక లక్ష్యం ఏమిటి ?
What is the aim of EBC Nestham Scheme?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నటువంటి ఈబీసీ కమ్యూనిటీ వారందరిని ఆర్థిక వృద్ధి లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం EBC నేస్తం అనే పథకం ప్రవేశపెట్టింది.
- అందులో భాగంగా ఈ సంవత్సరం 2023-24 నుంచి కొత్త దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది.
- వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం లానే ఈ బీసీ కమ్యూనిటీ లో ఉండే మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం .
- ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 15 వేల రూపాయలు చొప్పున మొత్తం మూడు విడతలుగా అనగా మూడు సంవత్సరాలకు 45 వేల రూపాయలు ఆర్థిక లబ్ధి అందుతుంది .
- 2023-24 సంవత్సర ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ముందుగా ఉన్న వారి అర్హత, అనర్హతలను మరియు కొత్తగా పథకానికి అర్హత ప్రమాణాలతో కూడిన గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చెయ్యటం జరిగింది .
EBC Nestham Eligible Castes List 👇🏿
Click Here
ఈబీసీ నేస్తం పథక ఉద్దేశం ఏమిటి ?
What is EBC Nestham Scheme ?
- రాష్ట్రంలో 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఈ బీసీ కమ్యూనిటీ మహిళలందరికీ ఆర్థిక వృద్ధి లోకి తీసుకురావడం
ఈబీసీ నేస్తం పథక లబ్ది ఎంత ?
What is EBC Nestham Scheme Benefit ?
- సంవత్సరానికి 15000 అలా మూడు విడతలుగా మొత్తం మూడు సంవత్సరాలకు 45 వేల రూపాయలు అకౌంట్ లో జమ
ఈబీసీ నేస్తం పథక అర్హతలు ఏమిటి ?
What are the Eligibility Criteria for EBC Nestham Scheme ?
- EBC కమ్యూనిటీకి చెందిన మహిళలు అయి ఉండాలి.
- వైయస్సార్ చేయూత, కాపు నేస్తం లో కవర్ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ వారు అనర్హులు.
- అర్హులైన మహిళ పేరు మీద ఆధార్ కార్డు ఉండాలి.
- అర్హులైన మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి.
- కుటుంబ ఆదాయం రూరల్ లో అయితే నెలకు 10,000 అర్బన్ లో అయితే నెలకు 12,000 మించకూడదు ( కుటుంబం అనగా తండ్రి తల్లి ఆధారపడిన పిల్లలు అని అర్థం ).
- కుటుంబ మొత్తం భూమి మెట్ట భూమి 10 ఎకరాల లోపు లేదా పల్లం భూమి మూడు ఎకరాల లోపు లేదా మెట్ట మరియు పళ్ళ మొత్తం కలిపి పది ఎకరాల లోపు ఉండాలి.
- కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు ( పారిశుద్ధ్య కార్మికుల కు మినహాయింపు).
- ఆటో, టాక్సీ,టాక్టర్ మినహా కుటుంబంలో ఎవరి పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
- కుటుంబంలో ఎవరూ కూడా ఇన్కమ్ టాక్స్ కట్టకూడదు.
- మునిసిపాలిటీ లో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు.
వయసు ధ్రువీకరణ పత్రాలు : ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ / డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ / టెన్త్ మార్క్స్ మెమో / ఓటర్ ఐడి కార్డ్
ఈబీసీ నేస్తం పథక అర్హతను ఎలా గుర్తిస్తారు?
How to determine Eligibility for EBC Nestham Scheme ?
- గ్రామ వార్డు వాలంటీర్ వారు డోర్ టు డోర్ ( ఇంటింటా ) వెళ్లి మొబైల్ అప్లికేషన్ నందు సర్వే చేసి అర్హులకు గుర్తిస్తారు. అర్హులను గుర్తించి ఏ సమయంలో వాలంటే వారికి పైన తెలిపిన అర్హతలు అన్నీ కూడా తెలిసి ఉండాలి
వాలంటీర్ వారు సర్వే చేయు సమయంలో అడుగు సమాచారం :
- లబ్ది దారు పేరు
- లబ్ది దారు ఆధార్ నెంబర్
- కుటుంబ పెద్ద పేరు
- కుటుంబ పెద్ద ఆధార్ నెంబరు
- కులము
- పుట్టిన తేదీ ప్రూఫ్
- కుటుంబ ఆదాయము
- బ్యాంకు అకౌంట్ నెంబరు/ IFSC కోడ్ / బ్యాంకు పేరు
- బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
- అద్దె వాహనాలు కాకుండా నాలుగు చక్రాల వాహనం ఉంటే నెంబరు
- భూమి వివరాలు ( మెట్ట పల్లము వివరాలు )
- మునిసిపాలిటీ లో భూమి ఉన్నట్లయితే వాటి వివరాలు
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటే వారి వివరాలు
- లబ్ధిదారుని ఫోన్ నెంబర్
ఈబీసీ నేస్తం పథకం కు కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి ?
What Are Documents Required for EBC Nestham Scheme?
- ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డ్స్
- క్యాస్ట్ సర్టిఫికెర్
- ఇన్కమ్ సర్టిఫికెట్
- రైస్ కార్డు
- బ్యాంకు బుక్
- ఆధార్ అప్డేట్ హిస్టరీ
- EBC సర్టిఫికెట్ కావలెను.
- భూమి ఉంటే నకలు
- మునిసిపాలిటీ లో భూమి ఉంటే వాటి నకలు
- అప్లికేషన్ ఫారం
- ఓటర్ కార్డు / SSC / DOB / ఇంటిగ్రాటెడ్ సర్టిఫికెట్
Download Application Form 👇🏿
ఈబీసీ నేస్తం పథకం ఆమోదం పొందే విధానం ఏమిటి ?
What is the approval process for EBC Nestham scheme ?
- గ్రామ వార్డు వాలంటీర్ వారు ఇంటింటా మొబైల్ అప్లికేషన్ నందు సర్వే చేసిన వివరాలు సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్ వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
- ధ్రువీకరణ పూర్తి అయిన తరువాత వివరాలను వెబ్ అప్లికేషన్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా MPDO/MC వారికి పంపించాలి. అక్కడ పరిశీలన పూర్తి అయిన తరువాత సంబంధిత జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారికి ఫార్వర్డ్ చేస్తారు.
- వారు ఆమోదం కొరకు సంబంధిత జిల్లా కలెక్టర్ వారికి పంపిస్తారు. అక్కడ నుండి మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఈ బీసీ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారికి అమౌంట్ శాంక్షన్ కోసం కలెక్టర్ వారు ఫార్వర్డ్ చేస్తారు .
- అక్కడ నుండి కార్పొరేషన్ వైస్ గా బిల్లుల ప్రిపరేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ CFSS వారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కొరకు అర్హుల జాబితాను హ్యాంగ్ చేయడం జరుగుతుంది.
ఈబీసీ నేస్తం పేమెంట్ ప్రాసెస్ ఏమిటి ?
What is the payment process of EBC Nestham Scheme ?
- మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ బీసీ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారి వద్ద శాంక్షన్ పొందిన బ్యాంకు లబ్ధిదారునికి ఖాతాలో ప్రభుత్వం నిర్ణయించిన రోజు అమౌంట్ జమ అవుతుంది.
- లబ్ధిదారులు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ అనేది వస్తుంది జమ అయినట్టు
- పేమెంట్ రసీదులు సచివాలయాల్లో జనరేట్ అవుతాయి మరియు గౌరవ ముఖ్యమంత్రి సందేశం లెటర్ను గౌరవ గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా లబ్ధిదారులకు అందజేయాలి
- పేమెంట్ అక్నౌలెడ్జిమెంట్ అనేది సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వారి వద్ద జరుగును. లబ్ధిదారులు బయోమెట్రిక్ వేసి పని పూర్తి చేయాలి.
- అర్హత ప్రమాణాలకు అనుగుణంగా వాలంటీర్ వారు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి, ఆ డేటా మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేయాలి, నమోదు చేసిన సమాచారాన్ని వెల్ఫేర్
Note : ప్రభుత్వం నిర్ణయించిన తేదీనాడు లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది.
EBC నేస్తం పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానము
ebc nestham payment status link :
Step 1: ముందుగా కింది లింక్ కి వెళ్లి Scheme దగ్గర EBC Nestham అని ఎంచుకోండి.
Step 2: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న కోడ్ ను యధావిధిగా ఎంటర్ చేయండి.
Step 3: తర్వాత GET OTP పైన క్లిక్ చేయండి. Your Aadhar will be authenticated ఒక మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి.
Step 4 :OTP Sent Successfully అని మెసేజ్ చూపిస్తుంది. OK అని క్లిక్ చేయండి.ఒక OTP వచ్చి ఉంటుంది చెక్ చేయండి.
Step 5 : మొబైల్ కి వచ్చిన OTP ను ఎంటర్ చేసి Verify OTP పైన క్లిక్ చేయండి.
Step 6: Are you Sure want to verify OTP ని చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి.
Step 7: OTP Verified Successfully అని చూపించి, ఒకే పైన క్లిక్ చేయగానే కింది విధంగా మీ వివరాలు, అప్లికేషన్ వివరాలు ఓపెన్ అవుతాయి .
Step 8. పేమెంట్ అమౌంట్ విడుదల కు ముందు మీ పేమెంట్ స్టేటస్ ఖాళీగా చూపించవచ్చు.పేమెంట్ విడుదల తర్వాత Status - Success విధంగా Status మారుతుంది. ఏ బ్యాంక్ లో అమౌంట్ పడిందో కూడా చూపుతుంది.
EBC Nestham Payment Status Link 👇🏿
ఈబీసీ నేస్తం పథకం వెరిఫికేషన్ ప్రాసెస్ ఏమిటి ?
What is EBC Nestham Verification Process ?
ఈబీసీ నేస్తం 2022-23 వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉందొ చూద్దాం.
- ఈబీసీ నేస్తం 2022-23 పథకానికి సంబంధించి వెరిఫికేషన్ ఆప్షన్ ను WEAs/WWDS వారి లాగిన్ లో ఇవ్వటం జరిగింది.
- గత సంవత్సరంలో అర్హులు అయిన వారి లిస్టు మాత్రం ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా అర్హులు అయ్యుండి పేర్లు రాకపోతే వారి వివరాలు కూడా ఎప్పటికీ అప్పుడు ఎలిజిబుల్ లిస్టులో కలపడం జరుగుతుంది.
- ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రకారం మాత్రమే ఆరు దశల ధ్రువీకరణ మరియు తాత్కాలిక అర్హుల జాబితా అనేది విడుదల అవటం జరుగుతుంది.
- కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా వెరిఫికేషన్కు ఉండవలెను.
- అనర్హుల వారి వద్ద కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లబ్ధిదారులు వద్ద లేకపోతే వారిని Hold లో ఉంచే ఆప్షన్ ఉన్నది.
- అలా ఉంచినట్టయితే వారికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి అయినట్టు అర్థం. వారు తరువాత ఆయా సర్టిఫికెట్లు ఇచ్చినట్టయితే మరలా అండ్ Un Hold చేసే అవకాశం ఉన్నది. అప్పుడు మరలా వెరిఫికేషన్ కొరకు WEAs/WWDS వారి లాగిన్ లో పేర్లు వస్తాయి.
- గత సంవత్సరం EBC Nestham పథకం నందు లబ్దిపొందిన Beneficiaries అందరి వివరాలు కూడా field verification కొరకు NBM portal WEAs/WWDS login నందు enable చేయడం జరిగింది.Verification list నందు వున్న లబ్ధిదారులందరిని కూడా WEAs/WWDS కచ్చితంగా field verification ద్వారా Eligible/Ineligible గా update చెయ్యాలి.
- Verification Path : Open NBM Portal --> https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login Login --> NBM Scheme Module --> YSR EBC Nestham --> Verification --> Click On "Verify .
- Eligible :: Field verification ప్రకారం లబ్ధిదారులు EBC Nestham పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే, AP SEVA Caste & Income certificate details enter చేసి, Recommended అనే option దగ్గర "YES" అని select చేసుకొని update చెయ్యాలి.
- Ineligible :: Field verification ప్రకారం ఎవరైనా లబ్ధిదారులు EBC Nestham పథకానికి ఏవైనా reasons వలన Ineligible అయితే, AP SEVA Caste & Income Certificate details enter చేసి, Recommended అనే option దగ్గర "NO" అని select చేసి, Ineligible Reason select చేసుకొని ineligible గా update చెయ్యాలి.
- Field verification ప్రకారం Death/ineligibility వున్న లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు "AP SEVA Caste & Income కలిగి ఉండకపోతే" అటువంటి లబ్దిదారులను "HOLD" option నందు ineligible reason select చేసుకొని update చెయ్యగలరు.
- అన్నీ అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరైనా beneficiaries ని bymistake గా HOLD option నందు ineligible గా update చేసిన తరువాత, మరి "UN-HOLD" చేస్తే అటువంటి లబ్దిదారుల వివరాలు verification option లో display అవ్వడం జరుగుతుంది. As per field verification, WEAs/WWDS login లో "eligible" గా update చేసిన తరువాత "system validation నందు కూడా Eligible" అయిన లబ్ధిదారులు మాత్రమే Provisinal Eligible list నందు ఉంటారు.
Downloads 👇🏿
- EBC Nestham Verification User Manual : Click Here
- Downlaod Field Verification Form : Click Here
- EBC నేస్తం GO Copy : Click Here