RTE Act Admission Process RTE Act Admission Process

RTE Act Admission Process

RTE Act Admission of children in Class I under Section 12(1) (C) of the RTE Act 2009 for the academic year 2023-2024 for all Private Unaided Schools

RTE Act Admission of children in Class I under Section 12(1) (C) of the RTE Act 2009 for the academic year 2023-2024 for all Private Unaided Schools

RTE Act 2009,సెక్షన్ 12(1)(C) ప్రకారం 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి తరగతి లొ 25% సీట్లు పిల్లలకు కేటాయించాలి.

ఎవరు అర్హులు? 

  • అనాధ పిల్లలు,
  • SC,
  • ST,
  • BC  ,
  • మైనారిటీ,
  • గ్రామాల్లో సంవత్సర ఆదాయం 1.2 లక్షలు, పట్టణాల్లో 1.44 లక్షలు లోపు ఉన్న OC పిల్లలు 


వయసు ఎంత ఉండాలి ?

  • ఏ ప్రైవేట్ పాఠశాలల్లో అయితే IB/ICSC/CBSC సిలబస్ ఉంటుందో ఆ పాఠశాలల్లో జాయిన్ అవ్వటానికి తేదీ 01.04.2023 నాటికీ 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
  • ఏ ప్రైవేట్ పాఠశాలల్లో అయితే స్టేట్ సిలబస్ ఉంటుందో ఆ పాఠశాలల్లో జాయిన్ అవ్వటానికి తేదీ 01.06.2023 నాటికీ 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.


ముఖ్యమైన తేదీలు :

  • పాఠశాలలు రిజిస్ట్రేషన్ తేదీలు : 06.03.2023 నుంచి 19.03.2023
  • విద్యార్థుల రిజిస్ట్రేషన్ : 22.03.2023 నుంచి 10.04.2023
  • GSWS డేటా ప్రకారం విద్యార్థుల డేటా పరిశీలన : 13.04.2023 నుంచి 17.04.2023
  • 1st రౌండ్ లాటరీ రిజల్ట్ : 18.04.2023
  • పాఠశాలల్లో పిల్లల జాయినింగ్ Confirmation : 19.04.2023 నుంచి 25.04.2023
  • 2nd రౌండ్ లాటరీ రిజల్ట్ : 29.04.2023
  • పాఠశాలల్లో పిల్లల జాయినింగ్ Confirmation : 01.05.2023 నుంచి 05.05.2023


రిజిస్ట్రేషన్ విధానము 

12(1)(C) అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది విద్యార్థుల ఆధార్ నెంబరు ఆధారంగా ఉంటుంది. విద్యార్థికి ఆధార్ నెంబరు లేకపోతే అప్పుడు వారి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల ( తల్లి మరియు తండ్రి లేని అనాధ పిల్లలకు ) ఆధార నెంబర్ పై రిజిస్ట్రేషన్ అవ్వాలి.

Step 1 : కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Register పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులు తప్పనిసరిగా BPL ఫ్యామిలీ అయి ఉండాలి అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుంది. 

Click Here

Step 2 : రిజిస్టర్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ కు User Name & Password లు వస్తాయి. Change Password చేసుకోవాలి.

Step 3 : లాగిన్ అయిన తరువాత విద్యార్థి లేదా తల్లి తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ నెంబరు ఎంటర్ చేసి GO పై క్లిక్ చేస్తే GSWS Server లొ ఉండే డేటా అనగా పేరు , జిల్లా పేరు ,మండలం పేరు,పంచాయతీ పేరు, మొబైల్ నెంబరు,చిరునామా వస్తాయి. మొబైల్ నెంబర్ ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

Step 4 : ఇతర వివరాలు అనగా PIN Code, E-Mail, DOB, Age, Gender, Religion, Caste, Rice Card Number ( Weaker Section వాళ్లకు తప్పనిసరి) ఎంటర్ చేయాలి.

Step 5 : విద్యార్థి యొక్క వయసు ఐదు సంవత్సరాలు కన్నా ఎక్కువ ఆరు సంవత్సరాల తక్కువ ఉండాలి. 
  • 01.04.2023 నాటికీ 5 సంవత్సరాలు దాటితే CBSC, ICSC, IB, STATE SCHOOLS చూపిస్తాయి. అదే 
  • 01.06.2023 నాటికీ 5 సంవత్సరాలు దాటితే కేవలం State Govt Schools మాత్రమే చూపిస్తాయి.

Step 6 : విద్యార్థి తోబుట్టువులు ఎవరైనా ఉంటే Weather The Applicant Is Having Sibling (YES/NO) లొ YES అని లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. YES అని పెడితే Sibling యొక్క ఆధార్, చదువుతున్న పాఠశాల UDISE కోడ్ ఎంటర్ చేయాలి.

Step 7 :

  • Children With Disability / Special Needs (CWSN)
  • Children Suffering From HIV/AIDS
  • Children is Orphan

పై డేటా ఇవ్వ వలెను.

Step 8 : అప్లికేషన్ చేస్తున్న సమయంలో చిరునామా తప్పుగా ఉన్నట్లయితే చిరునామాను మార్చుకునే అవకాశం ఉంది. దానికిగాను కింద ఇవ్వబడిన ఏదైనా ఒక ప్రూఫ్ అప్లోడ్ చేయాలి.

  •  ఆధార్ కార్డు
  •  ఓటర్ కార్డు
  •  కరెంట్ బిల్లు
  •  టెలిఫోన్ బిల్లు
  • వాటర్ బిల్లు
  • హౌస్ టాక్స్ రసీదు
  • డ్రైవింగ్ లైసెన్సు
  •  ఇంటి రెంట్ అగ్రిమెంట్ కాపీ
  •  రేషన్ కార్డు
  •  ఉద్యోగి సర్టిఫికెట్ 
  •  సంబంధిత ఎమ్మార్వో లేదా లోకల్ అధికారి నుండి సర్టిఫికెట్

పై రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వారికి అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఆ డేటా Save చేసుకోవాలి.

Web Option లు సెలెక్ట్ చేసుకునే విధానము :

విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులు ఉన్నటువంటి చిరునామా నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలో కనిపిస్తాయి. పాఠశాలల సంఖ్య 10 కన్న తక్కువ ఉన్నట్టయితే అప్పుడు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల లిస్టు చూపించడం జరుగును. ఒక కిలోమీటర్లు మరియు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏ ఒక్క పాఠశాల లేనట్టు అయితే అప్పుడు మిగిలిన పాఠశాలల లిస్టు చూపించడం జరుగును. విద్యార్థి యొక్క వయసు ఆధారంగా స్కూల్ ల వివరాలనేవి చూపించడం జరుగును. లిస్టులో నుంచి గరిష్టంగా 10 పాఠశాలను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 

HELP LINE NUMBERS

14417 (Toll free Number)

Downloads :


View More

Post a Comment

3 Comments