IPPB Bank Account Opening Process IPPB Bank Account Opening Process

IPPB Bank Account Opening Process

IPPB Bank Account Opening Process

IPPB Bank Account Opening Process

                             కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అన్ని పథకాలకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదు జమ చేస్తున్నాయి. చాలామందికి బ్యాంకు ఖాతాకు ఆధారు నెంబరు లింక్ అయినప్పటికీ కూడా NPCI Failed, Bank - Aadar Link Fail, Aadar In Active అని వస్తూ వారికి ప్రభుత్వ నుంచి అందవలసిన నగదు అందటం లేదు. అటువంటివారు వారికి నగదు త్వరగా ఖాతాలో పడేందుకుగాను వారికి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులో IPPB బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది రోజులలో నగదు ఖాతాకు జమ అవుతుంది.

ప్రశ్న : పోస్ట్ ఆఫీస్ లొ IPPB బ్యాంకు ఖాతా తెరుచుటకు ఎం కావాలి ?

  •  ఆధార్ కార్డు
  •  పాన్ కార్డు లేదా Form 60
  •  ఖాతా ఓపెన్ చేయు వారి బయోమెట్రిక్ 
  •  ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ OTP

ఆధార్ కార్డుకు , మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
 

ప్రశ్న : బ్యాంకు ఖాతా తెరుచుటకు కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి ?

ఎటువంటి బ్యాలెన్స్ లేకుండానే జీరో మినిమం డిపాజిట్ తో బ్యాంకు ఖాతా తెరవవచ్చు.


ప్రశ్న : IPPB బ్యాంకు ఖాతా తెరుచుటకు ఎంత వయసు ఉండాలి ? 

వయసు 10 సంవత్సరాలు డేటిన ఎవరైనా సరే బ్యాంకు ఖాతాని తెరవవచ్చు.


 ప్రశ్న : ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు తెరవచ్చా ?

 లేదు కేవలం ఒకరి పేరు మీద ఒక కథ మాత్రమే ఓపెన్ చేయాలి.


ప్రశ్న : జాయింట్ బ్యాంకు ఖాతా ఓపెన్ చేయవచ్చా ?

లేదు బ్యాంకు ఖాతా కేవలం ఒకరి పేరు మీద మాత్రమే ఓపెన్ చేయుటకు అవకాశం ఉంటుంది.


ప్రశ్న : IPPB బ్యాంకు ఖాతా వలన ఉపయోగాలు ఏమిటి ?

  • Bill Payments
  • ఇంటి వద్దకే బ్యాంకు సేవలు
  • Instant Money Transfer Through IMPS And Other Remittan Services
  • Virtual debit card
  • QR card 
  • Phone banking
  • SMS banking
  • Free quarterly Email Statements 
  • SMS Alerts


ప్రశ్న : బ్యాంకు ఖాతాకు నామిని ఆప్షన్ ఉంటుందా ?

అవును ఉంటుంది.


ప్రశ్న : బ్యాంకు ఖాతా రన్నింగ్ కొరకు మినిమం బాలన్స్ ఏమైనా మైంటైన్ చేయాలా ?

లేదు బ్యాంకు సురక్షితంగా ఉండేందుకు ఎటువంటి మినిమం బాలన్స్ మెయిన్టైన్ చేయవలసిన అవసరం లేదు.


ప్రశ్న : ఒక నెలలో ఎన్ని సార్లు బ్యాంకు ఖాతా నుంచి నగదు తీసుకోవచ్చు ?

ఎన్నిసార్లైనా నగదు తీసుకోవచ్చు.


ప్రశ్న : నెలలో ఎన్నిసార్లు బ్యాంకు ఖాతాలో నగదు వేసుకోవచ్చు ?

ఎన్నిసార్లు అయినా నగదు వేసుకోవచ్చు.


ప్రశ్న : ఇంటి వద్ద బ్యాంకు సర్వీసులు పొందుటకు కనీస చార్జీ ఎంత ?

ఇంటి వద్ద బ్యాంకు సర్వీస్ పొందుటకు గాను కనీస చార్జీ 20 రూపాయలు.


ప్రశ్న : బ్యాంకు ఖాతాలో గరిష్టంగా ఎంత నగదు ఉండవచ్చు ?

బ్యాంకు ఖాతాలో గరిష్టంగా 2 లక్షల వరకు ఉండవచ్చు.


 ప్రశ్న : బ్యాంకు ఖాతాలో గరిష్ట లిమిట్ అయినటువంటి రెండు లక్షలు దేటితే ఏమవుతుంది ?

మీయొక్క IPPB బ్యాంకు ఖాతాలో రెండు లక్షల గరిష్ట పరిమితి దాటినట్లయితే అప్పుడు మీ యొక్క బ్యాంకు ఖాతాకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ (POSA) అనేది ఓపెన్ అయ్యి ఆ ఎకౌంటుకు నగదు ట్రాన్స్ఫర్ అవుతుంది. POSA ఓపెనింగ్ కొరకు బ్యాంకు మీకు సహాయం చేస్తుంది.


ప్రశ్న : బ్యాంకు ఖాతాకు డెబిట్ కార్డు పొందవచ్చా ?

అవును RuPay Virtual Debit Card ను పొందవచ్చు. IPPB మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ కార్డు ని ఆన్ లైన్ లోనే జనరేట్ చేయవచ్చు.

.

ప్రశ్న : బ్యాంకు ఖాతాకు సంబంధించి వడ్డీని ఎలా లెక్కిస్తారు ?

రోజులో చివరన ఉండే నగదు పై వడ్డీని లెక్కించి నాలుగు నెలలకు ఒకసారి బ్యాంకు ఖాతాలో ఆ నగదును జమ చేస్తారు.


ప్రశ్న : DD సదుపాయం ఉంటుందా ?

లేదు ఉండదు.

.

View More