YSR Free Crop Insurance Scheme YSR Free Crop Insurance Scheme

YSR Free Crop Insurance Scheme

YSR Free Crop Insurance Scheme


YSR Free Crop Insurance Scheme

వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం :


  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రకృతి వైపరీత్యాల కారణంగా నోటిఫై చేయబడిన అన్ని పంటల నష్టానికి రైతులకు పంట బీమా అందించబడుతుంది. 
  • దాదాపు 22 నోటిఫైడ్ పంటలు ఉంటాయి. ఈ పంట బీమా ఉచితంగా ఉంటుంది.
  • గతంలో వైఎస్‌ఆర్‌ ఫసల్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ ప్రయోజనాలు పొందేందుకు రైతులు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. ఈ పథకం కింద, రైతులు ఈ స్కీమ్‌లో నమోదు చేసుకోవడానికి కేవలం 1 రూపాయలు మాత్రమే చెల్లించాలి. 
  • ప్రతి  సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో ఈ కర్షక్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు పంట నష్టం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తోంది. 
  • ఈ సంవత్సరం వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం 2023-24 ద్వారా15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1820.23 బీమా పరిహారం జమ. 
  • వ్యవసాయ ప్రణాళిక ఇన్పుట్స్ రుణ ప్రణాళిక వంటి వాటితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ మరియు పంట నష్టాల తాలూకు ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ పంటల బీమా పథకం తదితర కార్యక్రమాలకు ఈ కర్షక్ నమోదు సమాచారాన్ని ఉపయోగించడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్త తో తప్పు సమాచారమునకు అవకాశం లేకుండా నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  • YSR ఉచిత పంటల బీమా పథకం రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రముఖ పథకం.
  • ఇది 2019 సంవత్సరంలో ప్రారంభించబడింది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయం & సహకార శాఖ ఈ పథకం యొక్క నోడల్ విభాగం.
  • ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు పంట నష్టపోయినప్పుడు వారికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక ప్రధాన లక్ష్యం.
  • ఈ పథకాన్ని వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అని కూడా అంటారు.
  • వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద రైతులు, సాగుదారులు, వాటాదారులు మరియు కౌలు రైతులందరూ అర్హులు.
  • వైఎస్ఆర్ ఉచిత ఫసల్ బీమా యోజన పథకం కింద నమోదు చేసుకోవడానికి లబ్ధిదారుడు రూ.1 టోకెన్ మొత్తంగా చెల్లించాలి.
  • ఇప్పుడు YSR ఉచిత బీమా పథకం దిగుబడి ఆధారిత పంటల బీమా మరియు వాతావరణ ఆధారిత పంటల బీమాగా విభజించబడింది.
  • దిగుబడి ఆధారిత పంట బీమా క్లెయిమ్‌లు హార్వెస్ట్ తర్వాత నష్టాల ఆధారంగా పరిష్కరించబడతాయి.
  • అయితే వాతావరణ ఆధారిత పంట బీమా క్లెయిమ్‌లు సముచిత అధికారం అందించిన వాతావరణ డేటా ఆధారంగా పరిష్కరించబడతాయి.
  • వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు:- 
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా రైతు బంధు కేంద్రం/మీసేవా కేంద్రాలు.
  • తమను తాము నమోదు చేసుకోవడం ద్వారా నవశకం లబ్ధిదారుల నిర్వహణ పోర్టల్


Features & Benefits Of YSR Free Crop Insurance Scheme :

వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం లక్షణాలు & ప్రయోజనాలు :

  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని 2019 లో ప్రారంభించారు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు పంటల బీమాను అందజేస్తుంది.
  • AP YSR ఉచిత పంటల బీమా పథకం కింద, రైతులకు RS 1252 కోట్లు బీమా లభిస్తుంది.
  • ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలను ఈ విధానంలో కవర్ చేస్తారు.
  • ఈ పథకం దాదాపు 22 నోటిఫైడ్ పంటలకు వర్తిస్తుంది.
  • ఈ పథకం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది.
  • ఈ స్కీమ్‌లో ఒక పర్యాయ నమోదు రుసుము ₹1.
  • ఈ పథకం ప్రయోజనం పొందేందుకు రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు
  • 2019-2020 సంవత్సరంలో దాదాపు 49.80 లక్షల మంది రైతులను బీమా కింద కొనుగోలు చేశారు
  • దాదాపు 10641 రైతు భరోసా కేంద్రాల సహాయంతో ఈ పథకం అమలు చేయబడుతుంది.
  • వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కింద క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా రైతు బ్యాంకుకు జమ చేయడం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది.
  • రైతు భరోసా కేంద్రం సోషల్ ఆడిట్ చేయడంలో మరియు తప్పిపోయిన వారి జాబితాను సిద్ధం చేయడంలో సహాయకరంగా ఉంటుంది, తద్వారా వారు రైతు భరోసా కేంద్రంలోనే నమోదు చేసుకోవచ్చు.
  • 2020 క్లెయిమ్ వ్యవధిలో నష్టపోయిన అన్ని పంటలకు మే 2021న పరిహారం అందించబడింది.
  • ఈ కార్యక్రమం దాదాపు 56 లక్షల హెక్టార్ల భూమిని కవర్ చేస్తుంది.
  • వీటన్నింటితో పాటుగా మొలకెత్తిన మరియు రంగు మారిన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.


Objective Of Free Crop Insurance Scheme :

వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం లక్ష్యం :

  • భారీ వర్షాలు, అనావృష్టి, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉచిత ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. 
  • ఈ పథకం కింద రూ. 9.48 మంది రైతులకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.1252 కోట్లు అందించనున్నారు. 
  • ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం రైతులపై ఆర్థిక భారం కలిగించే భారీ ప్రీమియం మొత్తాలను చెల్లించకుండా కాపాడటం. 
  • పాలనలో పారదర్శకతను తదుపరి స్థాయికి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీంతో పాటు ప్రభుత్వం గ్రామ సచివాలయంలో 10,641 రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించి రైతులకు మేలు చేసేలా పరిహారం అందజేస్తుంది.



వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కొరకు ఈ కర్షక్ లో నమోదు చేయడం ఎలా ? 


  • గ్రామ సచివాలయం లో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హెచ్ లేదా sa6 సమన్వయంతో తమ పరిధిలో ఉన్న రైతులు తాము వేసిన పంటల తాలూకు వివరాలను మొబైల్ అప్లికేషన్ నందు నమోదు చేయాలి.
  • సీజన్ వారీగా ఖరీఫ్ రబీ మరియు వేసవి పంట కాలంలో విడివిడిగా నమోదు చేయాలి.
  • సదరు గ్రామ సచివాలయ స్థాయిలో నమోదు ప్రక్రియను సంబంధిత వ్యవసాయ అధికారి పర్యవేక్షించి నమోదైన డేటాను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఆధిక్యతను చేయవలసి ఉంటుంది.
  • సంబంధిత సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు జిల్లా జెడిఎ కార్యాలయం నందలి ఒక బాధ్యతాయుత అధికారి ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పర్యవెక్షించవలసి ఉంటుంది.
  • ఇందుకుగాను జిల్లా జెడి గారు తమ కార్యాలయంలో పనిచేయుచున్న ఒక నోడల్ అధికారిని నియమించి కమిషనరేట్కు తెలియపరచాలి.
  • ఈ పంట నమోదు చేయు సమయంలో తప్పనిసరిగా పాటించవలసిన విషయాలు:
  • సాగు దారు రైతు యొక్క ఆధార్ నంబర్ నమోదు.
  • సర్వే నంబర్ యొక్క జియో కోఆర్డినేట్ ఉంటాయి కనుక నమోదు ప్రక్రియ తప్పనిసరిగా పంట వేసిన క్షేత్రం నుండి మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది.
  • నమోదు ప్రక్రియలో పట్టాదార్ ఏ సాగు చేస్తున్నప్పుడు వారి వివరములు నమోదు చేయవలసిన ఉంటుంది కానీ పట్టాదారు తాగుతారు వేరువేరుగా ఉన్న విషయంలో సాగు దారు వివరములు మాత్రమే నమోదు చేయాలి.
  • సాగు దారు సాగు చేయు అన్ని పంటల వివరాలు ఈ కర్షక్ లో నమోదు చేయవలసి ఉంటుంది.
  • అనగా వ్యవసాయ ఉద్యానవన పౌడర్ క్రాప్స్ మరియు పట్టు పరిశ్రమ పంటలన్నింటినీ నమోదు చేయాలి.
  • అంతరపంటలు నమోదు చేయునపుడు అంతర పంటలు వేసిన పంటలు నిష్పత్తి క్రమంలోనే పంట పేరు నమోదు చేయాలి.
  • ఉద్యాన పంటల నందు అంతర పంటలుగా ఉంటే వేసిన రెండు పంటలకు పూర్తి విస్తీర్ణం నమోదు చేయాలి.
  • ఒక రైతు ఒకే సర్వే నెంబర్లో ఉన్న విస్తీర్ణంలో మొత్తం లో ఒకటి కంటే ఎక్కువ పంటలు వేసినప్పుడు యాడ్ క్రాప్ ఆప్షన్ నందు వేసిన పంటల విస్తీర్ణం ప్రకారం విడివిడిగా నమోదు చేసి విడివిడిగా ఫోటో అప్లోడ్ చేయి ఆప్షన్ ఉంది.
  • వెబ్ లాండ్ లో గాని సి సి ఆర్ సి లో గాని రైతు పేరు లేకుండా ఉండి పంట నమోదు ప్రక్రియలో పార్టీ రైతు వచ్చినప్పుడు పూర్తి ఆధారాలను పరిశీలించి తృప్తి చెందిన తర్వాత యాడ్ ఫార్మర్ ఆప్షన్లు నమోదు చేయాలి.
  • విస్తీర్ణము తాలూకు వివరాలు నమోదు చేసుకొన వచ్చును.
  • కౌలు రైతులకు సి సి ఆర్ సి కార్లు ఇప్పించుట కు భూ యజమాని రైతులను వీలు అయినంత వరకు తగిన భరోసాతో ఆమోదం కొరకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ సదరు భూ యజమాని తిరస్కరించినప్పుడు వాస్తవ సాగుతారు అనగా కౌలుదారు వివరములు తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది.
  • దీర్ఘకాలిక పంటలు అనగా పండ్లు పూలతోటలు నమోదు విషయంలో వయసు నమోదు చేయు ఆప్షన్ పంట విత్తనాలు తేదీతో పాటు గా ఇవ్వడం జరిగింది.
  • నమోదు చేయు అధికారి పంటల నమోదు ఆఫ్లైన్ నందు నమోదు చేసి తప్పులు సవరించి ఇంటర్నెట్ ఉన్న ప్రదేశంలో దానిని అప్లోడ్ చేసే అవకాశం కల్పించబడినది రచయిత అప్లోడ్ చేసే డేటా నందు తప్పులు దొరల డానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి.
  • ఒక రోజుకు 75 నుంచి 100 కోట్లు మాత్రమే నమోదు చేయటానికి వీలు కల్పించడం మూలంగా నమోదు చేయు అధికారి అత్యంత జాగరూకతతో వాస్తవ విషయాలను నమోదు చేయడానికి అవకాశం కలదు.
  • గోదావరి డెల్టా కృష్ణా డెల్టా ప్రాంతాలలో వరి పొలం గట్ల మీద వేసిన ఉద్యాన పంటల జట్ల సంఖ్యను నమోదు కొరకు ఆప్షన్ కల్పించడం.
  • ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఈ కేవైసీ విధానమును జోడించడం ముఖ్యమైనది నమోదు చేసిన ప్రతి రైతు యొక్క బయోమెట్రిక్ విధానం ద్వారా బొటనవేలి ముద్ర తీసుకోవడం వలన ప్రతి రైతు వాస్తవ సమాచారం నమోదు అవుతుంది.
  • అర్బన్ ప్రాంతాలలో కలిసిన రూరల్ ప్రాంతాల్లో తాలూకు పంటల నమోదు ప్రక్రియ ఆయ పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తో నమోదు చేయవలసి ఉంటుంది.
  • జె డి ఏ వారి కార్యాలయం నుండి ఇ నోడల్ అధికారి ఎ డి ఎ కార్యాలయంలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వారు ఎప్పటికప్పుడు నమోదు ప్రక్రియను రోజువారి పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ నిర్వహించవలసి ఉంటుంది.

  • ఈ విధంగా నమోదు చేసిన డేటాను మనము ముందు వివిధ పథకాల నిర్వహణ ఉపయోగించడం జరుగుతుంది అనగా పంటల భీమా తాలూకు నష్టపరిహారం వివిధ ప్రకృతి వైపరీత్యాల వలన జరిగే నష్టం పెట్టుబడి రాయితీ ఇతర అన్ని రాయితీలు రైతుల నుండి కొనుగోలు కు సంబంధించిన విషయంలో నూ దీనిలో నమోదైన రైతులు నుండి మాత్రమే తీసుకోబడుతుంది.
  • నమోదు ప్రక్రియ సజావుగా జరగడానికి నమోదు ప్రక్రియకు ముందు గ్రామంలో రైతులు అందరికీ తెలిసే విధంగా దండోరా ఇచ్చినట్లయితే నమోదు ప్రక్రియలో రైతుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోనవచ్చును.
  • పంట నమోదు ప్రక్రియ యొక్క ఆవశ్యకత గురించి రైతులకు అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం ఉంది. కావున అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
  • నమోదు ప్రక్రియకు సంబంధించి VAA లేదా VHA లేదా VSA మరియు వీఆర్వోలకు లాగిన్ పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. అదనంగా ఇందులో ఇన్ వాళ్లు అయినా ఇతర ముఖ్యమైన అధికారులకు కూడా లాగిన్ పాస్వర్డ్ ఇవ్వబడుతుంది.
  • ఏదైనా పంటల నమోదు ప్రక్రియలో తప్పులు దొర్లడం గమనించినప్పుడు జెడిఎ ఆఫీస్ నందు నియమింపబడిన నోడల్ అధికారి అనుమతితో మాత్రమే సవరణ చేయడానికి అవకాశం కల్పించబడింది.

ముఖ్యమైన వైయస్సార్ ఉచిత పంటల బీమా పథక లింక్ లు :
Important YSR Free Crop Insurance Scheme Links : 

  • ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి స్టేటస్ ను చెక్ చేయండి - Check Free Crop Insurance Bima Status : Click Here

  • 2022 ఖరీఫ్, 2022-23 రబీ కాలానికి సంబందించిన భీమా చెక్ చేయండి - Download area and crop wise crop insurance amount in Ap : Click Here 

  • E-CROP Status Checking link Breaking [ పై లింక్ ని క్లిక్ చేసి kahrif/Rabi➔ మీ జిల్లా ➔ మీ మండలం ➔ గ్రామం ➔ ఖాతా నెంబర్/సర్వే నంబర్ ఎంటర్ చేసి మీ వివరాలు చూడవచ్చు ]: Click Here  

  • Pantala Bheema Scheme 2022 New GO on Kharif 2021 guidelines: Click Here  

  • Crop insurance Dashboard list పంటల బీమా లబ్ధిదారుల జిల్లాల వారిగా రిపోర్ట్ : Click Here  

  • రైతు భరోసా పీఎం కిసాన్ లింక్ కొరకు క్లిక్ చేయండి: Click Here