AP Govt Education Survey 2023
CR మొబైల్ అప్లికేషన్ ఎడ్యుకేషన్ సర్వేకు సంబంధించి మార్పులు జరగడం జరిగినది. కొత్తగా- Available in the state (రాష్ట్రములో ఉన్నారు)
- Migrated Outside The State (రాష్ట్రము దాటి వలసలో ఉన్నారు)
- సర్వే పూర్తి అవ్వని వారి లిస్టులో "Yet To Be Enrolled
Yet To Be Enrolled :
- ఏ విద్యార్థులకైతే రాష్ట్రంలో అందుబాటులో ఉండి 12వ తరగతి లేదా సమానమైన విద్యను పూర్తి చేయలేదు అని సర్వే చేశారో అన్ని కూడా "Yet to be Enrolled" కేటగిరీ లోకి వెళ్తాయి. అవన్నీ కూడా నలుపు రంగు టిక్ మార్క్ తో చూపిస్తాయి.
- Yet To Be Enrolled లొ ఉన్న విద్యార్థుల వివరాలు రాష్ట్ర విద్యార్థుల వివరాలతో వెరిఫికేషన్ జరిగి వారు యాక్టివ్ లో ఉన్నట్టయితే Enrolled Category (సర్వే పూర్తి అయ వారు) లోకి వెళ్తాయి .అవన్నీ కూడా పచ్చ రంగు టిక్ మార్క్ తో చూపిస్తాయి.
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వారి సూచనల మేరకు
- ప్రతి గ్రామ/ వార్డు సచివాలయం పరిధిలోని వలంటీర్ తమకు కేటాయించిన 50 గృహాలను సందర్శించి 1 సెప్టెంబర్ 2005 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన పిల్లల వివరాలు సేకరించి, 18 నుండి 23 సంవత్సరాల వయసు వారు కాలేజీలో చేరేలా చర్యలు చేపట్టాలి.
- ప్రతి బిడ్డ 1 నుంచి 12వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించారా లేదా అని పరిశీలించాలి.
- వందశాతం అక్షరాస్యత, వంద శాతం GER పెంపు లక్ష్యం దిశగా WEAs, అధికారులు అడుగులు వేయాలి.
గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి కొత్త సర్వే కు సంబంధించి ఉత్తర్వులు విడుదల అవటం జరిగినది . సర్వేకు Education Survey అని పిలవడం జరుగును. ఈ సర్వేను వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఎవరైతే 5 నుండి 18 సంవత్సరాల మధ్య ఉంటారో వారికి చేయవలసి ఉంటుంది. సర్వే కి సంబంధించి ఆప్షన్స్ కూడా అప్లికేషన్లో చూపించడం జరుగుతుంది.
గ్రామ వార్డు వాలంటీర్లు CR Mobile App లొ చేస్తున్న GER సర్వే (ఎడ్యుకేషన్ సర్వే) కు సంబందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ వారు కొన్ని ఉత్తర్వులు అందించారు.
వాలంటీర్లు ముందుగా సర్వే చేసిన వాటిలో
- వలస
- గర్తించనివి
- మరణం
- సచివాలయం లొ అందుబాటులో ఉండి పూర్తి చేసిన
12th లేదా సమాన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సమాచారాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి నమోదు డేటాతో సరిపోల్చుకొని వాటిని మరల సర్వే చేయుటకు గాను తిరిగి వాలంటీర్ల మొబైల్ అప్లికేషన్ లకు ఫార్వర్డ్ చేయడం జరిగినది. తిరిగి వాటిని సరిగా సర్వే వాలంటీర్లు పూర్తి చేయవలసి ఉంటుంది.
సర్వే చేయు విధానము :
Step 1 : సర్వేను Consistent Rhythm అనే యాప్ లో చేయవలసి ఉంటుంది. కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ లో ఈ సర్వేకు సంబంధించి ఆప్షన్ చూపించడం జరుగుతుంది కావున కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.
Step 2 : పైన ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత User Name & Password అడుగుతుంది.
Username అంటే సచివాలయం కోడ్ + క్లిస్టర్ కోడ్ అని అర్థము. ఉదాహరణకు సచివాలయం కోడ్ 10190303, వాలంటీర్ క్లస్టర్ 2 అయితే అప్పుడు User name 10190303002 అవుతుంది .
Password వద్ద గతం లొ మీరు పెట్టిన Password ఎంటర్ చేయాలి.
Password మర్చి పోతే ?
- Forgot Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Username వద్ద మీ Username ఎంటర్ చేయాలి. Request Reset Link పై క్లిక్ చేయాలి. మీరు ముందుగా ఇచ్చిన మెయిల్ కు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు . లేదా
- Home Page లొ ఉన్న Mobile Number Login అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు వాలంటీర్ గా జాయిన్ అయిన సమయం లొ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Captcha కోడ్ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ కు OTP వస్తుంది . ఆ OTP ఎంటర్ చేసాక లాగిన్ అవుతుంది. లేదా
- పై రెండు ఆప్షన్ల ద్వారా లాగిన్ అవ్వకపోతే సచివాలయం లొ WEA వారి CR యాప్ లొ లాగిన్ అయ్యాక HOME PAGE లొ Utility పై క్లిక్ చేయాలి. తరువాత Reset CR Password Of Volunteer పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Cluster Code, Password, Confirm Password ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. Password ఎంటర్ చేసే టైం లొ Small Letter, Capital Letter, Special Character, Number ఉండేలా చూసుకోవాలి.
Step 3 : లాగిన్ అయిన తరువాత వాలంటీర్ క్లస్టర్ పరిధిలో 5-18 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి వివరాలు పేర్లతో చూపిస్తుంది.
Step 4 : ఎవరికి అయితే సర్వే చెయ్యాలో వారి పేరు పై క్లిక్ చేయాలి.ఒక ప్రశ్న చూపిస్తుంది.
వ్యక్తి యొక్క ప్రస్తుత సమాచారం తెలియజేయండి?'
- రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు
- వ్యక్తి వలస వెళ్ళారు.
- మరణించారు.
- గుర్తించబడలేదు
పై ఆప్షన్లు అనుగుణంగా ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు అని సెలెక్ట్ చేస్తే
12వ తరగతి లేక ఇతర సమానమైన తరగతి పూర్తి చేసారా?
అని అడుగుతుంది. ఇంటర్ లేదా ఇంటర్ కు సమానమైన కోర్స్ పూర్తి చేసినట్లయితే అప్పుడు మాత్రమే అవును అని సెలెక్ట్ చేయాలి. లేకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయాలి.
100% GER Badge సమాచారం :
కొత్తగా అప్డేట్ అయినా మొబైల్ అప్లికేషన్ లో "100% GER Badge" ను Add చేయటం జరిగింది. GER 100% పూర్తి చేసిన వాలంటీర్లు, WEA & WEDPS వారికి ఈ బ్యాడ్జ్ ఇవ్వటం జరుగుతుంది. GER అనగా ఆంగ్లం లొ GROSS ENROLMENT RATION అనగా స్థూల నమోదు నిష్పత్తి. అంటే చదువుకోవలసిన వయసు కల పిల్లల మొత్తంలో ఎంతమంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్నారు అనే విషయాన్ని తెలుపుతుంది. చదువుకోవలసిన పిల్లలు అందరూ కూడా ప్రస్తుతం విద్యాసంస్థల్లో జాయిన్ అయి చదువుతున్నట్లయితే అప్పుడు 100% GER సాధించినట్టు అర్థం.
వాలంటీర్లు బ్యాడ్జ్ పొందుటకు అర్హతలు :
వాలంటీర్ వారి క్లస్టర్ పరిధిలో ఇవ్వబడిన అందరికీ సర్వే పూర్తి చేసిన తరువాత, సంబంధిత డిపార్ట్మెంట్ వారు మూల్యాంకనం పూర్తి అయిన పిదప వలస లో ఉన్న, మరణించిన, గుర్తుపట్టలేని పిల్లలు మినహా సంబంధిత వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్న మిగతా పిల్లలు అందరూ కూడా ఏదైనా విద్యాసంస్థలో జాయిన్ అయినట్టయితే అప్పుడు సంబంధిత వాలంటీర్ కు పసుపు రంగు బ్యాడ్జి ఇవ్వటం జరుగుతుంది.
WEA / WEDPS వారు బ్యాడ్జ్ పొందుటకు అర్హతలు :
సచివాలయ పరిధిలో వాలంటీర్లు అందరూ కూడా 100% GER Badge పొందినట్టు అయితే అప్పుడు పసుపు రంగు GER బ్యాడ్జ్ ను వారి సచివాలయం సాధించినట్టు అర్థము.
ప్రశ్నలు - సమాధానాలు :
ప్రశ్న 1 : CR యాప్ లో వాలంటీర్ సర్వే చేసేటప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశారా లేదా అన్న వాటికి ఇంటర్ చదువుతూ ఉన్నా లేక ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి నో పెట్టీ సబ్మిట్ చేయడం జరిగింది, కానీ ఆ స్టూడెంట్స్ చాలా మంది ఇపుడు ఇంటర్, పాలిటెక్నిక్, gnm కోర్స్, ఐఐఐటి చదువుతూ ఉన్నారు అలాంటి వారివి CR యాప్ లోవైట్ కలర్ లో ఉండటం వల్ల వాలంటీర్స్ కి గ్రీన్ BADGES రావడం లేదు ?
సమాధానం : ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 1 నుండి 10 చదువుతున్న వారి వివరాలు మాత్రమే వస్తున్నాయి . ఇంటర్మీడియట్ మరియు ఇతర కోర్సులు చదువుతున్న వారి వివరాలు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు . క్లస్టర్ పరిధిలోని వారందరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డేటా లో వుంటే వారికి GER బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది.
ప్రశ్న 2 : అలాగే కొంతమంది పిల్లలు స్కూల్ ఆల్రెడీ చదువుతూ ఉన్నారు, CHILD INFO లో నమోదు అయి కూడా ఉన్నారు, అలాంటి వారివి కూడా వైట్ కలర్ లో చూపిస్తున్నాయి?
సమాధానం : చైల్డ్/స్టూడెంట్స్ ఇన్ఫో పోర్టల్ డేటా అనేది రోజు అప్డేట్ అవడం జరుగుతూ ఉంటుంది. If an individual is updated as "Active" in the Child/students info portal , automatically he/she will be shown with "Green" tick mark.
ప్రశ్న 3 : అలాగే కొంతమంది వి వాలంటీర్ హౌస్ హోల్డ్ MAPPING లో ఏజ్ తక్కువ చూపించడం వల్ల వాళ్ళ పేర్లు కూడా సర్వే కి వచ్చినవి, వారివి కూడా పెండింగ్ ఉన్నాయి , BELOW 6YEARS అంగన్వాడీ కి వెళ్తున్న పిల్లల వి కూడా పేర్లు వచ్చాయి , ఇటు వంటి వారివి WHITE కలర్ నుండి గ్రీన్ కలర్ కి ఏ విధంగా గా మారతాయి SIR, ఇలా చాలా పెండింగ్ ఉండటం వాళ్ళ వాలంటీర్స్ కి గ్రీన్ BADGE రావడం లేదు, వీటికి సొల్యూషన్ ఏంటి ?
సమాధానం : ఇటువంటి ఇబ్బందులను GSWS డిపార్ట్మెంట్ దృష్టికి చేరవేస్తాము.
ప్రశ్న 4 : వాలంటీర్స్ రాంగ్ గా సర్వే చేసి ఉంటే అవి ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారా ?
సమాధానం : GSWS డిపార్ట్మెంట్ నుండి అనుమతి లభిస్తే నెక్స్ట్ వెర్షన్ నందు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము
REPORT LINK