GSWS Testimonials Update on Public app
Latest Update :
- రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పబ్లిక్ మొబైల్ అప్లికేషన్ను మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని మీ సచివాలయ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, లబ్ధిదారుల టెస్టిమోనిల్, మీ సచివాలయ పరిధిలో అందిస్తున్న సేవలు, కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండవలెను.
- ముందుగా ఈ అప్లికేషన్ కు పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారికి మాత్రమే లాగిన్ సదుపాయం ఉండేది అతి త్వరలో సచివాలయ ఉద్యోగులు అందరికీ కూడా లాగిన్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.
- సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా మీ సచివాలయ పరిధిలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలను ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా అప్డేట్ చేయించవచ్చు.
- అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు మీ యొక్క మొబైల్ లో పబ్లిక్ మొబైల్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని మీ సచివాలయానికి సంబంధించి సెక్రటరీ వారి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి సచివాలయ పరిధిలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, లబ్ధిదారుల టెస్టిమోనియాలో , విజయ గాధలు అన్నియు ఈ మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలి . అదేవిధంగా వాలంటీర్లు వారి యొక్క పరిధిలో అందరికీ కూడా ఈ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి, సచివాలయ ఎకౌంటును ఫాలో అవ్వవలసిందిగా తెలియజేయండి. ఈ విధంగా తెలియజేయడం వలన సచివాలయ పరిధిలో అందించే అన్ని సర్వీస్ లు, సేవలు, మీటింగులు, సంక్షేమ పథకాల సమాచారం వెంటనే అందుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ / వార్డు స్థాయిలో పరిపాలనను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుండి టెస్టిమోనియల్ లను బెనిఫిసరి అవుట్ రీచ్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తుండడం తెలిసినదే. గ్రామ వార్డు వాలంటీర్ల, ప్రభుత్వ పథకాలను అందుకుంటున్న లబ్ధిదారుల మరియు గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, సర్వీసులు ను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఉండేందుకు ఇకనుంచి టెస్టిమోనియాలను Public అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుంది.
Public App ప్రత్యేకతలు :
- Public అనే మొబైల్ అప్లికేషన్ను Inshorts సంస్థ నిర్వహిస్తుంది.
- ఈ అప్లికేషన్ ద్వారా ఉచితంగా వాలంటీర్ల మరియు వివిధ పథకాల లబ్ధిదారుల టెస్టిమోనియాలను అప్లికేషన్లో అప్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ అప్లికేషన్ ను ఉపయోగించి గ్రామ వార్డు సచివాలయాల్లో రోజు వారీగా జరుగుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు మరియు ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది.
- ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి పోస్ట్ చేసిన ప్రదేశం నుంచి 15 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరైనా వీడియో / ఇమేజ్ / సందేశం ను చూడవచ్చు.
- సంబంధిత సచివాలయ సెక్రెటరీ వారు పోస్ట్ చేసే విషయాలను 15KM రేడియస్ దూరంలో ఉండే Public అప్లికేషన్ వాడే ప్రజలు చూడవచ్చు.
గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి , వార్డు సచివాలయాల్లో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు ఈ మొబైల్ అప్లికేషన్ లో లాగిన్ అయ్యి ఎప్పటికీ అప్పుడు వాలంటీర్ల మరియు వివిధ పథకాల లబ్ధిదారుల టెస్టిమోనియాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
Public Mobile App ఉపయోగించు విధానము :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 2 : ఇక్కడ ఇవ్వబడిన ఫైల్ లో పంచాయతీ కార్యదర్శుల వివరాలు సచివాలయం వారీగా ఇవ్వటం జరిగినది . అందులో User Name (Sachivalayam Code -PS), Email ID & Bio (Designation),PS Name ఉంటాయి వాటిని నోట్ చేసుకోవాలి - Click Here to Download File
Step 3 : App ఓపెన్ చేసాక E-mail / GMail / Facebook ద్వారా Sign in అవ్వాలి.లొకేషన్ అనుమతి ఇవ్వాలి.
Step 4 : Profile లోకి వెళ్లేందుకు ఆప్షన్ బార్ లొ కుడివైపు చివర ఉన్నా ప్రొఫైల్ సింబల్ పై క్లిక్ చెయ్యండి.
Step 5 : Edit Profile పై క్లిక్ చేసి ప్రొఫైల్ ఫోటో మరియు బయోలో మార్పులు చెయ్యండి. Save పై క్లిక్ చెయ్యండి.
Step 6 : Save చేసాక మీ ప్రొఫైల్ ఆమోదం చెందుతుంది. అప్పుడు ప్రొఫైల్ లొ + ఆప్షన్ పై క్లక్ చేసి Text రూపంలో సందేశం ఇవ్వాలి అనుకుంటే 240 అక్షరాలు అదే ఫైటో / వీడియో పోస్ట్ చేయాలి అంటే గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసి 120 అక్షరాల వరకు అవకాశం ఉంటుంది. వీడియో లొకేషన్ ఎంచుకోవాలి. Post Type ఎంచుకొని Send / సమర్పించండి పై క్లిక్ చేయండి.
Step 7 : OTP కోసం మొబైల్ నెంబర్ నమోదు చేయండి అని యాప్ అడుగుతుంది (KYC కోసం) ఓటిపి నమోదు చేశాక యాప్ లో మీ వీడియోస్ అప్లోడింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్లోడింగ్ పూర్తి అయిన తర్వాత మీ ప్రొఫైల్లో వీడియో కనిపిస్తుంది . మీ వీడియోని Save / Delete / Remove చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీడియోను షేర్ చేయాలి అనుకుంటే షేర్ ఆప్స్ పై క్లిక్ చేసి షేర్ చేయవచ్చు.
Public App లొ ఎటువంటి విషయాలను షేర్ చేయాలి :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి టెస్టిమోనియల్. అనగా వారి యొక్క అభిప్రాయము.
- సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ ప్రకారం రోజువారి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వీడియో రూపంలో అప్లోడ్ చేయవచ్చు.
- ప్రజలు సర్వీస్ పొందే సమయంలో వారితో సంభాషించే విషయాలను ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయవచ్చు.
- కాలానుక్రమంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ సర్వేలను వీడియో రూపంలో లేదా ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయవచ్చు (COP, SDG,NCD DC మొదలు..)
- దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో, హాస్టల్ అంగన్వాడి సెంటర్లు మొదలగు వాటిని అధికారులు విసిట్ చేసే సమయంలో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేయవచ్చు.
- సచివాలయ పరిధికి ఫ్యామిలీ డాక్టర్ సందర్శించినప్పుడు ఆ డేటాను అప్లోడ్ చేయవచ్చు
- సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఏదైనా పథకానికి సంబంధించి లేదా సర్వీస్కు సంబంధించి సమాచారాన్ని అందించవచ్చు .
Public App లొ ఎటువంటి విషయాలను షేర్ చేయకూడదు :
- ద్వేషపూరిత ప్రసంగం, దోపిడీ ప్రవర్తన, గ్రాఫిక్ హింస, హానికరమైన దాడులు మరియు ప్రచారం చేసే కంటెంట్
- హానికరమైన లేదా ప్రమాదకరమైన ప్రవర్తన.
- వీక్షకులకు ఎలాంటి విద్య లేదా వివరణను అందించని హింసాత్మక దోపిడీల వంటి నేరాల ఫుటేజీ.
- ఇతర సంఘం సభ్యులు, రాజకీయ కార్యకలాపాలపై వ్యక్తిగత దాడులు చేయండి.
- పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను ఉపయోగించడం లేదా ఇతరులపై తప్పుడు ప్రకటనలు చేయడం.
- అసభ్యకరమైన, అభ్యంతరకరమైన, అపవిత్రమైన, వివక్షత, తప్పుదారి పట్టించే, చట్టవిరుద్ధమైన లేదా బెదిరింపు వ్యాఖ్యలు.
- అత్యంత ప్రమాదకరమైన సవాళ్లు, లైంగిక వేధింపులు.
- ప్రమాదకరమైన లేదా బెదిరించే చిలిపి పనులు, ఉద్దేశపూర్వక శారీరక హాని, ఎవరైనా వెంటనే అనుభూతి చెందేలా చేయడం ప్రమాదం.
- ప్రజలకు మానసిక క్షోభ.
Public App లొ షేర్ చెయ్యకూడని సమాచారం పోస్ట్ చేసినట్లయితే ఏమవుతుంది :
- ఏదైనా సమాచారం తప్పుగా ఉన్నట్టయితే ఆ పోస్ట్ ని డిలీట్ చేయడం జరుగుతుంది మరియు ఏదైనా లింకు సరి కాదని తెలిసిన వెంటనే ఆ లింకు రిమూవ్ చేయడం జరుగుతుంది.
- ఎక్కువసార్లు తప్పుడు సమాచారం చేసినట్లయితే ఆ సంబంధిత వారిపై డిపార్ట్మెంట్ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.