Ammavodi Scheme 2023 Application Status , Time Lines , Eligibility Criteria , Payment Status
1.Recent Updates :
- అమ్మఒడి పథకం 2023-24 కు సంబందించి పేమెంట్ పడని వారందరికీ మరలా ప్రాసెస్ చెయ్యటం జరిగింది. వారి పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ లొ వచ్చే బుధవారం లోపు అప్డేట్ అవుతుంది.
- అమ్మ ఒడి డబ్బులు అందలేదు అని నిరాశ చెందిన లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.... తప్పుగా ఆధార్ను సీడింగ్ చేయడం వల్ల, విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు, భూమి మొదలైన అర్హత ప్రమాణాల కారణంగా సిక్స్ స్టెప్ వాలిడేషన్ లో తప్పుగా అనర్హులుగా గుర్తించిన వారికి నవశకం పోర్టల్ లో grievances చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
- బ్యాంక్ ఖాతాలను తప్పుగా నమోదు చేయడం వంటి బ్యాంక్ ఖాతా వైఫల్యాల కారణంగా నంబర్లు, తప్పుడు IFSC కోడ్ లు, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కాని సీడింగ్, నాన్-యాక్టివ్ బ్యాంక్ ఖాతాలు వారికి నవశకం పోర్టల్ లో grievances చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
- అమ్మ ఒడి పథకానికి సంబంధించి పేమెంట్ పడలేదు అని జగనన్న సురక్ష కార్యక్రమంలో పిర్యాదులు చేసిన 14,836 మంది లబ్ధిదారులకు ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి అమౌంట్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
- జగనన్న అమ్మఒడి పథకం 2023-24 సంవత్సరానికి సంబంధించి పేమెంట్ క్రెడిట్ అయిన వారి వద్ద నుండి డిజిటల్ Acknowledgment తీసుకునే సమయంలో కొత్తగా అప్డేట్ అయినా బెనిఫిసరి అవుట్రిచ్ V15.3 మొబైల్ అప్లికేషన్ లొ తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యుల ధ్రువీకరణ తీసుకుంటుంది.
- Mother And Other అనే ఆప్షన్ అమ్మఒడి అమౌంట్ Mother A/C కాకుండా వేరే వారి A/C అంటే Father/Gurdian A/C లో క్రెడిట్ అయింది అలాంటి వారికి మాత్రమే పై ఆప్షన్ చూపిస్తుంది.
- అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి, payment details update చేయడం జరిగింది. NBM Portal - WEA/WWDS /DA/WEDPS login - NBM reports - R1.7 'Jagananna Ammavodi 2023 -MIS report' నందు payment వివరాలు కూడా అప్డేట్ చేయడం జరిగింది.
- "SC Intermediate Students" - Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు,, మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate - SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.ఒక తల్లికి, Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.
- "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో నగదు జమ" - 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.9-12 వ తరగతులకు, సంబందించి, ST community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.
- జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి MIS రిపోర్ట్ (R1.7) ను NBM పోర్టల్ WEA/WWDS/DA/WEDPS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.
- తేదీ ఆగష్టు 3 నాటికి ఇంకను 68,441 e-KYC పెండింగ్ ఉన్నాయి . e-KYC పూర్తి అయ్యే వరకు వారికీ పేమెంట్ ప్రాసెస్ అవ్వవు . కావున రానున్న రెండు రోజుల్లో వారికీ e-KYC పూర్తి చేస్తే వారికీ అమౌంట్ క్రెడిట్ అవుతుంది . వాలంటీర్ వారీగా రిపోర్ట్ లింక్ కింద ఇవ్వటం జరిగింది . పెండింగ్ లిస్ట్ - Click Here
- అందరు లబ్ధిదారులకు పేమెంట్ ప్రాసెస్ పూర్తి అయినది.
- NBM టీం వారు ఈ వారం లోపు పోర్టల్ లొ పేమెంట్ స్టేటస్ అప్డేట్ చెయ్యటం జరుగును.
- ఇప్పటికి ఏ లబ్ధిదారుని ఖాతా లొ నగదు జమ కాకపోతే వారికి NBM పోర్టల్ లొ అర్జీ లను "పేమెంట్ క్రెడిట్ అవ్వలేదు" అనే ఆప్షన్ ద్వారా పెట్టవలెను.
- NPCI లింక్ ఫెయిల్యూర్, ఇతర కారణాల వలన పేమెంట్ ఫెయిల్యూర్ అయిన వారి వివరాలు వచ్చే వారం లోపు NBM పోర్టల్ లొ అప్డేట్ చెయ్యటం జరుగున
- అమ్మ ఒడి 9000 వేసిన వారికి తిరిగి ఈ రోజు 4000 వేస్తున్నారు ఎవరు కంగారు పడవలిసిన అవసరం లేదు అందరికి అమౌంట్ పడతాయి
- అమ్మ ఒడి పథకం 2023 సంవత్సరానికి గాను కొంత మందికి ₹13,000 బదులుగా ₹5000, ₹9000 వేలు మాత్రమే పడ్డాయి మరియు కొంత మందికి పూర్తిగా పడలేదు. ఇటువంటి వారికి త్వరలోనే ఆయా కార్పొరేషన్స్ ద్వారా అమౌంట్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు
- అమ్మఒడి పథకం 2023-24 సంవత్సరానికి గాను ఈరోజు (జులై 17) కూడా కొంత మందికి అమౌంట్ జమ అయింది. మిగిలిన వారికి ఈ వారాంతానికి( అనగా జులై 22 లోపు ) జమ చెయ్యడం జరుగుతుంది.
- అన్ని పెండింగ్ పేమెంట్ లు వారం లొ (జులై 10 నుంచి 16) లబ్ధిదారుని బ్యాంకు ఖాతా లొ క్రెడిట్ అవుతాయి.
- అమౌంట్ బ్యాంకు ఖాతా లొ క్రెడిట్ అయిన తరువాత వాటిని NBM వెబ్ సైట్ లొ అప్డేట్ చెయ్యటం జరుగును.
- మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా ఈ ఏడాది అమ్మ ఒడి అమౌంట్ విడుదల .పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో అమ్మ ఒడి వారోత్సవాలు.
- ఆశ వర్కర్ లు , అంగన్వాడీ వర్కర్ లు , హోమ్ గార్డ్స్ , శానిటేషన్ వర్కర్ లు కు అమ్మఒడి పథకం వర్తిస్తుంది.
- అమ్మఒడి 2023-24 eKYC Manual - Click Here
- అమ్మఒడి 2023-24 eKYC Dashboard - Click Here
- Latest Beneficiary Outreach App - Click Here
2.జగనన్న అమ్మ ఒడి పథకం 2023 అర్హతలు :
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హతలను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు పేర్కొనడం జరిగింది.
పూర్తి అర్హతలు ఇవే
- కుటుంబా ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెల 10 వేల రూపాయలు మించరాదు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతినెల 12 వేల రూపాయలు మించరాదు
- మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి భూమి మెట్ట భూమి అయితే పది ఎకరాల లోపు, మాగాణి అయితే మూడు ఎకరాలలోపు ఉండాలి. రెండు కలిపి కూడా 10 ఎకరాలకు మించి ఉండకూడదు.
- విద్యుత్ వినియోగం గత 12 నెలల కాలంలో సరాసరిగా 300 యూనిట్లు మించి ఉండకూడదు.
- కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి గాని లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వ్యక్తులు ఉండకూడదు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది.
- కుటుంబంలో ఎవరికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు.
- కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండకూడదు .
- చివరగా మున్సిపాలిటీ ప్రాంతాల్లో 1000చదరపు అడుగుల మించి ఎటువంటి ఆస్తి లేదా ప్రాపర్టీ ఉండరాదు.
3.ఆరు దశల ద్రువీకరన్ చెక్ చేసుకోను విధానము :
పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి మీ అర్హతలను చెక్ చేసుకునేందుకు కింది లింక్ పై క్లిక్ చేయండి
Click Here For Six Step Validation Check
4.జగనన్న అమ్మఒడి షెడ్యూల్ :
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి జూన్ 27 లోపు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది.
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి ముఖ్యమైన టైం లైన్స్ :
- 17th April 2023 - Receive data from School education and Intermediate Board
- 16th May 2023 - Sharing discrepancy data for data correction
- 8th - 10th June 2023 - Processing of Six-step Validation
- 12th June 2023 - Publishing of provisional lists for Social Audit
- 12th – 22th June 2023 - Enabling eKYC for eligible beneficiaries
- 12th June 2023 - Enabling grievances for ineligible beneficiaries
- 12th – 22 June 2023 - Redressal of grievances/objections
- 22 – 24th June 2023 - Generation of final Lists
- 26 – 27 June 2023 - Taking approval of District Collectors
- 28 June 2023 - Launch by Hon’ble CM
- Disbursement of benefits to the eligible beneficiaries through DBT 28th June 2023
Note: dates are subject to change
5.అమ్మ ఒడి అప్లికేషన్ స్టేటస్ , పేమెంట్ స్టేటస్ ఆధార్ కార్డు కు ఏ బ్యాంకు ఖాతా లింక్ అయినదో తెలుసుకునే విధానము :
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ లేదా పేమెంట్ విడుదల తర్వాత పేమెంట్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.పేమెంట్ క్రెడిట్ అయిన తరువాత కింద పోర్టల్ లొ అప్డేట్ అవుతుంది.
Click Here to Check Amma Vodi Payment Status
జూన్ 28వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాలో 15 వేలల్లో నుంచి 2000 రూపాయలను మినహాయించుకుని 13 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. మిగిలిన రెండు వేల రూపాయలను టీఎంఎఫ్ కింద మెయింటెనెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
6.అమ్మఒడి ప్రశ్నలు - సమాదానాలు :
1.Reverification list లో ఉన్న వారికి సంబధిత గ్రీవెన్స్ NBM లో RIASE చెస్తే వాళ్ళ పేర్లు EKYC కు ఇస్తారా ?
Ans : వెంటనే రావు
2. కొందరు పేర్లు Provisional Eligible & Reverification List లో కూడా లేవు, కానీ వాళ్ళు అర్హులు . వారికి ఎలా ?
Ans : Their Data not received from school education department
3. NBM లో గ్రీవెన్స్ raise చేసిన వారికి Ekyc కు ఎప్పుడు enable అవుతాయి?
Ans : We will communicate, it will take some more time
4. ఒక కుటుంబంలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక స్టూడెంట్ పేరు MOTHER తోను, ఒక స్టూడెంట్ పేరు GRAND MOTHER తొను EKyc కు వచ్చాయి, ఇలాంటి CASES లో ఏమి చేయాలి?
Ans : Hold grand parent one. They may be in different rice cards, so may be appeared .
5.అమ్మఒడి eKYC చేయుటకు చివరి తేదీ ఎప్పడూ ?
Ans : eKYC ను ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయండి.
6.అమ్మఒడి 2023-24 పథకము నగదును ను ఈ నెల అనగా జూన్ నెల 28 నే విడుదల చెయ్యనున్నారా ?
Ans : అవును. 27 జూన్ లోపు eKYC పూర్తి అయిన వారికి 28 న నగదు విడుదల అవుతుంది. మిగతా వారికి జులై మొదటి వారికి విడుదల అవుతుంది.
7.తాత్కాలిక అర్హుల & అనర్హుల లిస్ట్ లొ పేరు రాని విద్యార్థులు ఎం చేయాలి ?
Ans :
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కాలేజ్ ల నుండి విద్యార్థుల డేటా ప్రభుత్వానికి అందాల్సి ఉంది.జూలై 10 వ తారీకు వరకు ఆ ప్రాసెస్ జరుగుతుంది.కాబట్టి వాలంటీర్ యాప్ లో Ekyc వేయించేందుకు పేర్లు జూలై 10వ తారీకు వరకు వచ్చే అవకాశం ఉంది కంగారు పడనవసరం లేదు.
- మరికొందరి పేర్లు 6 అంచెల అనర్హత వల్ల Ekyc కి రాకపోయి ఉండవచ్చును. ఇటువంటి వారు తమ అర్హత నిరూపించుకునే పత్రాలతో సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేసే అవకాశం జూలై మొదటి వారంలో ఇవ్వబడుతుంది.
- పాఠశాల / జూనియర్ కాలేజ్ లో గానీ విద్యార్థి, తల్లుల వివరాలు తప్పుగా నమోదు అయిన వివరాలను సరి చేసేందుకు జూలై మొదటి వారంలో ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది.NBM లొ అర్జీ పెట్టాలి.
8. అమ్మ ఒడి రేపు అనగా జూన్ 28 న విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఈ కేవైసీ పూర్తికాని వారి సంగతేంటి?
Ans : కొన్ని సాంకేతిక సమస్యలు లేదా డేటా రాని కారణంగా ఈసారి కొంతమంది ఈ కేవైసీ ఇంకా పూర్తి కాలేదు. అటువంaటివారు కంగారు పడాల్సిన అవసరం లేదు.ఈసారి అమ్మ ఒడి కార్యక్రమం జూలై మొదటి వారం వరకు కొనసాగనుంది. సాధ్యమైనంత వరకు ఈరోజు పూర్తి చేయండి. డేటా లేని కారణంగా లేదా సాంకేతిక సమస్యలు ఉన్నవారికి 28 తర్వాత ఈ కేవైసీ చేసినచో, ఆ అమౌంట్ జూలై మొదటి వారంలో జరగనున్న వారోత్సవాల సమయంలో జమవుతుంది.
9.అమ్మఒడి పథకానికి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా "కొంతమంది విద్యార్థుల పేర్లు Provisional Eligible list & Re-Verification list రెండింటిలోనూ లేరు మరియు BOP app నందు search చేస్తుంటే No Data Available వస్తోంది" అని కొంతమంది issue raise చేయడం జరిగింది.వారికీ ఎం చేయాలి ?
Ans : ఇటువంటి వారు NBM portal - DA login నందు Mother Aadhar తో Ammavodi scheme 2023-24 అని select చేసుకొని , "Child is Eligible but not found in Eligible and Ineligible list" అనే grievance type తో grievence raise చెయ్యగలరు.
7.అమ్మఒడి డాక్యుమెంట్ లు :
- Ammavodi 2023 GO : Click Here