Revised Transfers Schedule of Sachivalayam Employees 2023
మొదట ఇవ్వబడిన ఉత్తర్వులలో
- దివ్యాంగులకు
- మానసిక వికలాంగులు అయినటువంటి పిల్లలు కలిగిన ఉద్యోగులు
వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో అటువంటివారు "Others" లొ ఎవరు అయితే దరఖాస్తు చేసి ఉంటారో వారి అప్లికేషన్లను ముందుగా ఇవ్వబడిన ప్రాముఖ్యత ఆర్డర్లో జత చేయడం జరుగుతుంది.
అటువంటి దరఖాస్తుదారులను కనిపెట్టడానికి గాను ఎవరైతే పైన చెప్పిన కేటగిరి వారు దరఖాస్తు చేసి ఉంటారు వారు వారి సంబంధిత మండల పరిషత్ అధికారికి లేదా మున్సిపల్ కమిషనర్ వారికి సంబంధించిన అధికారిక గుర్తింపు పొందిన సర్టిఫికెట్లను అందజేయవలసి ఉంటుంది. వాటిని కౌంటర్ సైన్ చేసిన తరువాత జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఇంచార్జ్ ఆఫీసర్ వారికి, మరియు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారికి మెయిల్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం తేదీ 10 జూన్ 2023 లోపు పూర్తి చేయవలసి ఉంటుంది.
పైన తెలిపిన ప్రాసెస్ కారణంగా ముందుగా ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం కాకుండా బదిలీలకు సంబంధించి చివరి తేదీను జూన్ 15 నాటికి పెంచడం జరిగినది.
Download Revised Transfers schedule Order
రివైజ్ చేయబడిన షెడ్యూల్ వివరాలు :
Within District :
- 28-05-2023 : లైను డిపార్ట్మెంట్ వారు వారి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలను తెలుపుటకు చివరి తేదీ
- 03-06-2023 : బదిలీల కొరకు దరఖాస్తు చేయుటకు చివరి తేదీ.
- 10-06-2023 : బదిలీల కొరకు దరఖాస్తు చేసిన దరఖాస్తులను Appointing Authority వారు వెరిఫికేషన్ చేయుటకు చివరి తేదీ .
- 12-06-2023 : దరఖాస్తు చేసిన వారికి మండలము లేదా ULB లను అలాట్మెంట్ చేసిన లిస్టు మరియు రిజెక్టు మరియు రిజెక్ట్ గల కారణాలుతో కూడిన లిస్టులను వెబ్సైట్లో పెట్టుటకు చివరి తేదీ.
- 14-06-2023 - 15-06-2023 : Appointing Authority వారు బదిలీలకు అర్హులైన వారికి ఫిసికల్ కౌన్సిలింగ్ చేసి సచివాలయాలను సూచిస్తూ కూడినటువంటి ట్రాన్స్ఫర్ ఉత్తర్వులను అందజేయు తేదీలు.
- 15-06-2023 : బదిలీలపై ఎటువంటి సమస్యలు లేదా అర్జీ జిల్లా కలెక్టర్ వారి వద్ద పెట్టాలనుకుంటే,వారి తేదీ 15-06-2023 నుంచి పెట్టుకునే అవకాశం ఉంటుంది.
Inter District :
- 28-05-2023 : లైను డిపార్ట్మెంట్ వారు వారి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలను తెలుపుటకు చివరి తేదీ
- 03-06-2023 : బదిలీల కొరకు దరఖాస్తు చేయుటకు చివరి తేదీ.
- 09-06-2023 : బదిలీ దరఖాస్తు చేసుకున్న జిల్లా నుంచి ఏ జిల్లాకు అయితే దరఖాస్తు చేసుకున్నారు ఆ జిల్లాకు దరఖాస్తులను ఫార్వర్డ్ చేయుటకు చివరి తేదీ.
- 10-06-2023 : ఏ జిల్లాకు అయితే బదిలీ కోరుకుంటున్నారో ఆ జిల్లాకు సంబంధించిన Appointing Authority వారు బదిలీలకు సంబంధించిన ప్రపోజల్లను రాష్ట్ర హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి పంపించుటకు చివరి తేదీ.
- 13-06-2023 : రాష్ట్ర హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు అప్లికేషన్లను సెక్రెటరీ (గవర్నమెంట్ ) వారికి పంపించుట మరియు, సెక్రటరీ నుండి GAD వారికి పంపించి అధికారిక ఉత్తర్వులు విడుదలకు చివరి తేదీ.