YSR Zero Interest Dwakra Women Scheme 2023 : Apply Online, Eligibility & Beneficiary List
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం 2023 కొత్త సమాచారం :
- ఆగస్టు 11న సున్నా వడ్డీ కార్యక్రమం.
- జులై 26 న జరగవలసిన వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత ప్రారంభ కార్యక్రమం అమలాపురంలో అధిక మోతాదు వర్షాల వలన వాయిదా వేయడం జరిగినది. కొత్త తేదీని ఈ పేజీలో త్వరలో అప్డేట్ చేయడం జరుగును .
- 9.48 లక్షల గ్రూపు లోని మహిళలకు ఈ పథకం కింద రూ.1,353.78 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్లవుతుంది.
పథకం పేరు | డ్వాక్రా మహిళా సంఘాల కోసం వైయస్ఆర్ జీరో వడ్డీ పథకం |
ప్రారంభించబడింది | వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి |
సంవత్సరం | 2019-2020 |
లబ్దిదారులు | స్వయం సహాయక బృందాలు మరియు DWCRA మహిళా సంఘాలు |
స్వయం సహాయక సంఘాలు లేదా DWCRA సంఘాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం. వైఎస్ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలతో ప్రారంభించ బడిన ఈ పథకం తరువాత సున్నా వడ్డీ పథకం గా అమలు అవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక ఏడాదిలో సకాలంలో చెల్లించిన రుణాలకు వడ్డీ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుంది. ఈ ఏడాది 1.02 కోట్ల మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ జమ చేసింది.
గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్
స్వయం సహాయక సంఘ అక్క చెల్లమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను "ప్రజా సంకల్పయాత్ర" లో చూసి చలించిపోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఉజ్వల భవిష్యత్ కోసం "వై.యస్.ఆర్ సున్నా వడ్డీ ” పథకాన్ని ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమమైన “నవరత్నాల” లో చేర్చడం జరిగినది.
పథకం ముఖ్య ఉద్దేశం:
- ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల యొక్క ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది.
- ఈ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ద్వారా అక్క చెల్లమ్మలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకంను తీసుకొనిరావడం జరిగినది.
- పొదుపు సంఘాల మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించడం
- జీవనోపాధి కోసం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించలేని పొదుపు సంఘాలకు ఆర్థిక భరోసా ఇవ్వడం.
- పొదుపు సంఘాల చెల్లించలేని మొత్తం వడ్డీని ప్రభుత్వమే భరించడం
వైయస్ఆర్ జీరో వడ్డీ రుణానికి బడ్జెట్
- COVID ని పరిష్కరించడం ప్రాధాన్యత అని, అయితే సంక్షేమ పథకాలు కూడా చాలా ముఖ్యమని ఆర్థిక మంత్రి అన్నారు. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలకు సహాయం చేయడానికి వైఎస్‌ఆర్ జీరో వడ్డీ రుణ పథకానికి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో రూ .1,365.08 కోట్లు కేటాయించింది.
ప్రయోజనాలు
- ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారం అంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది
- గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే పొదుపు సంఘాలకు నేరుగా వారి సంఘం యొక్క బ్యాంకు ఖాతాలో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడత లో డబ్బులు జమ చేస్తారు
ఈ పథకం క్రింద ఎవరు అర్హులు :
- 2022-23 ఆర్ధిక సంవత్సరంలో సకాలంలో వాయిదా చెల్లించిన అన్ని సంఘాలకు, సున్నా వడ్డీ వర్తిస్తుంది. సంఘం అప్పు నిల్వలో రూ.3 లక్షల వరకు మాత్రమే సున్నా వడ్డీ వర్తిస్తుంది.
- క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా అప్పు పొందిన సంఘాలు ప్రతి నెలా, గత నెలాఖరునాటికి ఉన్న అప్పు నిల్వలో కనీసం 3 శాతం ప్రస్తుత నెలలో చెల్లించి ఉండాలి.
- ఒక వేళ టర్మ్ లోన్ అయితే ఏ నెలలో ఎంత EMI చెల్లించాలో అంత ఆ నెలాఖరునాటికి చెల్లించి ఉండాలి.వై.యస్.ఆర్ సున్నా వడ్డీ అర్హతను ప్రతినెల ధృవీకరించి లెక్కించడం జరుగుతుంది.
- వాయిదా బకాయి ఉన్న సంఘాలు బకాయిలు పూర్తిగా చెల్లించిన పిదప మాత్రమే సున్నా వడ్డీ కి అర్హత పొందుతాయి.
- ఏ నెలలో అయితే బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో ఆ నెలకు మాత్రమే సున్నా వడ్డీని పొందుతారు.
- ప్రస్తుత అప్పు నిల్వ, అప్పు మంజూరయిన మొత్తంనకు సమానంగా గాని లేక తక్కువగా గాని ఉన్న సంఘాలు మాత్రమే అర్హత పొందుతాయి.
- బ్యాంకుల నుంచి గరిష్టంగా ఐదు లక్షల రుణం తీసుకున్న కాదు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
- రుణం తీసుకున్న నాటి నుంచి సకాలంలో వాయిదాల చెల్లించిన పొదుపు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
- లబ్ధిదారుల గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలు డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉండాలి
అనర్హతలు
- సకాలంలో వాయిదాలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన సంఘాలు అనర్హులు
- ఐదు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారు అనర్హులు
పథకం అమలు విధానము :
- వై.యస్.ఆర్ సున్నా వడ్డీ మొత్తమును ప్రభుత్వము నేరుగా స్వయం సహాయక సంఘం అప్పు ఖాతాకు జమచేయడం జరుగుతుంది. ఒక వేళ అప్పు ఖాతా క్లోజ్ అయిన యెడల సంఘం పొదుపు ఖాతా కు జమ చేయబడుతుంది.
కావలసిన పత్రాలు
- ద్వాక్రా గ్రూప్ కలిగిన బ్యాంకు ఖాతా పుస్తకం
- ఆధార్ కార్డు
- పొదుపు సంఘం రిజిస్టర్
వడ్డీ రేట్లు తగ్గించిన విధానము :
- గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకులతో మాట్లాడి స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే విధముగా బ్యాంకులతో మాట్లాడి వడ్డీ రేట్లును 13.50% నుంచి 9.50 % వరకు తగ్గించడం జరిగింది. దీని వల్ల చాలా సంఘాలు అధిక మొత్తంలో తక్కువ
- వడ్డీ రేటుతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది సంఘాలు జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని తద్వారా సంఘ సభ్యులు ఆర్థిక పరిపుష్టిని సాధించడం జరుగుతున్నది.
ఈ పథకం క్రింద ఇప్పటి వరకు అందించిన మొత్తం:
- వై.యస్.ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని తేది 24.04.2020 నుండి ప్రారంభించటం జరిగింది. ఇప్పటికే మూడు దఫాలుగా అర్హత గల స్వయం సహాయక సంఘాలకు వై.యస్.ఆర్ "సున్నా వడ్డీ"ని నేరుగా అక్కచెల్లెమ్మల తరపున బ్యాంకులకుచెల్లించడం జరిగింది.
ఈ పథకం క్రింద నాలుగవ సంవత్సరం అందించు మొత్తం :
- వై.యస్.ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని నాలుగవ సంవత్సరం కూడా కొనసాగిస్తూ, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో సకాలంలో చెల్లించిన అన్ని సంఘాలకు, ఆ సంవత్సరం తీసుకున్న కొత్త ఋణాలకు కూడా “సున్నా” వడ్డీకి రుణాలను గౌరవ ముఖ్యమంత్రి గారు 26.07.2023 న అమలాపురం పట్టణం, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ప్రారంబించడం జరుగుతుంది.
- ఈ పథకం కింద రాష్ట్రంలోని 9,48,122 పొదుపు సంఘాల్లోని సుమారు 10 లక్షల రుణ ఖాతాలకు నాలుగవ సంవత్సరం క్రింద రూ.1,353.76 కోట్లు నేరుగా బ్యాంకుల ద్వారా సంఘం అప్పు ఖాతా లకు 26.07.2023 తేది నాడు చెల్లించడం జరుగుతుంది.
- దీనిద్వారా సంఘాలు ఏర్పాటు చేసుకొనే చిన్న తరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా, వడ్డీ భారం లేకుండా నడపడానికి, మెరుగైన జీవనం సాగించడానికి కూడా ఈ వై.యస్.ఆర్ సున్నా వడ్డీ పథకం ఎంతగానో దోహదపడుతుంది
ఇతర వివరాలు
- వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారు సంబంధిత గ్రామ వార్డు సచివాలయం ప్రదర్శించబడిన అర్హుల జాబితాను వివరంగా పరిశీలించాలి.
- ఒకవేళ జాబితాలో పేర్లు నమోదు కానట్లయితే మీ సమీప గ్రామ సచివాలయం కానీ వాలంటీర్లకు కానీ మీ వివరాలు అందించగలరు
- అలా కాకపోతే 155251 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది
ముఖ్యమైన లింకులు :
- YSR Sunna Vaddi 2023 Circular Copy - Click Here
- సున్నా వడ్డీ పథకం కింద అర్హులైన లోన్ వివరాలు తెలుసుకోండి - Click Here
- సున్నా వడ్డీ పథకం కింద అర్హులైన SHG గ్రూప్ వివరాలు తెలుసుకోండి - Click Here
- SHG ID లేదా member ID ద్వారా మీ గ్రూప్ వివరాలు తెలుసుకోండిc - Click Here